1, డిసెంబర్ 2012, శనివారం

నగదు బదిలీ తో మద్యం ఆదాయానికి ఊతం

జనవరి ఒకటవ తేదీ నుంచి నగదు బదిలీ పథకాన్ని ప్రయోగాత్మకంగా దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన జిల్లాల్లో అమలు చేయనున్నారు. మన రాష్ట్రంలో దీని కోసం ఐదుజిల్లాలలను ఎంపిక చేశారు. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్‌గాంధీనే స్వయంగా చెప్పిన విషయం కావచ్చు, సర్వేలు కావచ్చు కానీ ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం చేస్తున్న వ్యయంలో పెద్ద ఎత్తున దుర్వినియోగం జరుగుతోంది. మనది సంక్షేమ రాజ్యం. సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇవ్వకపోయి ఉంటే అంతర్గత సంక్షోభంలో పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్‌లా మన దేశం ఉండేది. స్వాతంత్య్రం లభించినప్పటి నుంచి సంక్షేమ రంగానికి గణనీయంగా వ్యయం చేస్తున్నా, పేదరికం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది. ఒకవైపు సంక్షేమానికి నిధుల వ్యయం పెరుగుతోంది మరోవైపు పేదలు పెరుగుతున్నారు. పౌష్టికాహార లోపం గల వారి సంఖ్య ప్రపంచంలో కెల్లా మన దేశంలోనే ఎక్కువగా ఉంది. ఇలా ఎందుకు జరుగుతోంది అంటే కేటాయించిన నిధులకు, వ్యయం జరుగుతున్న దానికి పొంతన లేదు అనేది వాస్తవం. ఈ లోపాన్ని సవరించడానికి కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తున్నామని గొప్పగా ప్రకటించుకుంటోంది. నిజంగా ప్రభుత్వం ఆశించిన విధంగానే జరిగే అవకాశం దేశంలో ఉండి ఉంటే ఈ రోజు సంక్షేమ పథకాలకు ఇన్ని నిధుల అవసరం కూడా ఉండదు. నగదు బదిలీ పథకం అమలు చేసినా అది జరగదు సరికదా మరింత ఎక్కువ దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది.

 రూపాయికి కిలో బియ్యం, సబ్సిడీతో కిరోసిన్ వంటి వాటిని ఇప్పుడు పేదలకు ఇస్తున్నారు. నగదు బదిలీ పథకం అమలులోకి వచ్చిన తరువాత ఇక వీటిని ఇవ్వరు. అంటే బియ్యం కోసం నెలకు ఒక కుటుంబానికి రెండు వందల రూపాయల సబ్సిడీ భారాన్ని ప్రభుత్వం భరిస్తుంది అనుకుంటే బియ్యానికి బదులు నేరుగా ఆ కుటుంబం ఖాతాలోకి రెండు వందల రూపాయలను జమ చేస్తారు. నేరుగా బ్యాంకు ఖాతాలో డబ్బు వేయడం వల్ల సబ్సిడీ పథకాల దుర్వినియోగం అస్సలు ఉండదు. చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది. కానీ జరిగేది వేరు. ఒక కుటుంబానికి బియ్యానికి బదులు నగదు ఇస్తే, ఆ నగదు బియ్యానికి మాత్రమే ఉపయోగిస్తారని ప్రభుత్వం చెప్పగలదా? గ్రామీణ ప్రాంతాల్లో, బస్తీల్లో రేషన్ షాపులకు వెళ్లి చూస్తే అసలు వ్యవహారం తెలుస్తుంది. సబ్సిడీ బియ్యం ఇస్తున్నప్పుడే వాటిని అప్పటికప్పుడు ఎక్కువ ధరకు నగదుకు అమ్ముకునే వారున్నారు. బంగారాన్ని తనఖా పెట్టుకుని నగదు ఇచ్చినట్టుగా గ్రామీణ ప్రాంతాల్లో, బస్తీల్లో రేషన్ కార్డును తనఖా పెట్టుకుని డబ్బులిచ్చే పద్దతి చాలా చోట్ల కనిపిస్తుంది. అంటే ఆ కార్డుపై వచ్చే వాటిని తనఖా పెట్టుకున్నవారు తెచ్చుకుంటారు. వారిచ్చిన అప్పు తిరిగి చెల్లించేంత వరకు వడ్డీగా సరుకులు చౌక ధరలకు తెచ్చుకుంటారు. బియ్యం ఇస్తున్నప్పుడే ఇలా ఉంటే ఇక నగదు ఇవ్వడం వల్ల ఆ డబ్బు బియ్యానికే ఉపయోగపడుతుందని ఎలా చెప్పగలం. నగదు బదిలీ పథకాన్ని మన రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చింది టిడిపి. అప్పటి వరకు ఉన్న సబ్సిడీ పథకాలను తొలగించి వాటి స్థానంలో నగదు బదిలి అమలు చేస్తారా? లేక వాటిని కొనసాగిస్తూనే నగదు బదిలి అమలు చేస్తారా? అని బాబు అధికారంలో ఉన్నప్పుడు స్పష్టంగా సమాధానం చెప్పకుండా దాట వేశారు. కానీ కేంద్రం నగదు బదిలీ పథకం గురించి ప్రకటన చేయగానే ఇది మాదే మాదే అంటూ హడావుడి చేశారు.. 

నగదు బదిలీ పథకం అమలు వల్ల కచ్చితంగా ప్రభుత్వ ఖజానాకు మేలు జరుగుతుంది తప్ప పేదలకు మేలు జరగదు. కచ్చితంగా దుర్వినియోగాన్ని అరికట్టాల్సిందే కానీ పేదల కడుపు కొట్టి ఖజానాకు మేలు చేసే పద్దతిలో కాదు. దుర్వినియోగాన్ని అడ్డుకునే మార్గాలు పరిశీలించాలి. పేదలు కనీసం పట్టెడన్నం తింటారనే కదా బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రభుత్వం ఇచ్చే డబ్బును బియ్యానికే ఉపయోగిస్తారని ప్రభుత్వం చెప్పగలదా? మద్యం ఆదాయంలో రాష్ట్రం ఇప్పటికే కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ పథకం అమలుతో ఆ ఆదాయం మరింత పెరిగితే అది ప్రభుత్వానికి రెండు విధాల ప్రయోజనం. పేదలకు అన్ని విధాల శాపం

5 కామెంట్‌లు:

  1. మీ వాదన నిజమే.
    పని చేయగలిగిన వయసులో ఉన్నవారికి పని, దానికి తగ్గ జీతం కల్పించాలి కాని, ఈ ఉచితాలు ఎందుకు?
    ఈ నగదుని ధరలు తగ్గించడానికి ఉపయోగించగలిగితే బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  2. sir biiyam padhakm ayina ,vachina biyani amukoni tagadam leda,
    idi ante..adi use chesukone vari meda depend ayi untundi sir.

    రిప్లయితొలగించండి
  3. మీతో ఏకీభవిస్తున్నా.

    రిప్లయితొలగించండి
  4. నగదు బదిలీ, ఆరోగ్యశ్రీ ఒకేరకమైన పధకాలండీ.

    ఆరోగ్యశ్రీ : టెక్సాస్ రాష్ట్రంలో వరదలొచ్చినప్పుడు, అక్కడి ప్రభుత్వ పాఠశాలవ్యవస్థ పూర్తిగా పాడైపోతే, దాన్ని పునరుధ్ధరించడానికి బదులుగా, ప్రజలకి coupans ఇచ్చి, తమ పిల్లలని ప్రైవేటు పాఠశాల్లల్లో చదివించుకోమని చెప్పారట. ఇంకోళా చెప్పాలంటే ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటు సంస్థలతో పోటీపడనివ్వకుండా పీకపిసికి చంపెయ్యడమన్నమాట. ఆవిధంగా schooling systemని privatize చెయ్యడానికి మార్గం సుగమం చేశారన్నమాట. The problem I have is with the Govt. not competing with the Pvt. organizations. పాఠశాల వ్యవస్థని ఆరోగ్యశ్రీ విషయంలో 'ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు' లేదా పీహెచ్చిసీలు అని చదువుకోగలరు. Courtesy The Shock Doctrine - Naomi Klein.

    నగదు బదిలీ: మార్కెట్‌లో (నిత్యావసర వస్తువుల) ధరలు ప్రభావితంచేసే అంశాలు చాలా ఉంటాయ్. "మేం నగదు బదిలీచేశేశాం" అని చెప్పి ఇకమీదట ప్రభుత్వాలు ధరల నియంత్రణ బాధ్యతలనుండి తప్పుకోవచ్చన్నమాట. అదీకాక సబ్సిడీలు ఖజానామీదం భారం మోపుతున్నాయ్ అని చెప్పే అవకాశం రాబోయే ప్రభుత్వాలకెప్పుడూ ఉంటుంది. అయ్యా... ఇక్కడ అదే పీహెచ్చిసీల్ని రేషన్‌షాపులు అని చదువుకోండి సరిఘ్ఘాసరిపోతుంది.

    bonagiri గారూ ఏకాలంలో ఉన్నారుసోదరా మీరు? ఏదో మీపిచ్చిగానీ ప్రభుత్వాలు ఉపాధికల్పన నుండి ఎప్పుడో తప్పుకున్నాయ్ (మీకుతెలీదనికాదుగానీ... privatizationని పోటేపడే అవకాశంగా కాకుండా ప్రక్కకు తప్పుకొనే అవకాశంగా మన ప్రభుత్వాలు భావిస్తున్నాయ్). మీరుచెప్పిన ఆదర్శాల్ని ఏప్రభుత్వమూ implementచెయ్యడానికి సిధ్ధంగా లేదనుకుంటాను. We are beyond those idealistic(dreamy) days.

    రిప్లయితొలగించండి
  5. bonagiri గారు : నాకెప్పుడూ ఒక సందేహం. 'సంక్షేమమా, అభివృధ్ధా?' అన్న ప్రశ్న చాలాసార్లు విన్నదే గానీ 'సంక్షేమమూ, అభివృధ్ధీ' అన్న నినాదం సాధ్యమా? ఎలా? ఏది ఎక్కడ అంతమై, రెండోదానికి దారినివ్వాలి అన్నది ఎలా చెప్పగలం. Pardon me if the question sounds ridiculous.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం