జీవితం నుంచే సినిమాలు పుడతాయి, సినిమాల నుంచి జీవితాలు ప్రభావితం అవుతాయి. ఇప్పుడు సినిమాలేమో కుర్ర హీరోల ప్రేమ కథలతో చెలరేగిపోతున్నాయి. యువత చదువు ఉద్యోగం వేటలో ఎప్పుడూ లేనంత టెన్షన్ అనుభవిస్తుంటే, అచ్చం గతంలో సినిమాల వలెనే సీనియర్ సిటిజన్స్ ప్రేమలో పడిపోతున్నారు. పెళ్లి చేసుకుంటావా? తాతా అంటే నాకెవడిస్తాడు పిల్లను అనేది పాత మాట. ఈ తరం తాతలు ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంటున్నారు. ఇలాంటి అదృష్టవంతులు కొందరేననుకోండి. ఇలాంటి అదృష్టవంతుల ప్రేమ కథలు మాత్రం యాధృచ్చికంగానే బయటపడుతున్నాయి.
అదేదో సినిమాలో శ్రీలక్ష్మి మూగపాత్రలో నటించింది. ఆమెకు హఠాత్తుగా మాటలొస్తాయి. ఇంకేం అంత కాలం అణిచిపెట్టుకున్న మాటలన్నీ అసందర్భంగా బయటకు తన్నుకొస్తుంటాయి. స్కూల్‌లో చదివేప్పుడు పెన్సిల్ ఎత్తుకెళ్లాడని మొగుడ్ని చితగ్గొడుతుంది చిన్నప్పటి విషయాలు పెద్దయ్యాక తెగ మాట్లాడేస్తుంది.
ఎన్నికల ప్రచారం, కోర్టు తీర్పులు, ప్రత్యర్థులపై నిఘా పుణ్యమా అని ఇప్పుడు అలానే ఎనె్నన్నో రహస్యాలు బయటకు వచ్చేస్తున్నాయి. మా మోదీ దేశం కోసం పెళ్లి కూడా చేసుకోలేదు తెలుసా? అని ఆయన అభిమానులు గర్వంగా చెప్పుకునే వారు. దిగ్విజయ్‌సింగ్ మాత్రం అదేం కాదు మోదీకి భార్య ఉన్నారంటూ చెప్పుకొచ్చేవారు. నాయకులపై ఆరోపణలు సహజం కాబట్టి వీటిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఎన్నికల్లో పోటీ చేసే వారు ఏ కాలంను ఖాళీగా వదిలేయడానికి వీలు లేదు అన్నింటిని పూరించాల్సిందే అని సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు పుణ్యమా అని నరేంద్ర మోదీ తన పెళ్లి రహస్యాన్ని బట్టబయలు చేయక తప్పలేదు. ఈ వ్యవహారంలో బిజెపి వాళ్లకు దిగ్విజయ్‌పై కోపం వచ్చిందో లేక తెర వెనుక వ్యవహారం ఏమిటో కానీ దిగ్విజయ్ సింగ్ అమృతారాయ్‌తో ప్రేమాయణం సాగిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. 67 ఏళ్ల దిగ్విజయ్‌సింగ్ తనలో సగం వయస్సున్న అమృతారాయ్ ని అర్ధాంగిగా మార్చుకోనున్నారు . విషయం బయటపడిన తరువాత ఆమె తో నిండా ప్రేమలో మునిగిపోయినట్టు, అమెకు విడాకులు మంజూరైన మరుక్షణమే పెళ్లి చేసుకుంటానని ప్రకటించారు.. ఆమె కూడా కాబోయే భర్తకు తగిన ఇల్లాలులా పరస్పరం విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాం, అవి అందగానే దిగ్విజయ్ నేనూ ఒకటవుతాం అని ప్రకటించింది.
ఈ ముదురు ప్రేమికుల పుణ్యమా అని జాతీయ మీడియా మరోసారి ఎన్టీఆర్‌ను జ్ఞాపకం చేసుకుంది. ఆయన దిగ్విజయ్‌కన్నా పెద్ద వయసులో కనీసం విడాకుల కోసం దరఖాస్తు కూడా చేయకముందే లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నారు.
విడాకులు, మళ్లీ పెళ్లి ఇప్పుడేం కొత్త కాదు.. కానీ కొన్ని ముదురు ప్రేమలే మరీ చోద్యంగా అనిపిస్తున్నాయి. ఎక్కడో అమెరికాలో 60 ఏళ్లాయన పెళ్లి చేసుకున్నాడని, ఎవరో ఎలిజబెత్ టేలర్ డజన్ల కొద్ది పెళ్లిళ్లు చేసుకుంటుందని వింతగా చెప్పుకునే వారు ఇప్పుడు మనకూ ఇవి కామన్‌గా మారిపోయాయి.
ప్రజా జీవితంలో ఉన్నవారి ఇలాంటి ప్రేమలను ప్రజలు సహించరు అని చెప్పడానికి కూడా వీలులేదు. ఎన్టీఆర్ 70ఏళ్ల వయసులో లక్ష్మీపార్వతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే అప్పుడు టిడిపి నాయకులు మా రాజకీయ జీవితం ముగిసిపోయినట్టే అని కుమిలిపోయారు. తీరా చూస్తే ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతుంటే తమ్ముళ్లు ఈలలు,అరుపులతో ఆనందంగా గెంతులేశారు. ఫలితాలు వచ్చాక చూస్తే కాంగ్రెస్‌కు కనీసం ప్రతిపక్ష స్థానం కూడా దక్కలేదు. ఈ ప్రజలు దేన్ని ఆమోదిస్తారో, దేన్ని వ్యతిరేకిస్తారో అర్ధం కాదు. అలా అని దిగ్విజయ్‌సింగ్ తన ప్రేమ పురాణాన్ని బహిర్గతం చేశాడని జనం గెలిపిస్తారా? అంటే అంత సీన్ కనిపించడం లేదు.
బాబులాగానే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దిగ్విజయ్ సంస్కరణ వాదిగా పేరు తెచ్చుకున్నారు. కొంచం ముందు కొంచెం వెనుక అన్నట్టుగా దాదాపు ఒకే కాలంలో ఇద్దరు అధికారం కోల్పోయారు. అధికారం తప్ప మరేదీ బాబుకు జీర్ణం కాదు. ఆయన అధికారాన్ని అంతగా ప్రేమించారు. అవసరం అయితే జిల్లాకు ఇద్దరు ముగ్గురు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నారు. తాను ముఖ్యమంత్రి కావాలి అంతే .. ప్రేమిస్తే అంతే లైలా ప్రేమ కోసం సామ్రాజ్యాన్ని వదలుకున్నాడు మజ్నూ. ప్రేమ అత్యంత శక్తివంతమైంది. అది అమ్మాయిపై ప్రేమ కావచ్చు, సింహాసనం పై ప్రేమ కావచ్చు. సింహాసనంపై ప్రేమను విజయవంతం చేసుకునే సూచనలు కనుచూపు మేరలో కూడా కనిపించక పోవడంతో దిగ్విజయ్‌సింగ్ అమృతారాయ్ ప్రేమ సామ్రాజ్యాన్ని ఏలాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ ప్రేమలో తన్మయంలో మునిగిపోయినప్పుడు ఎవరు ఫోటోలు తీశారో, ఎవరు లీక్ చేశారో ఏమిటో కానీ వ్యవహారం సామాజిక మాధ్యమాలకు ఆ తర్వాత ప్రతికలకెక్కింది. ఇలాంటి వ్యవహారాల్లో దిగ్విజయ్ మొదటి వారు కాదు చివరి వారు కాదు.
ఎన్టీఆర్ ప్రేమ తెలుగుదేశం చరిత్రను మలుపు తిప్పింది. శశిధరూర్ ప్రేమ ఆయన మంత్రిపదవికి ఎసరు పెట్టింది. ముదురు ప్రేమలో తాత లాంటి వారు ఎన్‌డి తివారి. తన ప్రేమ ఈ వయసులో ఆయన్ని ఇరకాటంలో పెట్టింది. ఎన్ని ప్రేమలో ఆయనకు ఎన్నని గుర్తుంటాయి. చివరకు వాళ్ల అబ్బాయి కోర్టుకెక్కి తివారీనే తండ్రి అని కోర్టుతో చెప్పించుకున్నారు. మరోవైపు ఆయన ప్రేమాయణం గవర్నర్ పదవికి ఎసరు తెచ్చింది.

ఆ మధ్య తారా చౌదరి పట్టుబడ్డప్పుడు చాలా మంది తెలుగు ముదురు ప్రేమికుల పేర్లు బయటకు వచ్చాయి. తరువాత ఏం జరిగిందో కానీ ఎవరికి ఏమీ జరగలేదు, ఆమె బయటకు వచ్చారు. ప్రేమిస్తే పోయేదేమీ లేదు, తిరిగి వారు ప్రేమిస్తారు అనే సినిమా డైలాగు బాగానే ఉంది కానీ ముదురు ప్రేమికులు ప్రేమించేప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ కెమెరాలు ఉన్నాయో? ఎవరు నిఘా పెట్టారో చూసుకోవాలి లేకపోతే లేటు వయసులో పెళ్లికి ఒప్పుకోవలసి వస్తుంది. ప్రేమికుల దినోత్సవం లానే ముదురు ప్రేమిలకూ ఒక దినం ఉండాలి.
సాహసం చేయకురా నాయకా పదవి ఊ డేను
రాజ నీతి .. రాజకీయ నాయకులు పదవిని ప్రేమించినట్టు ఆడవారిని ప్రేమిస్తే పదవి ఊ డుతుంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం