రాజేశ్ అంటూ రెండు చేతులు పైకెత్తి కెవ్వున కేక పెట్టిందావిడ. నన్ను వంటరి దాన్ని చేసి వెళ్లి పోయావా? రాజేశ్... గట్టిగా ఏడవ సాగింది. తెర రెండు ముక్కలైంది. కృష్ణ కళ్లలో నీళ్లు నిండాయి. శూన్యంలోకి చూస్తూ తనలో తానే మాట్లాడుకోసాగాడు.
అది చూసి అనుపమ గట్టిగా నవ్వింది పిచ్చి కృష్ణ ఎందుకేడుస్తున్నావు. రాజేశ్ చనిపోగానే షాక్ తిన్నావు కదూ ఏం మాట్లాడాలో తెలియడం లేదు కదూ! ఇనుప రేకులు సీరియల్ నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు ప్రారంభమైంది. మా అమ్మ ఈ సీరియల్ ఫ్యాన్, ఆ తరువాత నేను ఫ్యాన్ నయ్యాను. ఇప్పుడు నువ్వు కూడా.. అయినా అంతగా ఏడవాల్సిన అవసరం లేదు రాజేశ్ ఈ సీరియల్ తమిళ్‌వెర్షన్ రాత్రే చూశాను డైలాగులు అర్ధం కావు కానీ విషయం అర్ధమైంది నిజానికి రాజేశ్ చనిపోడు. రాజేశ్ చనిపోయాడని గంగ కల కంటుంది. నిద్ర నుంచి లేచి గట్టిగా ఏడుస్తుంది. ఇప్పుడు నువ్వు చూసింది గంగ కల మాత్రమే. రెండు వారాల వరకు ఈ సస్పెన్స్ కొనసాగించి ఇది కల అని రెండు వారాల తరువాత చూపిస్తారు. తమిళ సీరియల్స్ మన కన్నా రెండు ఎపిసోడ్లు ముందున్నాయి అని అనుపమ చెప్పుకుపోతూనే ఉంది.
నువ్వేం చెబుతున్నావో నాకస్సలు అర్ధం కాలేదు అని కృష్ణ అయోమయంగా చూసాడు. అత్తా మామల దొంగాట సీరియల్‌లో గోపిలానే ఎంత అమాయకంగా ముఖం పెట్టావు కృష్ణ నాకు తెలియదనుకున్నావా? ఇనుప రేకులు సీరియల్‌లో రాజేశ్ చనిపోయాడనే కదా నీకు కళ్లల్లో నీళ్లు వచ్చాయి అని అనుపమ అడిగింది. ఇవి కన్నీళ్లు కావు అనుపమ ఆనంద భాష్పాలు న్యూస్ చానల్‌లో ఆ వార్తను చూసినప్పటి నుంచి నాకు కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి, అనందంతో మనసు గెంతులేస్తోంది. అందుకే ఇలా పిచ్చిపిచ్చిగా కనిపిస్తున్నాను అంతే కానీ అదేదో పిచ్చి సీరియల్‌లో పిచ్చోడెవడో చచ్చిపోయాడని పిచ్చిదెవరో ఏడిచినందుకు నేనేడవడం లేదు అని కృష్ణ చెప్పాడు.
మీకు కన్నీళ్లు తెప్పించిన ఆ వార్త ఏమిటో? అని అనుపమ వెటకారంగా అడిగింది. అమ్మ చెబితే చేస్తాను. ఈ కాలంలో ఈ మాట ఒక యువకుడి నోటి నుండి రావడం ఊహింగలవా? అనుపమా? అందులోనూ 42 ఏళ్ల సీనియర్ యువకుడు. పదేళ్ల పిల్లలకు మనం పని చెబితే మాట వినకుండా తుర్రు మంటున్నారు. అలాంటిది నెహ్రూ కుటుంబానికి చెందిన గాంధీ పేరు తగిలించుకునే ఆ కుటుబం వారసుడు ఈ వయసులో కూడా తల్లి చాటు బిడ్డలా అమ్మ చెబితే వింటాను అనగానే నా మనసు పులకించి పోయింది, నా కళ్లు ఆనంద భాష్పాలు రాల్చాయి. అప్పుడెప్పుడో ప్రధానమంత్రి సింగు గారు బాబు నా ఒక్కడి వల్ల కావడం లేదు, కాస్త పాలనా పగ్గాలు చేతపట్టి సహకరించు అని కోరితే ఇంత కాలానికి ఆ దరఖాస్తు పరిశీలించి మా అమ్మ చెబితే వింటాను అంకుల్ అని యువరాజు ప్రకటించాడు.
ఆస్తి కోసం తల్లిదండ్రులు ఎప్పుడు పోతారా? అని ఎదురు చూసే పిల్లలు, మామను పక్కుకు తప్పించి అధికారం చేపట్టే అల్లుళ్లు ఉన్న ఈ కాలంలో రా రమ్మని పిలిస్తే అమ్మ చెబితే వింటాను అనే కొడుకు ఉంటాడా?
రాష్ట్రం కోసం నేను ఒకే కొడుకును కన్నాను అని అప్పుడెప్పుడో చంద్రబాబు గారు చెప్పినప్పుడు రాష్ట్రం కోసం జీవితాలను త్యాగం చేసే మహానాయకులు పుట్టిన పుణ్యభూమిలో నేను పుట్టాను అని ఇదే విధంగా కన్నీళ్లు కార్చాను. 56ఏళ్ల వయసులో హీరో పాత్రను కొడుక్కు త్యాగం చేసి ప్రజలకు సేవ చేయాలని చిరంజీవి నిర్ణయించుకున్నప్పుడు ఆయన త్యాగ నిరతికి ఇదే విధంగా కళ్లల్లో నీళ్లు వచ్చాయి. ఇంత కాలానికి మళ్లీ కన్నీళ్లు తెప్పించాడు రాహుల్ బాబు. అమ్మ చెబితే వింటాను ఎంత తీయని మాట. ఎంత కాలానికి విన్నానీ మాట. అప్పుడెప్పుడో ఎన్టీరామారావు సినిమాల్లో నటించే కొత్తలో అమ్మాయిలు పెళ్లి చూపుల్లో అమ్మా నాన్న ఎలా చెబితే అలా వింటాను అనేవాళ్లు. ఇప్పుడు వాళ్లే సంబంధాలు చూసుకుని మీరు ఒకే అంటే సరే లేదంటే నేనే ఒకే అంటా అనేస్తున్నారు.
వంద కోట్లు దాటిన భారతీయుల బరువు బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్ బాబు అమ్మ చెబితే వింటాను అంటున్నారు. అందుకే నా కళ్లు చెమ్మగిల్లాయి అని కృష్ణ చెప్పుకుపోతుంటే అనుపమ కూడా కన్నీళ్లు ఆపుకోలేక పోయింది.
మీరు ఇనుప రేకులు సీరియల్ హీరో చనిపోయాడని ఏడుస్తున్నారను కున్నాను కానీ మీ కన్నీళ్ల వెనుకు ఇంత చరిత్ర ఉందని ఊహించలేకపోయానండి. పిజ్జా తినవద్దే అని చిలక్కు చెప్పినట్టు చెబితే చిన్నది అమ్మ చెబితే వినాలా? అంటూ కావాలని పెద్ద దాన్ని కూడా తీసుకొని పిజ్జా కార్నర్‌కు వెళ్లిందండి. పిజ్జాల కోసమే తల్లిదండ్రుల మాటను ఖాతరు చేయని పిల్లలున్న ఈ రోజుల్లో ఇంత పెద్ద దేశాన్ని పాలించే బాధ్యతను కూడా అప్ప చెబితే వింటాను అనడం చూస్తుంటే ఆ బాబు త్యాగంతో దేశం పులకించి పోయి తీరుతుందండి. రాహుల్ బాబే కాదు ఆయన మనవడు కూడా ఇంకో వందేళ్ల తరువాత కూడా ఆ వంశం వాళ్లే ఈ దేశాన్ని పాలించాలి. ఇదే నా శాపం.. సారీ నా దీవెన...
అప్పుడెప్పుడో భీష్ముడు ఇచ్చిన మాట కోసం పెళ్లి చేసుకోకుండా ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోయారు. తన కుటుంబం కోసం ఆయన బ్రహ్మ చారిగా ఉంటే ఆయన్ని కీర్తిస్తున్నారు కానీ రాహుల్ బాబు దేశాలు, ఖండాలను దాటి ఎంతో నల్లపిల్లను, ఆఫ్రికా పిల్లను కూడా గాఢంగా ప్రేమించి దేశాన్ని పాలించాల్సిన బాధ్యతను భుజస్కంధాలపైకి ఎత్తుకోవడానికి చివరకు పెళ్లి కూడా చేసుకోలేదు. మన దేశానికి కావలసింది ఇలాంటి త్యాగ పురుషులే అంటూ అనుపమ కళ్లు తుడుచుకుంది.
రాహుల్ బాబు అమ్మ ప్రేమ చూసి మీకూ కళ్ళు చెమ్మ గిల్లాయా ?

Hilarious!!! Great job on this one!!!
రిప్లయితొలగించండిఅబ్బ! నా దేశంలో తల్లి మాట జవదాటని కొడుకుని చూసి మది పులకించిపోయింది చూడండి.
రిప్లయితొలగించండిభజన చేసే విధము తెలియండీ! జనులార మీరూ...
ఇంకో వందేళ్ల తరువాత కూడా ఆ వంశం వాళ్లే ఈ దేశాన్ని పాలించాలి. ఇదే నా శాపం.. సారీ నా దీవెన... e sepadeevena bagundi murali sir
రిప్లయితొలగించండిచెమ్మగిల్లకుండా ఉండనిస్తారా మురళీజీ మీరు. గిల్లాయి.:))
రిప్లయితొలగించండిచాలా బాగుంది..
రిప్లయితొలగించండివ్యంగ్యానికి..హాస్యపు తాలింపు..
బాగుందండి..
@శ్రీ