‘‘నరేంద్ర మోదీకి నారా బాబుకు ఒక విషయంలో చక్కని పోలికుంది’’
‘‘ కార్పొరేట్ కంపెనీలపై ప్రేమనా?’’
‘‘ఈ కాలంలో పాలకులెవరైనా కార్పొరేట్‌పై ప్రేమ చూపించాల్సిందే. ఏ రాష్ట్రంలోనైనా కామనే నేను చెబుతున్నది అది కాదు’’
‘‘ఎన్నికల పొత్తు కుదరక ముందు బాబే ఈ విషయం చెప్పారు. మోదీ నన్ను చూసి అభివృద్ధి నేర్చుకున్నారు అని. అభివృద్ధి విషయంలోనే కదా ఇద్దరి మధ్య పోలిక. ’’
‘‘ తింగరి పల్లి సర్పంచ్ కూడా ఇదే మాట అన్నాడులే, నన్ను చూసే ఒబామా అమెరికాను అభివృద్ధి చేస్తున్నాడని, ఆ మాట విని వార్డ్ మెంబర్ కంకికొడవలి కంకన్న చైనా అభివృద్ధికి మా వార్డే స్ఫూరి అని బదులిచ్చాడు.. వార్డు మెంబరైనా ఓడిపోయిన ముఖ్యమంత్రి అయినా తన గురించి తాను ఇలా చెప్పుకోవడం కామన్’’
‘‘ఏం చెప్పినా అది కాదంటున్నావు మోదీ, బాబుల్లో కామన్ ఏంటో నువ్వే చెప్పు ఇద్దరూ విదేశాల్లో తెగ తిరిగేస్తున్నారు .. నువ్వన్నది దాని గురించే కదా ?’’
‘‘అధికారం లో ఉన్నప్పుడు కాక పోతే రాజకీయాల నుంచి తప్పుకున్నాక విదేశాల్లో తిరుగుతారా ? అది కాదు
‘‘మరింకేమిటి ? ’’
‘‘ మోదీ బాబు ఇద్దరూ దేవుళ్లే ’’
‘‘ఎలా? ’’
‘‘ ఇద్దరికీ అభిమానులు గుడి కట్టారు. గుడి మాన్యాలను స్వాహా చేసిన వాళ్లు వేల మంది కనిపిస్తారు ఈ దేశంలో గుడి ఉన్నది ఇద్దరు పాలకులకే. ’’
‘‘ మోదీకి ఎప్పుడో గుడి కట్టారు. కానీ కొత్త రాజధాని అమరావతిలో బాబుకు గుడికడుతున్నారు. రాజధాని ప్రారంభోత్సవానికి వస్తున్న మోదీ పనిలో పనిగా గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకుంటారేమో చూడాలి’’
‘‘ దేవుడే తన పక్కన ఉంటే దైవదర్శనానికి గుడికెందుకు వెళ్లడం’’
‘‘ ఇంతకూ దేవుడు ఎలా ఉంటాడని నువ్వు అనుకుంటున్నావ్?’’
‘‘ ఇదేం ప్రశ్న. బాబు గుడిలో దేవుడు బాబులానే ఉంటాడు. ఆ దేవుడికి గడ్డం కూడా ఉంటుంది. శ్రీకృష్ణుడికి మీసాలు ఉండేవా ? అని గతంలో టీవిలు, ఇంటర్‌నెట్ లేని రోజుల్లో పెద్ద చర్చ జరిగింది. గడ్డం విషయంలో అలాంటి సందేహాలేమీ ఉండవు ఎందుకంటే అందరికీ తెలిసిందే కదా? ’’
‘‘ దేవున్ని ఏ రూపంలో ప్రతిష్టిస్తున్నారో? ’’
‘‘ ఇంకా అక్కడి వరకు ఆలోచన రానట్టుంది. నన్నడిగితే మాత్రం శ్రీకృష్ణుడి రూపంలో బాబు విగ్రహాన్ని ప్రతిష్టిస్తే బాగుంటుంది. శ్రీకృష్ణుడు దుష్టపాలకుడైన మేనమామ కంసున్ని సంహరిస్తే, బాబు ఎన్టీఆర్‌ను దుష్టపాలకుడు అని చెప్పి అధికారం నుంచి దించి మానసికంగా కృంగీదీసి పైకి పోయేట్టు చేశారుకదా? శ్రీకృష్ణుడి రూపం కరెక్ట్’’
అలా అంటే శ్రీరాముని రూపం కూడా సరిపోతుంది. శ్రీరాముడు చెట్టు చాటు నుంచి వాలిని సంహరించాడు కదా? నేరుగా ఎదుర్కోలేక. బాబు కూడా అంతే ఎన్టీఆర్‌ను నేరుగా ఎదుర్కోలేదు కదా? ’’
‘‘ నువ్వు చెప్పింది నిజమే కానీ ఆల్ రెడీ రాజమండ్రిలో గోదావరి నదిలో ఎన్టీఆర్ రూపంలో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఒకే రూపంలో మామా అల్లుళ్ల దేవుడి విగ్రహాలు బాగోవు’’
‘‘ అసలుదేవుడి రూపం ఎలా ఉండేదో? ’’
‘‘ చాలా మంది దేవుడు అచ్చం ఎన్టీఆర్‌లా ఉంటారని చెప్పగా విన్నాను, రాయగా చదివాను’’
‘‘ చెప్పిన వాళ్లు, రాసిన వాళ్లు నిజంగా దేవున్ని చూశారా? ’’
‘‘ లేదు..’’
‘‘ మరి ఏదో అచ్చం మా పెద్దమ్మ కొడుకులానే ఉన్నాడు అన్నంత ఈజీగా అచ్చం శ్రీరామునిలానే ఉన్నాడని ఎలా చెబుతారు’’
‘‘ ఒకరు ఇద్దరు కాదు చాలా మంది చెప్పారు కాబట్టి మనం నమ్మాలి అంతే ఎదురు ప్రశ్నించవద్దు’’
‘‘ నిజం ఒక్కరు చెప్పినా అబద్ధం కోటి మంది చెప్పినా సత్యం సత్యమే అవుతుంది కానీ సంఖ్యతో దానికి సంబంధం లేదు. సత్యం వేరు ప్రజాస్వామ్యం వేరు. ప్రజాస్వామ్యానికి అంకె ముఖ్యం, సత్యానికి కాదు. ’’
‘‘ తెలుగు సినిమా అభిమానులేమో ఎన్టీఆర్ అచ్చం శ్రీకృష్ణుడిలా, శ్రీరాముడిలా ఉన్నావంటారు. రావణుడు, దుర్యోధనుడు, కర్ణుడు కూడా అచ్చం ఎన్టీఆర్‌లానే ఉండేవారంటారు. కర్నాటక వాళ్లేమో హిందూ దేవుళ్లందరూ కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌లా ఉండేవాళ్లంటారు. టీవిలో హిందీ సీరియల్ రామాయణం, మహాభారత్ చూశాక ఉత్తరాది వాళ్లేమో రామానంద్‌సాగర్ రామాయణం అచ్చం అరుణ్‌గోయల్ లానే శ్రీరాముడు ఉండేవారని నమ్మేశారు. మహాభారత్ చూశాక శ్రీకృష్ణుడంటే నితీశ్ భరద్వాజ్ అని ఢంకా బజాయించి చెప్పేశారు. మనకు వారి భాష తెలియకపోవచ్చు, వారి సినిమాలు చూసి ఉండక పోవచ్చు కానీ దేశంలో ఎన్ని భాషల్లో సినిమాలు తీస్తారో అన్ని భాషలకు అచ్చం శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఇలానే ఉంటారు అనిపించే నటులున్నారు.’’
‘‘ మరి నువ్వు చెప్పు దేవుడు ఎలా ఉంటారో? ’’
‘‘ ఎవరు చూసి వచ్చారని, రవివర్మ దేవుళ్ల బొమ్మలు చూసి దేవుడు ఇలానే ఉంటాడని సినిమాల వాళ్లు నిర్ణయించేశారు కానీ ఎవరైనా చూసొచ్చారా? ’’
‘‘ దేవుడు నిర్వికారుడు అంటారు కదా? ’’
‘‘ రూపం సంగతి ఎలా ఉన్నా దేవుడికి రంగు పట్టింపు ఉందనిపిస్తోంది’’
‘‘ ఎందుకలా?’’
‘‘ మొన్న తిరుమలలో ఒక హోటల్‌కు గులాబీ రంగు వేయిస్తే గగ్గోలు పెట్టారు.. తెల్లారే సరికి రంగు మార్చారు.’’
‘‘ అమరావతిలో గుడిని పచ్చరంగుతో నింపేస్తారేమో?’’
‘‘ తెలంగాణ ఇచ్చినందుకు ఆ మధ్య శంకర్‌రావు సోనియాగాంధీకి గుడి కడతానన్నారు. ఏమైందో? ’’
‘‘ విగ్రహం కూడా తయారు చేయించారు. ఈ లోపు ఎన్నికలు వచ్చాయి . తెలంగాణలో కాంగ్రెస్‌కు అధికారం రాలేదు. ఆంధ్రలో అడ్రస్ లేకుండా పోయింది. కేంద్రంలో ప్రతిపక్ష హోదా దక్కలేదు. దాంతో విగ్రహం అటకెక్కింది. శంకర్‌రావు మాజీ అయ్యారు. ’’
‘‘ ప్రజాస్వామ్యంలో నాయకులను దేవుళ్లను చేస్తూ, గుళ్లు కట్టడం ఏమిటి? ’’
‘‘ మనిషి భయం నుంచి బయట పడేందుకు దేవున్ని సృష్టించాడు అంటారు హేతువాదులు. మన నుంచి భయాన్ని పారద్రోలేందుకు దేవుడి సృష్టి జరిగితే మంచిదే కానీ తమ పాలనతో ప్రజలను భయపెట్టే పాలకులను దేవుళ్లను చేసి గుడి కట్టడమే రాజకీయం. ’’
‘‘ ఇప్పటికే మనకు మూడు కోట్ల దేవుళ్లు ఉన్నారు. ఈ కొత్త దేవుళ్లు అవసరమా? ’’
‘‘ దేవున్ని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ఎంతో కాలం తపస్సు చేసేవాళ్లు. ఇప్పుడు పాలక దేవుళ్లను ప్రసన్నం చేసుకోవాలంటే కొత్త కొత్త టెక్నిక్‌లు అవసరం. గుడి కట్టడం అందులో ఒకటి. లేకపోతే అమరావతికి టిడిపి నేత గురించి ఇంతగా ప్రచారం జరుగుతుంది అంటే గుడి కట్టడం వల్లనే కదా. భక్తుడి తపస్సు ఫలించినట్టే కదా? శత కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు. బతుక నేర్చిన ఉపాయాల్లో పాలకులకు గుళ్లు కట్టడం ఒకటి.’’
‘‘ దేవుడు ప్రసన్నం అయ్యాక గుడి ఉంటే ఎంత లేకుంటే ఎంత? రష్యాలో కమ్యూనిస్టు దేవుడు స్టాలిన్ విగ్రహాలనే కూల్చేశారు.’’
**
-బుద్దా మురళి (జనాంతికం 11. 10.2015 )

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం