''పిన్నిగారు మీ పిల్లలకు సంబంధాలు చూస్తున్నారటకదా! ’’ అంటూ ప్రశ్నను సంధించింది అదో రకంగా నవ్వుతూ మీనాక్షి. ‘‘ఆ చూస్తున్నాం.... ’’ అని ఊర్మిళ ముక్తసరిగా సమాధానం చెప్పింది. ‘‘సంబంధాలు కుదరడం కష్టంగా ఉన్నట్టుంది’’ అని మీనాక్షి పొడిగిస్తూ మరో ప్రశ్న వేసింది. ‘‘అలా ఏమీ లేదు’’ అంటూ ఊర్మిళ నీవెంత ఉడికించాలని చూసినా నేను ఉడుక్కోకుంటా నినే్న ఉడికిస్తాను అన్నట్టుగా మళ్లీ ముక్తసరిగానే సమాధానం చెప్పింది. తాను ప్రశ్నను పదిహేను మార్కల కోసం రాయాల్సిన వ్యాసాన్ని దృష్టిలో పెట్టుకొని అడిగితే ఊర్మిళ మాత్రం ఒక్క మార్కు ప్రశ్నలా ముక్తసరిగానే సమాధానం చెప్పింది.
‘‘మొన్న మీరు అమెరికా సంబంధం గురించి వాకబు చేసినట్టు పనిమనిషి కూతురు చెప్పింది, అది నాకు నమ్మబుద్ధి కాలేదు. నిజమో కాదో తెలుసుకుందామని’’ అంటూ మీనాక్షి ఇప్పుడు ప్రశ్ననే వ్యాసంగా ఉన్నప్పుడు ఎలా తప్పించుకుంటావో చూస్తాను అన్నట్టుగా ఓ లుక్కెసింది. ‘‘ అప్పటి వరకు ఔను.. కాదు. స్థాయి టైపు సమాధానలతో సరిపుచ్చిన ఊర్మిళ ఈ ప్రశ్నతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది.‘‘ అమెరికా సంబంధం చూడడానికి మేమంత గతిలేని వాళ్లమేమీ కాదు’’ అని రోషంగా పలికింది. ‘‘అమెరికా సంబంధం చేసుకోవలసిన ఖర్మ మాత్రం మా పిల్లలకు పట్టలేదు. మన దేశంపై ఆధారపడి బతికే అమెరికా సంబంధం ఎలా చేసుకుంటాం? అప్పుల్లో మునిగిపోయిన వాడి కుటుంబంతో సంబంధం కలుపుకుంటామా? అమెరికా అప్పులు పెరిగాయి, పరపతి తగ్గింది. వారి పరిస్థితి అచ్చం మొన్న దివాళా తీసిన మీ పిన్ని కొడుకు సూరయ్యలా తయారైంది కదూ’’ అని ఊర్మిళ దెప్పి పొడిచింది. ఎంత దెబ్బకొట్టావే అని మనసులోనే అనుకుంది మీనాక్షి.‘‘వారి సంగతి వదిలేయండి ఇంతకూ సంబంధాలు ఎక్కడ చూస్తున్నారేమిటి? ’’ అని మామూలు స్థాయికి వచ్చి మీనాక్షి ప్రశ్నించింది.
‘‘నీ దగ్గర దాపరికమేముంది. మరో లోకంలో మంచి సంబంధం ఉందని ఆ పేరయ్య చెబితే మొన్ననే మా వారిని పంపించాను. ఈ పాటికి చేరాలి, ఇంకా ఫోన్ రాలేదు. పూర్వం మన రైళ్లలానే ఇప్పుడు మరో లోకానికి అంతరిక్ష యాత్రకు సైతం వేళాపాళా లేదొదినా ? ఇండియా వాడు మరో లోకానికి విమానాలు నడిపినా ఇండియన్ టైంను మాత్రం మేయిన్‌టెయిన్ చేస్తున్నాడు’’ అని ఊర్ళిళ అనగానే ఇద్దరూ నవ్వుకున్నారు.
****
టీవిలో గట్టిగా నవ్వులు వినిపించగానే ఊర్ళిళకు మెలుకువ వచ్చింది. ఇప్పటి వరకు నేను కల కన్నానా? అనుకుంటూ మంచం మీది నుంచి లేచింది. ప్రస్తుతం మనం ఉన్న విశ్వంలో మరిన్ని విశ్వాలు ఉండే అవకాశం ఉందని, అంతర్జాతీయ ఖగోళ శాస్తవ్రేత్తలు కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకు వచ్చారు. మన విశ్వం ఆవిర్భవించినట్టుగానే ,మరిన్ని చిన్న విశ్వాలు ఏర్పఉండే అవకాశాలున్నట్టు లండన్ శాస్తవ్రేత్త డేనియల్ మార్క్‌లాక్ వివరించినట్టు వార్తల్లో చదివింది. అలా చదువుతూ నిద్రపోయిన ఊర్ళిళ ఏకంగా ఆ కొత్త లోకంతో పిల్లలకు సంబంధాలు కుదుర్చుకోవాలనే ఆలోచన తనకువచ్చినందుకు నవ్వుకుంది. పాడు లోకానికో తోడు లోకమన్నమాట అనుకుంది. అన్నీ జంటగా ఉన్నప్పుడు ఈ విశ్వం మాత్రం ఒంటరిగా ఉండడం ఏమిటి? దానికో జంట ఉండడం న్యాయమే అనిపించింది. ఒకటికన్నా రెండు ఎంతో గొప్పది.
తిరుమల శ్రీవెంకటేశ్వరుడి నిలయం ప్రపంచంలోని ఆలయాల్లోకెల్లా సంపన్న ఆలయం కావడం వెనుక అసలు కారణం ఏమిటి? బహుశా ఆయన ఇద్దరు భార్యల భర్త కావడమేనేమో!
మరి తలపై గంగ, పక్కన పార్వతి ఉన్న శివుడి నివాసం ఎక్కడ? ఆయన ఆలయాల్లో సంపద కనిపించదు కదా? అని అంటారా? అనుకూలంగా ఉన్న ఉదాహరణలనే వాడుకుంటాం!
చాలా మంది నటులు, పారిశ్రామిక వేత్తలు జీవితంలో ఒక ఉన్నత స్థానానికి చేరుకున్న తరువాత రెండో పెళ్లితో పరిపూర్ణులవుతారు.
రెండు అంకె చూడగానే గుర్తుకొచ్చే నాయకుడు బాబుగారు. మన చేతి రెండు వేళ్లపై కూడా ఆయనే కాపిరైట్ హక్కులు కలిగి ఉన్నారేమో అనిపించేంతగా రెండుకు ఆయన ప్రచారం కల్పించారు. ఆయన రెండు సార్లు ముఖ్యమంత్రి , రెండు సార్లు ప్రతిపక్ష నాయకుడయ్యారు. రెండో స్థానంలో ఉండి ఎన్టీఆర్‌ను దించిన తరువాత ఆయన మా పార్టీలో అంతా నంబర్‌టూలే అన్నారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ సినిమాలో తుగ్లక్ పాత్రలో నాగభూషణం ప్రధాని పదవి చేపట్టి గొడవ లేకుండా ఎంపిలంతా ఉప ప్రధానులే అనేస్తాడు. అప్పుడు ఏ ఒక్కరికో వెన్నుపోటు పొడిచే అవకాశం లేకుండా పోతుంది. తొలిసారి వెన్నుపోటులో నాదెండ్ల విఫలమైతే రెండోసారి జరిపిన వెన్నుపోటులో బాబు విజయం సాధించారు. ఆయన పాలనా కాలంలోనే రెండు రాష్ట్రాల ఉద్యమం పురుడు పోసుకుంది. చివరకు ఆయన రెండు కళ్ల సిద్ధాంతం నమ్ముకున్నారు.
స్త్రీ , పురుషులు. నాస్తికులు, ఆస్తికులు. జీవాత్మ, పరమాత్మ, సూర్య చంద్రులు. భూమి, ఆకాశం , స్వర్గం, నరకం- ఇలా అన్నీ రెండైనప్పుడు మన విశ్వానికి తోడుగా ఇంకో విశ్వం ఎందుకుండకూడదు??

బాగుంది మురళి గారు. అన్నట్టు మీకు రెండు బ్లాగ్ లు ఉన్నాయా ? అని సందేహం అండీ !?
రిప్లయితొలగించండివనజవనమాలి గారు ఒకటే బ్లాగ్ ఉందండీ . మీకు అలా ఎందుకు అనిపించింది. సికింద్రాబాద్ కథలు అని అప్పుడప్పుడు రాస్తున్న వాటిని విడిగా మరో బ్లాగ్ లో రాయాలనే ఆలోచన వచ్చింది కానీ రెండు బ్లాగ్ల వల్ల ప్రత్యేకంగా ఒనగుడేది ఏమిటో తెలియలేదు .
రిప్లయితొలగించండిఅనుకూలంగా ఉన్న ఉదాహరణలనే వాడుకుంటాం!:)
రిప్లయితొలగించండి