‘‘ఏ మోయ్ కాంతం ఎప్పుడు లేనంత అందంగా కనిపిస్తున్నావు? ఏమిటో విశేషం ’’
ఆ మాటలతో కాంతం ఒక్కసారిగా సిగ్గుతో ముడుచుకుపోయి ‘‘ముసలోడికి దసరా పండగ అని ఈ వయసులో ఏమిటా? చిలిపి మాటలు’’ అంటూ పైకి కోపం నటిస్తూనే లోలోన మురిసిపోయింది.
‘‘ఉన్నమాట చెబితే కోపమెందుకు? ఆ నల్లంచు తెల్ల చీరలో మెరిసిపోతున్నావోయ్ శే్వతా దేవి ’’ అని కుటుంబరావు అనగానే కాంతం మెలికలు తిరిగిపోతూ, చాల్లేండి ఎవరైనా వింటే నవ్విపోతారు’’ అంది. ఇంతలోనే కాలింగ్ బెల్ మ్రోగడంతో వెళ్లి తలుపు తీసింది. పక్కింటి పచ్చమ్మ ‘‘కాంతం రెడీ అయ్యారా? పంక్షన్‌కు టైం అవుతుంది పదండి’’ అని హడావుడి చేసింది. ‘‘అంతా పంక్షన్‌కు వెళున్నారా? ఈ రోజు పచ్చమ్మ కొత్త పెళ్లి కూతురంత అందంగా ఉంది . చెంపల్లో ఎప్పుడూ లేనంత మెరుపు కనిపిస్తోంది. ఏమిటా? విశేషం అనుకున్నాను’’ అని కుటుంబరావు పచ్చమ్మను పలకరించాడు. ఆ మాటలతో ఒకేసారి కాంతం, పచ్చమ్మ నివ్వెరపోయారు. అసలు ఇంట్లో ఉన్నాడా? లేడా? అన్నట్టు ఉండే కుటుంబ రావు ఒక్కసారి కూడా పలకరించి ఎరుగడు. అలాంటిది ఏకంగా తనను కొత్త పెళ్లి కూతురులా మెరిసిపోతున్నారు అనడం పచ్చమ్మకు నమ్మశక్యం కాకుండా ఉంది. ఈ మాట వినగానే కాంతం నిర్ఘాంత పోయింది. మా ఆయన మంచోడు ఇంటికెవరైనా ఆడవారు వస్తే తలెత్తి కూడా చూడకుండా తన గదిలోకి వెళతాడు అని ఇంత కాలం గొప్పగా అనుకున్నాను... కానీ ఛీ..్ఛఛీ... ఈ వయసులో ఆయనకు ఇదేం పాడు బుద్ధి నా ముందే ఇంటికొచ్చిన ఆడవారి అందాలను పొగుడుతున్నాడు అని కాంతం బాధపడింది. ఆమెకు పచ్చమ్మ ముఖం చూసేందుకు మనసొప్పలేదు. ఏంటీ ఇంకా రెడీ అయ్యారా? లేదా? అంటూ కమలమ్మ తలుపు తోసుకొచ్చి, పచ్చమ్మ భుజంపై చేయి వేసి, తొందరపెట్టింది. ఆమెను చూడగానే కుటుంబరావు చిన్నగా ఈలవేసి ‘‘ ఓహో ముద్దు గుమ్మ కమలమ్మ కూడా వచ్చిందా? శే్వతమ్మ, కమలమ్మ, పచ్చమ్మ ముగ్గురూ అందగత్తెలే ఒకరిని మించిన వారు ఒకరు. పచ్చమ్మకు, కమలమ్మకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది ఇప్పుడేంటి భుజం భుజం కలిపి నడుస్తున్నారు?’’అంటూ కుటుంబరావు అడిగిన ప్రశ్నకు ఏం చెప్పాలో వారికి అర్ధం కాలేదు. కాంతానికి మాత్రం తలకొట్టేసినట్టు అనిపించింది. ఇంకాస్సేపు ఉంటే ఈ ముసలాయన వాళ్ల అంద చందాల గురించి ఇంకేం మాట్లాడతాడో అనే భయంతో వారిని తీసుకొని బయటకు నడిచింది.
‘‘ఏమీ అనుకోకండి మా ఆయన ఇంతకు ముందెన్నడూ లేనట్టుగా ప్రవర్తిస్తున్నాడు’’ అని క్షమాపణ చెబితే, ‘‘మనలో మనకు క్షమాపణలేందుకు? వయసు మీరిన తరువాత ఎవరి నుంచైనా మన అందం గురించి పొగడ్తలు వింటే ఇంకా వినాలనిపిస్తుంది కానీ కోపం రాదు అని ముద్దుగుమ్మలు నవ్వుతూ కోరస్‌గా చెప్పారు.
***
కుటుంబరావు వ్యవహారం ముదిరిపోవడంతో కాంతమ్మ ‘‘ఏమండీ ఎందుకిలా మాట్లాడుతున్నారు? ఈలవేస్తూ పని మనిషి అందాన్ని కూడా మెచ్చుకుంటున్నారు. ఇంత అద్భుతంగా ఈలవేయడం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదంటున్నారు. మీకేమైందండి’’ అని కాంతం కన్నీళ్లు తుడుచుకుంది.
‘‘పిచ్చి కాంతం నేను ఎప్పటిలానే ఉన్నాను. నీకే ఏదో అయింది’’ అంటూ రిమోట్ అందుకుని టీవి ఆన్ చేశాడు. రాష్టమ్రంతటా యువనేత పవనాలే వీస్తున్నాయి అని తన్మయంగా చెబుతోంది ఆ న్యూస్ రీడర్. ఆయన సింహాసనంపై కూర్చున్న తరువాతనే తాను తల్లి కడుపులో నుంచి బయటకు వస్తానని గర్భస్థ శిశువు శపథం చేసినట్టు మా ప్రత్యేక విలేఖరి కథనం. చానల్ మార్చగానే ‘‘వృద్ధ నేత గడ్డానికి ఫిదా అయిపోయిన ప్రజలు. ఆయనే మళ్లీ రావాలని ప్రపంచ ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈరోజు నేను అమెరికాను ఇంత సమర్ధవంతంగా పాలిస్తున్నాను అంటే దానికి ఆయన చూపిన మార్గమే కారణం అని ఒబామా తన సెక్రటరీతో చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆయన గెలుపు కోసం ప్రపంచ దేశాల పాలకులు దేవుళ్లను మొక్కుతున్నారు’’ అని మరో చానల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో అదరగొడుతోంది.
‘‘చూశావా కాంతం టీవి ఒకటే, రిమోట్ ఒకటే కానీ చానల్‌ను మారిస్తే అదే టీవి తెరపై యువనేత అధికారంలోకి రావడం ఖాయం అంటుందో చానల్, వృద్ధనేత ఆల్‌రెడీ సింహాసనంపై కూర్చున్నారంటోంది మరో చానల్ ... ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అంతా నాటకం. మన టీవి మనకే అబద్ధం చెబుతుందా? అంటే ఏం చెబుతాం, ఈ లోకం అంతే కాంతం ... అంతే...’’ అంటూ కుటుంబరావు ఇంకా ఏదో చెప్పబోతుంటే కాంతానికి కన్నీళ్లు ఆగలేదు. పాత సినిమాలో తాగుబోతు హీరో వద్ద ఉండే రామయ్యా అనే నౌకరు పాత్ర ఇలానే అర్ధం పర్థం లేకుండా నీతులు చెబుతుంది. మా ఆయనకు ఈ మాయదారి రోగం వచ్చిందేమిటి దేవుడా?అని కాంతం కన్నీళ్లు పెట్టుకుని డాక్టర్ వద్దకు పరుగులు తీసింది.
***
హలో కుటుంబరావు గారూ ఏంటీ ఒంట్లో నలతగా ఉందా? మీ ఆవిడ కంగారు పడుతుంటే నేను వచ్చాను అని డాక్టర్ పలకరించారు. కుటుంబరావు టీవిల్లో వార్తల విశే్లషకునిగా వస్తుంటాడు దాంతో చుట్టు పక్కల బాగానే పాపులర్.
‘‘ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయంటారు?’’ అని డాక్టర్ సంభాషణ ప్రారంభించారు.
‘‘ముందు మీరు ఏ పార్టీనో చెప్పండి... చానల్‌ను బట్టి మా విశే్లషణ ఉంటుంది? అలానే మీరే పార్టీనో చెబితే ఫలితాలు ఎలా ఉంటాయో చెబుతాను’’ అని కుటుంబరావు నవ్వాడు.
***
‘‘జలుబుకు చికిత్స జరిపితే వారంలో, జరపకపోతే ఏడు రోజుల్లో తగ్గిపోతుంది. మీ ఆయన క్కూడా అంతే. చికిత్స చేస్తే వారంలో, చేయకపోతే ఈనెల 16న మధ్యాహ్నానికి సాధారణ స్థితికి వస్తారు’’ అని డాక్టర్ భరోసా ఇచ్చారు.
కాంతం అర్ధం కానట్టు అయోమయంగా చూస్తే, ఏమీ లేదమ్మా మీ ఆయన ఎన్నికల ఫలితాలపై ఒక్కో టీవిలో ఒక్కో రకంగా విశే్లషణ చేసి చేసి అలా అయ్యారు. మే 16న ఫలితాలు వచ్చాక ఆయనే మామూలు మనిషి అవుతారు. అప్పటి వరకు ఎవరైనా చేసేదేమీ లేదన్నాడు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం