‘‘ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ధ్యానంలో ఉన్నావా? యోగా చేస్తున్నావా? ఏంటీ?’’
‘‘బహిరంగ ధ్యానం చేసేందుకు సమస్యల నుంచి తప్పించుకోవాల్సినంత పెద్ద సమస్యలేమీ లేవు నాకు ?’’
‘‘ ద్యానాన్ని మరీ అంత తక్కువ చేయకు’’
‘‘మహామహా పారిశ్రామిక వేత్తలకే దొరకని పాలకుల దర్శనం ధ్యాన గురువులకు చిటికెలో దొరుకుతుంది తెలుసా? అందమైన హీరోయిన్ భూమికను దూరం నుంచి చూస్తే జీవితం ధన్యమైనట్టే అనుకున్న వ్యక్తి ఆమెకు ఏకంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంటే ఎలా సాధ్యం అయిందనుకుంటున్నావు? యోగ వల్ల.. యోగ గురువు భరత్ ఠాగూర్, భూమికల ప్రేమ కథ చెప్పమంటావా?ఐక్యరాజ్య సమితి యోగ దినోత్సవాన్ని ప్రకటించింది తెలుసా? ’’
‘‘అవన్నీ నాకెందుకు కానీ ఇంతకూ నీ ధ్యానముద్రకు కారణం ఏమిటి? పోనీ ఆలోచిస్తున్నావా? ఆలోచిస్తున్నట్టు నటిస్తున్నావా?’’
‘‘ఈ ముఖంలో నీకో నటుడు కనిపించాడా? ఏంటోరా అంతా నన్ను జిడ్డుముఖం అంటారు. నీకేమో ఒక నటుడు కనిపించాడు’’
‘‘నువ్వు రాజకీయాల్లో ఎక్కడో ఉండాల్సిన వాడివిరా? అనవసరంగా ఇక్కడే ఉండిపోయావు’’
‘‘హఠాత్తుగా నటన నుంచి రాజకీయాలకు వెళ్లిపోయావేంటి? ’’
‘‘నీ ఫోజుకు కారణం ఏంటిరా బాబూ అని నేనడిగితే ఆ ఒక్క ముక్కకు సమాధానం చెప్పడం తప్ప అన్నీ మాట్లాడుతున్నావు? ఇలా మాట్లాడడం రాజకీయాల్లో బాగా పైకి వచ్చిన వారికి మాత్రమే సాధ్యం అవుతుంది. వాళ్లు అడిగిన ప్రశ్నకు తప్ప ప్రపంచంలోని అన్ని విషయాల గురించి చెబుతారు. రుణమాఫీ ఎప్పుడు చేస్తావయ్యా అంటే ధ్యానం చేద్దాం రా! అనేంత చతురత వారికే ఉంటుంది. ఇంటికో ఉద్యోగం ఏమైంది అంటే ఇంటింటికి ధ్యానం, ధ్యానంలోనే సర్వ సమస్యలకు పరిష్కారం అన్నట్టు. పచ్చని పొలాల్లో నిప్పు పెట్టావేంటయ్యా అంటే ? ఆ పొలాల్లో కాంక్రిట్ జంగిల్ కట్టి రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటి పచ్చదనం పరిశుభ్రత కాంట్రాక్టు సింగపూర్ కంపెనీకి అప్పగిస్తున్నాను అని చెబుతారు. పాలకులే మా దేవుళ్లు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సంగతి తేల్చమంటే అర్జంటుగా దేవునికి మొక్కులు తీర్చుకుంటాను అని సగర్వంగా ప్రకటించినట్టు. నా తల రాత మారుస్తానన్నావు? అని అడిగితే అసలు సచివాలయం తలరాతే బాగా లేదు, ఎర్రగడ్డకు మార్చేస్తాను వాస్తుతో అంతా సెట్ అవుతుంది అని చెప్పడం నాయకులకే చెల్లుతుంది.’’
‘‘ఆ గొడవ నాకెందుకు కానీ.. నువ్వన్న మాటల్లో నాలో ఒక నటుడు ఉన్నాడు అన్నావు చూడు అది నాకు బాగా నచ్చింది. నా జీవితంలో ఇంత మంచి కాంప్లిమెంట్ ఎప్పుడూ వినలేదు’’
‘‘ ఓరీ నటరత్నా .... ఎక్కడికో వెళ్లిపోతున్నావు? ’’
‘‘నాలో నటుడున్నాడంటేనే పట్టరాని సంతోషం కలుగుతుంది. ఇంకా నటరత్న అన్నావంటే ఈ రోజు హోటల్ బిల్లు మొత్తం నేనే కట్టేస్తాను... ననే్నవ్వరూ ఆపలేరు’’
‘‘ఒరేయ్ ఆగరా! నీకు కొపం వచ్చినా సంతోషంగా ఉన్నా బిల్లు కట్టాల్సింది నువ్వేకానీ నేను నినే్నమీ మెచ్చుకోవడం లేదు ఆ విషయం గుర్తు పెట్టుకో’’
‘‘ఇప్పుడే కదా నటరత్న అన్నావు. ఎన్నికల ముందు లక్షల కోట్ల హామీలిచ్చి ఎన్నికలు ముగిశాక ఏమీ లేదని జోలె పట్టడం, హుండీలు పెట్టే నాయకులు మాట మార్చడానికి కొంత టైమ్ తీసుకుంటారు. నువ్వేంటి క్షణాల్లోనే మాట మార్చేస్తున్నావు’’
‘‘నిన్ను నటరత్న అన్న మాట నిజమే.. నినే్నమీ మెచ్చుకోలేదు అని చెప్పిన మాటా నిజమే’’
‘‘అదెలా ?’’
‘‘జీవితమే నాటక రంగం అని పెద్దలు చెప్పారా? లేదా? ఈ ప్రపంచమే నాటక రంగం అయినప్పుడు. ప్రతి మనిషి ఒక నటుడే కదా? ఆ విధంగా నేను నీలోని నటుడ్ని చూశాను. నాలోని నటున్ని నువ్వు చూడలేదు అదే నా బాధ’’
‘‘అది సరే మరి నటరత్న అన్నావు కదా? మరీ గాలి తీసేయకు. నటరత్న ఆ మాట వింటేనే ఎంత సంతోషంగా ఉందో? సినిమాల్లో చాన్స్ కోసం ట్రై చేసేవాడు అవకాశం దొరక్క పోతే నటీనటులకు శిక్షణా కాలేజీ ఏర్పాటు చేస్తాడు. సివిల్స్‌లో ఎన్నిసార్లు ప్రయత్నించినా గట్టెక్కని వాడు సివిల్స్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ స్టార్ట్ చేస్తాడు. నాలోని నీకు ఒక నటరత్న కనిపించాడు అంటే నేను అర్జంట్‌గా ఓ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ పెట్టేయాల్సిందే’’ ‘‘ఆగరా బాబూ అన్నీ నీ అంతట నువ్వే చెప్పేసుకుంటావేమిటి? నిన్ను నటరత్న అని ఎందుకున్నానో అడగవా?’’
‘‘చచ్చినా అడగను. నువ్వు చెబితే నా మీద ఒట్టే.. నువ్వు చెప్పావంటే ఈ హోటల్ బిల్లు కూడా కట్టను. నా గాలి తీసేవిధంగా ఏదో ఒకటి చెబుతావు’’
‘‘ఇదిగో బిల్లు కట్టకపోతే ఈ ఒక్కసారికి నేను కట్టుకుంటాను కానీ చెప్పకుండా ఉండడడం నా వల్ల కాదు.. చెప్పే తీరుతాను.. నటరత్న అంటే నినే్నదో ఎన్టీఆర్‌తో పోల్చుతున్నాను అనుకోకు. ప్రతి ఒక్కడు నటుడే అందరూ నటరత్ననే.. కొందరు తెరపైనే నటరత్నలు, అందరూ జీవితంలో నటరత్నలు. నటరత్నగా ఎన్టీఆర్ విశ్వరూపం దానవీర శూరకర్ణలో చూశాం, అక్కినేని నాగేశ్వరరావును దేవదాసులో, కృష్ణ నట విశ్వరూపాన్ని అల్లూరి సీతారామారాజులో చూశాం. ఒక్కో నటుని నటరత్న రూపాన్ని ఒక్కో సినిమాలో చూసేశాం ’’
‘‘అబ్బా విషయం చెప్పరా బాబూ! నాలోని
నటరత్నను ఎప్పుడు చూశావు? ’’
‘‘నటులు ఏదో ఒక సినిమాలో విశ్వరూపం చూపిస్తే, నటరత్నగా మిగిలిపోతారు. కానీ మనం ప్రతి రోజూ నటనలో విశ్వరూపం చూపాల్సిందే కదా? బాస్ వేసిన కుళ్లు జోకుకు నవ్వినప్పుడు మనలో ఒక హాస్య బ్రహ్మ కనిపిస్తాడు. వెర్రి చేష్టలకు కూడా ఇలాంటి అద్భుతమైన ఆలోచనలు మీకే వస్తాయి బాస్ అనేప్పుడు మనలో ఒక నాగభూషణం, గుమ్మడి కలగలిపి కనిపిస్తాడు. నెలాఖరులో చేబదులు కోసం ఫ్రెండ్‌ను మెచ్చుకునేప్పుడు రావుగోపాలరావును దించేస్తాం. చదువుకునేప్పుడు అమ్మాయిని ఎంతగా ప్రేమిస్తున్నామో చెప్పేప్పుడు ఒక ఆత్రేయ, మన మాటలకు అమ్మాయి నవ్వినప్పుడు ఒక వేటూరి మనలోంచి బయటకు తన్నుకు వస్తుంటారు. ఆ తరువాత దర్శకేంద్రుని హీరోయిన్‌ల పాటల సీన్‌లను లైవ్‌గా చూసేస్తాం’’
‘‘నాలో ఇంత గొప్ప నటుడు నీకు కనిపించాడా? ’’
‘‘ మధ్య తరగతి జీవితమే మహా నాటకం .. మధ్యతరగతి జీవులందరూ నట రత్నాలే ’’

Murali garu Excellent
రిప్లయితొలగించండిramesh garu thanks
రిప్లయితొలగించండిఆ తరువాత దర్శకేంద్రుని హీరోయిన్‌ల పాటల సీన్‌లను లైవ్‌గా చూసేస్తాం
రిప్లయితొలగించండిGood one!