‘ఈ కాలంలో ఉన్న మనం అదృష్టవంతులం’’
‘‘మనలా టెక్నాలజీని ఉపయోగించుకుంటున్న తరం మరేదీ లేదు. చిన్నప్పుడు ట్రంక్ కాల్ చేయాలంటే ప్యాట్నీలో ఉన్న టెలిఫోన్ ఎక్స్ఛేంజ్కు వెళ్లి టోకన్ తీసుకుని గంటల తరబడి నిలబడాల్సి వచ్చేది. ఇప్పుడు అమెరికాలో ఉన్న కూతురు హైదరాబాద్‌లో ఉన్న తల్లితో ట్యాబ్‌లో వంకాయ కూర గురించి, సాంబారులో ఉప్పు గురించి లైవ్‌లో మాట్లాడుకుంటున్నారు. ప్రతి ఇల్లూ 24 ఇంటూ 7 లైవ్ వంటల చానల్‌గా మారిపోయింది అంటే టెక్నాలజీ పుణ్యమే కదా? ’’
‘‘ముప్పయి ఏళ్ల క్రితం మనమీ టెక్నాలజీని ఊహించలేదు. అలానే వచ్చే ఇరవై ఏళ్లలో టెక్నాలజీ ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో మనం ఊహించలేం. స్మార్ట్ ఫోన్ లేనిదే జీవించలేని స్థితికి చేరుకున్న మనం సెల్‌ఫోన్ లేకుండా చిన్నప్పుడు ఎలా బతికామని ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. అలానే మరో రెండు మూడు దశాబ్దాల తరువాత టెక్నాలజీలో బతికే వాళ్లు ఇప్పటి మన జీవితం గురించి తెలుసుకొని ఓ మైగాడ్ స్మార్ట్‌ఫోన్ అనే పాత టెక్నాలజీతో పాపం ఎలా బతికారో అని మనమీద సానుభూతి చూపొచ్చు. మనం అదృష్టవంతులం అని నేను చెప్పింది టెక్నాలజీ గురించి కాదు. ’’
‘‘మరింక దేని గురించి?’’
‘‘ఉన్నావా? అసలున్నావా? అంటూ అనుమానం వ్యక్తం చేసిన మహామహా భక్తులు కూడా ఒక్కోసారి నిజంగా దేవుడు ఉన్నాడో లేడో నిర్థారించుకోలేక సతమతమయ్యారు. అలాంటిది మనం ఏకంగా దేవుళ్లు ఉన్న కాలంలో బతకడం అదృష్టవంతులమే కదా? ’’
‘‘ఈ కాలంలో దేవుళ్లను సినిమాల్లో చూసే అదృష్టం కూడా లేదు అలాంటిది నువ్వు దేవుళ్లను చూశావా? మొన్ననే కనిమొళి 2జి స్కామ్ నుంచి విజయవంతంగా బయటపడినందుకు తిరుపతి వెళ్లి దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుని తిరుపతిలో అసలు దేవుడే లేడని ప్రకటించింది. అలాంటిది నువ్వు దేవుళ్లను చూశావా? ’’
‘‘కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడి, బయటపడ్డాక ఆమెకు దేవుడు లేడనే అనుమానం వచ్చి ఉంటుంది. సహజమే కదా? ఆమెకే కాదు ఒక్కోసారి నాక్కూడా- నిజంగా దేవుడుంటే కుంభకోణాలు చేసిన వారు ఎలా బయటపడతారు అనిపిస్తుంది. కనిమొళిని చూసి విజయ్ మాల్యా అనవసరంగా దేశం విడిచి వచ్చానని సిగ్గుపడుతున్నాడేమో!’’
‘‘కేసు నుంచి బయటపడిన వారు దేవుడున్నాడనడం మామూలే, కానీ ఈమె కాస్త వెరైటీగా కేసు నుంచి బయటపడగానే దేవుడు లేడు అంటోంది. రుజువేంటి అని ఎవరైనా అడిగారో లేదో అడిగితే కేసు నుంచి నేను బయటపడడమే దేవుడు లేడు అనేందుకు రుజువు అంటుందేమో?. చర్చ పక్కదారి పట్టినట్టుంది. దేవుళ్లను చూశానన్నావు ఏంటాకథ’’
‘‘మొన్న బ్లాక్ బస్టర్ సినిమా అట్టర్ ప్లాప్ అయింది కదా?’’
‘‘నువ్వు మరీ ఇంత దుర్మార్గుడివి అనుకోలేదు. ఒక సినిమా అట్టర్ ఫ్ల్లాప్ అయితే దేవుడున్నాడని అంటావా? అంటే ఆ సినిమా అట్టర్ ఫ్ల్లాప్ కావాలని దేవుళ్లను మొక్కుకున్నావన్న మాట! ఫ్ల్లాప్ వెనుక అదేదో పార్టీ యువ నేత ఉన్నాడంటారనుకున్నారు చాలా మంది. కానీ దేవుడున్నాడన్న మాట’’
‘‘దేవుళ్లు ఉన్నారు. మొదట్లో మన సినిమాలన్నీ పౌరాణికమే. మనకు దేవుళ్లు పరిచయం అయింది ఈ సినిమాల ద్వారానే. 1936లో వచ్చిన తొలి తెలుగు సినిమా ‘్భక్తప్రహ్లాద’ పౌరాణికమే. దాదాపు 70వ దశకం వరకు దేవుళ్లను మనం సినిమాల్లోనే చూశాం.’’
‘‘ఔను నిజం ముఖ్యంగా 60వ దశకంలో వచ్చిన దేవుళ్ల సినిమాలను ఇప్పటికీ మైమరిచి చూస్తాం. ఆ తరువాత దేవుళ్ల సినిమాలు ఎందుకు రాలేదంటావు?’’
‘‘దేవుళ్లే కళ్లెదుట కనిపిస్తుంటే ఇక దేవుళ్ల సినిమాలు ఎవరు చూస్తారని అనుకున్నారేమో, దేవుళ్ల సినిమాలు తగ్గిపోయాయి.?’’
‘‘అన్నీ చెబుతున్నావుకానీ దేవుళ్లను ఎక్కడ చూశావు? ఎప్పుడు చూశావు ఆ సంగతి మాత్రం చెప్పడం లేదు.’’
‘‘ఇరాక్‌పై అమెరికా దాడి, ట్విన్ టవర్స్‌ను విమానంతో పేల్చడం, మన పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడిపై టీవిలో ఉద్వేగ పూరితంగా చర్చలు జరిపినట్టుగా, అంతకన్నా కొంచెం ఎక్కువగా ఓ తెలుగు సినిమా విడుదలపై ప్రజలేమనుకుంటున్నారు అని తెలుగు చానల్స్ అన్నీ కట్టకట్టుకుని చర్చించాయి. ఆ చర్చలప్పుడు నాకు దేవుళ్లు ఉన్నారని జ్ఞానోదయం అయింది.’’
‘‘అదే ఎలా అని ?’’
‘‘బ్లాక్‌బస్టర్ అని ప్రచారం జరిగి అట్టర్ ఫ్ల్లాప్ అయిన సినిమాను చూసి బయటకు వస్తున్న ప్రేక్షకుడు నాకీ జ్ఞానోదయం కలిగించాడు. ఆ ప్రేక్షకుడి తల్లి ఏరా బిడ్డా దెబ్బలు తగిలించుకున్నావు అని అడిగితే.. అమ్మా ఓసారి నీకు దెబ్బలు ఎలా తగిలాయి అని నిన్ను అడిగితే దైవ దర్శనం కోసం వెళితే తొక్కిసలాటలో దెబ్బలు తగిలాయి అని చెప్పావు. నేను నా అభిమాన హీరో సినిమాకు వెళితే నాకీ దెబ్బలు తగిలాయి. హీరోనే నాకు దైవం అని గర్వంగా చెప్పాడట! తన్మయంతో అతను చెప్పడం, టీవి చర్చల్లో ఉన్న ఓ అమ్మ మనసు ఉప్పొంగిపోవడం చూశాక కలికాలం దేవుళ్లు మన హీరోలే అనిపించింది. అప్పుడెప్పుడో భారతదేశ జనాభా 10- 20 కోట్లు ఉన్నప్పుడు ముక్కోటి దేవతలు అన్నారు. ఇప్పుడు వంద కోట్లు దాటినప్పుడు అదే దామాషా ప్రకారం దేవుళ్ల సంఖ్య కూడా పెరగాలా? వద్దా? రాష్ట్రాల సంఖ్య, నియోజక వర్గాల సంఖ్య పెరుగుతున్నప్పుడు దేవుళ్ల సంఖ్య ఎందుకు పెరగొద్దు’’
‘‘అవును నిజమే రజనీకాంత్ తమిళదేవుడు అయినట్టుగానే చాలా రాష్ట్రాల్లో చాలా మంది నట దేవుళ్లు జీవిస్తున్న కాలంలో మనం ఉండడం మన అదృష్టమే. ఈ విషయంలో ఉత్తరాది వారి కన్నా దక్షిణాది వాళ్లం అదృష్టవంతులం.’’
‘అభిమానులకు దేవుళ్లు కనిపిస్తారో లేదో కానీ. లింగ, కబాలీ, కాటమరాయుడు, వంటిసినిమాల నిర్మాతలు , బయ్యర్లకు ఆ సినిమాల విడుదల తరువాత నిజంగానే దేవుడు కనిపించి ఉంటాడు. తమ్ముడి తాజా సినిమా ను కొన్న వాళ్లకు దేవుడు కనిపించే ఉంటాడు

... బిచ్చగాడు డబ్బింగ్ సినిమా నిర్మాతను కోటీశ్వరుణ్ణి చేస్తే, కాపీ కథల కలియుగ దేవుళ్ల సినిమా కోటీశ్వరులను బిచ్చగాళ్లను చేస్తోంది. ఇదంతా దేవుళ్ల మహిమ.’’
బుద్దా మురళి (జనాంతికం 12-1-2018)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం