కహానీ.4
======
‘ఈ భాషలెవడు కనిపెట్టాడ్రా బాబూ!’ అంటూ శత్రువు సినిమాలో కోట శ్రీనివాస్‌లాగే -వినోద్ డైలాగ్ కొట్టగానే రూమ్‌లోని ఫ్రెండ్సంతా గొల్లున నవ్వుకున్నారు. వాళ్ల కంబైండ్ స్టడీలో ఇలాంటి జోకులే ఎక్కువగా పేల్తుంటాయ్. ‘ఇవే కనుక లేకపోయి ఉంటే జీవితం ఎంతహాయిగా ఉండేదో? మాతృభాష, ఫస్ట్ లాంగ్వెజ్, సెకండ్ లాంగ్వేజ్ ఇవి చాలవన్నట్టు ఏదోక విదేశీ భాష నేర్చుకోమని ఇంట్లో పోరు. వీటికితోడు అమ్మాయిల్ని ఆకట్టుకునే ‘భాష’ మనం సొంతంగా నేర్చుకోవాలి’ అని అశోక్ అనేసరికి అంతా చప్పట్లు కొట్టారు. భాషలు నేర్చుకోవడంతోనే జీవితం సరిపోతుంది -అని అంతా బాధపడ్డారు. కొద్దిసేపటికి వారి చర్చ పక్కింటి పైకి మళ్లీంది. ఏరా వినోద్ ఈమధ్య ప్రతి రోజూ ఒకే సమయానికి మీ పక్కింటికో ఆంటీ వస్తోంది. ఏంటీ కథా? అంటూ చిలిపిగా నవ్వాడు ప్రకాశ్. ‘నాకూ అదే అర్ధం కాలేదురా! పక్కింట్లోకి కొత్తగా వృద్ధ జంట దిగింది. అయినా, వాళ్లిద్దరూ వృద్ధుల్లా ఉండరు. మనకంటే ఎక్కువ ఉత్సాహంగానే ఉంటున్నారు. ఈసారి పలకరించి, విషయమేంటో తెలుసుకోవాలి’ అని వినోద్ బదులిచ్చాడు.
***
‘నమస్కారం అంకుల్’ -దారిలో ఎదురుపడిన పక్కింటి వ్యక్తిని పలకరించాడు వినోద్. రేబాన్ అనుకుంటా అని మనసులోనే నవ్వుకున్నాడు కంటి అద్దాలను చూసి. వినోద్ పరిచయంతో ఆ వ్యక్తి ఇంట్లోకి ఆహ్వానించాడు. కొద్ది సేపటికే ఒకమ్మాయి వచ్చింది. ‘్ఫరవాలేదు కూర్చో’ అని వినోద్‌కు చెప్పి, ఆ వృద్ధుడు మాత్రం ఆమె ముందు విద్యార్థిగా మారిపోయాడు. అర్థంగాకుండా అయోమయంగా ఆమె చేతిలోని బుక్‌వైపు చూస్తున్న వినోద్‌తో అంది.. ‘ఇది బ్రెయిలీ లిపి పుస్తకం’ అని.
***
వృద్ధునికి ఆమె బ్రెయిలీ లిపి నేర్పించడానికి రోజూ వస్తొంది. విషయం అర్థమయ్యాక అయోమయం మరింత పెరిగింది వినోద్‌లో. ఈ వయసులో? అంటూ మనసులోని ప్రశ్నార్థకాన్ని అప్పుడే అక్కడకు వచ్చిన వృద్ధుడి భార్యముందు అనేశాడు. దానికి ఆమె -అంకుల్‌కి ఏడుపదులు దాటి చాలా కాలమైంది. ఆయనకు చాలా భాషలు వచ్చు. ఇప్పుడు క్రేజీగా చెప్పుకుంటున్న ఐఐటి చదువులు ఆయన ఎప్పుడో చదివాడు. పెద్ద కంపెనీలో పెద్ద హోదాలోనే పని చేసి రిటైరయ్యారు. ఈ వయసులో హఠాత్తుగా కళ్లుపోయాయి. వినికిడి శక్తి మాత్రం ఉంది’ అని చెప్పుకొచ్చింది. అతని గురించి తెలిశాక వినోద్ ఆశ్చర్యంగా ‘ఈ వయసులో బ్రెయిలీ నేర్చుకుని ఏం చేస్తారు’ అడిగాడు. చిన్నప్పటి నుంచి చదవడం ఆయనకు ఇష్టమైన పని. హఠాత్తుగా కళ్లుపోయాయి. బ్రెయిలీ లిపిలో మంచి ఆత్మకథలు ఉన్నాయట. వాటిని చదువేందుకు ఇప్పుడు బ్రెయిలీ నేర్చుకుంటున్నారు’ అంటూ ఆమె చెప్పుకునిపోతుంటే -వినోద్‌కు మనసులోనే అనిపించింది. 20ఏళ్ల వయసులో ఏదైనా కొత్త భాష నేర్చుకోవడం కష్టమైన పని అనుకునే నేను వృద్ధుడినా? ఏడు పదుల వయసులో కళ్లుపోయినా ఆత్మకథలు చదివేందుకు బ్రెయిలీ నేర్చుకోవడానికి ఉద్యుక్తుడైన అంకుల్ వృద్ధుడా? అని తనను తానే ప్రశ్నించుకున్నాడు. తాను చదవాల్సినవి చాలా ఉన్నాయి. ‘భగవంతుడా.. నాకు కళ్లిచ్చావు చాలు. వీటిని సార్థకం చేసుకుంటాను’ అని మనసులోనే అనుకుని ఇంటిముఖం పట్టాడు.
*

(ఇది నిజంగానే ఉన్న వ్యక్తి కథ .. 72 ఏళ్ళ వయసులో చదువు పై ఆసక్తితో బ్రెయిలీ లిపి నేర్చుకుంటున్నారు .).
కళ్ళున్నందుకు ఆనందిద్దాం, ఇప్పుడే చదివేద్దాం చదవవలసిన మంచి పుస్తాకాలు ఏమంటారూ?
రిప్లయితొలగించండిkastephale గారు మంచి మాట చెప్పారు .. ఆ వ్యక్తి గురించి తెలిశాక నేను అనుకున్న తోలి మాట ఇదే . రెండోమాట అతని గురించి పిల్లలకు చెప్పాలని
రిప్లయితొలగించండిnice story
రిప్లయితొలగించండి