3, అక్టోబర్ 2024, గురువారం

మహనీయుల జీవితాలను దుర్భరంగా మార్చిన నిర్లక్ష్యం : మనకు జీవిత పాఠాలు 

లక్ష్మీ కటాక్షం జీవితంలో డబ్బుకు ప్రాముఖ్యత ఉంది అని మీరు భావిస్తే చదవాల్సిన పుస్తకం . తల్లి గర్భంలో శిశువుగా ఉన్నప్పటి నుంచి భూగర్భంలో శాశ్వత నిద్రలోకి జారుకునేంత వరకు మనిషి జీవితంలో ప్రతి దశలో డబ్బుకు ప్రాముఖ్యత ఉంటుంది .. అది గ్రహించక పోతే మహా మహుల జీవితాలు కూడా అంతిమ దశలో దయనీయంగా గడిచాయి . సువిశాల భారత దేశాన్ని పాలించిన మొఘల్ వంశీయులు కలకత్తాలో చిన్న టీ కొట్టు పెట్టుకొని బతుకు తున్నారు . ఎన్టీఆర్ , ఏ ఎన్ ఆర్ లు నెల జీతంతో నటించిన రోజుల్లో సినిమాకు లక్ష రూపాయల పారితోషకం తీసుకున్న తొలి సూపర్ స్టార్ చిత్తూరు నాగయ్య చివరి దశలో కడుపు నింపుకోవడానికి చిన్న చిన్న పాత్రలు వేశారు ... హీరోలను మించి సంపాదించిన రాజనాల చివరి దశలో తిండికే ఇబ్బంది పడ్డారు . రజనీ కాంత్ ను సూపర్ స్టార్ ను చేసిన నిర్మాత వృద్ధాప్యంలో తనకో ఇల్లు దానం చేయండి అని వేడుకున్నాడు .. ఒక వెలుగు వెలుగుతున్న రోజుల్లో జీవితం శాశ్వతంగా అలానే ఉంటుంది అని భావించి చివరి దశలో దుర్భర జీవితం గడిపిన ఎందరో మహానుభావుల జీవితాలను కళ్లముందుంచిన లక్ష్మీ కటాక్షం - డబ్బుకు విలువ ఇస్తేనే నిలుస్తుంది -పుస్తకం జీవితం మారకుండా ఉండాలి అంటే ఏం చేయాలో చెబుతుంది . మన భవిష్యత్తు , పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే డబ్బును ఎలా గౌరవించాలో చెబుతుంది . తొలి తరం సినిమా నటుల దుర్భర జీవితం ఆ తరువాత తరం వారికి డబ్బు గురించి ఎన్నో పాఠాలు నేర్పింది .. ఆ పాఠాలు మనమూ నేర్చుకోవడానికి లక్ష్మీ కటాక్షం మానసికంగా మనల్ని సిద్ధం చేస్తుంది . నవోదయ , న్యూ విశాలాంధ్ర , అమెజాన్ లలో పుస్తకాలు లభ్యం . 168 పేజీలు .. ధర 200 వివరాలకు వాట్సాప్ నంబర్  9849998087  - బుద్దా మురళి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం