2, జూన్ 2011, గురువారం

అమావాస . రోజు పున్నమి చంద్రుడు .................................... సికింద్రాబాద్ కథలు ౪

ఐశ్వర్య రాయ్ అందంగా ఉంటుందని నేను  చెబితే మీరే మంటారు...నిజమా  చాలా గొప్పవిషయం చెప్పారండి మీరు మామూలు వాళ్ళు కాదు అని విసుర్లు  విసరకుండా ఉంటారా.? ఐశ్వర్య రాయ్ అందంగా ఉందనే  కదా విశ్వసుందరి  టైటిల్ ఇచ్చారు, అభిషేక్ మనసుపడ్డాడు, అమితాబ్ కోడలిగా ఇంటికి తీసుకెళ్ళారు. సరే వాడెవడో సౌందర్య సాధనాల  మార్కెట్ కోసం విశ్వ సుందరిమనులను నిర్ణయిస్తాడు కాని. మార్కెట్ తో సంబంధం లేకుండా  చిన్నప్పటి నుంచి, పోయేంత వరకు ప్రతి ఒక్కరు  తన మనసులోనే ఎంతో మందికి విశ్వసుందరి కిరీటాన్ని బహూకరిస్తుంటారు.

 యం యఫ్ హుసేన్ కు  మధురి దిక్షితే ఐశ్వర్య రాయ్ అయినట్టు ఎవరో ఒకరికి కల్పనా రాయ్ కుడా ఐశ్వర్యా రాయే . నాకు  గాంధీ నగర్లో  ఐదో తరగతి చదివేప్పుడు అన్నపూర్ణ విశ్వసుందరిలా కనిపిస్తే ఆరో తరగతి సికింద్రాబాద్ లో చదివేప్పుడు విజయలక్ష్మి విశ్వసుందరి అనిపించింది. ( వాళ్ళు చిన్నప్పటి వాళ్ళు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పబడినవి .. వారెక్కడున్నారో కూడా తెలియదు కాబట్టి భయం లేదు. ఇప్పటి పేర్లు ససేమిరా చెప్పబడవు  )

 సరే ఎవడి గోడుకు వాడె హీరో .. ఐశ్వర్య రాయ్ అందం గురించి ఎందుకు ప్రస్తావించానంటే.. పున్నమి చంద్రుడు అందంగా ఉన్నాడని ... యెంత అందంగా ఉన్నదో చెప్పాలని అనుకున్నా.. పున్నమి చంద్రుడి అందం గురించి నేను చెబితే ..ఐశ్వర్యా రాయ్ అందంగా ఉంటుందని చెప్పినట్టు గా ఉంటుందనీ ఆమె గురించి ప్రస్తావించా. 
******
మా ఇల్లు భూదేవినగర్ సికింద్రాబాద్ జూబ్లి బస్సు డిపో నుంచి ఆరు కిలో మీటర్ల దూరం లో ఉంటుంది.  చుట్టూ కంటోన్ మెంట్ ఏరియా మధ్యలో ద్వీపకల్పం లా ఉంటుంది .   నగరం లోనే ఉన్నా   ఇంకా పెద్దగా అపార్ట్ మెంట్ల సంస్కృతి లేదు కాబట్టి కొంత  ప్రశాంతంగానే ఉంటుంది. పిచుకలు కనిపిస్తాయి . పచ్చని చెట్లు, చల్లని గాలి యిక్కడఇంకా  బతికే ఉన్నాయి ..

 క్లింటన్ వచ్చినప్పుడు , బుష్ వచ్చినప్పుడు మా ఇంటికి దగ్గరలోనే ఉన్న  ద్రాక్ష తోటలోంచి ద్రాక్ష పళ్ళు  ఇచ్చారు. హిందులో వచ్చిన ఆ ఫోటోలను తోట వాళ్ళు కొద్ది రోజులు ప్రదర్శించారు. ఆమెరికా అధ్యక్షుడు మెచ్చిన ద్రాక్ష అని రేటుపెంచుతారేమో  అనుకున్నా కాని పెంచలేదు..  ఇంటి ఎదురుగా రైలు  పట్టాలు . అప్పుడప్పుడు గుడ్స్ రైళ్ళు వెళతాయి   పట్టాల అవతల రాముల వారి  గుడి ఉదయాన్నే సుప్రభాతం వినిపిస్తుంది   .. వావ్ అనిపిస్తుందా ఇవన్నీ పాసిటివ్ పాయింట్స్ . అబ్బే అనిపించే   నెగిటివ్ పాయింట్స్ వీటికన్నా చాలా ఎక్కువగానే ఉన్నాయి .. నాకు వాటితో పని లేదు కాబట్టి నేను వాటిని పట్టించు కొను .. అలానే అవి నన్ను పట్టించు కోవు ..
****
వీక్లీ ఆఫ్ కావడంతో రాత్రి మేడపైన ఒక్కడినే ఉన్నా.. పున్నమి చంద్రుడు ఎప్పుడూ లేనంత అందంగా ఉన్నట్టు  అనిపించాడు. పున్నమి చంద్రుని అందం గురించి చెప్పాలనుకునే ఐశ్వర్యా రాయ్ అందం గురించి ప్రస్తావించా...పున్నమి చంద్రుడి అందం మాకు తెలుసులే అంటారని వర్ణించడం లేదు .   దేవుడికి కృతజ్నతలు చెప్పాలనిపించింది . ఎందుకంటారా ? పున్నమి చంద్రుడు ...  చల్లని గాలి..  వెనకవైపున   దేవాలయం నుంచి మెల్లగా ఏదో స్వరం వినిపిస్తోంది . నా పక్కన ట్రాన్సిస్టర్ లోంచి అమరగాయకుడు ఘంటసాల పాడుతున్నపాటలు ... నేనున్నానని చెబుతూ పదేపదే తాకి వెళుతున్న చల్ల గాలి .. ఈ జీవితానికి ఇంకేం కావాలనిపించింది ..

 ఏ కుంభకోణంలో పెరుంటుందో అనే భయం లేదు.. ఎసిబి వాడు దాడి చేసి అక్రమ సంపాదన భయత పెడతాడని భయపదాల్సిన స్తాయి కాదు నాది . అప్పులవాడు తలుపు తడతాడేమో అనే ఆలోచనే అవసరం లేదు ..

 ఘంటసాల పాటలు వినడానికి చెవులు ఉన్నాయి, చల్ల గాలి ఆస్వాదించే స్పృహ ఉంది.  ఇంకేం కావలి ఇవన్నీ ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత చెప్పాలని పించింది ... పరుగు పందెం లాంటి జీవితంలో ఇలాంటి రోజులను కుడా కల్పించినందుకు దేవునికి క్రుతజ్జతలు .. ఒక సారి కాదు వందల సార్లు థాంక్స్ ... 

******
ఇక్కడ పున్నమి చంద్రుని ఫోటో ఉంటే బాగుంటుంది కదూ .. నాకు అలానే అనిపించి పైకి చూసా కాని నల్లని మబ్బులు తప్పా ఎమీ కనిపించలేదు .. చంద్రుడు అసలే కనిపించలేదు ... ఎలా కనిపిస్తాడు . అమావాస రోజు చద్రుడు ఎలా కనిపిస్తాడు. పున్నమి రోజు ఆ వాతావరణానికి ముచ్చటపడ్డ నేను పున్నమి చంద్రుడికి , దేవునికి కృతజ్ఞత చెప్పాలనుకున్న.. కాని పని వత్తిడి వల్ల అమావాస
 నాటికి గాని తీరలేదు .. నా కృతజ్నతల కోసం చంద్రుడు వేచి ఉండడు కదా  

  మన జీవితం లో చాలా మందికి ఇలానే కృతజ్నతలు చెప్పలనుకుంటూ వాయిదా వేసుకుంటూ పోతాం .. కని పెంచిన  తల్లితండ్రులు  కావచు.. సేవ చేసే  భార్య కావచ్చు.. తమ విజయాలతో సంతోషపెట్టే  పిల్లలు కానీవండి.  స్నేహితులు కావచ్చు.. బాస్ అయినా సరే దేనికో ఓ దానికి కృతజ్నతలు చెప్పా లని పించినప్పుడు చెప్పేయండి.

 మీకు మేలు చేసిన వారికి కృతజ్నతలు చెప్పాలని ఎప్పుడో అనిపిస్తే అప్పటి వరకు వారు ఉండక పోవచ్చు. చెప్పడానికి మనం ఉండక పోవచ్చు.  సరే దేవుడు శాశ్వతం కాబట్టి ఎప్పుడైనా చెప్పవచ్చేమో మనుషులు శాశ్వతం కాదు కదా .. ఆ రోజు చెప్పలేక పోయామే అనే బాధ  జీవితాంతం ఉంటుంది ... 

2 కామెంట్‌లు:

  1. అవును మురళి గారూ,

    చల్లని వెన్నెల, పక్కనే రేడియోలొ తియ్యని పాటలూ, కమ్మని భోజనం అన్నిటికీ మించి అవి అనుభవించటానికి సమయం నిజమే ఇంకేమి కావాలి ఈ జీవితానికి.

    అమావాస్య చంద్రుడు మీకు కనిపించక పోయినా మీ థాంక్స్ వినే ఉంటాడులెండి.

    ఐతే మీరు మాకు దగ్గర్లోనే ఉంటారన్నమాట. మేము రిసాలా బజార్ దగ్గర్లో ఉంటాం.
    సిటీ కి వెళ్ళాలంటే కంటోన్మెంట్ లో నుంచే వెళ్తాము. ఆ దారి నాకెంత ఇష్టమో.

    శ్రీరాగ

    రిప్లయితొలగించండి
  2. సిరి గారు చంద్రుడికి థాంక్స్ నచ్చినందుకు మీకు థాంక్స్ .. మీది తెనాలి మాది తెనాలి అని పాడుకున్నట్టుగా సికింద్రాబాద్ వాళ్ళంతా మీది సికింద్ర బాదే మాది సికిందరా బాదే అని పాడుకునే రోజు రావాలని కొరుకుంటున్నా

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం