‘సూపర్ మ్యాన్... సూపర్ మ్యాన్ ’అంటూ అండర్‌వేర్ ప్యాంట్‌పైన ఒక వ్యక్తి హాలులోకి పరిగెత్తుకొచ్చాడు. అచ్చం సినిమాలో సూపర్ మ్యాన్ వేషధారణలానే ఉంది. చుట్టుపక్కల ఎక్కడైనా నాటకాలాడుతున్నారేమో అనుకుని బాబు ఇది పార్టీ ఆఫీసు ఇక్కడ రాజకీయ వేషాలే తప్ప ఇలాంటి వేషాలు వేయవద్దు వెళ్లండి అని భుజం మీద చేయి బలవంతంగా బయటకు పంపడానికి ప్రయత్నించారు. మే ఫూల్... మే ఫూల్ అని అతను గట్టిగా నవ్వాడు. ఏప్రిల్ ఫూల్‌ను మేలో జరుపుకునే వీడెవడురా బాబు అని తలలు పట్టుకున్నారు. అతను ముఖానికున్న మాస్క్ తొలగించాడు. నారాయణ... నారాయణ... అరే సిపిఐ కార్యదర్శి నారాయణ సూపర్ మ్యాన్ అయిపోయారు అని అంతా ఆశ్చర్యపోయారు.
ఆయనపైకి కెమెరాలు ఫోకస్ చేశారు. సూపర్ మ్యాన్ వేషంలో నారాయణ అంటూ చానల్స్ బ్రేకింగ్ న్యూస్‌లతో లైవ్ టెలికాస్ట్ మొదలు పెట్టాయి. నారాయణ వేషధారణపై టీవిల్లో చర్చలు మొదలయ్యాయి. ‘‘రైతుల సమస్యలు, పేదల సమస్యలు అంటూ నేను గంట సేపు ఉపన్యాసం చేసినా మీ చానల్‌లో నిమిషం చూపరు, పత్రికల్లో అక్షరం రాయరు. మళ్లీ ప్రజల సమస్యలను విస్మరిస్తున్న నాయకులు అంటూ మీరే చెబుతుంటారు. విషయం చెబితే ఎవరూ పట్టించుకోవడం లేదు అందుకే ఇలా వేషం వేసుకొని వచ్చాను. ఏ చానల్ తిప్పి చూసినా నా మాటలే లైవ్‌గా వస్తున్నాయి. మా పార్టీకి ఇంతకు మించి ఇంకేం కావాలి’’ అని నారాయణ తన వేష రహస్యాన్ని విప్పారు. నేను పోలీసుల కళ్లు కప్పి నాటు పడవల్లో సాహస యాత్ర చేసి ఉద్యమిస్తే మీరు ఒక్క రోజు కన్నా ఎక్కువ చెప్పలేదు. ఈ మధ్య ఎంత తీవ్రమైన కామెంట్స్ చేస్తున్నా స్క్రోలింగ్‌లకే పరిమితం చేస్తున్నారు. అందుకే ఒక్కోసారి ఒక్కో వేషం వేసి మిమ్ములను ఆశ్చర్యంలో ముంచెత్తాలనుకుంటున్నాను. మీరెవరూ ఊహించని వేషాల్లో వస్తాను. ఊహించండి చూద్దాం అని నారాయణ మీడియాకు సవాల్ విసిరి అక్కడి నుంచి మాయమయ్యారు.
***
బాబు చేతిలో పేపర్ల కట్టులు చూడగానే అక్కడ కూర్చున్న మీడియా వారికి పై ప్రాణాలు పైనే పోయాయి. ఒక టీవి చానల్ యువకుడు సార్ వచ్చే వారం నా పెళ్లి అని మెల్లగా చెప్పాడు. ఆ లోపుగానే ముగిస్తాలే అని బాబు భరోసా ఇచ్చారు. కిక్కిరిసిన విలేఖరుల సమావేశం కావడంతో కెమెరా బాబు తలకు తాకింది. ఆయన నిశే్చష్టులయ్యారు. ఒక్క నిమిషం ఏమీ మాట్లాడలేదు. వెంటనే మైకు అందుకున్నాడు. స్వర్ణాంధ్ర సాధించేంత వరకు నేను నిద్రపోను.. మిమ్ములను నిద్ర పోనివ్వను. నా పాలన చూసి ప్రపంచం విస్తుపోతోంది అని చెప్పడం మొదలు పెట్టారు. (పిఎ చెవి వద్దకు చేరి సార్ మీరిప్పుడు అధికారంలో లేరు ఇది 2012 అని గుర్తు చేశాడు.) నాకిప్పుడే అంతా గుర్తుకొచ్చింది. వైఎస్‌ఆర్ పులివెందుల ప్రాథమిక పాఠశాలలో చదివేప్పుడు పక్క కుర్రాడి బలపం ఎత్తుకెళ్లాడు. సిబిఐ ఎంక్వైయిరీ జరిపిస్తే వాస్తవాలు తెలుస్తాయి. మీడియ వాళ్లు అయోమయంగా చూశారు. ఆయన జీవితం ఎలాంటిదో చెప్పడానికే ఈ సంగతి చెప్పాను. తరువాత కర్నాటక వెళ్లి మెడికల్ కాలేజీలో చేరాడు. తెలుగు ఆత్మగౌరవాన్ని అప్పుడే తాకట్టు పెట్టాడు. సరే కొత్త సంగతులు చెప్పండి సార్ అని వెనక నుండి అసంతృప్తి వాది అరిచాడు.
ఇలా అయితే కష్టం సార్! తెలుగు సినిమా ఇంతకు ముందెన్నడూ లేనంతటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మీరే రక్షించాలి అని తెలుగు సినిమా పెద్దలు ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశారు. వీళ్లు మాట్లాడిన తెలుగును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి అర్ధమయ్యే తెలుగులోకి సమాచార శాఖ అధికారి తర్జుమా చేసి చెప్పాడు. తప్పకుండా మీ సమస్య పరిష్కరిస్తాను అనే అర్ధం వచ్చే విధంగా సిఎం ఏదో మాట్లాడారు. ఆ తెలుగును అధికారి మళ్లీ మామూలు తెలుగులోకి అనువదించాడు. అన్ని సినిమాలు ప్లాపవుతున్నాయి. అంతో ఇంతో కామెడీ సినిమాలు నడిచేవి. కానీ మీ నాయకులంతా నిత్యం చేసే కామెడీ చర్యలను టీవిలు 24 గంటల పాటు లైవ్‌గా చూపడంతో మా సినిమాలు చూసేవారే లేరు అని బోరుమన్నారు. టీవిల్లో 24 గంటల రాజకీయ కామెడీ నిలిపివేసి మా సినిమాలను రక్షించండి అని వేడుకున్నారు. సినిమాల్లో కామెడీ తగ్గి రాజకీయాల్లో కామెడీ పెరిగిపోవడం ఎవరికీ మంచిది కాదని కమెడీయన్లు ముఖ్యమంత్రికి చెప్పారు. మీరు నటులు రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు నాయకులమైన మేము కామెడీ ట్రాక్‌లోకి వస్తే తప్పేమిటి? అంటూ అక్కడే ఉన్న బొత్స పక పకా నవ్వారు.
ఆయనపైకి కెమెరాలు ఫోకస్ చేశారు. సూపర్ మ్యాన్ వేషంలో నారాయణ అంటూ చానల్స్ బ్రేకింగ్ న్యూస్‌లతో లైవ్ టెలికాస్ట్ మొదలు పెట్టాయి. నారాయణ వేషధారణపై టీవిల్లో చర్చలు మొదలయ్యాయి. ‘‘రైతుల సమస్యలు, పేదల సమస్యలు అంటూ నేను గంట సేపు ఉపన్యాసం చేసినా మీ చానల్‌లో నిమిషం చూపరు, పత్రికల్లో అక్షరం రాయరు. మళ్లీ ప్రజల సమస్యలను విస్మరిస్తున్న నాయకులు అంటూ మీరే చెబుతుంటారు. విషయం చెబితే ఎవరూ పట్టించుకోవడం లేదు అందుకే ఇలా వేషం వేసుకొని వచ్చాను. ఏ చానల్ తిప్పి చూసినా నా మాటలే లైవ్‌గా వస్తున్నాయి. మా పార్టీకి ఇంతకు మించి ఇంకేం కావాలి’’ అని నారాయణ తన వేష రహస్యాన్ని విప్పారు. నేను పోలీసుల కళ్లు కప్పి నాటు పడవల్లో సాహస యాత్ర చేసి ఉద్యమిస్తే మీరు ఒక్క రోజు కన్నా ఎక్కువ చెప్పలేదు. ఈ మధ్య ఎంత తీవ్రమైన కామెంట్స్ చేస్తున్నా స్క్రోలింగ్‌లకే పరిమితం చేస్తున్నారు. అందుకే ఒక్కోసారి ఒక్కో వేషం వేసి మిమ్ములను ఆశ్చర్యంలో ముంచెత్తాలనుకుంటున్నాను. మీరెవరూ ఊహించని వేషాల్లో వస్తాను. ఊహించండి చూద్దాం అని నారాయణ మీడియాకు సవాల్ విసిరి అక్కడి నుంచి మాయమయ్యారు.
***
బాబు చేతిలో పేపర్ల కట్టులు చూడగానే అక్కడ కూర్చున్న మీడియా వారికి పై ప్రాణాలు పైనే పోయాయి. ఒక టీవి చానల్ యువకుడు సార్ వచ్చే వారం నా పెళ్లి అని మెల్లగా చెప్పాడు. ఆ లోపుగానే ముగిస్తాలే అని బాబు భరోసా ఇచ్చారు. కిక్కిరిసిన విలేఖరుల సమావేశం కావడంతో కెమెరా బాబు తలకు తాకింది. ఆయన నిశే్చష్టులయ్యారు. ఒక్క నిమిషం ఏమీ మాట్లాడలేదు. వెంటనే మైకు అందుకున్నాడు. స్వర్ణాంధ్ర సాధించేంత వరకు నేను నిద్రపోను.. మిమ్ములను నిద్ర పోనివ్వను. నా పాలన చూసి ప్రపంచం విస్తుపోతోంది అని చెప్పడం మొదలు పెట్టారు. (పిఎ చెవి వద్దకు చేరి సార్ మీరిప్పుడు అధికారంలో లేరు ఇది 2012 అని గుర్తు చేశాడు.) నాకిప్పుడే అంతా గుర్తుకొచ్చింది. వైఎస్‌ఆర్ పులివెందుల ప్రాథమిక పాఠశాలలో చదివేప్పుడు పక్క కుర్రాడి బలపం ఎత్తుకెళ్లాడు. సిబిఐ ఎంక్వైయిరీ జరిపిస్తే వాస్తవాలు తెలుస్తాయి. మీడియ వాళ్లు అయోమయంగా చూశారు. ఆయన జీవితం ఎలాంటిదో చెప్పడానికే ఈ సంగతి చెప్పాను. తరువాత కర్నాటక వెళ్లి మెడికల్ కాలేజీలో చేరాడు. తెలుగు ఆత్మగౌరవాన్ని అప్పుడే తాకట్టు పెట్టాడు. సరే కొత్త సంగతులు చెప్పండి సార్ అని వెనక నుండి అసంతృప్తి వాది అరిచాడు.
ప్రపంచాన్ని నివ్వెర పరిచే విషయం ఒకటి చెప్పబోతున్నాను. స్కూల్‌లో చదువుకునేప్పుడు వైఎస్‌ఆర్ పక్కవారి పెన్సిళ్లు, బలపాలు ఎత్తుకెళ్లిన విషయం నాకు మాత్రమే తెలుసు. నేను ముఖ్యమంత్రిగా ఉంటే ఏనాటికైనా ప్రమాదం అని నల్లమల అడవులకు వెళ్లి అన్నలతో మాట్లాడి అలిపిరిలో నాపై హత్యాయత్నం చేశారు. నేషనల్ మీడియా ఉందా? దీన్ని ఇంగ్లీష్, హిందీల్లో కూడా చెబుతాను అని బాబు అనగానే ముందు తెలుగులో పూర్తి చేయండి సార్ అని అంతా చేతులు జోడించి ప్రార్థించారు. పాపం సార్ ఢిల్లీలో చక్రం తిప్పేవారు ఎలాంటి వారు ఎలా అయిపోయారు అని అభిమానులు ఆవేదన చెందారు.
***ఇలా అయితే కష్టం సార్! తెలుగు సినిమా ఇంతకు ముందెన్నడూ లేనంతటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మీరే రక్షించాలి అని తెలుగు సినిమా పెద్దలు ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశారు. వీళ్లు మాట్లాడిన తెలుగును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి అర్ధమయ్యే తెలుగులోకి సమాచార శాఖ అధికారి తర్జుమా చేసి చెప్పాడు. తప్పకుండా మీ సమస్య పరిష్కరిస్తాను అనే అర్ధం వచ్చే విధంగా సిఎం ఏదో మాట్లాడారు. ఆ తెలుగును అధికారి మళ్లీ మామూలు తెలుగులోకి అనువదించాడు. అన్ని సినిమాలు ప్లాపవుతున్నాయి. అంతో ఇంతో కామెడీ సినిమాలు నడిచేవి. కానీ మీ నాయకులంతా నిత్యం చేసే కామెడీ చర్యలను టీవిలు 24 గంటల పాటు లైవ్‌గా చూపడంతో మా సినిమాలు చూసేవారే లేరు అని బోరుమన్నారు. టీవిల్లో 24 గంటల రాజకీయ కామెడీ నిలిపివేసి మా సినిమాలను రక్షించండి అని వేడుకున్నారు. సినిమాల్లో కామెడీ తగ్గి రాజకీయాల్లో కామెడీ పెరిగిపోవడం ఎవరికీ మంచిది కాదని కమెడీయన్లు ముఖ్యమంత్రికి చెప్పారు. మీరు నటులు రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు నాయకులమైన మేము కామెడీ ట్రాక్‌లోకి వస్తే తప్పేమిటి? అంటూ అక్కడే ఉన్న బొత్స పక పకా నవ్వారు.
Hilarious! నవ్వు ఆపుకోలేక పోయాను అంటే నమ్మండి!
రిప్లయితొలగించండిexcellent...
రిప్లయితొలగించండిఅదరహో! అదరహా!!!
రిప్లయితొలగించండిVery nice!
రిప్లయితొలగించండిLOL
రిప్లయితొలగించండి