దానవీర శూరకర్ణలోని చిత్రం భళారే విచిత్రం ఈ పాట నిజంగా చిత్ర మే.. సుయోధన సార్వభౌముడికి డ్యూయె ట్ పెట్టాలనే ఆలోచనే ఓ చిత్రం. సి.నారాయణరెడ్డి ఆ పాటను అద్భుతంగా రాస్తే ప్రభ ఆ పాటలో అంతకుముందు ఏ సిని మాలోనూ కనిపించనంత అందంగా కనిపిస్తుంది. చిత్రమైన పాట ఉన్న ఈ సినిమా ప్యారడైజ్‌లో బాగా నడిచింది. ఆ సినిమా హాల్ చరిత్ర ఇంతకన్నా చిత్రమైనది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి ఏ సీ టాకీసుగా (1954) ప్యారడైజ్ టాకీసు పేరుతో రికార్డ్ నమోదు అయి ఉంది. ఈ టాకీసులో అనేక విచిత్రాలు, జ్ఞాపకాలు.. అద్భుతాలు ఉన్నాయి.
మీరు ఏ సినిమా హాలుకు వెళ్లినా ఇంటర్వెల్‌లో తలుపు లు అన్నీ మూసేస్తారు. ఇష్టం ఉన్నా లేకున్నా టాకీసులోని క్యాంటిన్‌లోనే చిరుతిండి కొనుక్కోవాలి. తలుపులు తీస్తే అంతకన్నా తక్కువ ధరతో, మంచి రుచికరమైన పదార్థాలు బయట కొనుక్కుంటారు. అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా క్యాంటిన్లో నాసిరకం చిరుతిళ్లు ఎక్కువ ధరకు కొనాలి. సిని మా హాలులోని క్యాంటిన్‌పై నిర్వాహకులకు అంత నమ్మ కం. అందుకే గేట్లకు తాళాలు వేస్తారు. తలుపులు ముస్తారు.
కానీ చిత్రం భళారే విచిత్రం అనిపించేట్టుగా ప్యారడైజ్ లోని క్యాంటిన్ అంతర్జాతీయ బ్రాండ్ కావడం. ఆ బ్రాండ్ విలువ కోట్ల రూపాయలు కావడం. ప్యారడైజ్ టాకీసు మూతపడింది కానీ అందులోని క్యాంటిన్ మాత్రం అదే పేరుతో అంతర్జాతీయ బ్రాండ్‌గా మారింది. ప్యారడైజ్ అం టే ఈతరం వారికి తెలిసింది హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్ నేం. కానీ ఒకప్పుడు ఎన్నో మంచి మంచి తెలుగు సినిమా లు ఆడిన టాకీసు ప్యారడైజ్.
సికింద్రాబాద్‌లో హిందీ, ఇంగ్లీష్ సినిమాలు ఆడే టాకీసులు ఎక్కువగా ఉన్నా ప్యారడైజ్‌లో మాత్రం ఎక్కువగా తెలుగు సినిమాలే ఆడేవి. దానవీర శూర కర్ణ, దేశోద్ధారకులు వంటి పలు హిట్ సినిమాలు ఎక్కువ రోజులు ఆడాయి.
ప్యారడైజ్ హోటల్ తమ ప్రగతిని వివరిస్తూ ఓ బోర్డు ఏర్పాటుచేశారు. సికింద్రాబాద్ ప్రాంతంలో ప్యారడైజ్ అనే పేరుతో పిలిచిన ఒక టాకీసులో చిన్న క్యాంటిన్‌గా 1953లో ఆవిర్భవించినట్టు రాసుకున్నారు. క్రమంగా టాకీసు ప్రభా వం తగ్గుతుండగా, అదే సమయంలో క్యాంటిన్ చిన్న హోట ల్‌గా మారింది. అటు నుంచి ఎవరూ అందుకోలేని స్థాయికి వెళ్తే టాకీసు మాత్రం మూతపడింది. టాకీసు మూతపడి అందులోని క్యాంటిన్ అంతర్జాతీయ బ్రాండ్‌గా మారడం సినిమాను మించిన విచిత్రం. ప్యారడైజ్‌లో ఎక్కువగా తెలు గు సినిమాలు ప్రదర్శించినా అప్పడప్పుడు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు ప్రదర్శించేవారు.
1977 జనవరి 14న ప్యారడైజ్‌లో విడుదలైన దాన వీర శూర కర్ణ సినిమా ఓ సంచలనం. ఎక్కువ రోజులు నడిచిన సినిమానే కాదు. ఎక్కువ నిడివిగల సినిమా కూడా. ప్యారడైజ్‌లో ఈ సినిమా విడుదల అని ఆ రోజుల్లో పత్రికల్లో వచ్చి న ప్రచార ప్రకటన చాలా ఆకర్షణీయంగా ఉండే ది. దుర్యోధనుడిగా ఎన్టీఆర్ పెద్ద గద ను పట్టుకొన్న పోస్టర్ ఆకట్టుకొనే విధంగా ఉండేది. ద్రౌపదిగా శారద వస్ర్తాపహరణం కృష్ణుడి గా ఎన్టీఆర్ అరచేతి నుంచి చీరలు రావడం, మాయాజూదంలో ఓడిపోయి పాండవులు దీనంగా కూర్చున్న దృశ్యంతో తొలుత పత్రికల్లో ప్రచార ప్రకటన వచ్చినా గదతో దుర్యోధనుడి పోస్టర్ ఎక్కువగా పాపులర్ అయింది. ఆ కాలంలో ప్యారడైజ్ టాకీసు జన ప్రవాహంతో నిండిపో యింది. దేశోద్ధారకులు సినిమా కూడా ఈ టాకీసులో బాగా ఆడింది. దాన వీర శూర కర్ణకు ముందు అక్కినేని నాగేశ్వర్ రావు, వాణిశ్రీ నటించిన ఆలుమగలు సినిమా బాగానే నడిచింది.
ఇప్పుడంటే అసలు విడుదలకు నోచుకోని సినిమాలు, ఒకరోజుకే ఎత్తేసే సినిమాలకు సైతం టీవీలో బోలెడు ప్రచా రం లభిస్తున్నది. ఆ రోజుల్లో పత్రికల్లో ప్రకటనలు, పోస్టర్‌లే ప్రచారం. పత్రికల ప్రకటనలో అన్ని టాకీసులు ఎయిర్ కం డిషన్డ్ అని రాస్తే ప్యారడైజ్ ఎయిర్‌కూల్ అని రాసుకొనేది.
సికింద్రాబాద్‌లో పాష్ ఏరియా జవహర్‌నగర్ ఈ టాకీసుకు పక్కనే.. రాజధాని నగరంలో తొలి అపార్ట్‌మెంట్
నిర్మాణం ఈ ప్రాంతంలోనే జరిగింది. సింధ్ కాలనీ.. వారు పూజించే ప్రత్యేక ఆలయం ఈ ప్రాంత ప్రత్యేకతలు. కొత్త సినిమా ఏది విడుదలయినా మొదటి మూడురోజులు నాలు గు ఆటలు అదే సినిమా ప్రదర్శించేవారు. నాలుగవ రోజు నుంచి ఉదయం ఆట పాత సినిమాను మార్నింగ్ షో గా తక్కువ రేటు టికెట్లతో ప్రదర్శించేవారు.
అమర శిల్పి జక్కన్న , ఆలు మగలు , ఊరికి ఉపకారి , వెలుగు నీడలు , ఆత్మ బలం , చాణక్య చంద్ర గుప్త వంటి సినిమాలు ప్యారడైజ్ లో విడుదల అయ్యాయి . ధరమ్ వీర్ వంటి సూపర్ హిట్ హిందీ సినిమా కూడా నటరాజ్ లోనే విడుదల అయింది .
***
ప్యారడైజ్‌లో బిర్యానీ ఎంత ఫేమస్ అంటే.. రాహుల్ గాంధీ చెప్పాపెట్టకుండా వచ్చి ఇక్కడ బిర్యానీ తిని వెళ్లేంత గా. బిర్యానీ ప్రియులకు ఇది నిజంగా ప్యారడైజే (స్వర్గం) కానీ ఇందులో ఎన్నో సినిమాలు చూసిన నాటితరం వారికీ మాత్రం ఇక్కడికి రాగానే టాకీసు కనిపించకపోవడం గుండె ల్లో గుచ్చుకున్నట్టుగా ఏదో వెలితిగా ఉంటుంది.
బుద్దా మురళి (జ్ఞాపకాలు , నమస్తే తెలంగాణ 7. 1. 2018)
టాకీస్ 3

నిజాం పాలనా కాలం లోనే ప్యారడైజ్ టాకీస్ ను అంజయ్య గౌడ్ నిర్మించాడు . ఇప్పుడు ఆ ప్రాంతం లో కనిపించే నెహ్రూ విగ్రహం ఆ కాలం లో ఆయన ఏర్పాటు చేసిందే .
తమ టాకీసులో ప్రదర్శించేందుకు ఓ సినిమా అనుమతి కోసం కోసం అంజయ్య గౌడ్ మద్రాస్ కు వెళ్ళడానికి రైలు కోసం వెళితే అప్పటికే వెళ్ళిపోయింది లో తరువాత స్టేషన్ లో ఎక్కేందుకు కారులో వెళితే అక్కడా రైలు దొరకలేదు ఆ తరువాత స్టేషన్ కు వెళ్లి కారులో వెళ్ళాడు అదే ఆయన పాలిట టాకీసు పాలిట శాపంగా మారింది రైలు పట్టాలు భారీ వర్షానికి కొట్టుకు పోయి రైలు ప్రమాదం లో మరణించిన వారిలో అంజయ్య గౌడ్ కూడా ఉన్నారు . జనగామ వద్ద జరిగిన రైలు ప్రమాదం లో మొత్తం 120 మంది వరకు మరణించారు అందులో అంజయ్యకూడా ఉంది. ఉన్నారు 27-9-1954లో ప్రమాదం జరిగింది . అగ్గిపిడుగు సినిమా కొనేందుకు వెళ్లారు
ఆ తరువాత అంజయ్య కుమారుడు ప్యారడైజ్ బాధ్యత తీసుకొన్నాడు
కొద్దికొద్దిగా టాకీసు జాగా ను హోటల్ గా మారిన క్యాంటిన్ ఓనర్ కు అమ్మ సాగాడు టాకీసును నడపడం ఇక తనవల్ల కాదని భావించి మొత్తం అమ్మకానికి పెట్టాడు
టాకీసు ఆవరణ లోనే ఉన్న తన తండ్రి సమాధి ని కదిలించి వద్దు అలానే ఉంచాలి అనే కండిషన్ తో టాకీసు మొత్తం అమ్మేశారు. సికింద్రాబాద్ నడి బొడ్డున ఉన్న నటరాజ్ ను అమ్మి అలియా బాద్ లో ఓ టాకీసు నిర్మించి కొంత కాలానికి అదీ అమ్మేశారు
అంజయ్య వారసులు అంజయ్య నిర్మించిన టాకీసును కాపాడ లేక పోయారు కానీ సమాధిని మాత్రం అలానే ఉంచాలనే కండిషన్ పెట్టారు .
****
సికింద్రాబాద్ చరిత్రలో ఒక భాగంగా నిలిచిన ప్యారడైజ్ 1987లో మూతపడింది. అదే స్థలంలో, అదే పేరుతో వెలిసిన ప్యారడైజ్ హోటల్ తన చరిత్రను అక్కడ రాసిపెట్టింది. ఒక సినిమా హాలులో క్యాంటిన్ అంతర్జాతీయ బ్రాండ్‌గా మారడం అభినందనీయమే కానీ.. అదే సమయంలో తన జన్మకు కారణమైన ప్యారడైజ్ రికార్డును నమోదుచేసి ఉంటే బాగుండేది. ప్యారడైజ్ సినిమా టాకీసుగా ఉన్నప్పటి ఫొటో కానీ సినిమా షీల్‌లు ఆ టాకీసుకు సంబంధించిన ఎలాంటి చరిత్ర, చిత్రాలు అక్కడ లేవు. ఇక్కడ ఒకప్పుడు ప్యారడైజ్ పేరుతో ఒక సినిమా టాకీసు ఉండేదని చెప్పినా నమ్మేట్టుగా లేదు.ప్యారడైజ్‌లో బిర్యానీ ఎంత ఫేమస్ అంటే.. రాహుల్ గాంధీ చెప్పాపెట్టకుండా వచ్చి ఇక్కడ బిర్యానీ తిని వెళ్లేంత గా. బిర్యానీ ప్రియులకు ఇది నిజంగా ప్యారడైజే (స్వర్గం) కానీ ఇందులో ఎన్నో సినిమాలు చూసిన నాటితరం వారికీ మాత్రం ఇక్కడికి రాగానే టాకీసు కనిపించకపోవడం గుండె ల్లో గుచ్చుకున్నట్టుగా ఏదో వెలితిగా ఉంటుంది.
బుద్దా మురళి (జ్ఞాపకాలు , నమస్తే తెలంగాణ 7. 1. 2018)
టాకీస్ 3
బాగా రాశారు. మీరు వీలైతే అప్పటి పోటో లు కూడా సేకరించి పెట్టండి. మీరు ప్రభుత్వంలో పదవి నిర్వహిస్తున్నారు కదా! ఎదైనా డిపార్ట్ మెంట్ లో దొరుకుతాయేమో లేకపోతే కొత్తమంది సామాన్య ప్రజలు పోటోలు తిసుకొని ఉండవచ్చు వారి నుంచి అయినా సేకరించేది. అలాగే సనత్ నగర్, బాలా నగర్ లో ఇండస్ట్రియల్ ఏరియా ను కూడా మీ వ్యాసాలలో కవర్ చేసేది.
రిప్లయితొలగించండిజంటనగరాలలో దానవీరశూరకర్ణ విడుదలైన శాంతి, షామ్, కమల్, ప్యారడైజ్‌లలో ఒక్క శాంతి థియేటర్ మాత్రమే ఇప్పుడు మనుగడలో ఉంది.
రిప్లయితొలగించండి