మహాత్మా గాంధీ కుమారుడు తన తండ్రిపై రాసిన పుస్తకం లో మోహన్ దాస్ కరం చంద్ గాంధీ ఈ దేశ ప్రజల దృష్టిలో జాతిపిత, మహాత్ముడు కావచ్చు. కాని ఒక కుమారుడిగా, తన తండ్రి గాంధీ పై తన అభిప్రాయం అది కాదు. గాంధీ అంటే ఒక విఫలమైన తండ్రి అని అన్నాడు.
మహాత్ముడు ఈ నేలపై నడయాడిన దేవుడు అని భావించే ప్రజల్లో నేను ఒకడిని . కాని ఒక కుమారుడుగా మాత్రం .నా ఓటు మహాత్ముని కుమారుడికే .
జాతిపిత కావచ్చు ఎంతటి ఉన్నత స్థానాల్లో ఉన్న వారైనా కావచ్చు తన పిల్లలను తీర్చి దిద్దాల్సిన బాధ్యత తండ్రిపై ఉంటుంది . తండ్రి విఫలమైతే మొత్తం కుటుంబమే విఫలమౌతుంది .
***
మా నాయనను అనేక ప్రశ్నలతో కడిగేయాలని నాకు ఎన్నాళ్ళనుంచో ఉంది. హైదరాబాద్ నగరానికి కేవలం 45 -50 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఊరు మాది నల్లగొండ జిల్లా మన్నెవారి తుర్కపల్లి ( నేను మా ఊరు ఎప్పుడూ వెళ్ళలేదు ) ఎకరం కోటి రూపాయల వరకు ధర పలుకుతుందని తెలియగానే . తాతల కాలం నుంచి వచ్చిన అన్ని ఎకరాల భూమి మాకోసం ఉంచాలని అనిపించలేదా నాన్న ? నీకా ముందు చూపు లేక పోవడం వల్లనే కదా మహానగరంలో మేం అష్టకష్టాలు పడాల్సి వచ్చింది అని నిలదీయాలని ఉండేది . పోనీ హైదరాబాద్ వచ్చావు. హైదరాబాద్ గాంధీ నగర్ లో భూమి ధర ఇప్పుడు బంగారం కన్నా ఎక్కువ ఖరీదు చేస్తుంది. అప్పుడు వెయ్యి రూపాయ లకో ప్లాట్ వచ్చేదట తలా ఓ ప్లాట్ కొని పెట్టినా బాగుండేది కదా . అలా ఎందుకు చేయలేక పోయావు నాయనా?
మీ అమ్మకు బోలెడు బంగారం పెట్టరురా అని మేనమామ చెప్పినప్పుడు కనీసం ఆ బంగారం దాచలేక పోయావా? అని అడగాలనుకున్నా .. ... . .. నిజాం కాలం లో తెలంగాణా పల్లెలను దోచుకోవడానికి అవకాశం ఉన్న స్థానంలో ఉండి.. దోచుకోక పోయినా పరవాలేదు కనీసం ఉన్నది ఎందుకు దాచలేక పోయావని ప్రశ్నించాలని అనిపించేది ..... ఇంకా ఇలాంటి ప్రశ్నలు నాలో అనేకం ఉండేవి .
*****
ఇప్పుడు కుడా ప్రశ్నించాలనే అనుకుంటున్నాను . కాని నా ప్రశ్నల సంఖ్య మారింది, ప్రశ్నలూ మారాయి .
నీకు అంత దైర్యం ఎక్కడిది నాయనా? అని ఒకే ఒక ప్రశ్న అడగాలని ఉంది.
నిజంగా పేదరికం కవులు వర్ణించినంత భయంకరంగా ఏమి ఉండదు.
కసిని పెంచుతుంది , మనలోని శక్తి సామర్థ్యాలకు సాన పెడుతుంది. సరిగ్గా ఎదుర్కొంటే తోక ముడుస్తుంది. సంపదలో పెరగడం అంత అదృష్టం కాదు, కష్టం కుడా కాదు . కాని సంపదనుంచి పేదరికం లోనికి మారి బతకడం చాల కష్టం .
నిజాం కాలం లో గ్రామం లో పెత్తనం చెలాయించే ఇద్దరు ముగ్గురిలో పోలీసు పటేల్ ఒకరు .. మా నాన్న పోలీసుపటేల్ గా ఉండే వారు . దాదాపు పన్నెండు గ్రామాల వారికి వడ్డీకి డబ్బులు ఇచ్చేవారు. మా నాన్నా సంపదలో పుట్టి, సంపదలో పెరిగారు .మాకు ఊహ తెలియక ముందే అంతా హారతి కర్పూరంలా కరిగిపోయింది . సంపద ఉన్నదనే తెలియనప్పుడు ? ఎటుపోయిందో? ఏం తెలుస్తుంది .

నిజమే మా నాన్నకు పెద్ద వ్యసనాలే ఉండేవి .మనుషులను నమ్మడం, మనుషులను ప్రేమించడం .. ఎలాంటి వారైన చావు దెబ్బ తినడానికి మనుషులను నమ్మడమనే ఒక్క వ్యసనం సరిపోదూ ? మనుషులను ప్రేమించడం వరకు క్షమించేయవచ్చు , కానీ మనుషులను పూర్తిగా నమ్మడం మాత్రం ఎప్పటికైనా ప్రమాదమే. .....
మా నాన్నకు మనుషులను నమ్మడమనే వ్యసనం ఉంటే మా పెద్దన్నకు మనుషులను అస్సలు నమ్మకపోవడం అనే పెద్ద వ్యసనం ఉంది. తన వ్యసనం వల్ల సంపదలో పుట్టినా పేదరికం లో బతికాడు మా నాన్న .. నమ్మకపోవడమనే వ్యసనం వల్ల మా అన్న మాత్రం పేదరికాన్ని చాలెంజ్ చేసి సంపన్నుడు అయ్యాడు . తండ్రి వ్యసనాన్ని చూసి మా అన్న ఒకే ఒక పాటం నేర్చుకున్నాడు. ఎవరినీ నమ్మవద్దు అనే సత్యాన్ని నమ్ముకున్నాడు. . ఆ నమ్మకమే అతన్ని బట్టల కొట్టు గుమస్తా నుంచి బంగారం దుకాణం యజమానిగా మార్చింది , అద్దె ఇంటిజీవితం మొదలు పెడితే ఒకటిన్నర డజన్ల ఇళ్లనుంచి అద్దెలు వసూలు చేసే యజమానిగా మార్చింది. అందరినీ నమ్మితే ఎమోతుందో నాన్న ఉదాహరణగా నిలిచారు. అలా అని అస్సలు మనుషులను నమ్మకుండా ఎలా ఉంటాం . అందుకే నాకు ఆ రెండు వ్యసనాలలో కొంచం కొంచం వ్యసనం చాలనిపించింది .
***
నాకు కొద్దిగా ఎరుక అనేది వచ్చిన తరువాత గుర్తున్న విషయం . రక్త సంబందికులకు బందించిన సమస్య. తాతలనాటి ఆస్తి పాతవారిని ఖాళీ చేయించి భారీ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలి. తేడా వస్తే ఏమైనా జరగ వచ్చు . ఎవరితో వ్యవహారాలు ఎలా జరపాలో నాకు తెలుసు బయపడకండి అంటూ ఆరు నెలలు రాత్రి పగలు నాన్న అక్కడే ఉన్నాడు. పదే పదే రుజువు అయ్యేదాన్నే సత్యం అంటాం . అక్కడ నమ్మితే మోసమే అనేది మరోసారి రుజువైంది . మానాన్న మాత్రం ఎప్పుడూ సంతృప్తి కరంగానే కనిపించేవారు, చిన్నచిన్న వాటికి సంతోష పడే వారు
****
స్టాక్ మార్కెట్ పడిపోవడం తో మొన్న ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో వాళ్ళ భార్య కుడా చనిపోయింది . ఆ వార్త బాధ కలిగించింది వాళ్ళ పిల్లలు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు , ఒకరు iit లో టాప్ రాంక్ సాధించారు .చచ్చి వాళ్ళు సాధించింది ఏముంది . ఆర్ధిక సమస్యలతో కుటుంబం ఆత్మహత్య . పిల్లలను బావిలో పడేసి తానూ ఆత్మహత్య చేసుకున్న తల్లి .. ఇలాంటి వార్తలు చదివినప్పుడు మనుషులు ఎందుకు అంత పిరికిగా ఆలోచిస్తారని అనిపిస్తుంది.
****
నీకు అంత దైర్యం ఎలా వచ్చింది అని మా నాన్నను అడగాలని ఉంది. పోలీసు పటేల్ గా ఉంటూ సాయుధపోరాటానికి అండగా ఉండడం కాదు.. ఈ నేల నలు చెరుగులా పోరాట గాలులు వీస్తున్నప్పుదు . ఆ గాలి నుంచి ఎవరు తప్పించుకోలేరు . నా సందేహం అది కాదు .. బంధువులు తప్పా ఏ ఆధారం లేకుండా పదిమందితో హైదరాబాద్ మహానగరం లో అడుగుపెట్టడం. ఎవరి జీవితాన్ని వారు నిర్మించుకునేట్టు చేయడం చూస్తే ... అంత ధైర్యం ఎలా వచ్చింది అని అడగాలని ఉంది . పిల్లలకు ఎలాంటి పరిస్థితి నైన ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వండి చాలు ...మార్కెట్ పడిపోతే , ఉద్యోగం పోతుందంటే ఆత్మహత్యను మార్గంగా చూపించకండి . ఏమో ఈ రోజు బావిలో తల్లితో పాటు శవంగా తేలుతున్న పిల్లవాడిని బతకనిస్తే జీవితంలో తలెత్తుకొని నిలబడే వాడేమో .
****
సంపద నుంచి పేదరికం లోకి మారాక జీవితం నరక ప్రాయంగా ఉంటుంది కాని నాకు గుర్తున్నంత వరకు మా నాన్న ముఖం లో నేను నిరాశను ఎప్పుడు చూడలేదు . నమ్మినవారు మోసం చెసినా అస్సలు పట్టించుకోలేదు . ఉన్నంతలో పిల్లలతో హాయిగా ఉండాలి అంతే. మనం ఫిల్ఖాన లో ఉండగా నాన్న కోసం ఆ నాడు సాయుధ పోరాటం లో పాల్గొన్న వాళ్ళు కొంతమంది వచ్చి ఆనాటి ముచ్చటలు చెప్పుకునే వారని మా చిన్నన్న చెప్పాడు.
ఓ సారి మా చిన్నమ్మాయి నాన్నా అంతా సెలవుల్లో మా ఉరేలుతున్నాం అని గొప్పగా చెబుతున్నారు , మనకు ఉరులేదా మనం వెళదాం అంది. హైదరాబాదే మన ఊరు అని సింపుల్ గా చెప్పాను.
ఇప్పుడునాకు మా ఊరు వెళ్ళాలని ఉంది .మా ఊరికి వెళతాను. ఉరి ముచ్చట్లు మా నాన్న ముచట్లు సేకరిస్తాను.
****
ఈ ఫీజులు , ఖర్చులు చూస్తుంటే ఒక్కో సారి భవిష్యత్తు తలుచుకుంటే భయం వేస్తుంది . అనే మాట ఇంట్లో వినిపిస్తే , సొంతిల్లు, ప్రభుత్వ ఉద్యోగమంత భద్రత ఉన్న ఉద్యోగం , చక్కగా చదువుకుంటున్న పిల్లలు ఇలా ఉన్న మనమే అలా అనుకుంటే మరి మా నాయన .... అంటూ మా నాన్న గురించి చెబితే నిజమే అన్నారు. నాకు ఇప్పటికీ మా నాన్నే ధైర్యం .
అధికారంలో ఉన్న వారని వెధవలకు కుడా తలవంచి పైకి ఎదుగుతున్న వారు కళ్ళ ముందు కనిపిస్తున్నా.. నేను నిటారుగా నిలబడే వ్యక్తిత్వం తోనే ఉన్నా ... నేను రాసిన జనాంతికం పుస్తక ఆవిష్కరణ సభలో ప్రొఫెసర్ హరగోపాల్ నీకింత ధైర్యం ఏమిటి ? నీమీద పోటా కేసు పెట్టవచ్చు తెలుసా అనిపుస్తకం లోని మాటలు ప్రస్తావించారు. రాయడానికి నిజంగా పెద్ద ధైర్యం అవసరం లేదు పైరవీలు చేసుకొని బతుకుదాము అనే కోరిక లేకుంటే చాలు . కాని కష్టాలను ఎదిరించి బతుకు పోరాటం చేయడానికే ధైర్యం కావాలి .. అందుకే అంత ధైర్యం నీకు ఎలా వచ్చింది అని మా నాన్నను అడగాలను కున్నా..
*****
ఓ చోట రాంగోపాల్ వర్మ గవాస్కర్ చెప్పిన మాట చెప్పాడు .అవుట్ అయి రాగానే పాడ్ బాయ్ కూడా మీరు ఆ బాల్ అలా కొట్టాల్సింది కాదు సార్ అని సలహా ఇస్తాడట . అలానే ఇలా చేయాల్సింది కాదు అలా చేయాల్సింది కాదు అని చెప్పడం నా నా ఉద్దేశం కాదు . తప్పు ఎవరిది, ఎవరు ఎవరిని మోసం చేసారు అనే దానిపై కూడా నాకిప్పుడు ఆసక్తి లేదు.
బతుకు ఆంటే భయంకరం అనుకోని దాన్ని భయంకరంగా ఉహించుకోకండి . ఆత్మహత్య పిరికి పండ చర్య అని నేను చెప్పడం లేదు . ఆత్మహత్యకు కూడా ధైర్యం కావాలి కాని బతకడానికి అంతకన్నా మించి ధైర్యం కావాలి. బతుకు భయపెడితే పేదరికాన్ని ఈడ్చి తన్నిన మా పెద్దన్న భవనం బేగంపేట ఆనంద్ సినిమా హాల్ వెనకాల నిటారుగా నిలబడి ఉంటుంది . ఓ సారి చూడండి.
****
ఏసమస్య వచ్చినా ముందు నిలిచేది మా నాన్ననే 1982 లో నేను పదో తరగతి పరీక్షలకు సిద్ధ మౌతున్నా.. అంత్యక్రియల్లో ఏదో సందేహం . ఎందుకు కంగారు పడతారు నాన్నను అడగ వచ్చు కదా మాట నోటివరకు వచ్చి ఆగిపోయింది . అక్కడ జరుగుతున్నవి మానాన్న అంత్యక్రియల ఏర్పాట్లు .
( ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా )
***
రామాయణం, మహాభారతం , పురాణాల నుంచి కొన్ని ఉదాహరణలతో వ్యక్తిత్వ వికాసం పై ఓటమే గురువు పుస్తకం రాశాను . మిత్రులకు పుస్తకం ఇస్తుంటే అక్కడికి కొత్తగా వచ్చిన జర్నలిస్ట్ మిత్రుడు నా చేతిలోని బుక్ పై ఇంటి పేరు చూసి ఈ ఇంటిపేరు గలవారు మా కు తెలుసు మా ఊరే అని ఆసక్తి చూపించాడు. మా ఊరిలో బుద్దా కాశయ్య అని ఉండే వారు , మా నాన్న ఆయన శిశ్యుడు . తెలంగాణా సాయుధ పోరాట సమయం లో కలిసి పని చేశారు . వాళ్ళ ఇంట్లో ఎప్పుడు చూసినా జనం సందడి .అంటూ చెప్పుకు పోతున్నాడు. చాల సంతోషం వేసింది . అతను చెబుతున్నది మా నాన్న గురించి. కొద్ది సేపటి తరువాత చెప్పాను ఆయన మా నాన్న అని . ఆ తరువాత ఆ మిత్రుడు చాల సార్లు అన్నా ఓసారి ఊరికిరా అని అడిగాడు. వస్తానని చెప్పను కాని ఎందుకో నాకు పెద్దగా ఆసక్తి అనిపించలేదు . ఓ సారి కొంచం ఆశర్యంగా, వింతగా చూస్తూ మన ఊరు చూడాలని నీకు ఎప్పుడూ అనిపించలేదా? అని అడిగాడు. చిరునవ్వే సమాధానం. ఓసారి అక్కడి యమ్. యల్.ఏ. తో ఏదో మాట్లాడుతుంటే మురళి నువ్వు మానురివాడివే నట కదా అంటూ ఊరికి చెందినా కొందరు పెద్దల పేర్లు చెప్పి వీరంతా నాకు పరిచయమే అని చెబుతుంటే ఒళ్ళు పులకరించినట్టు అయింది చిన్నప్పుడు ఆ పేర్లన్నీ మా నాన్న మాటల్లో తరుచుగా వినిపించేవి .
*** నాకు కొద్దిగా ఎరుక అనేది వచ్చిన తరువాత గుర్తున్న విషయం . రక్త సంబందికులకు బందించిన సమస్య. తాతలనాటి ఆస్తి పాతవారిని ఖాళీ చేయించి భారీ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలి. తేడా వస్తే ఏమైనా జరగ వచ్చు . ఎవరితో వ్యవహారాలు ఎలా జరపాలో నాకు తెలుసు బయపడకండి అంటూ ఆరు నెలలు రాత్రి పగలు నాన్న అక్కడే ఉన్నాడు. పదే పదే రుజువు అయ్యేదాన్నే సత్యం అంటాం . అక్కడ నమ్మితే మోసమే అనేది మరోసారి రుజువైంది . మానాన్న మాత్రం ఎప్పుడూ సంతృప్తి కరంగానే కనిపించేవారు, చిన్నచిన్న వాటికి సంతోష పడే వారు
****
స్టాక్ మార్కెట్ పడిపోవడం తో మొన్న ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో వాళ్ళ భార్య కుడా చనిపోయింది . ఆ వార్త బాధ కలిగించింది వాళ్ళ పిల్లలు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు , ఒకరు iit లో టాప్ రాంక్ సాధించారు .చచ్చి వాళ్ళు సాధించింది ఏముంది . ఆర్ధిక సమస్యలతో కుటుంబం ఆత్మహత్య . పిల్లలను బావిలో పడేసి తానూ ఆత్మహత్య చేసుకున్న తల్లి .. ఇలాంటి వార్తలు చదివినప్పుడు మనుషులు ఎందుకు అంత పిరికిగా ఆలోచిస్తారని అనిపిస్తుంది.
****
నీకు అంత దైర్యం ఎలా వచ్చింది అని మా నాన్నను అడగాలని ఉంది. పోలీసు పటేల్ గా ఉంటూ సాయుధపోరాటానికి అండగా ఉండడం కాదు.. ఈ నేల నలు చెరుగులా పోరాట గాలులు వీస్తున్నప్పుదు . ఆ గాలి నుంచి ఎవరు తప్పించుకోలేరు . నా సందేహం అది కాదు .. బంధువులు తప్పా ఏ ఆధారం లేకుండా పదిమందితో హైదరాబాద్ మహానగరం లో అడుగుపెట్టడం. ఎవరి జీవితాన్ని వారు నిర్మించుకునేట్టు చేయడం చూస్తే ... అంత ధైర్యం ఎలా వచ్చింది అని అడగాలని ఉంది . పిల్లలకు ఎలాంటి పరిస్థితి నైన ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వండి చాలు ...మార్కెట్ పడిపోతే , ఉద్యోగం పోతుందంటే ఆత్మహత్యను మార్గంగా చూపించకండి . ఏమో ఈ రోజు బావిలో తల్లితో పాటు శవంగా తేలుతున్న పిల్లవాడిని బతకనిస్తే జీవితంలో తలెత్తుకొని నిలబడే వాడేమో .
****
సంపద నుంచి పేదరికం లోకి మారాక జీవితం నరక ప్రాయంగా ఉంటుంది కాని నాకు గుర్తున్నంత వరకు మా నాన్న ముఖం లో నేను నిరాశను ఎప్పుడు చూడలేదు . నమ్మినవారు మోసం చెసినా అస్సలు పట్టించుకోలేదు . ఉన్నంతలో పిల్లలతో హాయిగా ఉండాలి అంతే. మనం ఫిల్ఖాన లో ఉండగా నాన్న కోసం ఆ నాడు సాయుధ పోరాటం లో పాల్గొన్న వాళ్ళు కొంతమంది వచ్చి ఆనాటి ముచ్చటలు చెప్పుకునే వారని మా చిన్నన్న చెప్పాడు.
ఓ సారి మా చిన్నమ్మాయి నాన్నా అంతా సెలవుల్లో మా ఉరేలుతున్నాం అని గొప్పగా చెబుతున్నారు , మనకు ఉరులేదా మనం వెళదాం అంది. హైదరాబాదే మన ఊరు అని సింపుల్ గా చెప్పాను.
ఇప్పుడునాకు మా ఊరు వెళ్ళాలని ఉంది .మా ఊరికి వెళతాను. ఉరి ముచ్చట్లు మా నాన్న ముచట్లు సేకరిస్తాను.
****
ఈ ఫీజులు , ఖర్చులు చూస్తుంటే ఒక్కో సారి భవిష్యత్తు తలుచుకుంటే భయం వేస్తుంది . అనే మాట ఇంట్లో వినిపిస్తే , సొంతిల్లు, ప్రభుత్వ ఉద్యోగమంత భద్రత ఉన్న ఉద్యోగం , చక్కగా చదువుకుంటున్న పిల్లలు ఇలా ఉన్న మనమే అలా అనుకుంటే మరి మా నాయన .... అంటూ మా నాన్న గురించి చెబితే నిజమే అన్నారు. నాకు ఇప్పటికీ మా నాన్నే ధైర్యం .
అధికారంలో ఉన్న వారని వెధవలకు కుడా తలవంచి పైకి ఎదుగుతున్న వారు కళ్ళ ముందు కనిపిస్తున్నా.. నేను నిటారుగా నిలబడే వ్యక్తిత్వం తోనే ఉన్నా ... నేను రాసిన జనాంతికం పుస్తక ఆవిష్కరణ సభలో ప్రొఫెసర్ హరగోపాల్ నీకింత ధైర్యం ఏమిటి ? నీమీద పోటా కేసు పెట్టవచ్చు తెలుసా అనిపుస్తకం లోని మాటలు ప్రస్తావించారు. రాయడానికి నిజంగా పెద్ద ధైర్యం అవసరం లేదు పైరవీలు చేసుకొని బతుకుదాము అనే కోరిక లేకుంటే చాలు . కాని కష్టాలను ఎదిరించి బతుకు పోరాటం చేయడానికే ధైర్యం కావాలి .. అందుకే అంత ధైర్యం నీకు ఎలా వచ్చింది అని మా నాన్నను అడగాలను కున్నా..
*****
ఓ చోట రాంగోపాల్ వర్మ గవాస్కర్ చెప్పిన మాట చెప్పాడు .అవుట్ అయి రాగానే పాడ్ బాయ్ కూడా మీరు ఆ బాల్ అలా కొట్టాల్సింది కాదు సార్ అని సలహా ఇస్తాడట . అలానే ఇలా చేయాల్సింది కాదు అలా చేయాల్సింది కాదు అని చెప్పడం నా నా ఉద్దేశం కాదు . తప్పు ఎవరిది, ఎవరు ఎవరిని మోసం చేసారు అనే దానిపై కూడా నాకిప్పుడు ఆసక్తి లేదు.
బతుకు ఆంటే భయంకరం అనుకోని దాన్ని భయంకరంగా ఉహించుకోకండి . ఆత్మహత్య పిరికి పండ చర్య అని నేను చెప్పడం లేదు . ఆత్మహత్యకు కూడా ధైర్యం కావాలి కాని బతకడానికి అంతకన్నా మించి ధైర్యం కావాలి. బతుకు భయపెడితే పేదరికాన్ని ఈడ్చి తన్నిన మా పెద్దన్న భవనం బేగంపేట ఆనంద్ సినిమా హాల్ వెనకాల నిటారుగా నిలబడి ఉంటుంది . ఓ సారి చూడండి.
****
ఏసమస్య వచ్చినా ముందు నిలిచేది మా నాన్ననే 1982 లో నేను పదో తరగతి పరీక్షలకు సిద్ధ మౌతున్నా.. అంత్యక్రియల్లో ఏదో సందేహం . ఎందుకు కంగారు పడతారు నాన్నను అడగ వచ్చు కదా మాట నోటివరకు వచ్చి ఆగిపోయింది . అక్కడ జరుగుతున్నవి మానాన్న అంత్యక్రియల ఏర్పాట్లు .
( ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా )
హ్మ్ ఏమి చెప్పాలో తెలియట్లేదు...మొత్తం వ్యాసంలో అంతర్లీనంగా ఉన్న మీ బాధ కనబడుతున్నాది.
రిప్లయితొలగించండిస్పూర్తికరం అంటే.. ఇదే! మీ నాన్న గారి నుండి నేర్చుకున్నస్ఫూర్తి ఉత్తేజకరంగా ఉంది. బాగుంది ..మురళి గారు
రిప్లయితొలగించండిచాలా బాగా రాసారు. నిజంగా కుటుంబ పెద్దగా ఓ తండ్రి తన బాధ్యతపట్ల ఎంత జాగ్రత్త వహించాలో రచ్చగెలిచినా ఇంట గెలవడానికి కూడా అదే శ్రద్థ చూపించాలని చూపిన ఉదాహరణ...గాంధీగారి అబ్బాయి. పిల్లలకు ఎం త ఆస్తిని వారసత్వంగా ఇచ్చాం అని కాకుండా.. ఎగుడుదిగుడు బతుకుదారిని సాఫీగా సాగిపోయే రహదారిగా మార్చుకోవడానికి కావలసిన గుండె నిబ్బరాన్ని ఇవ్వగలగాలి తల్లిదండ్రులు. ఈ విషయంలో మీ నాన్నగారు సఫలం అయ్యారనుకుంటున్నా. స్ఫూర్తినిచ్చే
రిప్లయితొలగించండిమీ అనుభవాలను పంచుకున్నందుకు ధన్యవాదాలు.
I read ten posts on similar subject today. None is more inspiring than this one. What else do we need from a father? Pure delight to read this.
రిప్లయితొలగించండి@ఆ . సౌమ్య గారు థాంక్స్ .. మీరు చెప్పింది నిజమే అనిపిస్తోంది. నాకు కూడా ఒక్కో సారి అలానే అనిపిస్తుంది . ఏదో అంతర్లీనంగా భాధ ఉందనిపిస్తోంది. ఐతే అది నాపరిస్తితిపై కాకుండా ? నేను బాగా ఇష్టపడే వారి పరిస్తితిపై అని నా అనుమానం .
రిప్లయితొలగించండి@ వనజవనమాలి గారు థాంక్స్ ..
@ సుధా గారు ధన్యవాదాలు .మహాత్ముడు గొప్పవ్యక్తి కాదు అంటే ఈ దేశం లో ఇప్పటి వరకు ఒక్క గొప్ప వ్యక్తి కూడా పుట్టలేదు, పుట్టబోడు అని నా అభిప్రాయం . ఐతేకొడుకుగా మహాత్ముణ్ణి తప్పు పట్టే అధికారం అతనికి ఉంటుంది. నా అభిప్రాయం తో ఏకీభవించి నందుకు థాంక్స్
.@దుర్వాసుడు గారు ప్రోత్సాహకరమైన మీ కామెంట్ కు థాంక్స్
Simply Superb...
రిప్లయితొలగించండి--Indrasena Gangasani
బుద్దా మురళి గారు,
రిప్లయితొలగించండినేను మీ ఆర్టికల్స్ ను ఆంధ్రభూమి లో చదివేవాడిని. మీరు బ్లాగుల్లో కి రావటం వలన మరిన్ని ఎక్కువగా రాస్తున్నారు, నేను రోజు మీటపాలు చదువుతాను. చాలా బాగా ఉంటాయి. మీ శైలి, విషయ పరిజ్ఞానం, ప్రస్తుత పరిస్థితుల మీద మీ వ్యాఖ్యానలు అద్బుతం. ఈ మధ్య మీరు రాసిన ఎన్నికల పైన మీడీయా ప్రభావం గురించి 1980 లో ఈనాడు పేపర్ సర్కులేషన్ చాలా తక్కువ అది ఎంతమందిని ప్రభావితం చేసి ఉంట్టుంది ? అని చాలా బాగా రాశారు. మీరొక వాలిడ్ పాయింట్ని లేవనెత్తారు. యం.బి.యస్. ప్రసాద్ గారు కూడా మీవ్యాసాన్ని ఒక వెబ్ సైట్లో ఉటంకించారు. మీకు వీలైతే ఎన్నికలపై కుల ప్రభావం ఎంత మేరకు ఉంట్టుందనే అంశం పైన రాసేది.
-------------------------
మీ నాన్న గారి మీద బాగా రాశారు. నావి కూడా అదే భావాలు. మీరు హైదరాబాద్ లో స్థలం గురించి రాస్తే, మా తాతలు మద్రాస్ లో 1915ల లో చదివారు అక్కడ ఎన్నో సంవత్సరాలు గడిపి స్వంత వూరికి ఉత్త చేతులతో వచ్చారు. ఆకాలంలో వూరి బయట అయిన నుంగంబాకం లో ఒక ఎకరా కొని ఉన్నా ఎక్కడో ఉండెవాళ్లమని అనిపిస్తుంది.
Srinivas
mee post inka continue ite bagundu anipinchenta baaga rasaaru. ento bagundi....... entamandi cheppina kooda vinakundaa aatmahatya chesukovaalanukonevaaru... manasikanga chanipointatte lekka.... atuvantivaaru enno manchpanulu chesi chanipote bagundunemo anukuntaanu nenu.
రిప్లయితొలగించండి@ఇంద్రసేనా గంగ సాని గారు థాంక్స్
రిప్లయితొలగించండి@శ్రీనివాస్ గారు థాంక్స్ అవకాశం ఉంటే ప్రసాద్ గారు నా వ్యాసాన్ని కోట్ చేసిన వ్యాసం వివరాలు తెలిస్తే చెప్పగలరు. కొన్ని వివరాలు సేకరించి రాజకీయాలపై కుల ప్రభావం గురించి రాయడానికి ప్రయత్నిస్తాను. సంపద కన్నా సంతృప్తితో జీవించే తత్వాన్ని అలవర్చుకుంటే సుకంగా ఉంటామండి .
@ సమీరా గారు క్షమించాలి ఆత్మహత్యపై నేను మీ అభిప్రాయంతో ................ ప్రతిమనిషి తన జీవితంలో ఎప్పుడో ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడని సర్వేల్లో తేలింది .. ఒక బలహీనమైన క్షణం లో ఆలాంటి ఆలోచన వస్తుంది. అలాంటి సమయంలో ధైర్యం చెప్పేవారుంటే ఆ దశనుంచి బయట పడతారు
He loves you as much as your mother loves you.
రిప్లయితొలగించండిBut, he never expressed it out. He keeps all his love in his butter like heart and behaves like a stone heart person just for your betterment.
He lives for you and takes up challenges outside
your house in this bad bad world. Never ever tells you his struggles and his hardships.. In return gets your anger and hatred but not gratitude. Fathers Day is to thank that selfless and silent worker. ----balakrishna
Very well discripted and seems truly from the heart. On the same occasion I too got some emotional feel to write this ---
రిప్లయితొలగించండితండ్రీ! నీకు ఒక్క దినమేనా? నీకో దణ్ణం!
అమ్మను తలచుకోడానికి ఓ సందర్భం అంటూ అఖ్ఖర్లేదు. అది ఒక సహజమయిన, స్వాభావికమయిన ప్రవర్తనలో భాగం. సంతోషంలో(అమ్మో! ఎంత బాందో!) దుఃఖంలో(అమ్మోయ్!)—నొప్పిలో –( అమ్మో!)- భయంలో (అమ్మ బాబోయ్- ఇక్కడ నాన్న జత కలిశాడు) ఆశ్చర్యంలో (అమ్మోయ్) ఊరడింపులో (హమ్మయ్య- ఇక్కడ కూడా మళ్లి నాన్న)—ఇలా పుట్టినప్పటినుండి, ఊపిరి --- for article see the link --
http://gksraja.blogspot.com/2011/06/blog-post.html?m=1
meeru chepimdi lashalu veluva chese ashra nijam
రిప్లయితొలగించండిmanishi manishigane edagali, nilabadagalagali
apude manava janmaku dhanyam
ధన్యవాదాలు తరతరాల తెలుగువెలుగు
తొలగించండి