‘‘గోతులు తీసే వాడు గోతిలో పడడు. నీతులు చెప్పేవాడు నీతిగా ఉండడు. నా జీవితమే నా సందేశం. నా అధికారమే నాకు ముఖ్యం ఎలా ఉంది నా నినాదం ’’అంటూ సిఎం అడిగాడు. ‘‘మీరు ఆటలాడతారని తెలుసు కానీ కవిత్వం కూడా చెబుతారా? ’’అని శ్రీమతి మురిపెంగా అడిగింది. ‘‘కక్కొచ్చినా, కవిత్వం వచ్చినా బయటకు పంపేస్తే మనకు సంతోషం ఎదుటి వాడికి సమస్య. కలిసొచ్చే కాలానికి సిఎం పదవి నడిచొస్తుంది. ఎమ్మెల్యే కాలేనీ వాళ్లు సిఎం అయినప్పుడు మంత్రి కాలేని వాళ్లు ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదనుకున్నాను అయ్యాను’’ అంటూ సిఎం నవ్వాడు.
‘‘ఏంటో ఈరోజు మీరు వింతగా మాట్లాడుతున్నారు’’అంటూ శ్రీమతి అనుమానంగా చూసింది.‘‘ నిజం చెప్పినా అబద్ధం చెప్పినా జనం నమ్మరు. కాబట్టి జనానికి కావలసిందే నువ్వు చెప్పు వాళ్లకు కావలసిందే వాళ్లు వింటారు? ’’ అని సిఎం నవ్వాడు.‘‘ అదేంటండి మీరేం మాట్లాడుతున్నారో మీకైనా తెలుస్తుందా?’’ అని శ్రీమతి అనుమానంగా అడిగింది.
‘‘మనం ఏం చేస్తున్నామో మనకూ అర్ధం కావద్దు అప్పుడే మనం ఏదో చేస్తున్నాం అని అంతా మనగురించి అనుకుంటారు. రాజకీయాల్లో రాణించాలంటే, హై కమాండ్‌ను ఒప్పించాలంటే ఇదే తారక మంత్రం’’.
‘‘హాస్టల్‌లో తిండి,నిద్ర వద్దండీ అంటే విన్నారు కాదు. ఇప్పుడు ఏమోమే మాట్లాడుతున్నారు’’ అని శ్రీమతి ఆందోళనగా ఆటూ ఇటూ చూసింది. ‘‘అసెంబ్లీలో జరిగే విశ్వాస పరీక్ష మీడియా కోసం, అసలైన విశ్వాస పరీక్ష హై కమాండ్ వద్ద ఉంటుంది. 150 మంది విశ్వాసం ప్రకటించిన జగన్‌ను పార్టీ నుంచి బయటకు పంపించాం, నా ఓటు నాకు తప్ప మరో ఓటు లేని నేను విశ్వాస పరీక్షలో నెగ్గాను. పరీక్ష ఇక్కడ విశ్వాసం ఢిల్లీలో ఇదే రాజకీయం ’’ అని సిఎం రాజకీయ గీతను బోధిస్తున్నట్టుగా ఫోజు పెట్టారు. అప్పటి వరకు అటు చూడలేదు కానీ టీవిలో వస్తున్న బ్రేకింగ్ న్యూస్‌పై శ్రీమతి దృష్టి సారించింది.
ముఖ్యమంత్రిపై మంత్రుల తిరుగుబాటు. వట్టి నాయకత్వంలో ముప్పావు డజను మంది మంత్రుల సమావేశం. వాటిని చూడగానే శ్రీమతి ముఖ కవళికలు మారిపోయాయి. తలా తోకా లేకుండా మాట్లాడే ఆయన ఈరోజు ఎప్పుడూ లేని విధంగా తాత్వికంగా మాట్లాడడానికి కారణం ఇదా? అనుకున్నారు.
మారిన శ్రీమతి ముఖ కవళికలు చూస్తూ ముఖ్యమంత్రి పడి పడి నవ్వసాగాడు. రెండేళ్ల కాలంలో శ్రీవారు సిఎం పదవికి అలవాటు పడ్డారేమో.. పోతుందనే భయంతో ఏం చేయాలో అర్ధం కాక ఇలా మాట్లాడుతున్నారేమో అనుకుంది.‘‘ నువ్వునుకుంటున్నట్టు ఏమీ కాలేదు డియర్ నేను బాగానే ఉన్నాను.’’
‘‘ఈ వార్తలు నిజమైతే కలవరపెట్టాలి, కాకపోతే చిరాకు కలిగించాలి కానీ మీరేంటండి ఆ రెండూ కాకుండా, ఏవేవో మాట్లాడుతున్నారు, నవ్వుతున్నారని’’ ఆయోమయంగా చూస్తూ అడిగింది.
‘‘గుర్తు తెచ్చుకో డియర్ ... ఏడాదిన్నర క్రితం అదే వట్టి ఇంట్లో జరిగిన సమావేశం టివిల్లో ఏమని వచ్చిందో గుర్తు తెచ్చుకో’’ అని మళ్లీ నవ్వాడు.
ఇద్దరి ముందు తెలుగు సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ చూపేప్పుడు కనిపించే రింగులు కనిపించాయి. ఆ రింగులు తెరమరుగై దృశ్యం కనిపించింది.‘‘ ఈయనేమైనా సినియర్ అనుకుంటున్నాడా? ఒక్కసారి కూడా మంత్రి పదవి నిర్వహించలేదు, నా కన్నా జూనియర్ నాకీ పదవి ఇస్తాడా? ఏమనుకుంటున్నాడో నా తఢాఖా చూపిస్తాను, ఆయన ముఖ్యమంత్రిగా ఎన్ని రోజులుంటాడో చూస్తాను అని వట్టి ఆవేశంగా పలికాడు.’’ బొత్స, ఆనం బృందం ఆయనకు మద్దతుగా నిలిచింది. తమ కన్నా సీనియర్ సిఎం అయితే ఆయన కింద ఈ పనికి రాని శాఖలు తీసుకుని పని చేసే ప్రసక్తే లేదు. అంటూ అంతా భీష్మించుకున్నారు. రౌండ్ రౌండ్‌కు అక్కడ ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.
టీవిలు బ్రేకింగ్ న్యూస్‌లతో హడలెత్తించాయి. రాత్రంతా జనం నిద్ర పోకుండా టీవిలకు అతుక్కు పోయారు. 20:20 క్రికెట్ మ్యాచ్ తరువాత ఈ వార్తనే వారికి ఎక్కువగా ఉత్కంఠత కలిగించింది. నిమిష నిమిషానికి అసమ్మతి మంత్రుల సంఖ్య పెరుగుతూ పోయింది. తెల్లవారే సరికి సిఎం మంత్రి పదవి తేల్లారి పోతుందని అనుకున్నారు. ఒక్క రోజు కాదు ఐదు వందల రోజులు గడిచిపోయినా ఏమీ కాలేదు.
***
‘‘ఇప్పుడు మళ్లీ అదే వట్టి ఇంట్లో సమావేశమయ్యారు దేని కోసం. తోటి మంత్రిని రక్షించేందుకు మంత్రులంతా ఏకమయ్యారు. హమ్ ఏక్ హై అని నినాదం చేస్తున్నారు. చూశావా తొలుత సిఎం పదవి కోసం సమావేశాలు పెట్టుకున్నారు. తరువాత సిఎంను దించేయాలని సమావేశం పెట్టారు, ఇప్పుడు తోటి మంత్రిని రక్షించుకోవాలని సమావేశం పెట్టారు. నిన్ను నువ్వు రక్షించుకోవాలంటే ముందు నీ ప్రత్యర్థికి నీ గురించి ఆలోచించేంత తీరిక లేకుండా సమస్యల్లోకి నెట్టేయ్! నువ్వే వెళ్లి సానుభూతి చూపించు. ఇదే రాజనీతి. ఫ్లాష్ బ్యాక్ చూశావు కదా ఇప్పుడు ఫ్యూచర్ చూపిస్తాను. ’’ అని తెలివిగా నవ్వాడు సియం
***‘‘ 2014 బ్రేకింగ్ న్యూస్
అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. తమకు టికెట్ వస్తుందా? రాదా అని పలువురు మంత్రులు వట్టి ఇంట్లో సమావేశం అయ్యారు.’’ అంటూ అచ్చం న్యూస్ రీడర్ మాదిరిగానే వార్తను చదివి, తన స్టైల్ లో నవ్వుతూనే ఉన్నాడు సియం .
‘‘అది సరే కానీ వచ్చే ఎన్నికల్లో మీరు గెలిచే నియోజక వర్గం ఏదైనా ఉందా?’’ అని శ్రీమతి అమాయకంగా అడిగారు.
‘‘తెలియని విషయాలను తెలివిగా చెప్పొచ్చు. తెలిసిన విషయాలను దాచి పెట్టొచ్చు. తెలిసీ తెలియని విషయాలను అర్ధం అయ్యి కాకుండా చెప్పొచ్చు. కానీ ..........’’ అంటూ ముగించాడు.

అదిరింది. చాలా చక్కగారాశారు. గత సం|| వట్టి ఇంట్లో జరిగిన విషయాన్ని గుర్తుంచుకొని సమయానుకూలంగ అద్బుతంగా రాశారు.
రిప్లయితొలగించండిమీ అభిమాని
వట్టి, ఒట్టి గొడ్డు ఆర్పులు బాగా గుర్తుచేశారు.
రిప్లయితొలగించండిఓరి నాయనోయ్! గారు ధన్యవాదాలు kastephale గారు ధన్యవాదాలు
రిప్లయితొలగించండిhaa...hhaa...very funny...
రిప్లయితొలగించండిఇంతింత పెద్ద మాటలు చెప్పేటంత తెలుగు ఆయనకు రాదు :)
రిప్లయితొలగించండి