‘‘ఒబామా ఎంత మాట అనేశాడు గురూ’’
‘‘ నినే్నమన్నాడు.. పాపం ఆయన పనేంటో ఆయన చేసుకుంటున్నాడు కదా? ’’
‘‘ నన్ను కాదు.... నేను చెప్పేది ఆయన స్టేట్‌మెంట్ గురించి. ముస్లింలు చాలా మంచి వాళ్లు. ఎన్నో రంగాల్లో రాణిస్తున్నారు. సేవ చేస్తున్నారు. మీడియా వల్లనే వారిపై ఉగ్రవాదులు అనే ముద్ర పడింది అని ఆవేదన వ్యక్తం చేశాడు.. నేను చెబుతున్నది ఈ మాట గురించి ’’
‘‘ ప్రపంచాన్ని ఏలుతున్న ఒబామా అంతటి నేత అన్నాడు కాబట్టి నిజమే కావచ్చు. మీడియాను నిషేధిస్తే ప్రపంచం నుంచి ఉగ్రవాదం కనుమరుగైతే మంచిదే కదా’’
‘‘ అబ్బా అలా పెడార్థాలు తీయకు . మీడియాను నిషేధించమని ఆయనెందుకంటారు కానీ. ఇస్లామిక్ ఉగ్రవాదం ప్రపంచాన్ని గడగడలాడిస్తుంటే. ఉగ్రవాదుల పీచమణిచే ప్రపంచ రక్షకుడిగా అంతా ఆయన్ని చూస్తుంటే. ఒక్కసారిగా ఆయన ఇంత మాట అనేశాడేమిటని ’’?
‘‘ అమెరికా ఎత్తుగడలు మనకేమర్థమవుతాయి. మన లీడర్ల మాటలే అర్థం కావడం లేదు. లోకల్ విషయాలేమైనా ఉంటే చెప్పు మాట్లాడుకుందాం.? ’’
‘‘ కెసిఆర్ ఏమన్నాడో విన్నావా? ’’
‘‘ నీతో ఏమన్నాడో నీకు తెలుసు? ’’
‘‘ జోకా? పేలలేదు కానీ.. కెసిఆర్ ఏంటి ఒకేసారి అలా అనేశాడు’’
‘‘ ఏమన్నాడు? ’’
‘‘ సెటిలర్స్ ఎవరూ లేరని, హైదరాబాద్‌లో ఉన్నవాళ్లంతా హైదరాబాదీలే అట’’
‘‘ ఇందులో రాజ్యాంగ వ్యతిరేకంగా ఏమైనా ఉంటే కోర్టుకు వెళ్లు’’
‘‘ అది కాదు.. మీ కాలుకు ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తాను అని కెసిఆర్ ఈమాటలు ఎందుకన్నాడు ? ’’
‘‘ ఆయనేమన్నా ఈ మాట తొలిసారిగా అన్నాడా? ఉద్యమ సమయంలోనే అన్నాడు కదా! పెట్టుబడి దారులకు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతాను అని కూడా ఉద్యమంలోనే అన్నాడు. అంతేనా కడుపులో పెట్టుకొని చూసుకుంటాను అని కూడా అన్నాడు కదా? ’’
‘‘ ఆంధ్రావాలే గోబ్యాక్, లంకలో పుట్టిన వాళ్లంతా రాక్షసులు అని కూడా అన్నాడు ఆ విషయం మరిచిపోయావా? ’’
‘‘ ఇంతకూ ఆయన అలా అనడం తప్పంటావా? ’’
‘‘తప్పని కాదు ఎందుకన్నాడు? అనేది నా సందేహం’’
‘‘ నిన్నటి పేపర్ ఉందా? ఇలా తే.. ఈ వార్త చూడు.. విభజించి ఆంధ్రను అన్యాయం చేశారు - చంద్రబాబు ఆవేదన’’
‘‘ బాబుగారి ఆవేదన నిజమే కదా? ఏకపక్షంగా విభజించి అన్యాయం చేశారు కదా? బాబుగారు అదే మాట చెప్పారు. ఎంతైనా రాజకీయాల్లో అనుభవజ్ఞుడు కదా ’’
‘‘ నిజమే చాలా అనుభవజ్ఞుడు. మరి ఈ పేజీలో ఉన్న వార్త ఒకసారి చూడు. నేనిచ్చిన లేఖ వల్లనే విభజన జరిగి తెలంగాణ ఏర్పడింది - చంద్రబాబు ’’
‘‘ ఈ పేపర్లను నమ్మడానికి వీలులేదు.. మా బాబు అలా అని ఉంటాడంటావా? ’’
‘‘ ఆయన చాలా సీనియర్ ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో బాబుగారికి మాట మార్చేంత నైపుణ్యం ఉంది. తెలంగాణ ఉద్యమం పుణ్యమా? అని ఆయనకు ఒకే గదిలో ఒకే సమయంలో ఆంధ్ర టిడిపి నాయకుల వైపు చూస్తూ ఒక మాట, తెలంగాణ టిడిపి నాయకులను చూస్తూ సరిగ్గా దానికి భిన్నంగా మాట్లాడేంత నైపుణ్యం వచ్చేసింది. ’’
‘‘ నేనేమడిగాను? నువ్వేం చెబుతున్నావు? ’’
‘‘ నేను ఒబామా ముస్లింల గురించి మాట్లాడిన మాటల గురించి అడిగితే తలా తోకా లేకుండా నువ్వు లోకల్ విషయాలు అంటూ కెసిఆర్ గురించి చర్చ మొదలు పెట్టావు. సరేలే అని కెసిఆర్ గురించి నేను ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానం చెప్పకుండా చంద్రబాబు వైపు వెళ్లావు. ఒకదానికి ఒకటి ఏమైనా సంబంధం ఉందా? ’’
‘‘ అర్థం చేసుకుంటే ఉంది. చేసుకోక పోతే లేదు. ఒబామా, కెసిఆర్, చంద్రబాబులకు సంబంధమేమీ కనిపించలేదా? నీకు?’’
‘‘ఒకాయన ప్రపంచాన్ని శాసించే నేత. ఇంకోకాయన పది జిల్లాల ముఖ్యమంత్రి, మరొకాయన పదమూడు జిల్లాల ముఖ్యమంత్రి అస్సలు వీరి మధ్య సంబంధం ఏమైనా ఉందా? ’’
‘‘ అదేనోయ్ వారి మధ్య సంబంధం ఎంత పెద్ద ప్రాంతానికి పాలకుడు అని కాదు.. ముగ్గురూ పాలకులే.. ముగ్గురూ రాజకీయ నాయకులే అదే వారి మధ్య సంబంధం. వీళ్లే కాదు మోదీ ఏమన్నాడు. పరమత సహనం అవసరం అన్నారు.. రాజకీయం ఒక కళాత్మక వ్యాపారం... ఏ సమయంలో ఏం మాట్లాడాలో అది మాట్లాడతారు... మాట్లాడిన మాటలనే నమ్ముతారని కాదు... అలా అని నమ్మరని కాదు. ఎప్పుడు ఏ మాటల అవసరం ఉంటే అవి మాట్లాడడమే రాజకీయం.
రాజకీయం అంటే శాస్తమ్రా? కళనా? అని ప్రశ్నకు బహుళ అభిప్రాయాలు బయటపడాతాయి. ఏ ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉండవు. సకల కళల సమాహారం సినిమాగా మారింది. సినిమా అనేది సేవ కాదు కళాత్మక వ్యాపారం. అలాంటి సినిమా కళతో పాటు శాస్త్రం, జీవితం అన్నీ కలిపి రుబ్బితే రాజకీయం బయటకొచ్చింది. రాజకీయం అంటే వ్యాపారం అనుకుంటావా? సేవ అనుకుంటావా? కళాత్మక సేవా వ్యాపారం అనుకుంటావా? నీ ఇష్టం ఏమైనా అనుకోవచ్చు. నిర్మాత, దర్శకుడు, మాటల రచయిత, నటీనటులు, సాంకేతిక నిపుణులు అంతా కలిస్తే సినిమా అవుతుంది. రాజకీయం కూడా అంతే. ఏ సమయానికి అవసరం అయిన డైలాగులు ఆ సమయంలో ఉపయోగిస్తారు. అంత మాత్రాన ఆ డైలాగులే పాత్ర ధారి స్వభావం అనుకోవద్దు. ఆ సందర్భానికి తగిన డైలాగులుగానే వాటిని చూడాలి. ’’
‘‘ అంటే ప్రజలను మోసం చేయడమే కదా? ’’
‘‘ మళ్లీ అదే మాటంటావు.. ఇందులో మోసం చేయడం ఏముంది. సినిమా కథను తెరకెక్కిస్తారు. ఇక్కడ ప్రత్యక్షంగా చూపిస్తారు అంతే తప్ప ఎవరు ఎవరిని మోసం చేయరు. మనం చూసేది సినిమా అని తెలిసినా .తెరపై బొమ్మలను చూస్తూ లీనమయితే అది సినిమా. ప్రత్యక్షంగా చూ స్తే రాజకీయం రెండింటి మధ్య అంతే తేడా . అయితే అన్ని డైలాగులు పేలవు. అన్ని సినిమాలు హిట్ కావు. సినిమా హిట్టయితే నిర్మాత జేబులు నిండుతాయి. రాజకీయం హిట్టయితే నాయకుడితో పాటు ఆయన్ని నమ్ముకున్ని వారి పంటపండుతుంది. అయితే ఒకే కథ పదే పదే హిట్టు కాదు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం