‘‘ఇదిగో నిరంజన్‌రావు నీకు వంద సార్లు చెప్పాను. గంజితో ఆరబెట్టి ఇస్త్రీ చేసిన నీ చొక్కా కత్తిలా నా చేతికి గాటు పెట్టింది. గంజిలేని చొక్కా వేసుకోలేవా? ’’
‘‘ అధికారం కోసం మరో రెండు దశాబ్దాలైనా ఎదురు చూస్తాం. పదవి లేకపోయినా ఉండగలం. గంజిపెట్టిన కడక్ చొక్కా లేకపోతే రాజకీయాల్లో ఉండలేం. చిన్నప్పటి నుంచి చొక్కామీద మోజుతో రాజకీయాల్లోకి వచ్చాను’’
‘‘ఆపండయ్యా మీ గోల. పసుపు, ఎరుపు, తెలుపు మన పార్టీల రంగులేవైనా కావచ్చు. ప్రజలు మనల్ని సమానంగా చూస్తూ అందరికీ డిపాజిట్లు గల్లంతు చేస్తున్నారు. మనలోని ఈ భావసారూప్యతే మనల్ని ఏకం చేసింది. ఫలితాలపై విశే్లషించుకుందాం. రాజకీయ విశ్లే షకులు, మేధావులు కూడా వచ్చారు. ఎవరి భవన్‌లకు వాళ్లం వెళ్లాక అక్కడ బాహాబాహిలో తేల్చుకుందాం. ఇక్కడ మేధో మధనానికే పరిమితం అవుదాం. ’’
‘‘ రాజకీయ విశ్లే షకుడు అని మీడియాలో కనిపించగానే ఒక్కసారైనా వాడెవడో కళ్లారా చూడాలని పేపర్ చదవడం అలవాటైనప్పటి నుంచి బలమైన కోరిక, ఏరీ రాజకీయ విశ్లే షకులు? ’’
‘‘ అదిగో ఆ మూలకు ముసుగేసుకుని చీకట్లో కొన్ని ఆకారాలు కదులుతున్నాయి కదా? వాళ్లే రాజకీయ విశ్లే షకులు. దేవతా వస్త్రాల తరహాలో రాజకీయ విశే్లషకులు మానవ మాత్రులకు కనిపించరు. ’’
‘‘ ఇక్కడా ముసుగేనా? ’’
‘‘ విషయం ముఖ్యం కానీ ముసుగు వీరుల ముఖంతో మనకేం పని’’
‘‘ పెద్దగా ఉపయోగించని నా మెదుడును వారం రోజుల పాటు చాలా సీరియస్‌గా ఉపయోగించాను. రాత్రి, పగలు, నిద్రలో మెళకువలో ప్రతి క్షణం ఆలోచించి ఓటమికి కారణం నేను కనిపెట్టాను. బెడ్‌రూమ్‌లో యూరేకా అని అరిస్తే మా ఆవిడ కొడుతుందని ఊరుకున్నాను. ఇప్పుడు యూరేకా... యూరేకా అని అరవకుండా ఉండలేకపోతున్నాను. ’’
‘‘ ముందు మీరు కనుగొన్న ఆ గొప్ప విషయం ఏంటో చెప్పి ఏడవండి’’
‘‘ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందు మన జానారెడ్డి ఐదు రూపాయల భోజనం చాలా బాగుందని కితాబు ఇచ్చారు కదా? అదే మన కొంప ముంచింది. మన ఆరడగుల బుల్లెట్ మర్రి శశిధర్‌రెడ్డి ఆంధ్ర ఓటర్లకు గాలం వేసి, వ్యూహాత్మకంగా ఓట్ల రద్దుపై ఆందోళన చేశారు. భాగ్యనగరంలో గల్లీ గల్లీలో ఆంధ్ర మెస్‌లు కనిపిస్తాయి. ఒక్కో మెస్‌లో రోజుకు వందల మంది భోజనం చేస్తారు. జానారెడ్డి ఐదురూపాయల భోజనం బాగుంది అనే సరికి ఇది ఆంధ్రా మెస్‌లకు ఎసరు పెట్టే కుట్ర అనుకున్నారు. గ్రేటర్‌లో ఉన్న ఆంధ్రామెస్‌లు+వాటిలో రోజు భోజనం చేసేవారు అంతా కలిసి గులాబీ పార్టీకి ఓటేశారు. జానా ఐదురూపాయల భోజనం మాటతో ఆంధ్రా మెస్‌లు రాత్రికి రాత్రి ప్లేటు ఫిరాయించి, మనల్ని పక్కన పెట్టి గులాబీని నమ్ముకున్నారు. అదే మన కొంప ముంచింది. ’’
‘‘చక్కని విశ్లే షణ. అందరం దీనికే అంగీకరిద్దాం. విడివిడిగా ఆలోచించడం ఎందుకు దండగ’’
‘‘మేం సొంతంగా ఆలోచించడం మొదటిసారే అయినా ఏ మాత్రం తత్తరపాటు లేకుండా మా ఓటమికి మేం చక్కని కారణం కనుగొన్నాం. టిడిపికి ముందు తెలంగాణ అని చేర్చడం వల్ల మేం ఓడిపోయాం. ముందు కాకుండా వెనక చేర్చి ఉంటే మాకు 99 డివిజన్లు, టిఆర్‌ఎస్‌కు ఒక్కటి వచ్చేది. వెనకిది ముందు కావడం వల్ల ఫలితాలు తలక్రిందులయ్యాయి. తెలంగాణలో తెలంగాణ టిడిపి అంటున్నారు, ఆంధ్రలో మాత్రం ఇలా ఏమీ చేర్చకుండా టిడిపి అని మాత్రమే అంటున్నారు. అందుకే అక్కడ గెలిచాం, ఇక్కడ అడ్రస్ లేకుండా పోయాం. చివరకు ఎన్టీఆర్ చివరి దశలో ఎన్టీఆర్ టిడిపి అని పార్టీ పెట్టి పార్టీని పైకి లేపాలనుకుంటే ఎన్నికలకు ముందే ఆయనే పైకి పోయారు. భార్య టిడిపి, కొడుకు టిడిపి, కో పైలట్ టిడిపి అని ఎన్నో టిడిపిలు వచ్చినా ఒక్కటీ నిలవలేదు. కొంత మంది అల్లుడు టిడిపి అని పిలుద్దామని సలహా ఇచ్చినా, భవిష్యత్తు దర్శనం చేసిన మా అధినేత దానికి ఒప్పుకోకుండా టిడిపికి ఏమీ చేర్చలేదు. అందువల్లే బతికిపోయారు.
భవనాలకు, సచివాలయాలకు, రాజధానులకు వాస్తు ఉన్నట్టే పార్టీ పేరులోని అక్షరాలకు కూడా వాస్తుంటుంది. టిడిపికి ముందు ఏం చేర్చినా వాస్తు ఒప్పుకోదు కావాలంటే వెనక చేర్చవచ్చు. పోటీ చేసిన ప్రతి చోట డిపాజిట్లు గల్లంతు కావడానికి తప్పు అక్షర వాస్తుది కానీ మాది కాదు. మేం పరిశోధించి తేల్చిన విషయం ఇది. మా పార్టీ విధానం ప్రకారం అమరావతి వెళ్లి అధినేతతో మాట్లాడి హైదరాబాద్ ఓటమిపై అక్కడ ప్రకటిస్తాం ’’
‘‘ఇప్పుడు మీరు ఎర్రపార్టీల విశ్లే షణ వినాలి’’
‘‘ ఎర్రన్నా ఎన్నికలు జరిగి నెల కూడా కాలేదు. కనీసం 20-30 ఏళ్ల తరువాత కానీ తప్పు ఎందుకు జరిగిందో? ఎలా జరిగిందో చారిత్రక తప్పిదం అని గుర్తించడం మీ పార్టీ విధానం. ఇప్పుడే విశే్లషించాలని అని మీరు కోరుకోవడం మీ పార్టీ విధానాలకే విరుద్ధం. పువ్వు పార్టీ వాళ్లకు చాన్సిద్దాం’’
‘‘భారత్ మాతాకీ జై.. మేం ఎందుకు ఓడిపోయామో అమిత్‌షా నుంచి ఇంకే నివేదిక రాలేదు. అమరావతి నుంచి సందేశాలు అందలేదు. క్రమశిక్షణకు మారుపేరైనా మేం సొంతంగా ఆలోచించం’’
‘‘ మమ్ములను మాట్లాడనివ్వాలి. మాట్లాడనివ్వాలి’’
‘‘ అబ్బా ఎవరయ్యా మీరంతా మేం మాట్లాడుకోనివ్వకుండా ఈ కాకిగోల ఏంటి? ’’
‘‘ మేం పబ్లిక్.. మీకెందుకు ఓటు వేయలేదో, మిమ్ములను తుక్కు తుక్కు కింద ఎందుకు ఓడించామో మేం చెబుతాం’’
‘‘ అనుమతి లేకుండా లోనికి రావడమే కాకుండా ఇలా పద్ధతి లేకుండా మాట్లాడడమేనా? మీరు మాకెందుకు ఓటు వేయలేదో మా కన్నా మీకెక్కువ తెలుసా? ఒక్కోక్కరం థర్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీలో ఉన్నాం. మాకు తోడుగా రాజకీయ విశే్లషకులు, మేధావులు ఇంత మంది ఉన్నారు. వీరెవరికీ తెలియంది బోడి మీకు తెలుసా? మీ మాటలు వినేంత పనికి మాలిన వాళ్లలా కనిపిస్తున్నామా? బౌన్సర్స్ వీళ్లను బయటపడేసి రండి’’
‘‘ ప్లీజ్ మేం మీకెందుకు ఓటు వేయడం లేదో మేం చెబుతాం వినండి ప్లీజ్ . ఒక్కసారి వినండి ప్లీజ్.... ప్లీజ్... ’’
‘‘వినమంటే వినం..గెటౌట్.’’
- బుద్దా మురళి (జనాంతికం 21-2-2016)

ఎవరు ఎలా & ఎందుకు గెలిచారో/ఒడారో నా బ్లాగులో విశ్లేషణ చేస్తున్నాను. ఎవరయినా చదువుతారో లేదో చూడాలె!
రిప్లయితొలగించండి