‘‘ఈ కాలంలో ఎవరినీ నమ్మేట్టు లేదు’’
‘‘ఔను నిజం.. ఆ ముఖ్యమంత్రి యోగినో త్యాగినో దేశప్రజల వ్రత ఫలం, పుణ్యపురుషుడు అని ఎన్ని ఆశలు పెట్టుకున్నాం. ఆయనా అందరు నాయకుల్లాంటివాడే. ఆ మహిళా పోలీసు అధికారి బదిలీతో ఈ విషయం తేలిపోయింది. తప్పు చేసిన అధికార పక్షం కార్యకర్తలను ప్రశ్నించడమే ఆమె చేసిన ఘోరమైన తప్పిదమై, ఆమెను నెపాల్ సరిహద్దులకు బదిలీ అయ్యేట్టు చేసింది. అదేదో లాలూప్రసాద్ యాదవ్ బదిలీ చేస్తే- మన నాయకులు ఇంతే.. అనుకునే వాళ్లం. కానీ మన ఆదర్శ పురుషుడు ఆదిత్యనాథ్ యోగి ఇలా చేయడం నమ్మలేక పోతున్నాం’’

‘‘అక్షర లక్షలు విలువ చేసే మాట చెప్పావు’’
‘‘నువ్వు లక్షలు అంటే 28 శాతం జిఎస్‌టి కట్టమంటారు’’
‘‘జిఎస్‌టి మంచిదే అని కెసిఆర్ చెబుతున్నారు కదా?’’
‘‘మరక మంచిదే అని సర్ఫ్ ఎక్సెల్ వాళ్లు చెబుతారు. మరక ఉంటేనే కదా సర్ఫ్ అమ్ముడు పోయేది.. ఎవరి కోణం వారిది. పాలకుడు కోరుకునేది మరింత ఆదాయం. పాలితులు కోరుకునేది మరింత పొదుపు. ఐనా నేనన్నది ఉత్తర ప్రదేశ్ గురించి కాదు. ’’
‘‘ఎవరినీ నమ్మేట్టు లేదన్నది దేని గురించి?’’
‘‘గుండెపోటు గుమ్మడి ఓ తాతలా, మోతుబరి రైతులా కనిపిస్తాడు.. అలాంటి గుమ్మడిలో కూడా విలన్ ఉంటాడని అనుకుంటామా? నాగభూషణం అంటే తడిగుడ్డతో గొంతులు కోసే విలన్ అనుకుంటాం.. కానీ విలన్‌ను చీల్చి చెండాడే వీరోచిత హీరో ఆయనే అంటే నమ్మగలమా? మొన్న ఓ న్యూస్ చానల్‌లో ఓ నాయకుడు నైతిక విలువల గురించి అదే పనిగా చెబుతుంటే చూడలేక చానల్ మారిస్తే మరో టీవిలో ‘ఏది నిజం?’ అని 1950 ప్రాంతం నాటి సినిమా కనిపించింది. అందులో హీరో నాగభూషణం, విలన్ గుమ్మడి.. నమ్మలేక పోయాను. విలువల గురించిన ఉపన్యాసాలకు ఉండే విలువ ఏంటో తెలుసు కాబట్టి నవ్వుకొని చానల్ మార్చేస్తే ఈ సినిమా కంట పడింది. ’’

‘‘విలన్లు, కమెడియన్లు పరిణామక్రమంలో హీరోలు కావడం, హీరో విలన్ కావడం జూనియర్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్‌గా ఎదగడం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఎప్పటి నుంచో ఉన్నదే కదా? నాగభూషణం హీరో అంటేనే నమ్మలేం ’’
‘‘ఇందులో నమ్మక పోవడానికేముంది మోహన్‌బాబు షక్కర్ మే రక్కర్ అంటూ విలనీ పండించి.. దారి చూపిన దేవత అంటూ తాను రేప్ చేసిన కథానాయికనే పెళ్లి చేసుకుని మారిన మనిషిగా పెదరాయుడుగా గ్రామస్తులకు తీర్పులు చెప్పలేదా? అంతులేని కథలో బాధ్యత తెలియని వ్యక్తిగా జయప్రదకు అన్నగా నటించిన రజనీకాంత్ కోట్లాది మంది తమిళులకు ఆరాధ్య దైవం అవుతాడని ఊహించామా? ఓవైపు తీర్పులు చెప్పి, బాషాగా అలరించి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి కోట్లాది మందిని ఉద్ధరించాలనే స్థాయికి చేరుకుంటాడని ఎప్పుడైనా అనుకున్నామా? సాగర సంగమంలో తాగుబోతు కమల్ హాసన్ బాధ్యతాయుతమైన ‘్భరతీయుడు’గా మారుతాడని ఎవరనుకున్నారు? ఎవరైనా ఎప్పుడూ ఒకేలా ఉంటారని ఎందుకనుకుంటావు? కాలాన్ని బట్టి మారుతారు. జగపతిబాబు వాళ్ల నాన్న సూపర్ హిట్ సినిమాలు తీస్తే, జగపతిబాబు హీరోగా సూపర్ హిట్ సినిమాల్లో నటించి కాలం కలిసి రాక హీరో నుంచి ఇప్పుడు విలన్ కాలేదా? తాత వయసులో బాలకృష్ణ ఇపుడు ఇరగదీయడం లేదా? అంతా కాలమహిమ.’’

‘‘మన చేతిలో ఏమీ ఉండదు.. అంతా కాల మహిమ.. దూరదర్శన్ సీరియల్స్‌లో పేదవృద్ధుడి పాత్రలో నరసింహరాజు కనిపిస్తుంటాడు. ఆయన ముఖంలో పేదరికం వెళ్లి విరుస్తుంటుంది. చెబితే నమ్ముతావా? నరసింహరాజు ఒకప్పుడు టాప్ హీరో.. పున్నమినాగులో చిరంజీవి విలన్ అయితే ఆయన హీరో. హీరో అన్నాక విలన్‌ను పిచ్చకొట్టుడు కొట్టాలి అలా కొట్టాడు కూడా. వాళ్లిద్దరి జాతకాలు తారు మారయ్యాయి నరసింహరాజు దూరదర్శన్ జూనియర్ ఆర్టిస్ట్‌లా మారిపోతే చిరంజీవి మెగాస్టార్ అయ్యాడు.’’
‘‘ కాలం కలిసొస్తే ఎన్టీఆర్ మునిమనవళ్లు కూడా హీరోలు అవుతారు కలిసి రాకపోతే హీరో నుంచి జూనియర్ ఆర్టిస్ట్‌లై పోతారు.’’
‘‘మీ ఇద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో నాకస్సలు అర్థం కావడం లేదు.’’
‘‘ఒక్కో సమయంలో ఒక్కోలా ఉంటారు అనుకుంటున్నాం. బాగో జాగో అన్న కెసిఆర్ తెలంగాణ వచ్చాక మీ కాళ్లకు ముళ్లు గుచ్చుకుంటే పంటితో తీస్తాను అని చెప్పలేదా? నా లేఖతోనే తెలంగాణ వచ్చిందని తెలంగాణలో చెప్పి మధ్యాహ్నం హెలికాప్టర్‌లో విజయవాడకు చేరుకుని అన్యాయంగా విడదీశారు అని బాబు చెప్పలేదా? ’’

‘‘అంతే కదా? అదేదో సినిమాలో ఎన్టీఆర్ హీరో, సత్యనారాయణ విలన్ ఇద్దరి మధ్య ఫైటింగ్ సీన్ పూర్తి కాగానే అదే స్టూడియోలో మరో ఫ్లోర్‌లో ఎన్టీఆర్, సత్యనారాయణలు తాతా మనవళ్లుగా అద్భుత రసాన్ని పండించారు. ఏ ఫ్లోర్ నటన ఆ ఫ్లోర్ కే పరిమితం. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిఎస్‌టిని వీరోచితంగా వ్యతిరేకించిన మోదీ ప్రధానమంత్రి కాగానే జిఎస్‌టి అమలుతోనే దేశం ముందుకు వెళుతుందని చెప్పలేదా? గుజరాతీ భాషలో కేంద్రం మిధ్య అని హూంకరించి, ఇప్పుడు జిఎస్‌టితో రాష్ట్రం మిధ్య అని మోదీ చెప్పడం లేదా? ఏ పాత్రలో ఉంటే ఆ డైలాగు చెప్పక తప్పదు కదా? అద్వానీ సూపర్ హిట్ సినిమా ‘రథయాత్ర’ సమయంలో మోదీ జూనియర్ ఆర్టిస్ట్. అదే మోదీ హీరో అయ్యాక అద్వానీకి కనీసం క్యారక్టర్ ఆర్టిస్ట్ పాత్ర కూడా దక్కకుండా చేయలేదా? ’’
‘‘బాగా చెప్పావు.. దానవీర శూరకర్ణలో దుర్యోధనుడిగా ఎన్టీఆర్ అద్భుతమైన డైలాగులు చెబితే- మనకు మహాభారతంలో నిజమైన హీరో దుర్యోధనుడే అనిపించింది. అదే ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా నటించిన సినిమాలో దుర్యోధనుడు ఇంత ఫవర్‌పుల్‌గా ఉండడు. ఎన్టీఆర్ కూడా దుర్యోధనుడి పాత్రలో చెప్పిన డైలాగులను బృహన్నల పాత్రలో చెప్పలేడు కదా? ఏ పాత్ర డైలాగులు ఆ పాత్రకే’’
‘‘సినిమాకు, రాజకీయాలకు సంబంధం ఏంటి?’’
‘‘రెండూ ఒకదానిలో ఒకటి కలిసిపోయి చాలా కాలం అయింది. రెండూ నటనే’’
‘‘మీ ఇద్దరి చర్చ సినిమాలపైనా, రాజకీయాల గురించా? నాయకుల గురించా? ’’

‘‘మనుషులంతా ఒకటే . రాజకీయాలు,సినిమాలు ఒకటే.. పాత్రకు తగ్గ డైలాగులు చెబుతారు. ఏ పాత్రా శాశ్వతంగా ఒకేలా ఉండదు. కాలాన్ని బట్టి అవసరాన్ని బట్టి మారుతుంది. దానవీర శూరకర్ణ డైలాగులను శ్రీకృష్ణ పాండవీయంలో ఆశించవద్దు అని అంతే.’’
*
*