ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో పలువురు ఉన్నతాధికారులు బయట ఫైళ్లు పట్టుకుని వేచి చూస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో హాలు కిక్కిరిసి ఉంది. అక్కడున్న అన్ని గదుల్లోనూ రాజకీయ దురంధరులు, ఉన్నతాధికారులు కొలువై ఉన్నారు. రాష్ట్ర విభజన ముగింపు దశకు చేరుకున్న సమయంలో ఇక్కడ ఏదో కీలక పరిణామం చోటు చేసుకోనుందని సుబ్రమణ్యంకు అర్ధమైంది. ఇంతటి కీలక సమయంలో సైతం చిన్ననాటి మిత్రున్ని గుర్తు పెట్టుకుని తనతో మాట్లాడేందుకు ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ ఇవ్వడంతో సుబ్రమణ్యం ఉబ్బితబ్బయ్యాడు. ముందుగానే సమాచారం ఉండడంతో అక్కడున్న అధికారి ఒకరు సుబ్రమణ్యంను లోనికి తీసుకు వెళ్లాడు.
గదిలో ఇంకెవరైనా ఉన్నారా? అని సుబ్రమణ్యం ఉండబట్టలేక అడిగాడు. లేదు సాధారణంగా ఇలాంటి సందర్భంలో ముఖ్యమంత్రి ఎవరినీ లోనికి అనుమతించరు. ఐదారు గంటల పాటు ఒక్కరే ఉంటారు. మీరు చిన్ననాటి స్నేహితులు కావడం వల్ల మిమ్ములను ఈ సమయంలో కలుసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇలాంటి సమయంలో వెళ్లిన వారు నాకు తెలిసినంత వరకు మీరే మొదటి వారు అని వినయంగా చెప్పాడు. ఐదారు గంటలు ఒంటిరిగా ఏం చేస్తారు అని సుబ్రమణ్యం కుతూహలంగా అడిగితే ఆ అధికారి తెలియదు అన్నట్టుగా తల అటూ ఇటూ ఊపి తెలుసు అన్నట్టుగా ముసిముసి నవ్వులు నవ్వుతూ వెళ్లిపోయాడు.
***
సుబ్రమణ్యంను పలకరించి, టీవిలో క్రికెట్ చూస్తూనే ముఖ్యమంత్రి మాటలు మొదలు పెట్టారు. దాయాదుల మధ్య పోరు కాబట్టి ఆట రసవత్తరంగా ఉంది. ముఖ్యమంత్రికి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ప్రాణం. తుఫాను వచ్చినా, భూ కంపం వచ్చినా క్రికెట్ అడందే రోజు గడిచేది కాదు. ముఖ్యమంత్రి వైనా క్రికెట్‌పై ఆభిమానం పోలేదన్నమాట అని సుబ్రమణ్యం మాటలు కలిపాడు. సుబ్రమణ్యంకు క్రికెట్‌పై కొద్దిగా అవగాహన ఉంది కానీ ఆసక్తి, పరిజ్ఞానం తక్కువే.
మాట్లాడుకుంటూనే ఇద్దరూ టీవిలో క్రికెట్ చూడడంలో మునిగిపోయారు. ఆట రసపట్టులో ఉంది. ముఖ్యమంత్రి సిక్స్... సిక్స్ అని గట్టిగా అరిచాడు. ఆ వెంటనే చిత్రంగా ప్లేయర్ సిక్స్ కొట్టాడు. సుబ్రమణ్యం చప్పట్లతో అభినందించాడు.

కొద్దిసేపటికి ముఖ్యమంత్రి ఫోర్ ... ఫోర్ అని యధాలాపంగా అన్నాడు. ఫ్లేయర్ బాల్‌ను గట్టిగా బ్యాట్‌తో కొట్టగానే అది దూసుకెళ్లింది. బౌండరీ దాటకుండానే అక్కడున్న ప్లేయర్ పట్టుకుంటాడేమో అని పించింది. బాల్‌ను ఆపినట్టే ఆపాడు. వాడి మొఖం వాడేం ఆపుతాడు అని ముఖ్యమంత్రి అంటుండగానే బాల్ నిజంగానే ఊహించని విధంగా బౌండిరీ దాటింది. గ్రౌండ్‌లో ఉన్న అభిమానుల ఆనందానికి అంతు లేదు. బాల్ బౌండరీ దాటగానే అంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. సుబ్రమణ్యం ఆశ్చర్యం నుంచి తేరుకోలేక పోయాడు. అతను ఫోర్ కొడతాడని ముందే ఊహించడం అంత చిన్న విషయం కాదు. సుబ్రమణ్యం ముఖ్యమంత్రిని ఆశ్చర్యంగా చూడసాగాడు. ఇవన్నీ మనకు మామూలే బ్రదర్ ఇంకేంటి విషయాలు అంటూ ముఖ్యమంత్రి దాన్ని సాధారణ విషయంగానే తీసుకుని టీవిలో మునిగిపోయాడు. స్టార్ బ్యాట్‌మెన్ అని లగడపాటి అన్న మాటను టీవిలో చూసి ఏదో మామూలుగానే తీసుకున్నాను కానీ నిజంగానే ముఖ్యమంత్రి స్టార్ క్రికెటర్ అనుకున్నాడు సుబ్రమణ్యం.
బ్యాట్‌మెన్ మంచి ఊపులో ఉన్నాడు ప్రతి బంతిని ఐతే ఫోర్ లేదంటే సిక్స్ అన్నట్టుగా ఇరగ దీస్తున్నాడు. చూస్తుంటే ఈ ఒక్క బ్యాట్‌మెనే మొత్తం మ్యాచ్‌ను ఆడేసేట్టుగా ఉన్నాడని సుబ్రమణ్యం అన్నాడు. తొందరపడి ఒక నిర్ణయానికి రావద్దు చివరి బాల్ వరకు మ్యాచ్ పూర్తయినట్టు కాదు అని ముఖ్యమంత్రి నవ్వాడు.
అన్నీ సిక్స్‌లు, ఫోర్లు కొడుతుంటే ఇంక మ్యాచ్ వన్‌సైడ్ కాకుంటే ఏమవుతుంది అని సుబ్రమణ్యం ఆసక్తిగా అడిగాడు.
వీడి మొఖం మరో రెండు బాల్స్ ఆడగానే, మూడో బాల్‌కు క్లీన్ బౌల్డ్ అవుతాడు అని ముఖ్యమంత్రి చెప్పాడు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చెప్పింది చెప్పినట్టు జరగడంతో సుబ్రణ్యంలో ఆసక్తి పెరిగింది.

రెప్పవేయకుండా టీవివైపు చూడసాగాడు. మొదటి బాల్‌ను సిక్స్ కొట్టాడు. రెండో బాల్‌లో రెండు రన్లు తీశాడు. ఊపిరి బిగబట్టి మూడవ బాల్ కోసం సుబ్రమణ్యం చూడసాగాడు. అటు ముఖ్యమంత్రి, ఇటు సుబ్రమణ్యం ఇద్దరి మధ్య నిశ్శబ్ధం రాజ్యం ఏలుతోంది. బౌలర్ పరిగెత్తుకు వస్తుంటే ఆ గదిలో సుబ్రమణ్యం గుండె చప్పుడు కూడా వినిపించేంత నిశ్శబ్దం ఆవహించింది. బ్యాట్‌కు తగిలి బంతి గాలిలోకి లేచింది. సిక్స్ ఖాయం అనిపించిది. కానీ ఊహించని విధంగా బౌండరీ వద్ద క్యాచ్ పట్టుకున్నాడు. కలా? నిజమా? ... సుబ్రమణ్యం ఇంకా తేరుకోలేక పోతున్నాడు. అప్పటి వరకు వీర విహారం చేస్తున్న బ్యాట్‌మెన్ ఔట్ కాగానే గ్రౌండ్‌లో అంతా నిరాశ పడ్డారు.
నీలో మానవాతీత శక్తులేవో ఉన్నాయి. లేకపోతే రెండు బాల్స్ ఆడిన తరువాత ఔట్ అవుతాడని ఎలా చెప్పగలిగావు. నువ్వు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతోంది. స్టార్‌లకే స్టార్‌వు అంటూ సుబ్రమణ్యం తన స్నేహితున్ని తన్మయంగా చూడసాగాడు. కిరణ్ అంటే పేరులోనే రన్ ఉంది. ఎవరెన్ని రన్స్ చేయగలవో దివ్యజ్ఞానంతో చెప్పగలుగుతున్నావని అభినందించాడు. క్రికెట్ ఒక్కటే కాదు రాష్ట్ర విభజన అయినా ఏదైనా ముఖ్యమంత్రి చెప్పినట్టే జరుగుతుంది అనుకున్నాడు. మిత్రుని వద్ద సెలవు తీసుకుని బయటకు వచ్చాడు.
***
‘‘మీ ముఖ్యమంత్రి కనిపించే దైవం. ఆయన నోటి నుంచి వచ్చిన మాట జరిగి తీరుతుంది’’అంటూ సుబ్రమణ్యం ఆశ్చర్యంగా అధికారులతో తన అనుభవాన్ని చెప్పాడు.‘‘ మీకు క్రికెట్‌లోనే కాదు ముఖ్యమంత్రి గురించి కూడా పెద్దగా తెలియదనుకుంటాను’’అంటూ అధికారి నవ్వాడు.

మీకలా ఎందుకనిపించింది అని సుబ్రమణ్యం అడిగాడు.
ఇప్పటి వరకు ముఖ్యమంత్రితో కలిసి మీరు చూసింది జూలై 30న అయిపోయిన మ్యాచ్‌ను ఏం జరిగినా రోజూ క్రికెట్ చూడందే ముఖ్యమంత్రికి గడవదు. అందుకే అయిపోయిన మ్యాచ్‌లను కూడా ఆయన రికార్డు చేసుకుని చూస్తుంటాడు అని ఆ అధికారి నవ్వాడు.
అయిపోయిన మ్యాచ్‌ను రికార్డ్ చేసుకుని అంత ఉత్కంఠతతో చూసేవారుంటారా? అని సుబ్రమణ్యం మరింతగా ఆశ్చర్యపోయాడు. కీ ఎక్కడో ఉంది. ఈయన రన్ ఔటే అనుకున్నాడు సుబ్రమణ్యం.

excellent, చివరి మలుపు బాగుంది
రిప్లయితొలగించండిఆ చివర ట్విస్టు ఉంది చూసారూ.. అక్కడే ఉందండీ ఈ పోస్టుయొక్క "కీ"!
రిప్లయితొలగించండి