సంపన్నుల గురించి చాలా మంది ఆలోచనలు చిత్రంగా ఉంటాయి. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్ట్ కనిపించింది. ఎనిమిది వేల కోట్ల రూపాయలతో ఇల్లు కట్టిన అంబానీది, 80 గజాల స్థలంలో ఇల్లు కట్టిన నాదీ ఒకే దేశమా?
న్యూజిలాండ్‌లో షాపింగ్ కోసం 350 కోట్లతో చార్టర్డ్ ఫ్లైట్ కొన్న నీతూ అంబానీది, షాపింగ్ కోసం ఆటో ఎక్కాలా ? వద్దా అని ఆలోచించే మా అమ్మది ఒకే దేశమా?
సెవెన్ హిల్స్ హాస్పటల్‌లో ఐదు లక్షల బిల్లు కట్టి డెలివరీ అయిన ఐశ్వర్యారాయ్‌ది, నిర్మల ఆస్పత్రిలో ముక్కి ముక్కి ఐదువేల బిల్లు కట్టిన నా భార్యదీ ఒకే దేశమా?
ఇలా సాగుతుంది ప్రశ్నల పరంపర. చాలా మంది అంబానీ అలా ఎదిగిపోవడానికి, మనం సామాన్య జీవితం గడపడానికి కారణం ఈ వ్యవస్థ, ప్రభుత్వం లేక ఇంకోటి ఏదో అనుకుంటాం. ఇందులో మన పాత్ర ఏ మాత్రం ఉండదు వారి ఆలోచన ప్రకారం.
నిజానికి మన విజయంలో ఐనా పరాజయంలో ఐనా ప్రధాన పాత్ర మనదే. మన ఆలోచనలదే. మన మనసుదే. ఒక వ్యక్తి అంబానీగా ఎదిగినా, ఇల్లు గడవడానికే అప్పులు చేస్తూ బతికే అప్పుల అప్పారావుగా మిగిలిపోయినా దానికి మనమే కారణం అంతే కానీ కనిపించని దేవుడు, కనిపించే ప్రభుత్వాలు, వ్యవస్థలు ఎంత మాత్రం కారణం కానే కాదు. సమస్య నుంచి పారిపోయే వారు, ఎదుర్కోలేని వారు, బద్ధకస్తులు మాత్రమే కారణం తమది కాదు ఇంకెవరిదో అంటారు.
అంబానీ పెద్ద ఇల్ల్లు కట్టుకున్నా, కూతురు పెళ్లి వైభవంగా చేసినా మనం సహించలేం. అంబానీ చట్టవిరుద్ధంగా సంపాదిస్తే దాన్ని వ్యతిరేకించాలి కానీ సంపాదించడమే తప్పు అన్నట్టుగా వాదనలు ఉంటాయి.
మనం విలువలకు కట్టుబడి ఉన్నాం కాబట్టి సామాన్యులుగా ఉండిపోయాం. అంబానీ విలువలకు కట్టుబడి లేడు కాబట్టే సంపన్నుడు అయ్యాడు అనేది కొందరి వాదన. ఇలా వాదించే వారు తమను తాను మోసం చేసుకుంటున్నారు. ఇలాంటి వారి విషయంలో ఎవరైనా చేసేదేమీ లేదు.
ధీరూబాయ్ అంబానీ కూడా ఒకప్పుడు సాధారణ ఉద్యోగి. చిన్న ఉద్యోగంలో ఉన్నా ఆలోచనలు మాత్రం ఉన్నతం. చిన్న ఉద్యోగం చేసే రోజుల్లో కూడా ఏదో ఒక రోజు వ్యాపార సామ్రాజ్యం సృష్టించాలని కలలు కన్నాడు. వాస్తవం చేసుకున్నారు. దుబాయ్‌లో చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. ఇంటింటికి తిరిగి వస్తువులు అమ్మారు. ఏం చేస్తున్నా ఎప్పుడూ తన లక్ష్యం కళ్ల ముందు మెదులుతూనే ఉండేది.
సంపన్నులు సామాన్యులు ఆలోచించే తీరు వేరుగా ఉంటుంది.
సెల్‌ఫోన్‌లో నెట్‌వర్క్ సరిగా లేకపోతే మరో కంపెనీకి మారుదామని మనం ఆలోచిస్తాం. కానీ అంబానీ మాత్రం జియో నెట్ వర్క్‌ను ప్రారంభించాలని ఆలోచిస్తారు.
నిర్మా గుర్తుందా? గుజరాత్‌లోని ప్రభుత్వ ఉద్యోగి, కెమిస్ట్. కర్సన్‌బాయ్ పటేల్. ఇంటి నుంచి ఆఫీసుకు సైకిల్‌పై వెళ్లే సమయంలో, తిరిగి ఇంటికి వచ్చే సమయంలో నిర్మా పౌడర్‌లు అమ్ముతూ తన వ్యాపార ప్రస్థానం ప్రారంభించి. 15వేల మంది ఉద్యోగులు, 3550 కోట్ల రూపాయల టర్నోవర్‌కు వ్యాపారాన్ని విస్తరించాడు.
అంబానీలు, కర్సన్‌బాయ్‌లు, మన చట్టూ చాలా మందే ఉన్నారు. సైకిల్‌పై తిరిగి క్రేన్ వక్కపొడి అమ్మిన వారు, భక్తునికి భగవంతునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి అంటూ సైకిల్‌పైనే ఇంటింటికి తిరిగి అగర్ బత్తీలు అమ్మిన వారు కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాలను సృష్టించారు. ఇలాంటి వారు మేం పేదరికంలో ఉండడానికి ఈ వ్యవస్థ, ఈ దేశమే కారణం ఆనే ఆలోచనలు చేయరు. సంపద కలిగి ఉండడం పాపం అనుకోరు. సంపన్నులను విలన్లుగా చూడరు. తాము పేదరికంలో ఉన్నా దానికి కారణం ఎవరూ కాదనని తామేనని, పేదరికం నుంచి బయట పడే మార్గం కూడా తమ వద్దనే ఉందని భావిస్తారు. భయటపడేందుకు కృషి చేస్తారు. విజయం సాధిస్తారు. కొన్ని కోట్ల మందికి, లక్షల మందికి ప్రేరణగా నిలుస్తారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తారు. ఇలాంటి విజేతలు ఎంతో మంది మన చుట్టూ ఉన్నారు. అలాంటి వారి నుంచి ప్రేరణ పొందవచ్చు అంతే తప్ప సంపన్నులను విలన్లుగా చూడాల్సిన అవసరం లేదు.
ఆఫీసు నుంచి రాగానే టీవిలో అత్తా ఒకింటి కోడలే సీరియల్ చూస్తే ఎదగం. క్రికెట్ కబుర్లు, సినిమా కబుర్లు, రాజకీయ కబుర్లతో కాసేపు కాలక్షేపం కావచ్చు. కానీ జీవితంలో ఎదిగే అవకాశం ఉండదు. ఉద్యోగంలో ఎప్పుడు ఇంక్రిమెంట్ వస్తుందా? ప్రమోషన్ వస్తుందా? అనే ఆలోచన కన్నా తన పరిస్థితి మెరుగు పరుచుకునే మంత్రం తన వద్దనే ఉందని గ్రహించడం వల్లనే ఎంతో మంది చిరుద్యోగం నుంచి వ్యాపార సామ్రాజ్యాలను స్థాపించే స్థాయికి ఎదుగుతున్నారు. మంత్రాలు, మాయలు, యంత్రాలు చేసేదేమీ ఉండదు. మన చేతి చమురు వదలడం తప్ప మనను విజయతీరాలకు చేర్చే శక్తి మనలోనే ఉందని గుర్తించాలి.
ఏ క్రికెటర్ పుట్టిన రోజు ఎప్పుడో కొంత మంది అడగ్గానే చెప్పేస్తారు. హీరోయిన్ పుట్టుమచ్చలు. హీరోల పుట్టిన రోజులు గుర్తుంచుకోవడానికి ఖర్చు చేసే సమయాన్ని మనం విజయం కోసం మనం ఖర్చు పెట్టుకోవడం అవసరం.
ఏ సినిమా ఎన్ని రోజులు నడిచింది, ఏ సినిమాలో ఏ హీరోయిన్ ఎన్ని చీరలు మార్చింది మన కెందుకు. మన జీవితం ఎలా మారుతుంది ఆలోచిస్తే ఏదో ఒక మార్గం దొరుకుతుంది. ముందు ఆలోచించడం ప్రారంభిద్దాం.
అంబానీ గురించి మనం గంటల తరబడి చర్చించుకున్నా, మన గురించి అతను ఒక్క క్షణం కూడా ఆలోచించడు. తన సమయం ఎంత విలువైందో అంబానీకి తెలుసు. అది తెలియంది మనకే. తెలుసుకున్న రోజు మనమూ ఎదుగుతాం. పేదరికం నుంచి సంపన్నత వైపు పయనించే ఆలోచనల గట్టుమీద ఉంటారా? పేదరికానికి వ్యవస్థలు, దేవుడు, కనిపించని శక్తులే కారణం అనే ఉపయోగం లేని భావాలా గట్టున ఉంటారా? మీ ఇష్టం.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం