నేతాశ్రీ 2
24 రంగాలు కలిస్తే సినిమా! మరి ఎన్ని రంగాలు కలిస్తే రాజకీయం ? మహా మహానటులనే బోల్తా కొట్టిస్తుంది రాజకీయం. రాజకీయం కళా? కలనా?అంటే ఎవరికి తోచిన అర్ధం వాళ్లు చెప్పుకోవచ్చు కానీ అన్నీ కలిస్తేనే రాజకీయం. తలపండిన వారిని సైతం పిచ్చివాళ్లను చేసి ఆడించే రాజకీయ రంగంలో బుడ్డొడు ఏం చేస్తాడు.
చె గువేరా సినీనటుడు పవన్ కల్యాణ్‌కు అత్యంత ప్రీతిపాత్రమైన నాయకుడు. పవన్ చెగువేరాను నరనరాన జీర్ణం చేసుకున్నాడు. చెగువేరాకు బాగా నచ్చిన నవల డాన్ క్విక్సోట్. ఈ నవలలో హీరో క్విక్సోట్ రోసి నంటి అనే బక్కచిక్కిన గుర్రం ఎక్కి స్పెయిన్ దేశమంతా తిరిగి అన్యాయాన్ని ఎదిరిస్తూ, అనాధలను ఆదుకుంటూ ప్రజలను రక్షిస్తుంటాడు.
సరిగ్గా ఇలానే తెలుగు ప్రజలను రక్షించాలని పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ ఏర్పాటు చేశారు . జనసేన పేరుతో రాజకీయ పార్టీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. జనసేనాధిపతిగా ఆయన నిలవాలనుకుంటున్నారు. నవల కాబట్టి రచయిత ఇష్టం వచ్చినట్టుగా హీరో వీరోచిత కార్యాలు చేస్తారు. రాజకీయాల్లో అది సాధ్యమా? మహామహా మెగాస్టార్లనే బోర్లాపడేసిన రంగమిది.
మనం బుడ్డొడు అని ముద్దుగా పిలుచుకున్నట్టు అర్జెంటినాలో చె అని పిలుచుకుంటారు. చె అంటే బుడ్డోడు అని. చెగువేరా పేరు అలా ఏర్పడిందే. చెగువేరాను ఇష్టపడే ఈ బొడ్డుడు రాజకీయాల్లో ఏం చేస్తాడు.
ఆవేశం ఒక్కటే రాజకీయాల్లో రాణించడానికి సరిపోతుంది అనుకుంటే అది పవన్‌కు బోలెడుంది. నాలుగు పదుల వయస్సున్న పవన్ కల్యాణ్ అన్న చాటు తమ్మునిగా సినిమాల్లోకి వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. మిగిలిన హీరోల్లా కాకుండా సమాజం గురించి ఆలోచించడం, బాగా చదవడం, ఏదో చేయాలనే తపన సినిమా రంగంలో పవన్‌ను ప్రత్యేకంగా నిలిపింది. ఎంతో మందిని ఆదుకునే మంచి మనసున్న నటుడు అంటారు తెలిసిన వారు.
కోటి రూపాయలను విరాళంగా ప్రకటించి కామన్ మ్యాన్ ప్రోటెక్షన్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినా, ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్ష పదవి చేపట్టి కాంగ్రెస్ నాయకుల పంచెలు ఊడదీసి కొడదామని తిట్టినా అది ఆవేశం నుంచి వచ్చిన చర్యలే.
రాజకీయాల్లో రాణించాలంటే సర్వకళల్లో ఆరితేరి ఉండాలి. కెమెరా స్టార్ట్ యాక్షన్ అనే మాటలు వినగానే నటిస్తే నటులకు సరిపోతుంది కానీ రాజకీయాల్లో అలా కాదు. నిశ్శబ్దంలోనూ, చిమ్మ చీకటిలో, నిద్రలోనూ, మెలుకువగా ఉన్నప్పుడు నిత్యం ప్రతి క్షణం నటిస్తూనే ఉండాలి. అది నటన అని ఏ మాత్రం తెలియకుండా నటించేంత సామర్ధ్యం ఉండాలి. అలా ఉన్నవాళ్లే రాజకీయ నాటక రంగంలో రాణిస్తారు. ప్రజారాజ్యంను చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం చేసిన తరువాత పవన్ రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా సొంత బృందంతో రాజకీయాల్లోకి వస్తున్నారు. ప్రశ్నించడం కోసం జనసేన పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారట! పవన్‌ను అభిమానించే వారు, వ్యతిరేకించే వారు అంతా అనుకునే మాట పవన్ రాజకీయాల్లో ఇమడలేడు అని ఈ సంగతి కాలమే తేల్చాలి.

chaala baaga vraasaaru
రిప్లయితొలగించండి