24, జూన్ 2011, శుక్రవారం

లక్ష వత్తుల నోము... సుమన్ .వెయ్యి సినిమాల నోము

బాబు సుమన్ నీ అదృష్టాన్ని చూస్తే జెలసి కలుగుతోంది బాబు . అంతా తమ తమ గోడు వేల్లబోసుకోవడానికి బ్లాగ్స్ మొదలు పెట్టినంత సులభంగా నువ్వు సినిమా తిసేస్తున్నావు  . అందుకే బ్లాగర్స్ నిన్ను ఆదర్శంగా తీసుకోని ఎవరి బ్లాగ్ కు వారే సుమన్ అనే నినాదం లేవదీశారు ( ఈ నినాదం నాకు నచ్చిన నినాదం కానీ నాది కాదు ) థామస్ ఆల్వా ఎడిసన్ బల్బ్ కనుగొన డానికి  వెయ్యి ప్రయోగాలు చేశాడు. వెయ్యవ సారి విద్యుత్ బల్బు కనుగొన్నాడు . బల్బును ఎలా చేయకుడదో 999 మార్గాలు తెలుసుకున్నాను అని , తన ప్రయోగం విజయ వంతం అయ్యాక చెప్పాడు. 

 జూన్ 26 నా   నీ మరో సినిమా మమత మీ టివి లో విడుదల అవుతుందనే హెచ్చరిక ఇప్పుడే చదివాను. నీ సినిమాలపై బ్లాగ్ లోకం లో పిచ్చి అభిమానం బాబు. నిజంగా ఆ సమయం లో నేను ఆఫీసు లో ఉండి తీరాలి లేక పొతే చూడడానికి అదేం భాగ్యం బాబు. నువ్వేమన్నా పరాయి వాడివా మా తెలుగు వాడివే కదా . ఐనా ఇప్పటి వరకు నువ్వెన్ని సినిమాలు తిశావని . చేతిలో స్టూడియో ఉండి చూపడానికి టివి ఉండి. చూసేందుకు బాబు సుమన్ అస్సలు భయపడవద్దు బాబు .. భయపడితే మనదేశానికి అమెరికా నుంచి సముద్ర మార్గం కనిపెట్టే వారా? ఎర్రగా ఉందని టమాట ను చూసి తొలుత బయపడిన  వారు అలానే ఉంటే అంత రుచికరమైన టమాట మనకు దక్కేదా? మేమున్నాం. భయపడకు తీయి బాబు తీయి  . 

థామస్ ఆల్వా ఎడిసన్ అంత గోప్పవాడవు కావాలంటే కనీసం వెయ్యిసినిమాలు తీయాలి బాబు . ఎజన్మలో చేసుకున్న పుణ్యమో నీ కిన్ని అవకాశాలు. ( వాళ్ళ  నాన్న సంగతి మనకెందుకండి. మన సుమన్ బాబు మనకు ముఖ్యం . ఆ మధ్య నువ్వు మీ నాన్న గురించి మరో పేపర్లో ఇంటర్వ్యు లో ఏదో చెబితే ఇదంతా వై యస్ ఆర్ కుట్ర అని నన్నపనేని విమర్శించారు . ఇప్పుడు నువ్వు సినిమాలు తీయడం వెనక యువనేత కుట్ర ఉందని అనే వాళ్ళు అనుకుంటారు నువ్వు పట్టించుకోకు . ఆడ వాళ్ళు లక్ష వత్తుల నోము నోచుకున్నట్టు నువ్వు వెయ్యి సినిమాల నోము నోచుకోవాలని , వందేళ్ళు హీరోగా నటిస్తూ వర్ధిల్లాలని మన రాజకీయ  నాయకులురాష్ట్రాభివ్రుద్దినికోరుకున్నంత మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.....
  నీ నుంచి కుటుంబ కథ చిత్రాలు వచ్చాయి. డబుల్ యాక్షన్ చిత్రాలు వచ్చాయి. పౌరాణిక చిత్రాలు వచ్చాయి. నీ నుంచి ఇక రావలసింది ఒక దయ్యం సినిమానే బాబు . చచ్చి లోకాన ఉన్నాడో కానీ హిచ్ కాక్ కూడా భయపడాలి అలా ఉండాలి ఆ దయ్యం సినిమా 

( అతని సినిమా ఎలా ఉంటుందనే విషయం పక్కన పెడితే నాకు తెలిసినంత వరకు ఆతను నిజంగానే సొంతంగానే కథ , మాటలు రాస్తాడట. చాలా మంది ప్రముఖులుఘోస్ట్  చేత రాయిస్తారు. పెద్దల పిల్లలు అడ్డమైన అలవాట్లతో దారి తప్పుతుండగా ఆతను అలా కాకుండా సాహిత్యం పై ఆసక్తి పెంచుకున్నందుకు అభినందనలు )  

8 కామెంట్‌లు:

  1. అంతే కాదు అతను ఇంగ్లిష్ క్లాసిక్స్ కూడా బాగా చదివేట్టు ఉన్నాడు. థామస్ హార్డి రాసిన "మేయర్ ఆఫ్ ది కేస్టర్ బ్రిడ్జ్" నవలని ఈ టివిలో అంతరంగాలు అనే సీరియల్గా తీశాడు. ఆ నవల చదివటానికే చాలా రోజులు పడుతుంది. కాని మీ సుమన్ ఆనవలని బాగా ఆకళింపుచేసుకొని నవలలో ఉన్న పాత్రలే కాకుండా, మీలాంటి అభిమానుల కొరకు అదనపు ఆకర్షణ గా ఎప్పుడు నల్ల చీర కట్టుకొని ఉండే అనురాధా పాత్రను కొత్తగ సృష్టించాడు.
    ------------------------------------------
    సుమన్ గారిని తలచుకొనపుడల్లా నాకు చిరంజీవి నటించిన యమూడికి మొగుడు సినేమా గుర్తుకు వస్తుంది. రావుగోపాల రావు లాంటి తెలివిగల వ్యక్తికి సుధాకర్ వంటి కొడుకును చూసి సినేమాలో అయితే నవ్వుకొంటాం. అదే నిజజీవితం లో ఆ పరితిస్థితే వస్తే ఏమి చేయగలం? ఎమీ మాట్లాడకుండా అబ్బాయి కున్న కోరికలు తీర్చి, మౌనంగా ఉంట్టు మన పెద్దరికాని కాపాడుకోవటం తప్ప.

    Srikar

    రిప్లయితొలగించండి
  2. శ్రీకర్ గారు మన సుమన్ మీద మీ అభిమానానికి థాంక్స్ . ఎక్కువగా నేను టివి లో హాస్య పరమైన కార్యక్రమాలే చూస్తాను . బహుశా ఆ సమయం లో అంతకన్నా నవ్వించే కార్యక్రమం ఏదో వస్తూ ఉంటుంది . అందుకే ఎప్పుడూ అంతరంగాలు చూసే అవకాశం రాలేదు. సరే రేపు మన సుమన్ బాబు సినిమా టివిలో వస్తుంది చూడడం మరవకండి. బ్లాగర్స్ ఆందరూ ఎదురుచూస్తున్నారు . సినిమా చూసి రివ్యు రాయడానికి . అందుకే నేను ముందే రాసేశాను

    రిప్లయితొలగించండి
  3. మీరు 'జనాంతికం' మురళి గారే కదండీ.. ??మీ శైలి చూసి వారే అనుకుంటున్నాను..
    చాలా సంతోషంగా ఉంది, ఇక్కడ ఇలా కలుసుకోవడం..

    రిప్లయితొలగించండి
  4. నేను జనాంతికం మురళినే నండి మురళి గారు . నాపేరు బుద్దా మురళి . నాకు సంతోషంగానే ఉందండీ . మనమే వ్యంగ్యం లో పెద్ద పుడింగి అనుకుంటే ,బ్లాగ్స్ లో చాలామంది పుడింగి లను చూసి సంతోషం వేసిందండి

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం