‘‘జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ విలువ ఎంతుందంటావ్’’
‘‘ నీకు చిత్రమైన సందేహాలు వస్తుంటాయిరా? ఆ హిల్స్‌లో ఒక్క ఇంటి విలువ కట్టడం కూడా మనలాంటోళ్లకు కష్టం. మనకే కాదు హిల్స్‌లోని ఇంటి ఓనర్‌కు కూడా తన ఇంటి విలువెంతో తెలియదు. చాలా కాలం ముఖ్యమంత్రిగా పని చేసినాయన నా జీతం రూపాయి, నా ఇంటి విలువ 24లక్షలు అని చెబితే, కిసుక్కున నవ్వి మరొకాయన అది ఆ ఇంటికి వేసిన రంగుల ఖరీదు, ఇంటి ఖరీదు కాదన్నాడు. నీకూ నాకే కాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ప్రయత్నించినా ఉమ్మడి హిల్స్ విలువ తేల్చి చెప్పలేరు. అక్కడ పేదలకు రెండు లక్షల ఇళ్లు కట్టిస్తానని ఆ మధ్య కెసిఆర్ ప్రకటించారు కదా? ఇళ్లు కడితే విలువెంతుంటుందని ఇప్పటి నుంచే లెక్కలేస్తున్నావా? ఏంటి? ’’
‘రెండు లక్షల ఇళ్లలో నాకో ఇల్లు వస్తే ఎక్కడికిపోతుంది కానీ.. విషయం అది కాదు.’’
‘‘మరేంటి? ’’
‘‘బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లను దత్తత తీసుకుంటే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాను’’
‘‘నీకేమన్నా పిచ్చా? తల్లిదండ్రులు లేని అనాధ పిల్లలను దత్తత తీసుకున్నట్టు సంపన్న కొండలను నువ్వు దత్తత తీసుకోవడం ఏమిటి? బంజారాహిల్స్‌కు కనీసం ఆటోలో వెళ్లి రావడానికి కూడా నీ దగ్గర డబ్బుండదు. బస్సులో వెళ్లి వస్తావేమో ఇంకా అక్కడ నీకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇంకా మంజూరు కాక ముందే అప్పుడే బంజారాహిల్స్‌కు ఎసరు పెట్టేయాలని చూస్తున్నావ్?’’
‘‘దత్తత తీసుకుంటానంటే ఎగిరి గంతేయాలి, మీడియాను పిలిచి నా పేరు చెప్పాలి కానీ నువ్వేంట్రా మిత్రుడినని కూడా చూడకుండా నిరుత్సాహ పరుస్తున్నావ్’’
‘‘అంటే నీ ఉద్దేశం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ అనాధలనుకుంటున్నావా? ఎవరూ లేక అనాధల్లా ఉంటే నువ్వొచ్చి వాటి ఆలనా పాలన చూసేందుకు దత్తత తీసుకుంటావా? పిచ్చోడా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉండేది అక్కడే. ఒక్కో పార్టీ తరఫున కనీసం ఆరడజను మందైనా ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని ఆశించే వాళ్లు ఉంటారక్కడ. ముఖ్యమంత్రి పదవి తృటిలో తప్పి పోయిందని బాధపడేవాళ్లు ఒకటిన్నర డజన్ల మందైనా అక్కడుంటారు. చీకట్లో ఉత్సాహంగా ఆత్మకథ రాసుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ఉండేది అక్కడే’’
‘‘అదంతా సరే కానీ చీకట్లో ఆత్మకథ రాసుకోవడం ఏమిటి? కెసిఆరేమో తెలంగాణ వచ్చాక ఎండా కాలంలో కూడా విద్యుత్ కోత విధించడం లేదని చెబితే, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చీకట్లో గడపడమా? అంటే ముఖ్యమంత్రి చెప్పిన వన్నీ అబద్ధాలని తేలిపోయాయి కదా? ’’
‘‘తెలంగాణ వస్తే చీకట్లో గడపాల్సిందే అని బల్లగుద్ది మరీ చెప్పారు కదా? అయినా ఆయన మాట ఎవరూ వినలేదు, తన మాట కనీసం తానైనా వినకపోతే బాగోదని కిరణ్ కుమార్‌రెడ్డి సింబాలిక్‌గా చీకట్లో ఆత్మకథ రాస్తున్నారు. అంతే కానీ విద్యుత్ కోత ఉందని కాదు.’’
‘‘పానకంలో పుడక లాగా అసలు విషయం పక్కన పెట్టి కిరణ్ దగ్గరకొచ్చాం. మళ్లీ మన దత్తత కొద్దాం. నేను ఎలాగైనా బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్‌ను దత్తత తీసుకోవాలని డిసైడ్ అయ్యాను’’
‘‘దత్తత తీసుకోని ఏం చేస్తావ్? ’’
‘‘నాకు తెలియదా ఏంటి ? దత్తత తీసుకుని అందరూ ఏం చేస్తారో నేనూ అదే చేస్తాను. చీపుర్లు పట్టి వీధులు ఊడ్చేస్తాను. తెల్లారి పేపర్లో ఆ ఫోటోలు వస్తాయి దత్తత అంటే అంతే కదా?’’
‘‘దత్తత అంటే నీకు అర్ధమైంది అంతేనా?’’
‘‘అంత కాకుంటే ఇంకెంతుందేమిటి? నాకు తెలియదా? పత్రికలు చదవడం లేదనుకున్నావా? లోకేశ్ బాబు అమెరికాకు వెళ్లి 2400 గ్రామాలను దత్తత ఇచ్చి వచ్చారు. ప్రధానమంత్రి ఎంపిలను గ్రామాలను దత్తత తీసుకోమన్నారు.’’
‘‘నిజమేరా! నువ్వు చెబుతుంటే ఇప్పుడు తలకెక్కుతోంది. గ్రామాలను దత్తత కివ్వడానికి అవేమన్నా వీళ్ల జాగీరా? తల్లిదండ్రులు లేని అనాధలా? గుళ్లలో ఫ్యాన్ రెక్కలపైన దాతల పేర్లు ఆ రెక్కల సైజు కన్నా పెద్దగా ఉంటాయి. తమ పేరును అక్కడ ప్రచారం చేసుకోవడం ద్వారా వాళ్ల కీర్తి దాహం తీర్చుకుంటున్నారనిపిస్తుంది. ఫ్యాన్ దానం చేసినోడే అంత పెద్దగా పేరు రాయించుకుంటే బిల్‌గేట్స్, వారెన్ బఫెట్ లాంటి వాళ్లు వేల కోట్ల రూపాయలను వివిధ పనులకు దానం చేశారు. ఆ లెక్కన వీళ్లు ఆకాశంలో ప్రపంచమంతా కనిపించేట్టు తమ పేర్లు రాసుకోవాలి.’’
‘‘ఆరు దశాబ్దాల స్వతంత్ర పాలనలో గ్రామాలను అనాధల్లా వదిలేశామని పాలకులు ఇప్పటికైనా నిజాయితీగా ఒప్పుకున్నారు. ’’
‘‘ఎప్పుడొప్పుకున్నారు? ఎక్కడొప్పుకున్నారు?’’
‘‘దత్తత తీసుకునేది అనాధలనే కదా? ’’
‘‘ మనం సర్పంచ్ అని మామూలుగా పిలుస్తాం కానీ ఉత్తరాధిలో మాత్రం గ్రామ ప్రధాన్ అంటారు. అంటే దేశానికి ప్రధానమంత్రి ఎంత శక్తివంతుడో, గ్రామానికి గ్రామ ప్రధాన్ అంతటి వాడన్నమాట! చివరకు అప్పుడెప్పుడో మూడు దశాబ్దాల క్రితం రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయితీలకు కల్పించిన అధికారాలు సైతం ఇవ్వకుండా తొక్కి పెట్టి ఇప్పుడు అనాధల్లా ఎవరెవరికో దత్తత ఇచ్చేస్తున్నారు. వారేమో రోడ్లు ఊడ్చి మీడియాకు ఫోటోలు పంపి తమ బాధ్యత తీరిపోయినట్టుగా చేతులు దులుపుకుంటున్నారు.’’
‘‘పోనీ వెంకన్నను దత్తత తీసుకుంటే ఎలా ఉంటుంది? ’’
‘‘ఆ మాట అన్నావంటే కళ్లు పోతాయి. బోడి నువ్వేంట్రా వెంకన్నను దత్తత తీసుకోవడం. మూడునాలుగేళ్ల క్రితం వైజాగ్‌కు చెందిన రామారావు అనే ఆయనకు ఈ ఐడియా వచ్చింది. చిల్కూరు బాలాజీ ఆలయంతో దత్తత ప్రారంభించి మిగిలిన ఆలయాలపై పాగా వేయాలనుకున్నారు. కాళ్లిరగొట్టి పంపిస్తామని వార్నింగ్ ఇచ్చేసరికి తోక ముడిచాడు.
‘‘నాకో అనుమానం ఎవరు ఎవరిని దత్తత తీసుకుంటున్నాట్టు. ప్రచారం లేనిదే బతకలేమని అనాధల్లా ఉన్నవారిని గ్రామం దత్తత తీసుకుంటుందా? లేక గ్రామాన్ని వాళ్లు దత్తత తీసుకుంటున్నారా? ’’

ప్రభువులకి ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించే మనస్తత్వం ఉంటే చాలు!
రిప్లయితొలగించండిఆయనే ఉంటే మంగలెందుకన్నట్టు ఆ సద్బుధ్ధి లేకనే ఈ అగచాట్లు?