‘‘అంత ఆసక్తిగా చూస్తున్నావు.. ఎంసెట్ రిజల్ట్స్‌నా? ’’
‘‘ఎంసెట్, ఐఐటి రిజల్ట్స్‌లో ఆసక్తి ఏముంటుంది? ర్యాంకులన్నీ మనవాళ్లేకే కదా! జనసేన పార్టీ రిక్రూట్‌మెంట్ టెస్ట్ ఫలితాలు చూస్తున్నా. అందరికీ తెలిసిన ప్రశ్నలకు- పవన్‌కల్యాణ్ మదిలో ఉన్న సమాధానాలు ఏంటో ఊహించి రాయడం కష్టం ’’
‘‘ప్రశ్నించేందుకే పార్టీ.. అంటే ఇదేనా? మనమే అర్థం చేసుకోలేదు.’’
‘‘మన ఆరుగురు మేధావులం - వర్గ పోరాటానికి ఆస్కారం లేని వాటిపై మాట్లాడుకుందాం. ఇది కాలనీ పార్కు. న్యూస్ చానల్స్ చర్చలో అయితే ఎంత గట్టిగా చర్చించినా, కొట్టుకున్నా ఓకె ’’
‘‘ఆరుగురు మేధావులం అని మీకు మీరే చెప్పుకుంటే సరిపోదు. ఇక్కడున్న అందరం ఒప్పుకోవాలి. ఓ వార్త చెప్పనా?’’
‘‘నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. బాబు అమెరికాలో విస్తృతంగా తిరుగుతుంటే అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నారా? అని అక్కడి వారు చినబాబు లోకేశ్‌ను అడిగిన విషయం గురించే కదా? సాటి తెలుగువాడు ఎదుగుతుంటే సహించలేవా? ఏం.. తెల్లవాడు వందల ఏళ్లు ప్రపంచాన్ని పాలిస్తే భరించవచ్చు కానీ ఓ తెలుగువాడు అమెరికా వెళ్లి ఆ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికైతే తప్పా? ఇదేం వివక్ష?’’
‘‘ట్రంప్.. తుంటరి తనం తగ్గించుకో.. నీకే ప్రమాదం- అని చెబుతూనే ఉన్నాం.. చెప్పంగ వినని వాడిని చెడంగ చూడాలి అంటారు. ఉంటే గింటే ట్రంప్‌కు భయం కానీ నాకెందుకు? ఆంధ్రకు లోకేశ్, తెలంగాణకు కెసిఆర్, దేశానికి మోదీ ఉన్నారు. తెంపరి ట్రంప్, తుంటరి కొరియా ప్రపంచాన్ని వణికిస్తున్నప్పుడు ఒక తెలుగువాడు అమెరికా పగ్గాలు చేపట్టి ప్రపంచాన్ని దారిన పెడితే సంతోషమే’’
‘‘ఇంతకాలం ప్రపంచంపై వాళ్లు పెత్తనం చేస్తే మనం సహించలేదా? ఇప్పుడు పెత్తనం చెలాయించే అవకాశం మాకొచ్చింది. ఖానూన్‌కే హాత్ బహత్ లంబే హోతా హై... అమెరికా తక్ బీ హోతాహై.. పితాశ్రీ పరంతూ..’’
‘‘దానికీ, దీనికి సంబంధం ఏంటి?’’
‘‘నాకూ తెలియదు. నాకు హిందీలో ఆ రెండు మూడు మాటలే వచ్చు. హిందీ సినిమాలు, మహాభారత్ సీరియల్ చూసి నేర్చుకున్నాను. కాస్త గంభీరమైన మాటలు కదా? అని వాడేశాను.’’
‘‘ఇక్కడ హిందీ ఎవరికీ రాదు. ఫరవాలేదు. ’’
‘‘హలో.. వౌనంగా ఉన్న నువ్వే కాదు.. ఇక్కడ మేం కూడా మేధావులమే. నువ్వొక్కడివి ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టు ఆ పోజు ఏంటి? ’’
‘‘మీ మాటలు చూస్తే మీరెవరూ అసలు విషయాన్ని గ్రహించలేదనిపిస్తోంది. తెలంగాణలో విప్లవం రాబోతుంది. ఇప్పటి వరకు వేరు. ఇక నుంచి వేరు. ఎపిటి మేధావి జెఎసి రంగంలోకి దిగనుంది. కెసిఆర్‌కు కష్టకాలం మొదలైంది.’’
‘‘ఎపిటి జెఎసినా? మొదటిసారి వింటున్నా?’’
‘‘ఇంకా ఇది బయటకు రాలేదు. ఆంధ్రా మేధావి సంఘం , తెలంగాణ మేధావి సంఘం ఈ రెండూ కలిస్తే ఒక్కసారి ఊహించుకో’’
‘‘అంతా అయిపోయిన తరువాత నువ్వు మళ్లీ సమైక్యాంధ్ర వాదం వినిపిస్తున్నట్టుగా ఉంది. రెండూ ఎలా కలుస్తాయి?’’
‘‘మొన్న ధర్నా చౌక్ వద్ద ధర్నాకు ఆంధ్రా మేధావి సంఘం నేత రాలేదా? ధర్నాలో ఆంధ్రా మేధావులు, తెలంగాణ మేధావులు కలిసి ఎపిటి మేధావి జెఎసి ఏర్పాటు చేస్తే అప్పుడుంటుంది సినిమా..’’
‘‘ఔను.. భయం పట్టుకుంది కాబట్టే పోలీసులతో పాలించాలని చూస్తున్నారు. పోలీసులకు వందల కోట్ల బహుమతులు ప్రకటిస్తున్నారు. వందల ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగిస్తున్న ఈ కాలంలో, అమెరికాలో ఐటి రంగం మొత్తం తెలుగు వారి చేతుల్లో ఉన్న ఈ రోజుల్లో ,ఒక తెలుగు సినిమా 15 వందల కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ కాలంలో ఇంకా పోలీసులు అవసరం అంటారా? ’’
‘‘పోలీసులు గనుక లేకపోతే శాంతిభద్రతల బాధ్యత మావోస్టులదా? ’’
‘‘మన దేశ బడ్జెట్‌లో భారీ వాటా రక్షణ రంగానిదే. అసలు యుద్ధం వస్తుందో లేదో తెలియదు కానీ వేల కోట్ల రూపాయలు రక్షణ రంగానికి అవసరమా? అసలీ దేశానికి సైన్యం అవసరమా?’’
‘‘ బాగా చెప్పారు. నా రాష్ట్రం, నా దేశం, నా ఖండం అంటూ ఎక్కడికెళుతున్నాం? విశ్వమానవులుగా ఉండలేమా? దేశాల మధ్య గోడలను కూల్చేయండి’’
‘‘ఏదో కూల్చమంటున్నారు. మా అల్లుడు ఈ మధ్యనే ప్రొక్లెయిన్ కొన్నాడు. కూల్చివేత పనులు ఏవైనా మా అల్లుడికే ఇవ్వాలి.. అలా అయితేనే మీకు నా మద్దతు ఉంటుందని చెబుతున్నాను.’’
‘‘ఉండవయ్యా ప్రతి దానిలో నువ్వు వ్యాపారం వెతుకుతావు. అప్పుడెప్పుడో బెర్లిన్ గోడ కూల్చారని కిరణ్‌కుమార్‌రెడ్డి ఇటుక ముక్క జేబులో పెట్టుకుని తిరిగినట్టు. ఇక్కడ దేశాల మధ్య గోడలు కూల్చడం అంటే కవి హృదయం- అన్ని దేశాలూ ఒకటి కావాలని అంతే. నిజంగా కూల్చేందుకు గోడలేమీ లేవు.’’
‘‘మరి దేశ రక్షణ బాధ్యత టెర్రరిస్టులు చూసుకుంటారా? ’’
‘‘మరీ అంత సంకుచితంగా హిందుత్వ వాదంతో ఆలోచించకండి విశ్వమానవుడిగా ఆలోచించాలి. దేశానికి హద్దులే ఉండనప్పుడు సైన్యం అవసరమే ఉండదు’’
‘‘అడగడం మరిచిపోయాను. మీ ఇంటి కాంపౌడ్ వాల్ నిర్మాణం ఎంత వరకు వచ్చింది? ’’
‘‘దొంగలు ఎక్కువయ్యారు. ఒక్క పురుగు కూడా లోనికి రాకుండా కాంపౌడ్ వాల్, గ్రిల్స్ ఏర్పాటు చేశారు. ఖర్చు అయితే అయింది కానీ ’’
‘‘అది సరే.. ఏదో అద్భుతమైన సంగతి అన్న పెద్దాయన మళ్లీ వౌనంగా ఉండిపోయాడు, ఏంటో అది చెప్పండి’’
‘ ధర్నా చౌక్ వంటి చిన్నా చితక సమస్యలను పట్టుకొని ఎన్నాళ్లు రోడ్డున పడతారు. అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్శించే ఐడియా ఉంది’’
‘‘ప్లీజ్ చెప్పు.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గడ్డం బాధ చూడలేక పోతున్నాం.’’
‘‘చెబుతా చెబుతా.. వర్ణ వివక్ష తెలుసా? వర్ణవివక్షకు పాల్పడితే అంతర్జాతీయ సమాజం ముందు తల వంచుకోవాలి. ’’
‘‘తెలుసు? ఐతే ’’
‘‘కేసిఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏ రంగు దుస్తులు వేసుకున్నారు?’’
‘‘తెలుపు’’
‘‘గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు..? ’’
‘‘అన్ని రోజులూ తెలుపే.. అయితే..?’’
‘‘సప్తవర్ణాలు ఉండగా, తెలుపు దుస్తులు మాత్రమే వేసుకోవడం అంటే వర్ణవివక్ష చూపడమే కదా? దీనిపై మనం కోర్టుకు వెళితే అంతర్జాతీయ సమాజం ముందు.. మనం మనసు పెట్టి ఆలోచిస్తే ఇలాంటివి ఇంకా చాలా కనిపిస్తాయి. ’’
‘‘ నువ్వే కాదు .. నేను .. మనం అందరం మేధావులమేనని ఒప్పుకుంటున్నాం.’’
బుద్దా మురళి (జనాంతికం 26. 5. 2017)

😂😂😂
రిప్లయితొలగించండిExcelle t