బ్రాండ్ ఇమేజ్ అనేదేదో పాశ్చాత్యుల కంపెనీలు మనకు పరిచయం చేశారని చాలా మంది అనుకుంటారు. కానీ అమెరికాను కనిపెట్టక ముందు, అది పుట్టక ముందు నుంచే మనకు మహామహా బ్రాండ్‌లున్నాయి. బ్రాండ్ అంబాసిడర్‌లు ఉన్నారు. పరమ శివుడ్ని మించిన బ్రాండ్ ఏ దేవుడికుంది. అడగ్గానే కోరిన వరాలిచ్చే భోళాశంకరుడనే బ్రాండ్ ఆయన మీద చాలా బలంగా ఉంది. టాటా బ్రాండ్ పేరు వినగానే నాణ్యమైన ఉత్పత్తులు గుర్తుకు వచ్చినట్టు పరమ శివుడి పేరు తలుచుకోగానే భక్తుల పాలిట భోళాశంకరుడి రూపం మెదులుతుంది. టాటాకు వ్యాపారంలో తిరుగు లేని పేరుంది. కార్పొరేట్ పైరవీకారు నీరా రాడియాకు టాటా 60 కోట్లు ఇవ్వడం లాంటివి ఆ బ్రాండ్ మీద పడ్డ ఓ మచ్చ.
కార్పొరేట్ కంపెనీలు బ్రాండ్ ఇమేజ్ కోసం ప్రకటనలకు కోట్లు ఖర్చు చేస్తాయ. నిజానికి ఒక కంపెనీ బ్రాండ్ ఇమేజ్ సాధించేందుకు పడే కష్టం కన్నా ఎన్నో రేట్లు ఎక్కువగా ఒక రాజకీయ పక్షం బ్రాండ్ ఇమేజ్ కోసం కష్టపడాల్సి వస్తుంది. రాజకీయ పక్షాలకు బ్రాండ్ ఇమేజ్ కల్పించే వృత్తిలో ఉన్నవారు కార్పొరేట్ కంపెనీలకు పనికి రారు, కార్పొరేట్ కంపెనీల వాళ్లు రాజకీయ పక్షాలకు బ్రాండ్ ఇమేజ్ కల్పించడానికి పనికి రారు.
ఈ విషయం తెలియక గతంలో బిజెపి వాళ్లు తమ పార్టీకి గొప్ప బ్రాండ్ ఇమేజ్ కల్పించమని ఒక కార్పొరేట్ కంపెనీని సంప్రదిస్తే, భారత్ వెలిగిపోతోంది (ఇండియా ఇస్ షైనింగ్) అనే నినాదం ఇచ్చి ఇక జనంలోకి వెళ్లండి మీరు వెలిగిపోతారు అని భరోసా ఇచ్చింది. బిజెపి వాళ్ల నినాదం విన్నాక సమస్యలతో మేం చస్తూ బతుకుతుంటే భారత్ వెలిగిపోతుందా? ఓటర్లకు చిరాకేసింది. వెలుగు మాట దేవుడెరుగు బిజెపిని చీకటిలోకి పంపించేశారు. ఈ విషయం తెలిసి కూడా ఈ మధ్య మాయావతి కూడా బిఎస్‌పికి మంచి బ్రాండ్ ఇమేజ్ కల్పించమని ఒక కార్పొరేట్ కంపెనీని కలిశారు. మంత్రులను తొలగించండి, ఇలా మాట్లాడండి, అలా చేయండి అంటూ భారీ ఫీజు తీసుకుని తోచిన సలహాలిచ్చారు. అవినీతి మంత్రులను తొలగించడం వల్ల పార్టీకి బ్రహ్మాండమైన ఇమేజ్ వచ్చిందని ఆమె మురిసిపోయారు. కానీ ఫలితాలు వచ్చాక చూస్తే ఉన్న ఇమేజ్ కూడా మంట గలిసి ఇప్పటి వరకు కోలుకోలేక పోయారు.అన్ని పార్టీలు ఇలానే తమది గొప్ప బ్రాండ్ అని ప్రత్యర్థులది చెత్త బ్రాండ్ అనే ప్రచారం వల్ల అసలు రాజకీయ వ్యాపారమే చెత్త బ్రాండ్ అనే బలమైన ముద్ర ప్రజలపై పడిపోయింది. ముందుకు వచ్చిన చిన్నపాటి బొర్ర, ఖద్దరు దుస్తులు, నెత్తిపై టోపీ ఇదీ రాజకీయ నాయకుని బ్రాండ్ .
బివి పట్ట్భారామ్ అనగానే మనకు టోపీలోంచి రంగు రంగుల కాగితాలను తీసుకు రావడం, పేక ముక్కలను మాయం చేయడం, పావురాలను రప్పించడం గుర్తుకు వస్తుంది కదూ. దాదాపు రెండు మూడు దశాబ్దాల పాటు తీవ్రంగా కృషి చేసి ఆయన తెచ్చుకున్న బ్రాండ్ ఇమేజ్ అది. కానీ చిత్రమేమంటే గత రెండు దశాబ్దాల నుంచి ఆయన మేజిక్ మానేసి సైకాలజిస్ట్‌గా ఉన్నారు. సైకాలజిస్ట్‌గా ఆయన ఎంత బిజీగా ఉన్నా ఆయన పేరువింటే మాత్రం గుర్తుకు వచ్చేది మెజీషియన్ రూపమే. కొందరు ఈ బ్రాండ్‌లను మార్చుకోవడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. అలా మనుషుల మస్తిష్కంలో ముద్ర పడిపోతుంది. టెలిఫోన్లు మధ్యతరగతి వారికి అందుబాటులోకి వచ్చిన కొత్తలో ఫోన్ మాట్లాడుతున్నట్టుగా ఫోటో దిగడం ఫ్యాషన్. అదే విధంగా కంప్యూటర్ అందుబాటులోకి వచ్చిన కొత్తలో వౌస్‌ను ఆడిస్తూ, కంప్యూటర్ స్కీృన్‌ను చూస్తూ ఫోటో దిగడం పెద్ద క్రేజి. అయితే మీకు గుర్తు కొచ్చేసిందన్నమాట! నిజమే బాబు గారు కంప్యూటర్ స్కీృన్ చూస్తూ వౌస్‌ను తిప్పుతున్నప్పటి ఫోటో అప్పుడు పత్రికల్లో రోజూ కనిపించేది. క్యాలండర్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పత్రికల్లో ప్రకటనలు అన్నింటిలో ఇదే ఫోటో. కంప్యూటర్‌లకు బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారేమో అనుకునేంత బలంగా ఈ ముద్ర పడిపోయింది. ఈ బ్రాండ్‌తో కాలం కలిసొచ్చేట్టు లేదని గ్రహించి తొమ్మిదేళ్ల క్రితం నుంచి కొత్త బ్రాండ్ ఇమేజ్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా కుదరడం లేదు. కంప్యూటర్ స్కీృన్ స్థానంలో పొలం దున్నుతున్న బాబు ఫోటోను చేర్చినా కొత్త బ్రాండ్ జనంలోకి వెళ్లలేదు.
రిలయన్స్ వాళ్లు తమ లోగోను మార్చి కొత్త లోగో ప్రచారం కోసం కోట్లరూపాయలు ఖర్చు చేశారు. కానీ ఎందుకో పాత లోగో గుర్తుకు వచ్చినంతగా కొత్తది మనసులో ముద్రించుకోలేదు. కాలాన్ని బట్టి లోగోను, బ్రాండ్‌ను, బ్రాండ్ అంబాసిడర్లను మారుస్తుంటారు. అయితే చాలా సార్లు ఈ మార్పులు జనానికి అంత ఈజీగా అలవాటు కావడం లేదు. బాబు జమానాలో రాజకీయాల్లో ప్యాంటు షర్టు తప్ప దోవతీల బ్రాండ్‌కు కాలం చెల్లిందని బలంగా నమ్మేవారు. కొన్ని వందల కిలోమీటర్ల దూరం నడిచి దోవతీ బ్రాండ్ రాజకీయాలకు కాలం చెల్లలేదని వైఎస్‌ఆర్ నిరూపించారు. ఇప్పుడు మళ్లీ ఫ్యాంట్‌ల యుగం వచ్చింది. అయితే ఫ్యాంట్ల సంఖ్య పెరిగింది. వీటిలో ఏ ఫ్యాంటును ఎలా ఆదరిస్తారో తేలాలంటే రెండేళ్లు ఆగాలి.