‘‘ఏమోయ్ ఉత్తరాలు రాయడంతో నా అంత మొనగాడు లేడని ఓ తెగ చెప్పుకుంటావు కదా? ఏదీ ఒకటి రాసిపెట్టు చూద్దాం నీ ప్రతాపమెంతో?’’
‘‘టీ హోటల్‌లో ఖాళీగా కూర్చున్నానని తక్కువగా అంచనా వేయకు, టీ కొట్టు నుంచి ఎర్రకోటకు ఎగబాకిన మోదీ కాలమిది.’’
‘‘ఆ మధ్య ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతోడు ఇందిరాగాంధీ కూడా ఓడిపోయంది అని చెప్పుకునేవారు. ఇందిరాగాంధీ కూడా ఓడిపోయంది నిజమే కానీ ఓడిపోయిన వారంతా ఇందిరాగాంధీ కాలేరు. టీ కొట్టు నడిపేవారంతా మోదీలు కారు’’
‘‘అది సర్లే కానీ ఇంతకూ ఈ వయసులో ప్రేమ లేఖ రాయించుకోవాలనెందుకనిపించింది. ’’
‘‘లేఖ రాయమన్నాను కానీ ప్రేమ లేఖ అని చెప్పలేదు కదా? ’’
‘‘మరింకేం లేఖ.. ఏరా నీకు గుర్తుందా? ఈ చేతితో మన క్లాస్‌లో ఎంత మంది కోసం ప్రేమ లేఖలు రాయలేదు. ఎవరు ఎవరిని ప్రేమించినా, ప్రేమ లేఖ రాయాల్సింది నేనే కదా? ఆ రోజు గుర్తుందా? సురేష్ గాడు తన ప్రేయసికి లేఖ రాయమంటే పొరపాటున వాడి పేరుకు బదులు నా పేరు రాసుకున్నాను. వెదవ ఆ మాత్రం కూడా చూడకుండా అలానే ప్రేమలేఖ ఇవ్వడం , ప్రేమలేఖ రాయలేనోడికి ప్రేమెందుకని ఆ అమ్మాయి తిట్టడం ’’
‘‘చాల్లేవోయ్ అంటే నాకు లేఖ రాయడం రాకున్నా నీతో రాయించుకోవడానికి వచ్చాననుకున్నావా? అయినా నాకు కావలసింది ప్రేమ లేఖ కాదు. జీవిత లేఖ. ఇదేమీ ప్రేమలేఖలు రాసే కాలం కాదు, వయసు కాదు. ’’
‘‘సర్లే విషయమేంటో చెప్పు. లేఖ అంటూ రాయడం వచ్చిన వాడు వీలునామానైనా, విడాకుల పత్రమైనా, ప్రేమలేఖనైనా రాయగలడు. ఇంతకూ ఇందులో నీకే లేఖ కావాలి. సెలవు చీటి రాయించుకోవడానికి నీకేమన్నా ఉద్యోగమా? సద్యోగమా? పార్టీ అంటూ పైరవీలు అంటూ తిరగేటోడికి నీకు లేఖలతో పనేంటిరా? చెక్కుపై సంతకం చేయడానికి తప్ప పెన్ను ఉపయోగించనోడివి నువ్వు’’
‘‘ఎప్పటి నుంచో పార్టీలో తిరుగుతున్నానని తెలుసు కదా? ’’
‘‘ఎందుకు తెలియదురా! చదువు ఒంటబట్టకపోయినా చదువుకున్నోడికన్నా బాగానే సంపాదిస్తున్నావని మనోళ్లందరూ నిన్ను చూసి కుళ్లుకుంటున్నారు. ఎన్ని తరాల వాళ్లయినా ఇంట్లో కూర్చోని తిన్నా ఇబ్బంది లేకుండా గడిచిపోయేంత సంపాదించావని మన మిత్రులంతా మీ గురించి చెప్పుకుంటారు. ఐటి ఉద్యోగి అయినా బోలెడంత ఐటి చెల్లించే ఉద్యోగి అయినా ఆరునెలల పాటు జీతం లేకున్నా గడిచిపోయేంత డబ్బు బ్యాంకు అకౌంట్‌లో ఉంచుకునే వాడే మంచి ఆర్థిక సూత్రాలు పాటించేవాడని అంటారు. వాడే గొప్ప ఆర్థిక పనిమంతుడు అనుకుంటే నువ్వు ఏకంగా పదేళ్లపాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా తిని కూర్చోని చూపించావంటే , చదువుకున్నవాడికన్నా మధ్యలోనే చదువు వదిలేసుకున్న నువ్వే గ్రేట్‌రా! ’’
‘‘ఏదో అంతా ప్రజల అభిమానం. నా లేఖ గురించి కాస్త ఆలోచించు. ఏమీ లేదురా! ఆవురావురు మంటూ ఇంత కాలం ఎదురు చూశాక అధికారం వచ్చింది కదా? విపక్షంలో ఉన్నప్పుడు సంపద పంపణి అని చెప్పిన మాటకు కట్టుబడి ఇప్పుడు అధికార పంపిణీకి అవకావం ఏర్పడింది. ఏదో నాకు తోచిన ప్రజా సేవ చేయాలి కదా? ప్రజా సేవ చేయాలంటే ఏదో ఒక పదవి ఉండాలి. పదవి పొందేందుకు కూడా అప్లికేషన్ పెట్టుకోవాలని మా బాస్ పిలుపు నిచ్చారు. కనీసం కాలేజీలో సీటు కోసం కూడా సొంతంగా అప్లికేషన్ పెట్టుకున్న అనుభవం లేదు. ఆ పనేదో నువ్వు చేసిపెడతావని వచ్చాను ’’

‘‘ఓ దాందేం భాగ్యం. తప్పకుండా వివరాలు చెప్పు మరి... చదువు సంధ్యలు, స్పోర్ట్స్‌లో గెలిచిన పతకాలు. వీటితో పాటు ప్రజా సేవలో ప్రజల కోసం నువ్వు చేసిన మంచి పనులు ఏమిటేమిటో చెప్పు వాటితో చక్కగా లేఖ రాసేస్తాను’’
‘‘మన దగ్గర సర్ట్ఫికెట్లు ఏమీ లేవు. కానీ ఏ సర్ట్ఫికెట్ కావాలన్నా సంపాదించే తెలివితేటలు ఉన్నాయి. పిచ్చోడా ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగం అనుకున్నావా? నేను దరఖాస్తు రాయమన్నది గవర్నమెంట్‌లో పదవి కోసం కానీ గవర్నమెంట్ ఉద్యోగం కోసం కాదు. మంచి పనులు చేసేదుంటే రాజకీయాల్లో ఎందుకుంటాంరా! ఎదుటోటి మీద నాలుగు రాళ్లు విసిరేసి నాలుగు రాళ్లు వెనకేసుకోవడానికి రాజకీయాల్లోకి వస్తాం ... అది కాదు కానీ ఏయే వివరాలు ఉండాలో నేను చెబుతాను వాటన్నింటిని కలిపి మా బాస్ మురిసిపోయేలా లెటర్ రాసే బాధ్యత నీది.... ఇదిగో ఈ పేపర్ కటింగ్ చూడు దరఖాస్తుకు ఇది జత చేయి ఈ ఒక్క సర్ట్ఫికెట్ చాలు పదవి వచ్చి నా ఒళ్లో వాలిపోవడానికి

హత్యలు చేసైనా బాస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకు రావాలి ఈ స్టేట్‌మెంట్ చూశావా? నాదే ఈ స్టేట్ మెంట్. ఒక్క స్టేట్‌మెంట్‌తో పార్టీలో మన క్రేజీ ఎంత పెరిగిపోయిందో తెలుసా? ఈ అంకె జనాభాలో మా కులం ఓట్లది. దొంగ ఓట్లు వేయించినందుకు ఇదిగో నాపై పెట్టిన కేసులు. రాళ్లు విసిరినందుకు, బంద్‌లు చేసినందుకు, దాడులు జరిపినందుకు ఇదిగో నాపై పెట్టిన కేసుల జాబితా.
‘‘ఇవి చాలు వీటితో దరఖాస్తు తయారు చేసేయ్’’
‘‘ ఏరా ఏదో చిన్ననాటి మిత్రుడివని ఇంత సేపు నీతో చనువుగా మాట్లాడాను కానీ నీమీదున్న కేసులు చూస్తుంటే నీతో మాట్లాడేందుకు నాకే భయమేస్తుందిరా! ’’

‘‘నిజంగానా? ఐతే నాకు పదవి ఖాయం. ఈ కేసులే నాకు శ్రీరామ రక్ష ఇంకో మాట నాకు పదవి వచ్చాక నువ్వే నా పిఎ. రాయడం బాగా తెలిసి వ్యవహారం ఏమీ తెలియని నువ్వే నాకు కావాలి. అసలే రోజులు బాగా లేవు. రాజకీయాల్లో ఎవరినీ నమ్మలేం.’’
‘‘నువ్వు చెబుతుంటే నీ మాటే నిజమనిపిస్తోందిరా! చదువుకొని నేనెంత నష్టపోయానో, చదువు అబ్బక నువ్వెంత బాగుపడ్డావో మనను చూసిన ఎవరికైనా అర్ధమవుతుంది’’
‘‘నా ప్రతిభను గుర్తించినందుకు థ్యాంక్స్. ఇంకో విషయం ఆ లెటర్‌తో పాటు ఇంకో సర్ట్ఫికెట్ రహస్యంగా జత చేయాలి’’
‘‘ ఏంటది? ’’
‘‘ మనమీదో మర్డర్ కేసు కూడా ఉంది.. ఇదిగో ఆ మర్డన్ నేనే చేశానని కోర్టు ఇచ్చిన తీర్పు ’’
‘‘ ఎంత ఎదిగిపోయావయ్యా’’
‘‘ ఏదో అంతా మీ అభిమానం’’

**
:))
రిప్లయితొలగించండి