RTI 1
చట్టం కొందరికి చుట్టం అంటుంటారు .. కానీ చట్టం తన గురించి తెలిసిన అందరికీ చుట్టమే .. తెలియని బంధువుల దగ్గరకు వెళ్ళనట్టుగానే చట్టం గురించి తెలియక పోవడం వల్ల చాలా మంది దాన్ని దూరం పెడుతున్నారు కానీ చట్టం అందరికీ చుట్టమే ... చట్టం గురించి మనం తెలుసు కొక పోతే చట్టం నుంచి మనం ప్రయోజనం ఎలా పొందగలం ...
సామాన్యుడి చేతికి అత్యంత శక్తి వంతమైన ఆయుధం అందించిన సమాచార హక్కు చట్టం2005 గురించి 12 ఏళ్ళ తరువాత కూడా ప్రజలు - పఅధికారులకు అవగాహన కొత్త తక్కువగానే ఉంది ... ఈ చట్టం ను ఉపయోగించుకొని ప్రభుత్వ కార్యాలయాల నుంచి సమాచారం పొందడం గురించి .. చట్టం ప్రయోజనాల గురించి సులభమైన తెలుగులో రోజుకో పాయింట్ చెప్పాలని ఓ ప్రయత్నం
సమాచార హక్కు చట్టం పై సామాన్యులకు అవగాహన కలిగించడానికి ..సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవాలని ఓ చిరు ప్రయత్నం
ఓటు హక్కు తరువాత అంత శక్తి వంతమైంది సమాచార హక్కు
సమాచారం తమ సంపద దానిని ఇతరులకు ఇవ్వడం ఏమిటి అనే భావన కొంత మందిలో ఇంకా ఉంది ... మీరు ప్రభుత్వ ఉద్యోగిగా ఎన్నికల విధులు నిర్వహించేప్పుడు 18 ఏళ్ళ వాళ్ళు ఓటు వేయడానికి వస్తే వద్దు అని చెప్పి పంపిస్తారా ?
పంపించరు ... మరి సమాచార హక్కు కింద తమ గ్రామానికో జిల్లాకో మంచి జరిగే సమాచారం అడిగితే నిరాకరించడం ఎందుకు ?
18 ఏళ్లకు ఓటు హక్కు లభిస్తుంది
ఈ దేశాన్ని ఎవరు పాలించాలి రాష్ట్రాన్ని ఎవరు పాలించాలి
అని నిర్ణయించే హక్కు 18 ఏళ్ళు నిండిన అందరికీ ఉంటుంది . దేశ భవిష్యత్తుకి నిర్ణయించే ఓటు వేసేప్పుడు ఎలా వద్దు అనడం లేదో సమాచారం అడిగినప్పుడు కూడా అలానే ఇద్దాం ...
దరఖాస్తు నమూనా
సమాచార హక్కు చట్టం ఉపయోగించుకోవడానికి ప్రత్యేక దరఖాస్తు పారం అంటూ ఏమీ లేదు
తెల్ల కాగితం మీద సమాచార అధికారికి మీరు కోరుతున్న సమాచారం గురించి రాసి .. మీ అడ్రెస్ రాస్తే చాలు .. ఆ సమాచారం ఎందుకోసం అనే కారణం చెప్పాల్సిన అవసరం లేదు ...
గ్రామా స్థాయిలో ఉచితంగా .. మండల స్థాయిలో 5 రూపాయలు జిల్లా రాష్ట్ర స్థాయిలో అయితే పది రూపాయలు చెల్లించాలి ..పోస్టల్ ఆర్డర్ , కోర్ట్ ఫీజు స్టాంప్ , డిడి లేదా నగదు రూపం లో చెల్లించి సమాచార హక్కు చట్టం సెక్షన్ 6 కింద సమాచారం కోసం దరఖాస్తు చేయాలి ....
బుద్ధా మురళి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం