13, డిసెంబర్ 2011, మంగళవారం

ఇక రాంగోపాల్ వర్మ ఈ టీవీ సుమన్ తోనే పోటీ పడాలి .. వివాదాల ప్రచారంతో సినిమా పప్పులు ఉడకవు




చానల్స్‌లో వివాదాల ద్వారా సినిమాను సక్సెస్ చేయించుకోవాలని ప్రయత్నిస్తే ఏమవుతుంది. బెజవాడ సినిమా అవుతుంది. ఇప్పుడు చానల్స్‌లో ప్రచారాన్ని నమ్మి సినిమా చూసేవారెవరూ లేరు. సినిమా బాగుందని చూసిన వారు చెబితే కొంత వరకు నమ్ముతున్నారేమో కానీ మీడియాను నమ్మి సినిమాకు వెళ్లే రోజులు పోయాయి.

 రాంగోపాల్‌వర్మ వర్మ మాత్రం ఇంకా పాత టెక్నిక్‌లనే నమ్ముకున్నారు. శివ నాటికి ఇప్పటికి కాలం చాలా మారిపోయింది. ఆయన దాన్ని గుర్తించారో లేదో? గుర్తించక పోవడమే మంచిది. ఇదే దూకుడుతో ఇదే తరహాలో మరో ఐదారు సినిమాలు తీస్తే చాలు. అంతకు మించి మనం ఆయన నుంచి కోరుకునేది ఏమీ లేదు. వర్మ సినిమాలు మరో రెండు మూడు విడుదలయ్యాక ఆయనకు ఈటీవి సుమన్ తప్ప మరెవరూ సాటిరారు. వారిద్దరి మధ్యనే రసవత్తరమైన పోటీ ఉంటుంది. బెజవాడ సినిమా విడుదల సందర్భంగా దాదాపు అన్ని తెలుగు చానల్స్‌లోనూ రాంగోపాల్ వర్మ హడావుడి కనిపించింది.

 పేయిడ్ ఇంటర్వ్యూలో, లేక చానల్స్ వాళ్లు పే చేసి ఇప్పించుకునే ఇంటర్వ్యూలో, సాధారణంగా సినిమా వాళ్లను చేసే ఇంటర్వ్యూలో ఏది ఏమిటో ఈ మధ్య తెలియడం లేదు. ఏ ఇంటర్వ్యూ అయితేనేం కానీ బెజవాడ సినిమా విడుదల సందర్భంగా అన్ని చానల్స్‌లోనూ రాంగోపాల్ వర్మ తెగ మాట్లాడేశారు. నా ఇష్టం వచ్చినట్టు నా కోసం నేను సినిమా తీస్తాను మీకు నచ్చినా నచ్చక పోయినా నాకు సంబంధం లేదు, ఇష్టం ఉంటే చూడండి లేకపోతే లేదు. రాంగోపాల్‌వర్మ ఎన్ని చానల్స్‌లో మాట్లాడినా మొత్తంగా ఆయన మాటల సారాంశం ఇది. పైగా టీవి చానల్‌లో ప్రశ్న అడిగిన వారితో అమర్యాదకరంగా మీకు అర్థం కావడం లేదు అంటూ తీసిపారేస్తూ మాట్లాడుతుంటారు. సినిమా గురించి చానల్స్‌లో తెగ హడావుడి చేశారు. ఆయన మాట్లాడింది సరిపోదన్నట్టు తెలుగు చానల్స్ ఆ సినిమా ప్రచారం తమ బాధ్యత అన్నట్టుగా లెక్కలేనన్ని ప్రత్యేక కథనాలు ప్రసారం చేశాయి. తీరా సినిమా విడుదలయ్యాక అది అట్టర్ ఫ్ల్లాపైంది. ఇంటర్వ్యూల్లో వివాదాస్పదంగా మాట్లాడడం ద్వారా సినిమాపై ఆసక్తి కలిగించడానికి ఆయన చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. గతంలో రక్తచరిత్రను ఇదే విధంగా టీవిల ద్వారా సంచలనం చేశారు. సినిమా విడుదలైన తరువాత ఏమాత్రం బాగాలేదనే టాక్ వచ్చేసరికి వర్మకు సన్నిహితుడైన ఒక ఎమ్మెల్యే ద్వారా టీవిలో సంచలన ప్రకటన చేయించారు. ఈ సినిమా ఎన్టీఆర్‌ను అవమానించే విధంగా ఉందని సినిమాను బ్యాన్ చేయాలని చానల్ చర్చలో టిడిపి ఎమ్మెల్యే ఒకరు డిమాండ్ చేశారు. ఆయన వర్మ మిత్రుడు. ఆ డిమాండ్ కూడా ప్రచారంలో భాగం. ఎన్టీఆర్ అభిమానులైన నాయకులు రోడ్డుమీదకు వచ్చి కొంత హడావుడి చేయడం ద్వారా సినిమాకు కొద్దిగా ఊపిరి పోశారు.

 ఇదే తరహాలో బెజవాడను మొదటి నుండి వివాదం చేయడానికి ప్రయత్నించారు. బెజవాడ రౌడీ అని తొలుత పేరు ప్రకటించడం, విజయవాడ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేయడం, విజయవాడలో వర్మ, ఆయన మిత్రుడు లగడపాటి రాజ్‌గోపాల్ బైక్‌పై షికార్లు, చివరకు నేను ఎవరికీ భయపడను కానీ మిత్రుడి కోరిక మేరకు సినిమా పేరు మార్చినట్టు వర్మ ప్రకటించారు. ఇన్ని నాటకాలు ఆడినా, చానల్స్ ప్రచారంతో అదరగొట్టినా సినిమా అట్టర్ ఫ్ల్లాప్ కావడం విశేషం. మరోవైపు సుమన్ రెండు మూడు వారాలకో సినిమాను నిర్మించేస్తూ ఈటీవి ప్రేక్షకులపైకి వదిలేస్తున్నారు. సినిమాలను కుటీర పరిశ్రమ స్థాయికి తీసుకు వచ్చిన ఘనత సుమన్ బాబుదే. అట్టర్ ఫ్లాప్ సినిమాలు నిర్మిస్తూ థియేటర్‌లో విడుదల చేస్తున్న వర్మ ధైర్యాన్ని, రెండు మూడు వారాలకో సినిమా టీవిలో విడుదల చేస్తున్న సుమన్ కృషిని అభినందించాల్సింది. వివాదాల ద్వారా టీవిల ద్వారా సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకం అంత పెద్ద దర్శకుడికి ఉండడం విచిత్రమే. అన్ని తెలుగు చానల్స్‌లో పవన్ కళ్యాణ్‌తో చిట్‌చాట్ అంటూ సుమ ఇంటర్వ్యూ చేసిన కార్యక్రమం వచ్చింది.

 15 నుంచి 30 నిమిషాల తేడాతో అన్ని తెలుగు చానల్స్‌లో ఒక దాని తరువాత ఒకదానిలో ఈ కార్యక్రమం వచ్చింది. పంజా సినిమా విడుదల సందర్భంగా ఇది పేయిడ్ ఇంటర్వ్యూనేమో! ప్రకటనను, ప్రత్యేక కార్యక్రమాన్ని ఒకే విధంగా చూపిస్తే ఎలా? ఆ మధ్య హాలివుడ్ నటుడు ఢిల్లీ వస్తే అభిమానులు తెగ హడావుడి చేశారట! ఇంగ్లీష్ సినిమాలు చూసే వాళ్లు మన దేశంలో బాగానే ఉండవచ్చు కానీ అభిమానం అంటూ అలా వెంటపడేంత సీన్ ఉంటుందా? ఆ నటుడు వచ్చి వెళ్లిన తరువాత వారంతా పేయిడ్ అభిమానులని, హాలీవుడ్ హీరోను సంతృప్తి పరిచేందుకు అలా చేశారని జాతీయ చానల్స్‌లో కథనాలు ప్రసారమయ్యాయి.
సోషల్ సైట్స్ హద్దులు మీరి అభ్యంతరకరమైన రాతలు, ఫోటోల మార్ఫింగ్‌పై కేంద్ర మంత్రి సిబాల్ నిరసన వ్యక్తం చేశారు. స్వీయనియంత్రణ లేదా ఆంక్షలు అవసరం అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై ఇంగ్లీష్ చానల్స్ కన్నా మన తెలుగు చానల్స్‌లోనే సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఆంక్షలు విధిస్తారా? అంటూ మంత్రిపై మండిపడ్డవారే ఎక్కువ. సోషల్ సైట్స్‌లో ఇప్పటికే కొంత వరకు స్వీయనియంత్రణ ఉంది. ఎవరైనా అభ్యంతరకరమైన రాతలు, ఫోటోలు పెడితే ఫిర్యాదు చేయవచ్చు. పెద్ద సంఖ్యలో బోగస్ అకౌంట్స్ ఉంటాయి వాటిపై ఫిర్యాదు చేస్తే వెంటనే తొలగిస్తారు. ఆలోచనలకు స్వేచ్ఛ అవసరం, ఆలోచనలను అడ్డుకోవలసిన అవసరం లేదు కానీ సున్నితమైన అంశాలపై ఉద్రిక్తతలను రెచ్చగొట్టే చర్యలను అడ్డుకోవడానికి సోషల్ సైట్స్ స్వీయనియంత్రణ పాటించాల్సిందే. ఏదో ఒక మారు మూల దేశంలో ఒక మతాన్ని కించపరిచే విధంగా కార్టూన్ వేశారని హైదరాబాద్‌లో సైతం మతకలహాలు చెలరేగాయి. సున్నితమైన అంశాలపై రెచ్చగొట్టే రాతలు, ఫోటోలతో ఎవరైనా ఇష్టానుసారం వ్యవహరించడానికి అవకాశం ఉండకూడదు. రోడ్డుపై ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అంటే ఒక పౌరుడిగా ఎక్కడికైనా ప్రయాణించే నా హక్కును కాలరాస్తారా? అని నిలదీస్తే ఎలా? సోషల్ సైట్స్‌లో వెర్రితలలు వేసే వ్యవహారాలను అడ్డుకోవడానికి స్వీయనియంత్రణ అవసరం. అదే సమయంలో ప్రజలకు తమ భావాలను స్వేచ్ఛగా వెల్లడించే హక్కు ఉండాలి.
విశాఖలో రియల్ ఎస్టేట్ గొడవలపై టీవి5 గురువారం ఒక ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేస్తూ విశాఖకు సీమ సంస్కృతి అంటూ పేర్కొన్నారు. చానల్ వాళ్ల దృష్టిలో సీమ సంస్కృతి అంటే ఏమిటో? అస్థిత్వ పోరాటాలు సాగుతున్న ఈ కాలంలో ఒక ప్రాంతం గురించి మాట్లాడేప్పుడు చానల్స్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.

12 కామెంట్‌లు:

  1. గతం లో నాగ సూరి వేణు గోపాల్ గారని ఒకాయన ఇలానే చక్కని విశ్లేషణ లను వార్త paper మాధ్యమం ద్వారా చక్కగా వ్యక్త పరిచేవారు వారి సమీక్షని
    వారి వి బుక్స్ గా కూడా తర్వాత వచ్చాయి
    మీ blog ని email ద్వారా subscribe అయ్యి చాల మంచి పని చేశాను లేకుంటే ఇంత ఆసక్తి కరమైన విశ్లేషణా త్మక వివరణ miss అయ్యేవాడిని
    మీ దృక్పథం సార్వజనీనికం గా ఉన్నది
    చాలా సంతోషం
    ఈ మధ్య Maa వారి channel లో 11 దాటాక phone చేసి line లో ఉంటె ఏదో ఒక క్షణం లో మీ కాల్ కలుపుతామని జనాల్ని మోసం చేసి డబ్బు గడించేలా ఒక మాటకారి చేత
    వికట ప్రచారం చేసి నా వద్దా కూడా 6 నిమిషాలకు గానూ 70 రూపాయిలు ఛార్జ్ చేసారు
    వీళ్ళు TV లో చెప్పే సోది ఒక ఎత్తైతే ఆ ఫోన్ రింగ్ అవ్వక డైరెక్ట్ గా కలిసి ఏదో record
    ఎక్కువ టైం line లో ఉండేలా record చేసి మభ్య పెట్టె మాటలని అందులో అమ్మాయి చేత చెప్పించి దారుణం గా డబ్బులు దోచుకుంటున్నారు
    దయ చేసి మీరు దాని పరం గా విశ్లేషన ఇచ్చినట్లయితే దానికి దృశ్య రూపం కల్పించి ప్రచారం చేస్తాను నాకు మల్లె మరోక్కరు అలా నష్ట పోవటం నాకు ఇష్టం లేదు
    " koun banega karod pathi " కూడా business oriented commercial program అని మొన్న ఈ మధ్యనే తెలిసింది
    వ్యాపారం చేసుకోవాలి కాని చానల్స్ నీచ స్థితికి దిగజార కూడదు
    ఆ maatv యాజమాన్యం నా దృష్టి లో తన విలువను కోల్పోయింది ఆ పరమ చెత్త ప్రోగ్రాం ద్వారా అన్యాయంగా నా డబ్బులు దోచుకున్నందుకు
    ?!

    రిప్లయితొలగించండి
  2. గతం లో నాగ సూరి వేణు గోపాల్ గారని ఒకాయన ఇలానే చక్కని విశ్లేషణ లను వార్త paper మాధ్యమం ద్వారా చక్కగా వ్యక్త పరిచేవారు వారి సమీక్షని
    వారి వి బుక్స్ గా కూడా తర్వాత వచ్చాయి
    మీ blog ని email ద్వారా subscribe అయ్యి చాల మంచి పని చేశాను లేకుంటే ఇంత ఆసక్తి కరమైన విశ్లేషణా త్మక వివరణ miss అయ్యేవాడిని
    మీ దృక్పథం సార్వజనీనికం గా ఉన్నది
    చాలా సంతోషం
    ఈ మధ్య Maa వారి channel లో 11 దాటాక phone చేసి line లో ఉంటె ఏదో ఒక క్షణం లో మీ కాల్ కలుపుతామని జనాల్ని మోసం చేసి డబ్బు గడించేలా ఒక మాటకారి చేత
    వికట ప్రచారం చేసి నా వద్దా కూడా 6 నిమిషాలకు గానూ 70 రూపాయిలు ఛార్జ్ చేసారు
    వీళ్ళు TV లో చెప్పే సోది ఒక ఎత్తైతే ఆ ఫోన్ రింగ్ అవ్వక డైరెక్ట్ గా కలిసి ఏదో record
    ఎక్కువ టైం line లో ఉండేలా record చేసి మభ్య పెట్టె మాటలని అందులో అమ్మాయి చేత చెప్పించి దారుణం గా డబ్బులు దోచుకుంటున్నారు
    దయ చేసి మీరు దాని పరం గా విశ్లేషన ఇచ్చినట్లయితే దానికి దృశ్య రూపం కల్పించి ప్రచారం చేస్తాను నాకు మల్లె మరోక్కరు అలా నష్ట పోవటం నాకు ఇష్టం లేదు
    " koun banega karod pathi " కూడా business oriented commercial program అని మొన్న ఈ మధ్యనే తెలిసింది
    వ్యాపారం చేసుకోవాలి కాని చానల్స్ నీచ స్థితికి దిగజార కూడదు
    ఆ maatv యాజమాన్యం నా దృష్టి లో తన విలువను కోల్పోయింది ఆ పరమ చెత్త ప్రోగ్రాం ద్వారా అన్యాయంగా నా డబ్బులు దోచుకున్నందుకు
    ?!

    రిప్లయితొలగించండి
  3. ఎందుకో ఏమో గారు గతం లోనే ఈ అంశం పై రాశానండి ... లింక్ ఇస్తున్నాను చూడండి
    http://amruthamathanam.blogspot.com/2011/07/blog-post_12.html

    రిప్లయితొలగించండి
  4. బులుసు గారు మన సుమన్ బాబు తో ఎవరూ పోటీ పడలేరండి . వర్మ పోటీ పడ్డా గెలుపు మన సుమన్ బాబుదే

    రిప్లయితొలగించండి
  5. ఈ సుమన్ ఎవరండీ బాబు, ఇంత మంది ఫంకాలు వున్నారీయనకి ? సినిమా నటుడు సుమన్ ఈ సుమన్ ఒకరేనా ? ఆ మధ్య నెమలికన్ను గారో కాకుంటే మరోకరెవరో కూడా వీరలెవల్లో ఈ సుమన్ ఫంకా యణం రాసారు ?

    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  6. వర్మ సినిమాలు మరో రెండు మూడు విడుదలయ్యాక ఆయనకు ఈటీవి సుమన్ తప్ప మరెవరూ సాటిరారు. వారిద్దరి మధ్యనే రసవత్తరమైన పోటీ ఉంటుంది...:))))))
    idhi nijam. manchi visleshanaa vyaasam. chaalaa baagundi. Thank you..

    రిప్లయితొలగించండి
  7. @ " చానల్ వాళ్ల దృష్టిలో సీమ సంస్కృతి అంటే ఏమిటో? అస్థిత్వ పోరాటాలు సాగుతున్న ఈ కాలంలో ఒక ప్రాంతం గురించి మాట్లాడేప్పుడు చానల్స్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి."
    నిజం చెప్పాలంటే రాజకీయాలకంటే ముందే ఈ రాష్ట్రాన్ని ప్రాంతాలుగా విభజంచేసిన ఘనత న్యూస్ చానల్స్ దే. ఒకటో రెండో చానల్స్ మినహా అన్ని చానల్స్ ముక్కలు చేసిన రాష్ట్రాన్నే వార్తల్లో చూపిస్తున్నారు. వీళ్ళకి బాధ్యతలుంటాయి అనుకోవడం వృధా! nice article.

    రిప్లయితొలగించండి
  8. mee vyasalu chala bavunnai...kani naaku idi nachha ledu..andulo konni vishalu prastavistunnanu..1)varma tanato matlade vallanu insult chestunnaru annaru..idi tappudu abhiyogam.evaru matladina varma chala opigga vintaru.tana vadana(enta tikkaga unna sare)tanu cheptare gani ippativaraku eppudu evarini insult cheyyaledu...ala chesina videos emanna mee daggara unte.ee bloglo pettandi.2)varma tana cinemalu tanakishtamochinatlu teestananai cheppadu antaru..aithe andulo nakemi tappu kanipinchaledu.3)rakta charithra flap kau.part 2 avarage.part 1 hit..naa drushtilo rakta charitra oka classic.andulo n.t ramarao character ni chusina taruvate naku inka n.t. ramarao gari meeda gouravam perigindi

    రిప్లయితొలగించండి
  9. శ్రీను గారు ఓ సారి టీవి లో రక్త చరిత్రపై చర్చ జరుగుతుంటే ఒక మహిళా గట్టిగ వాదిస్తుంటే ఆమె కు నేను సమాదానం చెప్పను వాళ్ల ఆయన ఆమెతో ఎలా కాపురం చేస్తున్నాడో అని అన్నాడు . ఆమె వాదన నీకు నచ్చక పొవచు . టీవి లో మాట్లాడేప్పుడు సున్నితంగా ఆమె మాటలు ఖండించవచ్చు . ఆమె కాపురం గురించి మాట్లాడ వచ్చా ? ఆమె కూడా స్టుడియోలో ఉంటే సమాధానం ఏం చెప్పేదో తెలిసేది . మరోసారి ఇలానే ఇదే సిన్మపై చర్చలో లైవ్ లో ఓ సినిమా రిపోర్టర్ వస్తే అతన్ని తీసి పారేస్తూ నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో , కోర్టులోనే చూసుకుందాం అంటూ మాట్లాడడ్రు. టీవి లలో మాట్లాడుతూ ఎదుటి వారు ప్రశ్నిస్తే నేను చెప్పింది నీకు అర్థం కావడం లేదు అని చెబుతారు . ఐతే చేసేది ఉద్యోగం కాబట్టి వాళ్ళు భరిస్తారు కానీ వినే వారికి ఆ విషయం తెలుస్తుంది . ఆతను పెట్టుబడి పెట్టి సినిమాలు తీసుకుంటున్నారు అతని ఇష్టం కానీ మర్యాదగా మాట్లాడాలి కదా .. చానల్ పేరు గుర్తులేదు కానీ బహుశా సాక్షి అనుకుంటాను ఆలాంటి వర్మ ఇలా అయ్యారని కార్యక్రమం చేశారు . అందులో వర్మ పై యండమూరి వీరేంద్ర నాథ్ విశ్లేషణ చేశారు . ఆయన తనకు తోచిన విశ్లేషణ ఏదో చెప్పారు అది నీకు నచ్చవచ్చు నచ్చక పోవచ్చు నీ ఇష్టం యండమూరి విశ్లేషణ రికార్డ్ చేసి చూపారు అది విన్నాక వర్మ . ఎందుకో నాకు యండమూరి ముఖాన్ని చూస్తే కోతి గుర్తుకు వస్తోంది . అంటూ చెత్తగా మాట్లాడారు . ఇద్దరూ మనుషులు మాట్లాడుకోవడం వేరు కొన్ని లక్షల మంది చూసే మాధ్యమం లో మాట్లేదేప్పుడు కనీస మర్యాద పాటించాలి . ఆతను వర్మ బాగుపడాలని ఏదో చెప్పారు నచ్చక పొతే వదిలేయాలో కానీ అతని ముఖం ఎలా ఉందో ఎందుకు ... ఇక నాకు రికార్డ్ చేయడం, దాన్ని పోస్ట్ చేయడం వంటివి తెలియదు . తెలిసిన ఇలాంటివి రికార్డ్ చేసుకోను . పాత సినిమాలు రికార్డ్ చేసుకుంటా

    రిప్లయితొలగించండి
  10. *వర్మ పై యండమూరి వీరేంద్ర నాథ్ విశ్లేషణ చేశారు .... . ఎందుకో నాకు యండమూరి ముఖాన్ని చూస్తే కోతి గుర్తుకు వస్తోంది . అంటూ చెత్తగా మాట్లాడారు.*
    బుద్దా మురళి గారు,
    మీరు రాసే వ్యాసాలు ఎప్పటినుంచో ఆంధ్రభూమిలో చదువుతు ఉన్నాను. నాకు చాలా బాగా నచ్చుతాయి. యండమూరిగారు తెలుగు వరు గర్వించదగ్గ ఒక మంచి రచయిత. అందులో అనుమానం ఎమీ లేదు. కాని యండమూరి గారికి అటువంటి సన్మానం ఒక్క రామగోపాల్ వర్మ గారే చేయగలడు. తెలివిలోను, మానసికంగా వీరిద్దరిది ఒకే స్థాయి. అందువలన నిర్మోహమాటం గా రాంగోపాల్ వర్మ ఆయనపై ప్రతిస్పందించారు.

    రిప్లయితొలగించండి
  11. వర్మ గారి గురించి నాకు తెలియదు కానీ యండమూరి గారు అర్థం అవ్వాలంటే మాత్రం వాళ్ళకి ఒక లెవెల్ ఉండాలి. లౌక్యం , స్థితప్రజ్ఞత , తర్కాన్ని ఇష్టపడే వాళ్ళకి మాత్రమే ఆయన చెప్పింది అర్ధం అవుతుంది. అర్ధం కానివాళ్ళకెపుడూ తలతిరగటం ఖాయం.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం