‘‘ఈ రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలా ఉన్నాయి’’
‘‘ సినిమా కథ తెలిసీ, ఆందోళన చెందుతున్నట్టు నటిస్తున్న ప్రేక్షకుడిలా కనిపిసున్నావ్ నువ్వు’’
‘‘నీకన్నీ వేళాకోళాలే. తెలంగాణలో టిడిపి ఉంటుందా? విలీనం చెల్లుతుందా? రేవంత్ ఏ పార్టీలో చేరుతాడు? లోకేశ్ భవిష్యత్తు ఏమిటి? హరీశ్‌రావు తిరుగుబాటు ఎప్పుడు? అన్నీ సస్పెనే్స కదా? ’’
‘‘జరగబోయే కథ మొత్తం నీ కళ్ల ముందు కదలాడుతున్నా, కోరుకున్నట్టు జరిగితే బాగుండు అని కోరుకుంటున్నావు. అలా జరుగుతుందో లేదో అనే అనుమానంతో ఆందోళన చెందుతున్నావు ’’
‘‘ నేను ఎడ్డెం అంటే నువ్వు తెడ్డెం అంటున్నావ్. ’’
‘‘ ఎప్పుడైనా సర్వపిండి తిన్నావా? ’’

‘‘ సర్వపిండి అంటే ? రాజకీయాలకు సర్వపిండికి సంబంధం ఏమిటోయ్’’
‘‘ తెలంగాణలో చాలా ఫేమస్ పిండి వంటకం. ఏ వంటకమైనా వేడివేడిగా తింటే బాగుటుంది కానీ సర్వపిండి మాత్రం ఒకరోజు తరువాత తింటే రుచిగా ఉంటుంది. సర్వపిండిలో రాజనీతి మొత్తం దాగుంది. పేరేమో పిండి కానీ నమిలి తినే ఆహార పదార్థం. ’’
‘‘వంటల సంగతి తరువాత మాట్లాడుకుందాం కానీ రాజకీయాల్లో ఏం జరగబోతుందో చెప్పు ముందు ’’
‘‘నేను అదే చెబుతున్నాను. సర్వపిండి తెలంగాణలో చాలా పాపులర్ వంటకం నువ్వేమో అదేంటి అన్నావు. అలానే తెలుగుదేశం అంటే తెలంగాణ రాజకీయాల్లో అదేంటి అనే రోజులు వస్తున్నాయి. సర్వపిండి అనగానే తెలంగాణ గుర్తుకు రావడం, పూత రేకులు అనగానే ఆంధ్ర గుర్తుకు రావడం అనివార్యం. పూత రేకులు హైదరాబాద్‌లో ప్రతి గల్లీలో దొరికినా అవి ఆంధ్రా బ్రాండ్ అంబాసిడర్.’’
‘‘చూడు బ్రదర్ బందురు లడ్డు, మచిలీపట్నం పూత రేకులు, కాకినాడ కాజా హైదరాబాద్‌లో ఎక్కడైనా దొరుకుతుంది అందరూ తింటారు. వాటితో పోలిక వద్దు కానీ నేరుగా అర్ధం అయ్యేట్టు చెప్పు ’’
‘‘ఉద్యమ కాలంలో కెసిఆర్ నిజాం కాలేజీలో తెలంగాణ సంబురాలు అని నిర్వహించారు. వారం రోజులకు సరిపోయే సర్వపిండి గంటలోనే అయిపోయింది. తెలంగాణకు తిరుగులేదు, ఎవరితో పొత్తు లేకుండా ఓంటరిగా పోటీ చేయాలని కెసిఆర్ సర్వపిండికున్న డిమాండ్ చూశాక నిర్ణయించుకున్నారని నా అంచనా’’

‘‘ అబ్బా అర్ధం అయ్యేట్టు చెప్పమన్నాను కదా? ’’
‘‘ చూడోయ్ ఆంధ్రుల ఆత్మగౌరవం అని ఎన్టీఆర్ టిడిపిని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం అని కెసిఆర్ టిఆర్‌ఎస్‌ను స్థాపించారు. పార్టీల పేర్లు వేరు కానీ ట్యాగ్‌లైన్ ఒకటే కదా? తెలంగాణ ఆత్మగౌరవానికి ఆంధ్రలో మార్కెట్ ఉంటుందా? అలానే ఆంధ్రుల ఆత్మగౌరవానికి తెలంగాణలో డిమాండ్ ఉంటుందా? పోనీ మరాఠీ ఆత్మగౌరవం ఆంధ్రప్రదేశ్‌లో పని చేస్తుందా? తమిళ ఆత్మగౌరవం తెలంగాణ రాజకీయాల్లో పని చేస్తుందా? మనకు నచ్చినా నచ్చక పోయినా అంతే. కెటిఆర్ ఎంత ఉత్సాహ పడ్డా ఆంధ్రలో టిఆర్‌ఎస్ పప్పులుడకవు, లోకేశ్ ఎన్ని వ్యూహాలు పన్నినా తెలంగాణలో టిడిపిని కాపాడలేరు’’
‘‘ అంతే అంటావా? ’’
‘‘ సికిందరాబాద్ అనగానే ఆనంద్ భవన్ హోటల్, బాటా గుర్తుకొస్తుంది. అక్కడ టిఫిన్ చేయకుండా బాల్యం గడిచిన వ్యక్తి ఉండడు. ఆనంద్‌భవన్ కూల్చేశారు. గల్లీ గల్లీకో బాటా రావడంతో సికిందరాబాద్ బాటా ప్రాధాన్యత కోల్పోయింది. ’’
‘‘ నిజమా ఎందుకు కూల్చారు ’’
‘‘ నిలబడి గబ గబా తినే గొప్ప రోజులు ముంచుకుకొచ్చాయి. దాంతో ప్రశాంతగా కూర్చోని తినే సౌకర్యం ఉన్న ఆనంద్‌భవన్ తొలుత మూతపడి, తరువాత కూల్చబడింది. ’’
‘‘ చిన్నప్పుడు నేనూ అక్కడ చాలా సార్లు టిఫిన్ చేశాను. కూకట్‌పల్లి వెళ్లాక అటు వైపు వెళ్లలేదు. ఆ హోటల్‌లో సర్వర్లు మంచి వాళ్లు. పని మంతులు, ఒక్కసారి ఉద్యోగంలో చేరితే పొమ్మన్నా బయటకు పోయేవారు కాదు. నమ్మిన బంట్లు’’

‘‘ తెలంగాణలో టిడిపికి భవిష్యత్తు లేదురా బాబు అంటే నమ్మిన బంట్ల లాంటి క్యాడర్ ఉంది అని ఇలానే వాదిస్తున్నారు. హోటల్‌ను కూల్చేశాక సర్వర్లదేముంది బ్రదర్. దమ్ముంటే ఇంకో హోటల్ పెట్టుకుంటారు. లేదంటే మరో హోటల్‌లో చేరిపోతారు అంతే కానీ సర్వర్ల కోసం హోటల్ నడిపించరు కదా?’’
‘‘ 95లో ఎన్టీఆర్ నుంచి బాబు సైకిల్ లాగేసుకుంటే ఏమైంది. సైకిల్ ఎత్తుకొచ్చారని ఎంత మంది ఎన్ని మాటలన్నా సైకిల్ మాత్రం బాబు చేతిలోనే ఉంది కదా? ఇప్పుడు విలీనం చెల్లుబాటుపై మనం ఎన్ని మాటలు మాట్లాడినా అసెంబ్లీలో సాంప్రదాయాలకే పెద్ద పీట వేస్తారు. మామ కళ్లు మూసి అల్లుడు సైకిల్ ఎత్తుకెళితే, తెలంగాణలో ఆ సైకిల్‌ను తక్కు చేసి తమ్ముళ్లు కారు డిక్కిలో తోసేశారు’’
‘‘ హైదరాబాద్ గడ్డమీద చెడ్డీ వేసుకొని తిరిగాను 100%లోకల్ అని చెప్పిన లోకేశ్‌కు తెలంగాణలో భవిష్యత్తు లేదా? ’’

‘‘ చూడోయ్ లోకేశ్ హైదరాబాద్‌లోనే కాదు అమెరికాలోనూ చెడ్డీలు వేసుకుని స్నేహితురాళ్లతో కలిసి దిగిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. చెడ్డీలతో తిరిగాడని అమెరికా లోకల్ అవుతాడా? హైదరాబాద్ ప్రచారంలో కెసిఆర్ ఏ మన్నారు? బాబూ ఊడ్చుకోవడానికి మీకు హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు ఎన్నో పట్టణాలు ఉన్నాయి వెళ్లు అంటే హైదరాబాద్‌ను ఊడ్చడానికి నేనూ మా అబ్బాయి ఉన్నారని చెప్పకనే చెప్పారు కదా? ఎలక్షన్‌లో ఫలితాలతో ఊడ్చి చూపించారు కూడా . బాబును ప్రజలు ఎన్నుకున్నది ఆంధ్రకు మేలు చేయమని , హైదరాబాద్‌లో వేలు పెట్టడానికి కాదు. గ్రేటర్‌లోని ఆంధ్ర ప్రజలూ ఎన్నికల్లో ఇదే మాట చెప్పారు. ’’
‘‘నువ్వేన్నయినా చెప్పు హరీశ్‌రావు తిరుగుబాటు ఖాయం ’’
‘‘మనిషి ఆశా జీవి.. ఇలాంటి ఆశలు లేకపోతే బతకలేడు. తిరుగుబాటు చేస్తాడు అని నమ్మక పోతే నీకు ఆందోళనతో గుండె పోటు వస్తుంది. రేపు బాగుంటుందనే నమ్మకంతో బంగారం ధర చెల్లించి రాగిరేకు కొనుక్కుంటాం ఇదీ అంతే. నమ్మకం లేకపోతే బతకలేవు. యుగాంతం అని దశాబ్దాల నుంచి నమ్ముతున్నప్పుడు ఐదారేళ్లు నమ్మలేవా? ’’

- బుద్దా మురళి (జనాంతికం 14. 02. 2016)
"హరీశ్‌రావు తిరుగుబాటు ఎప్పుడు?"
రిప్లయితొలగించండివెన్నుపోటులకు అనాదిగా వస్తున్నా సంప్రదాయాన్ని అతిక్రమిస్తే పుట్టగతులు ఉండవు. "ముక్కు" మంత్రి అమెరికాలో వైద్యం చేయించుకుంటునప్పుడు మాత్రమె తిరుగుబాటు చేయాలి. వేరే సమయాలప్పుడు గ్రహబలం సరిపోదు. ఈ విషయం తెలిసే మెడికల్ పుస్తకాలలో పేర్కొన్న రోగాలన్నీ ఉన్నా కెసిఆర్ సింగాపూర్ చైనాలలోనే వైద్యం చేయించుకుంటున్నారు తప్ప అమెరికా జోలికి వెళ్ళడం లేదు.
ఈ ముక్క బాగుందండి జై గొట్టుముక్కల వారూ ...
తొలగించండిఏ మాట కామాటే చెప్పుకోవాలి ...
విషయపు లోతులకెళ్ళి విశ్లేషించడం, విశదీకరించడం లో
మీ తరువాతే ఎవరైనా ...
వేరేమీ వెదక్కండి - పొగడ్తే ఇది ...
:-)
హరీష్ తో కాకపోతే కెసిఆర్ మనవడు తిరుగు బాటు చేస్తాడని వినిపిస్తోంది
రిప్లయితొలగించండికెసిఆర్ మనవళ్ళు అమెరికా పౌరులని విన్పిస్తుందే మరి వాళ్ళు మన దేశంలో తిరుగుబాటులు చెయ్యొచ్చో లేదో?
తొలగించండిహరీష్ తో కాకపోతే కెసిఆర్ మనవడు తిరుగు బాటు చేస్తాడని వినిపిస్తోంది
రిప్లయితొలగించండి