అర్జునుడు భూ చక్రం వేయగానే, కర్ణుడు లక్ష్మీ అటంబాంబు లాంటిదాన్ని పేల్చేవాడు. అప్పుడు గ్రాఫిక్స్ లేదు, టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందలేదు కాబట్టి బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి పాత సినిమాల్లో కురు పాండవులైనా, మరే దేవుళ్లయినా మనం దీపావళికి కాల్చే మందుగుండు సామగ్రి లాంటి ఆయుధాలతోనే యుద్ధాలు చేసేవారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, గ్రాఫిక్‌తో ఎలాంటి మాయాజాలాన్నైనా సృష్టించవచ్చు కానీ ఏం లాభం? ఇప్పుడు పౌరాణిక సినిమాలే రావడం లేదు. పోనీ హీరోలైనా కొత్త టెక్నాలజీ ఉపయోగించుకుని యు ద్ధాలు చేస్తారా? అంటే అదీ లేదు. విలన్ గట్టిగా మాట్లాడితే ఆ సౌండ్‌కే ఎగిరి అవతల పడతాడేమో అనిపించేంత సన్నగా ఉండే హీరో ఒకే ఒక్కడు వంద మందిని ఎడమ చేతితో కొట్టేస్తున్నాడు. కుడి చేతితో హీరోయిన్‌ను కౌగిలించుకుంటాడు.
నిజమో కాదో కానీ నాల్గవ ప్రపంచ యుద్ధంలో రాళ్లే ఆయుధాలు అవుతాయని ఐన్‌స్టిన్ అన్నారట! అదేంటయ్యా టెక్నాలజీ రోజు రోజుకు పెరుగుతుంది కదా అని సందేహం వ్యక్తం చేస్తే, నిజమే మూడవ ప్రపంచ యుద్ధం నాటికి టెక్నాలజీ మరీ పెరిగిపోతుంది. అప్పుడు చిన్నా చితక దేశాలు కూడా అణ్వాయుధాలు ఉపయోగిస్తాయ కదా! దాంతో సర్వనాశనం అవుతుంది కాబట్టి నాలుగవ ప్రపంచ యుద్ధం నాటికి మనిషి మళ్లీ ఆదిమానవుని దశలోనే ఉంటాడని చెప్పడం అన్నమాట!
నిజాం పాలించిన కాలంలో రజాకార్లను ఎదుర్కోవడానికి తెలంగాణ పల్లెల్లో కారం పొడిని కూడా ఆయుధంగా ఉపయోగించారు మహిళలు. ఒకప్పుడు ఎవరి వద్ద ఎక్కువ పాడి ఉంటే వాడే గొప్ప. ఇప్పుడు ఏ దేశం దగ్గర ఎక్కువ ఆయుధాలుంటే ఆ దేశమే గొప్ప. ఐతే దానికి అమెరికా అనుమతి ఉండాలి. సద్దాం హుసేన్ సొంతంగా ఆయుధాలు సమకూర్చుకుంటే.. తన మాట వినకుండా ఎవడిష్టం వచ్చినట్టు వాడు ఆయుధాలు సమకూర్చుకుంటే ఇక నేనెందుకు అని బోలెడు ఆవేదన చెంది, ఆ తరువాత సద్దాంను మట్టుపెట్టాడు పెద్దన్న. లాడెన్ దగ్గర కూడా ఇలా ఆయుధాలు బాగానే ఉండేవి ఐతేనేం అమెరికాకు నచ్చలేదు. దాంతో ఎన్ని ఆయుధాలు ఉన్నా ఎక్కడో పాకిస్తాన్‌లో దాక్కు న్నా అమెరికా కళ్లు కప్పలేకపోయాడు.
నాటి పౌరాణికాలు ఇప్పటికీ నచ్చడానికి ప్రధాన కార ణం ఆయుధాలేనేమో! నువ్వు పలానా ఆయుధం ప్రయోగిస్తే, నేను ఈ ఆయుధం ప్రయోగిస్తాను కాచుకోరా అంటూ ఇద్దరు దేవుళ్లు బాణాలు విడిస్తే అవి సుర్రు మంటూ సౌండ్ చేసుకుంటూ నిప్పులు కురిపిస్తూ వెళ్లేవి. ఏ ఆయుధం ఎక్కువ నిప్పులు కురిపిస్తే అది అంత గొప్ప ఆయుధమన్నమాట! యుద్ధంలో ఇద్దరూ చేతికి అందేంత దూరంలోనే ఉన్నా ఎందుకో కానీ ఇద్దరూ నేరుగా బాణాలు వేసుకోరు. ఒకరు ఆకాశంలోకి బాణం వదిలితే అది ఐదు నిమిషాల పాటు అలా వెళుతూనే ఉంటుంది. నాలుగు నిమిషాల తరువాత ప్రత్యర్థి దానికి విరుగుడుగా మరో బాణం వేస్తాడు. రెండూ మార్గమధ్యలోనే ఢీకొని కింద పడిపోయేవి. ఎదురెదురుగానే ఉన్నారు కదా నేరుగా బాణం వదలకుండా అలా ఆకాశంలోకి ఎందుకు వదిలారు? అనే సందేహానికి ఇప్పటికీ సమాధానం దొరకలేదు. బహుశా ఆనాటి యుద్ధ నియమాల్లో ఇది కూడా ఒకటేమో!
వజ్రాయుధం, బ్రహ్మాస్త్రం ఇవి ఆనాటి పాపులర్ అస్త్రాలు. అదేం చిత్రమో కానీ వజ్రాయుధం ఇంద్రుడి వద్ద ఉన్నా ప్రతి ఒక్కడూ అతన్ని ఓడించేవాడే. పైగా ఆయన దేవతలకు రాజు. మరీ ఇంత బలహీనమైన రాజేమిటో?
ఆ మధ్య లగడపాటి రాజగోపాల్ మా వద్ద బ్రహ్మాస్త్రం ఉంది అని చెప్పగానే అప్పటి వరకు ఆంధ్ర, తెలంగాణ చరిత్రను చదువుతూ పోయిన చరిత్ర కారులంతా ఒక్కసారిగా పురాణాలపై పడ్డారు. బ్రహ్మాస్త్రాన్ని ఎవరెవరు ఎక్కడెక్కడ ప్రయోగించారు.బ్రహ్మాస్త్రానికి విరుగుడు ఉం దా? అనే అనే్వషణలో పడిపోయారు. అణ్వాయుధాలు ప్రయోగించినప్పుడు అమెరికా అధ్యక్షుడి లాంటి వారిని రక్షించేందుకు సురక్షిత ఏర్పాట్లు ముందుగానే చేసి ఉన్నారట!అలానే బ్రహ్మాస్త్రం ప్రయోగించినప్పుడు ఎలా ఎదుర్కోవాలని తర్జనభర్జనలు పడ్డారు. రాజకీయాల్లో మీడియాను మించిన బ్రహ్మాస్త్రం లేదంటారు. అయితే ఇది గత వైభవమే. మీడియా బ్రహ్మాస్త్రంతోనే బాబు ఎన్టీఆర్ లాంటి పాపులర్ నేతను ఇంటికి పంపించగలిగారు. అయితే ఆ ఆయుధాన్ని పదే పదే వాడడంతో అది నిరుపయోగంగా మారింది. పైగా ప్రత్యర్థులు సైతం ఇలాంటి ఆయుధాలు సంపాదించేశారు.
మరి ఇంతకూ బెజవాడ బెబ్బులి చెబుతున్న బ్రహ్మాస్త్రం ఏమిటా? అని అంతా ఆలోచిస్తుండగానే ఆయన బ్రహ్మాస్త్రం ప్రయోగించారు.
ప్రపంచంలో కెల్లా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలోని చట్టసభలో లగడపాటి పెప్పర్ స్ప్రే అనే ఆయుధాన్ని ప్రయోగించగానే ఎంపిలు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు.
ఔను నిజం అది బ్రహ్మాస్తమ్రే అని తెలంగాణ వాదులు మనసులోనే సంబర పడ్డారు. ఎందుకలా అంటే. తెలంగాణ అవసరం అని తెలంగాణ ప్రజలను ఒప్పించడానికి కెసిఆర్‌కు దశాబ్దా కాలం పట్టింది. అయినా జాతీయ మీడియా దృష్టిని ఆకట్టుకోలేకపోయారు. కానీ ఈ బ్రహ్మాస్త్రంతో దేశం మొత్తానికి తెలంగాణ ఏర్పాటు అవసరం అని లగడపాటి చెప్పినట్టు అయింది. జాతీ య మీడియా వద్దన్నా మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి. ఆయుధం ప్రయోగించినప్పుడు కళ్ల నీళ్ల పర్యంతం అయిన ఎంపిలంతా ఇప్పుడు కసితో తెలంగాణకు అండగా నిలుస్తారు. ఇంత కన్నా మాకు ఉపయోగపడే బ్రహ్మాస్త్రం ఏముంటుంది? అనేది తెలంగా వాదుల వాదన. బుర్రలో గుజ్జు లేకుండా చేతిలో ఆయుధం మాత్రమే ఉంటే ఒక్కోసారి శత్రువు చేతిలోని ఆయుధం కూడా ప్రత్యర్థికి ఉపయోగపడుతుంది. భస్మాసురుడి చేతిలో బ్రహ్మాస్త్రం ఉంటే ఏమవుతుంది. అది భస్మాసురుడినే మింగేస్తుంది. అదే జరిగింది.

excellent write up.
రిప్లయితొలగించండిBaaga Selavicharu...
రిప్లయితొలగించండిఅద్దిరింది! వ్యంగ్యం రాయాలంటే మీ తరవాతే ఎవరైనా!!
రిప్లయితొలగించండి"బుర్రలో గుజ్జు లేకుండా, చేతిలో ఆయుధం మాత్రమే ఉంటే.." - ఇది మహాద్భుతం! లగడపాటి ఇది చదివితే, మే మొహాన కూడా pepper spray చల్లే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి!
ఒహో అయితే పెప్పర్ స్ప్రే వాడకపోతే తెలంగాణ వచ్చేది కాదు అంటారు !!
రిప్లయితొలగించండిబాగా రాసారు బుద్దా మురళి గారు
రిప్లయితొలగించండిCongratulations to the people of India!
రిప్లయితొలగించండి:)) జ(ల)గడపాటి అస్త్ర సన్యాసం ప్రకటించాడుగా మురళీగారు.
రిప్లయితొలగించండిhttp://www.youtube.com/watch?v=U58aORo9TS0
తొలగించండి