ఏమండోయ్, చిన్నోడు ఏమంటున్నాడో చూశారా?’’
‘‘ఏరా.. ఇంకా స్కూల్‌కు రెడీ కావడం లేదు’’
‘‘నేను స్కూల్‌కు రాజీనామా చేశా నాన్నా’’
‘‘ఎందుకురా?’’
‘‘ముందు పాఠశాలల్లో విద్యార్థుల సమస్యలు ఏమిటో అధ్యయనం చేస్తాను. విద్యాశాఖ మంత్రిగా వారి సమస్యలు పరిష్కరిస్తాను. అందుకే రాజీనామా చేశాను. టీచర్ల తీరు నాకు నచ్చలేదు. మానవ హక్కులను ఉల్లంఘించే విధంగా పాఠాలు చెబుతున్నారు. ఒక్కో స్కూల్‌కు వెళతాను. విద్యార్థులతో మాట్లాడతాను. సమస్యలు తెలుసుకుని, ఏదైనా పార్టీలో చేరి విద్యాశాఖ మంత్రిని కావాలా? లేక నేనే పార్టీ పెట్టాలా? అని నిర్ణయం తీసుకుంటాను.’’
‘‘నువ్వింకా పిల్లాడివిరా! ఇప్పుడే పార్టీ పెట్టలేవు’’
‘‘ఐతే బాలల హక్కుల సంఘానికి వెళతాను’’
‘‘ఎందుకు?’’
‘‘ఆయనెవరో ఐపిఎస్ ఆఫీసర్ తెలుగునాట హీరోగా మీడియా గుర్తింపునకు అలవాటు పడి, మహారాష్టల్రో ఎలాంటి గుర్తింపు రాకపోవడంతో రాజీనామా చేసేసి రాజకీయాల్లోకి వచ్చి వ్యవసాయ శాఖ మంత్రి కావాలని కోరుకుంటే.. ఆహా ఓహో అన్నారు. చదుకునే పిల్లల సమస్యలను పరిష్కరించడానికి నేను స్కూల్‌కు రాజీనామా చేసి విద్యార్థుల సమస్యలపై అధ్యయనం చేస్తానంటే ప్రతి ఒక్కరూ విమర్శించడమే, పెద్దలకో న్యాయం, పిల్లలకో న్యాయమా? బాలలకు హక్కులు లేవా? ఇదేనా ప్రజాస్వామ్యం. ఇందుకోసమేనా తెలంగాణ తెచ్చుకున్నది . ఇందుకోసమేనా మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది?’’
‘‘బాగైందా? పిల్లాడు ఇంట్లో ఉన్నప్పుడు టీవీలో ఆ దిక్కుమాలిన చర్చలు చూడకండి అంటే విన్నారా? పిల్లాడికి రాజకీయ అవగాహన ఉండాలి అన్నారు. ఇప్పుడు అనుభవించండి..’’
‘‘అరే బడుద్దాయ్.. ముందు స్కూల్‌కు వెళ్లు.. నీతో తరువాత మాట్లాడతాను’’
‘‘స్కూల్‌కు వెళుతున్నా చదువుకోవడానికి కాదు. స్కూల్ పిల్లల చదువు సమస్యలను అధ్యయనం చేయడానికి..’’
‘‘హా..హా.. పులి కడుపున పులే పుట్టిందోయ్ కుటుంబరావు. మీ వాడికి నిన్ను మించిన రాజకీయ పరిజ్ఞానం అలవడినట్టుగా ఉంది.’’
‘‘రావోయ్.. రా!.. ఏమేవ్ మీ అన్నయ్య వచ్చాడు. టీ తీసుకురా! మావాడి సంగతికేం కానీ .. దేశంలో ఏం జరుగుతోంది? ఏంటీ విశేషాలు?’’
‘‘నెల్లూరులో ఓ అటెండర్ వద్ద వంద కోట్ల ఆస్తి దొరికిందట!’’
‘‘చిన్నచేపల గురించి ఏం మాట్లాడతావు కానీ.. నాకైతే పాపం అనిపించింది. ఆ అల్పజీవి అంత సొమ్ము కూడబెట్టడానికి ఎంత కష్టపడ్డాడో? శ్రమశక్తి అవార్డు పొందాల్సిన వాడు’’
‘‘ప్రచారానికి దూరంగా ఉండాలని ఆ అవార్డు వద్దన్నాడేమో కానీ- అతను కోరుకుంటే దక్కని అవార్డు ఉంటుందా? జోక్ కాదు నిజంగా చెబుతున్నాను. ఎవరికీ చిక్కకుండా, అనుమానం రాకుండా వంద కోట్లు నొక్కేయడం, దాచి పెట్టడం అంటే మాటలా? ఎంత శ్రమ పడాలి. ఎంత శక్తి ఉండాలి. జేబులు ఖాళీగా ఉన్నా ఎంతో ఆస్తి ఉన్నట్టు పోజులు కొడుతూ, కారు కొని నెలవారీ వాయిదాలు కట్టలేక ముఖం చాటేస్తూ, పైకి సంపన్నుల్లా నటించే వారున్న ఈ రోజుల్లో వంద కోట్ల ఆస్తి ఉండి అటెండర్‌గా పని చేస్తూ ఏమీ లేనట్టు నటించడం అంటే పాపం.. అతను ఎంత క్షోభను అనుభవించాడో. అందుకు శ్రమశక్తి అవార్డే కాదు. నటభూషణ అవార్డు కూడా ఇవ్వాలి’’
‘‘ఇలాంటి అవతార పురుషులు ప్రతి చోట, ప్రతి ఆఫీసులో ఉంటారు కానీ దేశ రాజకీయాలు ఎలా ఉన్నాయి?’’
‘‘ముఖ్యమంత్రులకు దిష్టి తీయాలి?’’
‘‘ఈ నగరానికేమైంది అనే ప్రకటన గుర్తుకు వచ్చి, ఈ ముఖ్యమంత్రులకేమైంది అనిపిస్తోంది?’’
‘‘ఔను ఏమైంది? అన్నింటికీ నేనే అనే ముఖ్యమంత్రి ఏకంగా తాను పుట్టక ముందు స్వాతంత్య్ర పోరాటం చేసి బ్రిటీష్ వారిని గడగడలాడించానని సెలవిచ్చారు. ఆ మధ్య పోతనతో రామాయణం రాయించారు.’’
‘‘గంటల తరబడి మాట్లాడినప్పుడు మాట జారదా? దానికి ఇన్ని జోకులా?’’
‘‘అన్నింటికీ నేనే అంటారు కాబట్టి మాట జారడం కాదు.. సీరియస్‌గానే చెప్పారేమో అని అనుమానం. ఏంటీ అలా గోళ్లు గిల్లుకుంటున్నావ్! గోళ్లు పెరిగితే త్రిపుర ప్రభుత్వాన్ని విమర్శించు’’
‘‘ఎందుకు?’’
‘‘పుండు గోక్కుంటే ఎంత హాయిగా ఉంటుందో, పెరిగిన మన గోళ్లను ఎవరైనా తీస్తే అంత హాయిగా ఉంటుంది. తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తే గోళ్లు తీసేస్తామని త్రిపుర సిఎం బంపర్ ఆఫర్ ఇచ్చాడట. పత్రికల్లో చూశాను.’’
‘‘గోళ్లు పెరిగిన వారంతా ఒకేసారి త్రిపుర పాలకుడ్ని విమర్శిస్తే సరి.. గోళ్లు పీకే ఉచితసేవ అందుకోవచ్చు’’
‘‘అంటే త్రిపుర పాలకుడి పాలనాకాలం అంతా గోళ్లు పీకడంతోనే గడచిపోతుందేమో?’’
‘గోళ్లు గిల్లుకోవడం కన్నా గోళ్లు పీకడం బెటర్ కదా! గుడ్డికన్నా మెల్ల మేలు అన్నట్టు’’
‘‘అది సరే.. బ్రిటిష్‌వారితో పోరాడి వారిని గడగడలాడించిన జాతి మా పార్టీ అని ఆయన గారన్నారట.. మేధావులు ఊరికే అనరు.. ఆ మాటల వెనుక ఉద్దేశం ఏమై ఉంటుంది?’’
‘‘ఆయన అన్నదాంట్లో తప్పేముంది? ప్రతి మాటా అక్షర సత్యం. చినబాబు ఇప్పుడిప్పుడే తెలుగు అక్షరాలు నేర్చుకుంటున్నాడు. చినబాబు తప్పు మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు కానీ పెదబాబు కూడా...’’
‘‘చినబాబును నువ్వు తక్కువగా అంచనా వేస్తున్నావు. పెద్ద ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉన్నపుడు ఢిల్లీలో చక్రం తిప్పడానికి హిందీ నేర్చుకునే ప్రయత్నం చేశారు. ఆయనకు హిందీ రాలేదు కానీ హిందీ నేర్పించే ప్రయత్నం చేసిన యార్లగడ్డ ఢిల్లీలో ఓ మోస్తరు చక్రం తిప్పే స్థాయికి ఎదిగారు . ఉమ్మడి రాష్ట్రంలో మైనారిటీ ల మనసు దోచేందుకు పెదబాబు ఉర్దూ నేర్చుకునే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. ఆయనకు ఉర్దూ రాలేదు. ఉర్దూ నేర్పే ప్రయత్నం చేసినాయన ఉర్దూ మరచిపోలేదు. రాష్ట్ర విభజనతో ఉర్దూ అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు చినబాబు ఖర్చుకు వెనుకాడకుండా తెలుగు నేర్చుకుంటుంటే అభినందించాల్సింది పోయి విమర్శలా?’’
‘అదిసరే.. మా పార్టీ స్వాతంత్య్రం కోసం పోరాడిందని ఎందుకన్నాడంటావ్?’’
‘‘కవి హృదయం అర్థం చేసుకోవాలి.. మన దేశ స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాటానికి నాయకత్వం వహించిన పార్టీ ఏది?’’
‘‘కాంగ్రెస్ పార్టీ..’’
‘‘మరి ఆయన చెప్పింది అదే కదా! ఈరోజు దేశంలో ఉన్న అన్ని పార్టీలకూ మాతృసంస్థ కాంగ్రెస్ కదా.. అంటే దేశం కోసం పోరాడి స్వాతంత్య్రం తెచ్చామని గర్వంగా ప్రకటించే హక్కు అన్ని పార్టీలకూ ఉంది. నదులన్నీ సముద్రం లో కలిసినట్టు పార్టీలన్నీ కాంగ్రెస్ నుంచి పుట్టినవే .. అన్ని పార్టీలూ ఆ తానుముక్కలే అని నిజాయితీగా చెప్పినందుకు అభినందించాలి.’’

‘‘ఏంటో... నారదుడికి గూగుల్ కన్నా ఎక్కువ తెలుసు అని ఒక సీఎం, స్వాతంత్య్రం వచ్చాక పుట్టినా స్వాతంత్య్రం కోసం పోరాడింది తమ పార్టీయేనని మరో సీఎం.. మహాభారత కాలంలోనే ఇంటర్నెట్ ఉందని మరో మేధావి అనడం.. పాలకుల ప్రకటనలు వింటుంటే ఏదో తికమకగా ఉం ది’’
‘‘ వ్యవసాయం దండగ అంటే తప్పు పట్టారు ఇప్పుడొకాయన ఉద్యోగం కోసం ఎదురు చూడడం దండగ వ్యవసాయం చేసుకోండి అంటే తప్పు పడుతున్నారు .. పాపం పాలకులు ఏం మాట్లాడినా తప్పేనా ? ’’
‘‘చూడోయ్.. దేశంలో సమస్యలు ఎప్పుడూ ఉంటాయి.. మొఘలుల కాలంలో, బ్రిటీష్ వారి హ యాంలో సమస్యలున్నాయి.. నెహ్రూ పాలనలో ఉన్నా యి.. ఇప్పుడూ ఉన్నాయి.. భవిష్యత్‌లోనూ ఉంటాయి... ఇంతటి సమస్యల్లోనూ మనం హాయిగా నవ్వుకునేలా ప్రకటనలు చేస్తున్న పాలకులను మన పాలిట వరంలా భావించాలి’’
‘‘అంతేలే.. సమస్యల సుడిగుండంలో కొట్టుకుపోకుం డా హాయిగా నవ్విస్తున్నారు నేటి పాలకులు తమ ప్రకటనలతో...’’ *

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం