ఛీ..ఛీ... మరీ ఇంత అధ్వాన్నమా?
ఏమైందేమిటి? అంతగా ఇదై పోతున్నావు
దేశం చెడిపోయింది
అదెప్పుడో జరిగిపోయింది
మరీ ఇంతగా చెడిపోతుందని అనుకోలేదు.
నిజానికి మహాత్మాగాంధీ ఉండాల్సింది మా కాలంలో కాదు ఈ కాలంలో ఉంటే బాగుండేది. నాయకుల్లో మార్పు తీసుకు వచ్చేవాడు.
నీది మరీ అత్యాశ. మహాత్ముడు ఈ రోజుల్లో ఉంటే ఏం చేసేవారో నేను చెప్పాలా?
చెప్పు
రోజుకో మాట మార్చే విలువలు లేని ఈ నాయకులను అసహ్యించుకునే వాడు. నాటకాల రాయుళ్లను మించి నటిస్తున్న వీరిని చూసి ఆగ్రహంతో ఊగిపోయేవారు. జైలులో ఊచలు లెక్కించాల్సిన వారు తమకు వచ్చే సీట్లు ఓట్లు లెక్కిస్తూ కోట్లు స్వాహా చేసిన మన నాయకులను చూసి, అహింను పక్కన పారేసి గన్ను చేతిలో పట్టుకుని నీతి తప్పిన నేతలను తూటాలకు బలి చేసేవాడు.
ఏంటీ మహాత్మాగాంధీ చేతికి కూడా గన్ను ఇచ్చేస్తున్నావు.. నీ ఆలోచన నాకు నచ్చలేదు..
నేను గాంధీని హింసావాదిగా మార్చడం లేదు, నాయకులపై గాంధీకి ఎంత కోపం ఉండేదో చెబుతున్నాను.
అయినా మీ పిచ్చికాకపోతే ఏ కాలానికి తగిన నాయకులు ఆ కాలంలో ఉంటారు కానీ ఇప్పుడు మహాత్ముడు ఉంటే ఏం జరిగేదో ఆలోచిస్తే ఎలా?
అది సరే కానీ వైఎస్‌ఆర్ ఉండి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదని వాళ్ల అమ్మాయి చెబుతున్నది కదా?
ఆయన ఉండి ఉంటే జగన్‌కు బదులు వైఎస్‌ఆరే ముందు జైలులో ఉండేవారని బాబు బదులిచ్చారు కదా కదా?
ఆ సంగతి వదిలేయ్ నేను చెబుతున్నది విభజన గురించి...
అలాగా నిజంగా వైఎస్‌ఆర్ ఉండి ఉంటే రాష్ట్ర విభజన ఎలాంటి అడ్డంకులు లేకుండా జరిగిపోయేదని నేనంటాను.
హై కమాండ్ తెలంగాణ ఇవ్వాలనుకుంటోంది.. 2009 వరకు మనం బలంగా ఉంటాం అప్పటి వరకు నిర్ణయాన్ని ఆపగలం. 2014లో మన బలం క్షీణిస్తుంది అప్పుడు తెలంగాణను ఆపలేం అని వైఎస్‌ఆరే అంతర్గత సమావేశంలో అన్నట్టు ప్రచారంలో ఉంది కదా?
అందుకే పోలవరం పూర్తి చేయడానికి, హైదరాబాద్‌పై పేచీ పెట్టేందుకు హెచ్‌ఎండిఏ పరిధి పెంచారు.
సర్లే వైఎస్‌ఆర్ సంగతి వదిలేయ్ ఇందిరాగాంధీ ఉండి ఉంటే విభజన జరిగేదే కాదంటాను.. నువ్వేమంటావు.
ఇందిరాగాంధీ ఉండి ఉంటే .. కిరణ్ లాంటి అంగుష్ఠ మాత్రులు మాట్లాడగలిగే వారా ? ఆమె ఏం చేయాలనుకుంటే అది చేసేవారు .. అవసరం అయితే అత్యవసర పరిస్థితి విధించే వారు .. ఒక్క mla మద్దతు కూడా లేని వాళ్ళు స్వరం పెంచాగాలుగుతున్నారంటే .. ఇందిరాగాంధీ లేక పోవడం వల్లే ...
ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచి ఉండక పోతే బాబు సిఎం అయ్యేవారు కాదు... లక్ష్మీపార్వతి ముఖ్యమంత్రిగా, ఎన్టీఆర్ ప్రధానమంత్రిగా ఉండేవారు అప్పుడు విభజనే జరిగేది కాదంటాను. మా నాయన సమైక్యవాది ఆయనే ఉండి ఉంటే ఇలా జరిగేదే కాదని హరికృష్ణ కూడా చెబుతున్నాడు కదా?
ఈ ఆలోచన వెన్నుపోటుకు సహకరించినప్పుడు ఉండాలి.
ఆరు నెలలపాటు అధికారం అప్పగిస్తే బాబు సమస్యలు పరిష్కరిస్తానని అంటున్నారు కదా ?
అంటే తొమ్మిదేళ్ళ పాటు అధికారం అప్పగించిన పాపానికి సమస్యలు సృష్టించి ప్రజల మీద కక్ష తీ ర్చుకున్నాడా ?
పోనీ చంద్రబాబు ప్రధానమంత్రి పదవిని త్యాగం చేయకుండా ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా?
అది త్యాగం కాదు ముందు చూపు.. ప్రధానమంత్రి పదవి చేపట్టిన ఏడాదికే ఆయన దేవేగౌడలా మాజీగా మిగిలిపోయేవారు కనీసం ఇప్పుడు ప్రతిపక్ష నాయకునిగానైనా ఉన్నారు.
పోనీ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు బాబు మద్దతు ఇచ్చి ఉంటే ప్రభుత్వం పడిపోయేది, విభజనే ఉండేది కాదు కదా?
అలా అయితే ప్రభుత్వం పడిపోయాక ... రాష్టప్రతి పాలన విధించి కేంద్రం తన ఇష్టానుసారం విభజన జరిపి ఉండేది కదా?
సర్లే మన మధ్య విభజన గొడవ ఎందుకు కానీ రాజకీయాలు పక్కన పెట్టి మాట్లాడుకుందాం.
సరే
ఒకవేళ గిరీశం ఇప్పుడు బతికుంటే ఏమనుకునేవాడు
రాజకీయ నాయకులందరి ముఖాల్లో తన రూపాన్ని చూసుకుని మురిసిపోయేవాడు.
మరి మధురవాణి ఉండి ఉంటే
సిగ్గుతో ముడుచుకుపోయి ఉండేది
ఎందుకు?
ఈ సమాజానికి ఏదో చేయాలనే తపన పడే తనపై కొందరు కక్ష కట్టి కేసుల్లో ఇరికించారు అంటూ టీవిల ముందు సహజ నటనతో అదరగొట్టే తారా చౌదరిలను చూశాక మధురవాణి సిగ్గుపడకుండా ఉండడం సాధ్యమా?
మరి గురజాడ అప్పారావు ఉండి ఉంటే
ఎక్కడో ఒక గిరీశం ఉంటే ఆ పాత్రతో నాటకం రాశాడు అడుగడుగున గిరీశాలు, లుబ్దావదాన్లు ఉంటే ఇక కన్యాశుల్కం నాటకం రాయడం ఎందుకు అనుకునేవారు. అంటే నేనేం మాట్లాడినా దాన్ని ఖండించాలనే ధృడమైన నిర్ణయంతోనే వచ్చావా?
లేదు...
అంటే దీన్ని కూడా అంగీకరించవా?
అంగీకరించను.
సరే ఇంతకూ తెలంగాణ వస్తుందంటావా? రాదంటావా?
నువ్వు వస్తుందంటే నేను రాదంటాను
నువ్వు రాదంటే వస్తుందని అంటాను
జంజీర్ ఎందుకు బాగా లేదు
జంజీర్‌లో తిరిగి అమితాబ్ నటించినా అట్టర్ ఫ్లాప్ అయ్యేది.
ఆ నాయకులు ఇప్పుడుండి ఉంటే ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలానే ఆ నాటి గొప్ప సినిమాలను మళ్లీ తీస్తే ఎలా ఉంటుంది అంటే ఇదిగో ఇలానే ఉంటుంది.
నేను పిచ్చివాడిలా కనిపిస్తున్నానా?
సరే అన్నింటిని వ్యతిరేకిస్తున్నానని అంటున్నావు కదా... ఈ ఒక్క మాటతో ఏకీభవిస్తున్నాను.

ఇలా ఆసక్తికరంగా రాయటం మీకే చెల్లింది మురళిగారూ!
రిప్లయితొలగించండిఇది కూడా బాగుంది సార్.
రిప్లయితొలగించండిమదరాసు మనదే ఉద్యమం పాక్షికంగా అయినా సఫలం అయిఉంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడేదే కాదు.
రిప్లయితొలగించండిఎన్టీఆర్ భవనం వెంకటరాం గారిని రాజ్యసభ సభ్యత్వం, అడిగినప్పుడు ఇందిరా గాంధీ ఒప్పుకుంటే తెదేపా వచ్చేది కాదు. చంద్రబాబు, వైఎస్ఆర్ లాంటి వారు ఎదిగే వారు కాదు.
Alternate history scenario building is an entertaining timepass but a meaningless exercize.