వరం కోరుకోవడం కూడా ఓ కళ. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడే పిల్లలు కేరు మంటూ ఏడిచి వరం సాధించుకుంటారు. వరం ఎప్పుడు కోరాలో పిల్లరాక్షసులకు తెలిసినంతగా పెద్ద రాక్షసులకు, నాయకులకు కూడా తెలియదనిపిస్తుంది.
ఓ గడసరి నేరజాణ తనను బంగారంలో ముంచెత్తమని కోరుతూ పాట పాడుతుంది. ముద్దటుంగరం అమ్మి ముక్కుకు ముక్కెర, నాణ్యమైన ధాన్యం అమ్మి నడుముకు వడ్డాణం, కాడియెద్దులు అమ్మి కాళ్లకు కడియాలు తెమ్మంటుంది. చివరకు పట్టెమంచం పరుపూ లేక మనసు చిన్నబోయింది పంట భూములమ్మి పట్టె మంచం తెమ్మంటుంది. కాస్త స్వరం పెంచి అంతే నాకు చాలు తమలపాకు తొడిమే పదివేలు నేనేదిక కోరేదిక లేదు అంటుంది. చూసే వారికేమో పాపం తమలపాకు తొడిమె ఇచ్చినా అదే పదివేలనుకుంటుంది అమాయకురాలు, పైగా అందరి వలే అలిగే దాన్ని కాదు కొసిరే దాన్ని కాదని చెబుతుంది అనిపిస్తుంది.
కోరికలు కోరేప్పుడు స్వరం తగ్గించి తమలపాకు తోడిమే పదివేలు అన్నప్పుడు స్వరం పెంచుతూ లౌక్యం చూపుతుంది. ఇప్పుడు మన నాయకులు కూడా ఇలానే తమలపాకు తొడిమే పదివేలు అంటూ కుర్చీ ఇస్తే అవన్నీ సమకూర్చేసుకుంటామని రోడ్డున పడ్డారు. కానీ ఆ జాణ లౌక్యంగా అడిగితే, మన నాయకులు మాత్రం కోరికను ఎక్కడా దాచుకోలేక పదవి లేకుండా ఉండలేమని చెబుతున్నారు.
ఆమె కోరికలు కోరుతున్న తీరు పాట కాదు పాఠం. ఏళ్ల తరబడి తపస్సులు చేసి గడ్డాలు పెంచి నీరసించే రుషులకు సైతం వరాలు ఎలా కోరాలో తెలియదు. నేతలకు అసలే తెలియదు.
మహాభారత యుద్ధంలో ధర్మరాజు హఠాత్తుగా కౌరవుల వైపు వెళ్లి భీష్ముడికి పాదాభివందనం చేస్తారు. శత్రువు కాళ్లు మొక్కాడు .. ఛీ..్ఛ... అని ఆది చూసిన వారికి అనిపించవచ్చు. సొంత వాళ్లు ఎన్ని పొగిడినా ఇవ్వని కిక్కు శత్రువు గౌరవించినప్పుడు వస్తుంది. ఆ విషయం ధర్మరాజుకు బాగా తెలుసు. ప్రసన్నుడై ఏం కావాలో కోరుకో అంటే నువ్వు ఎలా చస్తావో చెప్పి పుణ్యం కట్టుకో అని ధర్మరాజు కోరతాడు. అష్టాదశ పురాణాల్లో ఇంతటి చతురతతో వరం కోరిన వారు మరొకరు కనిపించరు. ధర్మరాజు కాళ్లు మొక్కినట్టే కనిపిస్తుంది కానీ కోరిక మాత్రం పీక నులిమేది. పాపం ఇలాంటి తెలివి తేటలు లేకపోవడం, ఏం వరం కోరాలో, ఎలా కోరాలో తెలియకనే మహా మహా రాక్షసులు సైతం బోల్తాపడ్డారు. ఒక ఐడి యా జీవితానే్న మార్చేస్తుందన్నట్టు.. సాస్టాంగ ప్రమాణం ఎలా చేయాలో చూపించమని అడిగి ఎస్‌విఆర్ తల నరికేసి దేవిని ప్రసన్నం చేసుకుని ఎన్టీఆర్ వరం కోరుకోవడం పాతాళాబైరవిలో మనం చూశాం కదా?
ఘోరమైన తపస్సు చేసి చివరకు శివుడిని భస్మాసురుడు కోరిన వరం అతనే్న బూడిదగా మార్చింది కదా? భస్మాసురుడి భాషలో వీకో, అతని భావం వరమిచ్చే దేవునికి అర్ధం కాలేదో కానీ నేను ఎవరితలపై చేతులు పెట్టినా వాళ్లు బూడిద కావాలనే వరం కోరుకోవాలనుకున్నాడు. స్పష్టంగా చెప్పక పోవడం వల్ల చివరకు తన తలపై చేయి పెట్టుకుని తానే భస్మం అయ్యాడు. ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారన్నట్టు తన చావు కోసం తానే తపస్సు చేసినట్టు అయింది. తల్లిచేతిలోనే చనిపోయే వరం నరకాసురుడి సొంతం. కొడుకు వల్ల మరణించే వరం హిరణ్యకశిపుడిది. శివుడు రాక్షసులకు ఇచ్చిన వరాలన్నీ ఇలాంటివే కదా? నా కడుపులో దూరిపొమ్మని గజాసురుడు అడిగితే చివరకా వరం గజాసురుని కడుపు చీల్చడానికి ఉపయోగపడింది. పాపం వాళ్ల ప్రాణాలు వాళ్లు తీసుకోవడానికి వరం కోరుకోవడం ఎందుకో?
పత్రికలకు పాఠకులే దేవుళ్లు, రాజకీయ నాయకులకు ఓటర్లే దేవుళ్లు. దేవుళ్లలో అందరి కన్నా సులభంగా వరం ప్రసాదించేది పరమ శివుడంటారు. సరే ఈయన వరమిచ్చినా మిగిలిన దేవుళ్లు వెన్నుపోటు ద్వారా ఆ వరాన్ని శాపంగా మార్చేస్తుంటారు. దేవుళ్లలో శివుడు భోళా అయితే ప్రజాస్వామ్యంలో ఓటరు చాలూ.. ఓటరు దేవుళ్లను మెప్పించి వరం కోరుకోవడం అన్నింటి కన్నా కష్టమైన పని. ఓటరు దేవుళ్లు ఎవరికి ఎప్పుడు వరమిస్తారో, ఎప్పుడు ఎందుకు శిక్షిస్తారో మాకు బాగా తెలుసు అని నాయకులు అనుకుంటారు కానీ అది నిజం కాదు.
ఏ నాయకుడు ఏం చేసినా ఓటరు దేవున్ని మెప్పించి కుర్చీని వరంగా పొందాలనే కదా? నాకు కుర్చీపై అస్సలు వ్యామోహం లేదని ఏ నాయకున్ని కదిపినా చెబుతుంటారు. వారి ఫ్యామిలీ డాక్టర్‌ను అడిగితే చెబుతారో లేదో కానీ వారి ఎక్స్‌రేను పరిశీలిస్తే, అందరి హృదయం లవ్ షేప్‌లో ఉంటే వీరిది మాత్రం కుర్చీ ఆకారంలో ఉందని అనుమానం.
పప్పన్నం ఎప్పుడు పెట్టిస్తావు అని అమ్మలక్కలాంతా అడిగే వయసు కూడా దాటిపోయినప్పటికీ సోనియమ్మ మాత్రం తన కుమారుడిని దేశానికి త్యాగం చేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టారు. వచ్చే ఎన్నికలు యువరాజా వారి నాయకత్వంలోనే జరుగుతాయి. ఫేస్‌బుక్‌లో, సోషల్ సైట్స్‌లో అతని పరిస్థితి ఘోరంగా ఉన్నా, దేశంలోని జనం ఫేస్‌లోకి చూస్తే మాత్రం మిగిలిన వారి కన్నా ఈ ముదురు బ్రహ్మచారికే అవకాశాలు ఎక్కువున్నట్టు అనిపిస్తోంది.నా కాళ్లు బొబ్బలెక్కుతున్నాయి, అలసిపోయాను, జ్వరం వచ్చింది నీరసంగా ఉంది అయినా నడుస్తున్నాను అని నాయకుడు చెబితే కుర్చీ కోసం ఎంత తంటాలు పడుతున్నాడో అనిపిస్తుంది కదా! తమలపాకు తొడిమే పదివేలు అన్నంత లౌక్యంగా కోరిక కోరాలి. పంట భూములమ్మయినా పట్టె మంచం కొనుక్కురమ్మంటున్న ఆ జాణ కోరికను భర్త తీర్చాడా? నేతల కోరిక ఓటరు దేవుడు తీరుస్తాడా? చూద్దాం.

Super sir
రిప్లయితొలగించండిపాపం ఓటరు దేవుడూ.. ఎంత కష్టం వచ్చిపడింది :(
రిప్లయితొలగించండిపాదయాత్రలతో..త్యాగాలు చేస్తున్న ఎవరికీ పట్టం కట్టగలరు?
ఆహా జ్ఞానోదయం చేసారు :))
రిప్లయితొలగించండి