సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి 13 ఏండ్లు అవుతున్నా, సమాచారం అంటే ఏమిటి? సమాచారం పరిధిలోకి వచ్చే అం శాలు ఏమిటీ? అనే దానిపై దరఖాస్తుదారులకే కాదు, ప్రజా సమాచార అధికారులకు సందేహాలు అలానే ఉన్నాయి. సమాచార హక్కు చట్టంలో సమాచారం పరిధిలోకి ఏం వస్తాయో స్పష్టంగా ఉంది.తెలంగాణ సమాచార కమిషన్‌కు ఇటీవల ఆసక్తికరమైన కేసులు కొన్ని వచ్చాయి. ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ విభాగాధిపతులు తమ కార్యాలయాల వద్ద ఏర్పాటుచేసిన నేమ్ బోర్డుల ఫొటోలు కావాలని స.హ.చట్టం కింద అడిగారు. పలువురు దరఖాస్తుదారులు ఇదేవిధంగా కోరారు. స.హ.చట్టం కింద తాము కోరిన ఫొటోలు ఇవ్వలేదని సమాచా ర కమిషన్‌కు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదు అందినప్పుడు ఇరు పక్షాలను పిలిచి విచారించడం కమిషన్ బాధ్యత.
ఫొటోలు తీసివ్వాలని కోరడం, ఫొటోలు తీసి ఇవ్వడం స.హ.చట్టం కిందికి వస్తుందా? అని విచారించే ముందు చట్టంలో సమాచారం నిర్వచనం చూడాలి. రికార్డులు, పత్రాలు, మెమోలు, ఈ-మెయిల్స్, అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, సర్క్యులర్లు, ఉత్తర్వులు, లాగ్ బుక్స్, కాంట్రాక్టులు, నివేదికలు, పేపర్లు, శాంపిళ్లు, మోడల్స్, డేటా, ఎలక్ట్రానిక్ రూపంతో పాటు ఏ రూపంలో ఉన్న సమాచారమైనా స.హ. చట్టం కిందికి వస్తుంది. ఏదైనా పత్రం, రాత ప్రతి, ఫైల్, ఏదైనా మైక్రో ఫిల్మ్ వంటివి సమాచారం కిందకు వస్తాయి.
అధికార యంత్రాంగం వద్ద ఉన్న ఈ సమాచారాన్ని స.హ.చట్టం కింద పొందవచ్చు. పనులను, పత్రాలను, రికార్డులను తనిఖీ చేసే హక్కు ఉం టుంది. రికార్డులలో ఉన్న సమాచారాన్ని ఎత్తి రాసుకోవచ్చు. వాటి నఖ లు , సర్టిఫైడ్ కాఫీ తీసుకోవచ్చు. టేపులు , వీడియో క్యాసెట్ల రూపంలో సమాచారం ఉంటే వాటి కాపీ తీసుకోవచ్చు. కంప్యూటర్‌లో సమాచారం ఉంటే ప్రింటవుట్‌ల ద్వారా ఆ సమాచారం తీసుకోవచ్చు. ఇది సమాచార హక్కులో భాగం.
ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న సమాచారం మొత్తం మాకు ఒక సీడీ లో కావాలని కోరేవారు కొందరు. మేము కోరిన రూపంలో సమాచారం ఇవ్వాలని కోరేవారు కొందరు. ఇలాంటి దరఖాస్తులు, సమస్యలు చాలా చోట్ల రావడంతో దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. సమాచారం అంటే ఏమిటో చట్టం స్పష్టం చేసినప్పటికీ కొందరు పలు సందేహాలు వ్యక్తం చేయడంతో 2008లో కేంద్రం స్పష్టత ఇచ్చింది.
కొందరు సమాచార అధికారిని తమ పరిధిలో లేని సమాచారం కోర డంతో ఈ వివరణ అవసరమైంది. సమాచారం తమకు పలానా ఫార్మట్ లో కావాలని, సీడీల రూపంలో కావాలని కొందరు అడుగుతున్నారు. సమాచార అధికారి వద్ద సమాచారం ఏ రూపంలో ఉంటే అదే రూపం లో ఇవ్వాలని dopt. (గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) స్పష్టత ఇచ్చింది. ఫొటో కాపీ రూపంలో సమాచారం ఉంటే ఫొటో కాపీ రూపంలోనే ఇవ్వాలి. ఫ్లాపీ రూపంలో ఉంటే ఫ్లాపీలోనే సమాచారం ఇవ్వాలి. సమాచారం రూపాన్ని మార్చివ్వాల్సిన అవసరం లేదు. సమాచార అధికారి వద్ద ఉన్న సమాచారాన్ని ఇవ్వాలి కానీ ఇతర విభాగాల నుంచి సేకరించి ఇవ్వడం సమాచార అధికారి బాధ్య త కాదు. కొందరు సమాచారాన్ని తాము కోరుకున్న భాషలోకి అనువా దం చేసి ఇవ్వాలని కోరుతుంటారు. సమాచారం ఎలా ఉంటే అలానే ఇవ్వవచ్చు.
ప్రభుత్వ కార్యాలయంలో సమాచార అధికారి తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఏ రూపంలో ఉందో అదే రూపంలో ఇస్తారు. అంతే కానీ తాము కోరిన రూపంలో కాదు. ఉదాహరణకు సమాచారం సీడీ రూపంలో ఉంటే సీడీ కాపీ ఇస్తారు అంతే కానీ ఫైల్ రూపంలో డ్యాకుమెంట్‌గా ఉన్న సమాచారం మొత్తం సీడీ రూపంలో ఇవ్వాలని కోరినా నిబంధనల మేరకు ఫైల్ రూపంలోనే ఇవ్వాలి.
సమాచార అధికారి తమ కార్యాలయంలో ఉన్న సమాచారం, ఉండే సమాచారం మాత్రమే ఇవ్వాలి కానీ సమాచార హక్కు కింద సమాచారం కోరితే తన వద్ద లేకుండా ఇతర కార్యాలయాల నుంచి తెప్పించి ఇవ్వాలి అని చట్టం ఎక్కడా చెప్పడంలేదు. తమ వద్ద ఉన్న సమాచారాన్ని 30 రోజులలోపు దరఖాస్తుదారునికి ఇవ్వడం ముఖ్యం. ప్రభుత్వ కార్యాలయాల వద్ద , విభాగాధిపతుల ఛాంబర్‌ల వద్ద ఉన్న నేం ప్లేట్స్ ఫొటోలు కావాలని స.హ.చట్టం కింద కొంతమంది దరఖాస్తు చేశారు. నేం ప్లేట్ ఏర్పాటుచేశారా లేదా? అనేది సమాచారం కిందకు వస్తుంది కానీ, నేం ప్లేట్ ఫొటోలు కావాలని కోరడం స.హ.చట్టం కిందకు రాదు.
ఏది స.హ.చట్టం కిందకు వస్తుందో? ఏది రాదో అనే అనుమానాలతో అధికారులు నేం ప్లేట్ ఫొటోలు తీసివ్వడమే కాకుండా అన్ని విభాగాల నుంచి ఈ ఫొటోలు కోరడంతో ఆయా విభాగాల వారికీ లేఖలు రాశారు. దరఖాస్తుదారులు కోరినవిధంగా నేం ప్లేట్ ఫొటోలు తీసి ఇవ్వమని.. స.హ.చట్టం కింద సమాచారం ఇవ్వకపోతే జరిమానా విధిస్తారనే భయం తో కొందరు అధికారులు ఫొటోలు తీసి ఇచ్చారు. కోరిన భాషలో, కోరిన ఫార్మట్‌లో సమాచారం ఇచ్చారు. కొందరు అధికారులు సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం చూపుతుంటే, కొందరు తమ పరిధిలో లేని సమాచారం కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు . సమాచారం తెప్పించుకొని ఇస్తున్నారు. కొందరేమో సమాచారం తమ కార్యాలయంలో లేదు అని చేతులు దులుపు కొంటున్నారు.
ప్రభుత్వ కార్యాలయాల వద్ద నేం ప్లేట్ ఏర్పాటు మంచిదే .. ఏ కార్యాలయం వద్దనైనా అలా ఏర్పా టు చేయకపోతే, ఏర్పాటు చేశారా లేదా అనేది సమాచారహక్కు కిం ద తెలుసుకోవచ్చు. ఏర్పా టుచేయమని కోరుతూ ఆ కార్యాలయానికి లేఖ రాసి, తానూ రాసిన లేఖపై ఏ చర్య తీసుకున్నారు అని సమాచార హక్కు చట్టం కింద సమాచారం అడు గవచ్చు. అంతే తప్ప ఫొటో కోరడం సమాచారం హక్కు చట్టం కిందకు రాదు. ఫైల్స్‌లో ఉన్న సమాచార కాపీ కోరవచ్చునని చట్టం చెబుతున్నది. నేమ్ ప్లేట్ ఫొటో అనేది సమాచారం కిందకు రాదు. నేం ప్లేట్ ఏర్పాటు చేశామని సమాచారం ఇవ్వడం మాత్రమే సమాచార హక్కు కిందకు వస్తుంది. కాబట్టి నేం ప్లేట్ ఏర్పాటు చేశామనే సమాచారం ఇస్తే సరిపోతుంది. స.హ.చట్టం 4(1)బి కింద ప్రభుత్వ కార్యాలయంలోని అధికార యంత్రాంగానికి సంబంధించిన వివరాలు, వారు నిర్వర్తించే విధులు ఏమిటో అందరికి అందుబాటులో ఉండాలి. సమాచారం కోరితే ఒక పేజీ కి రెండు రూపాయలు తీసుకోవాలి.
యూనివర్సిటీలు కొన్నిపత్రాలకు నిర్ణీత మొత్తం చార్జీలు వసూలు చేస్తుంటారు. ఉదాహరణకు యూనివర్సిటీ కొన్ని పత్రాలకు 500 రూపాయలు వసూలు చేయాలనేది యూనివర్సిటీ నిర్ణయించిన ధర. స.హ. చట్టం కింద ఒక పేజీకి రెండు రూపాయలు కాబట్టి రెండు రూపాయలతో తాము కోరిన కాపీ ఇవ్వాలని కొందరు దరఖాస్తు చేసుకున్నారు. అయితే రెండు రూపాయలకు ఇవ్వడం ఇక్కడ వర్తించదు యూనివర్సిటీ ముందుగానే ధర నిర్ణయించింది. కాబట్టి ఆ మేరకు చెల్లించాలి. ధర గురించి 2005, అక్టోబర్ 13న ఒక జీవో ద్వారా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. నిర్ణీత ధర ముద్రించిన ముద్రిత సామగ్రి టెక్ట్స్, ప్లాపీ, సీడీలు, మరే రూపంలో ఉన్నా ముద్రిత ధరకు ఇవ్వాలి. నిర్ణీత ధర ముద్రించని వాటికి పేజీకి రెండు రూపాయలు తీసుకోవాలి. మ్యాపులు, ప్లాన్లు దాని వాస్తవ ధరకు ఇవ్వాలి. స.హ.చట్టంపై సమాచార అధికారులు స్పష్టమైన అవగాహనతో ఉంటే సమాచారం కోరేవారికి, సమాచార అధికారులకూ ప్రయోజనకరం.
-బుద్ధా మురళి (నమస్తే తెలంగాణ 4-4-2018)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం