అబ్బాయి హార్డ్‌వేర్, అమ్మాయి సాఫ్ట్‌వేర్. ఒకరిది డే డ్యూటీ, ఇంకొకరిది నైట్ డ్యూటీ. డబుల్ సాలరీ నో సంసార సుఖం క్లబ్బులో సభ్యులు వాళ్లు. వరుస సెలవులతో జంట ఉత్సాహంగా ఉంది.
‘‘ఓయ్ కడుపులో తిప్పుతున్నట్టుగా ఉందిరా?’’అని ఆమె చెప్పినప్పటి నుంచి అతను ఉత్సాహంతో ఆకాశంలో తేలిపోతున్నాడు. చైనా క్యాలండర్‌ను చూసి లెక్కలేశారు. గ్యారంటీగా అబ్బాయే అని తేల్చేశారు. అమ్మాయి కావాలని అతను అబ్బాయి అయితే బాగుంటుందని ఆమె ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఇద్దరి చదువు ఒకేసారి పూర్తయింది. ఒకేసారి క్యాంపస్ సెలక్షన్‌లో ఉద్యోగం దొరికింది. ఇద్దరి జీతం సమానం. ఇద్దరి సీనియారిటీ కూడా ఒకటే చివరకు ఆ భార్యాభర్తలిద్దరికీ ఒకేసారి పెళ్లయింది కూడా....(?)
‘‘చూడు డార్లింగ్ చదువుకున్న మనం కూడా అమ్మాయి వద్దు, అబ్బాయే కావాలంటే ఎలా డియర్ ’’అంటూ భర్త గోముగా అడిగాడు.
‘‘నువ్వు లక్ష చెప్పు డార్లింగ్.... అబ్బాయిలను ఎడా పెడా కనేసి ఒకరిద్దరిని సైన్యానికి ఇచ్చేయాలని ఆ స్వామి చెప్పాడు కదా ’’ అని భార్య ప్రశ్నించింది.
‘‘సరే నీ ఇష్టం కానీ అబ్బాయే కావాలని అంత గట్టిగా ఎందుకు వాదిస్తున్నావు. సైన్యంలో పంపడానికేనా? ’’అని భర్త అడిగాడు.
‘‘పిల్లను అమెరికా పంపిస్తాం కానీ సైన్యంలోకి ఎందుకు పంపిస్తాం’’ ‘‘మరి అంతగా ఎందుకు పట్టుపడుతున్నావు?’’
‘‘నన్ను అడగడం కాదు ముందు అమ్మాయే కావాలని నువ్వెందుకు అడుగుతున్నావో చెప్పు ’’అని ప్రశ్నించింది శ్రీమతి. పహెలా ఆప్ అంటే పహలా ఆప్ అంటూ ఇద్దరూ ఒకరికొకరు వేలు చూపించుకున్నారు. ‘‘హిందీ సంగతి వదిలేయ్ ఇంగ్లీష్‌లో కూడా లేడీస్ ఫస్ట్ అంటారు కదా? ఇంగ్లీష్ మీద గౌరవంతోనైనా ముందు నువ్వే చెప్పు ’’అన్నాడు.
‘‘అబ్బా సెంటిమెంట్ మీద కొట్టావు. మా అమ్మ మీద ఒట్టుపెట్టుకున్నా పట్టించుకోకపోయేదాన్ని కాని ఇంగ్లీష్ ప్రస్తావన తెచ్చాక కాదనలేకపోతున్నాను’’ అని ఆమె కరిగిపోయింది. ‘‘అమ్మాయి, అబ్బాయి ఎవరైనా ఓకే... కానీ నువ్వు అమ్మాయే కావాలన్నావు కదా? నువ్వు సంపాదించినంత సంపాదించే నేను చచ్చినా నీ మాట ఒప్పుకోవద్దనే పంతంతో అబ్బాయి కావాలన్నాను ’’అని చెప్పింది.
‘‘అరే సేమ్ నాదీ అదే అభిప్రాయం. నీ అభిప్రాయాన్ని ఖండించాలనే కోరిక తప్ప నిజంగా నాకు వేరే కోరిక ఏమీ లేదు. ఇంకో రహస్యం చెప్పనా నేనేమంటే నువ్వు దానికి రివర్స్‌లో అంటావు కాబట్టి నేను అమ్మాయి కావాలన్నాను నిజంగా నేను కోరుకున్నది అబ్బాయినే’’ అని అతను బుల్లితెర విలన్‌లా చిన్నగా నవ్వాడు. వెండితెర విలన్‌లా గట్టిగా నవ్వాలని ఉన్నా అపార్ట్‌మెంట్‌లో జాలి తెర లాంటి గోడలు కూలిపోతాయని భయంతో చిన్నగా నవ్వాడు.
‘‘డియర్ ఇదిగో నీ కోసమే నువ్వు రామ్‌దేవ్‌బాబా శిష్యురాలివి కదా? ఆయన ఎంతో కష్టపడి తయారు చేసిన మందు ఇది తిన్నావంటే పండంటి బిడ్డ ఖాయం’’ అని భరోసా ఇచ్చాడు. పుత్రజీవక్ బీజ్ ... మందు తీసుకోని ఆమె పులకించి పోయింది. ‘‘డార్లింగ్’’ అంటూ గోముగా పిలిచి ‘‘పుత్రజీవక్ బీజ్ మందు తింటే పుత్రుడు పుడతాడంటావా?’’ అని అడిగింది. ‘‘డార్లింగ్ అంత చదువుకున్న నువ్వు కూడా ఇలా అనుమానించడం నువ్వు చదివిని చదువును అవమానించడమే. మనం చదువుకున్న వాళ్లం ఏ విషయాన్నయినా నమ్మేయాలి. ఇంకా నయం నువ్విలా అనుమానించినట్టు మన ప్రెండ్స్‌కు తెలిస్తే నలుగురిలో మన పరువు పోతుంది. నిరక్ష్యరాస్యుల్లా అనుమానించారని మన గురించి నలుగురు చెప్పుకుంటే ఎంత అవమానంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించు. మగపిల్లాడు కాదు మనకసలు పిల్లలు లేకపోయినా పరవాలేదు. కానీ ఇంత చదువు చదివి పల్లెటూరి వాళ్లలా అనుమానించారు అని మనను అంటే తట్టుకోగలమా? ’’అని ఒకింత ఆవేశంగా భర్త అడిగాడు. ‘‘వాడేవడో నైజీరియానో సోమాలియానో వాడికి తిండికి కూడా లేక కడుపులో ఎముకలు కూడా బయటకు కనిపిస్తుంటాయి. అలాంటి వాడు మీకు వందల కోట్ల లాటరీ తగిలింది రెండు మూడు లక్షలు పంపించమనగానే బుద్ధిగా పంపించేస్తాం. మందులకు ఈనెల డబ్బులు కాస్త సర్దుతావా అని అమ్మానాన్న అడిగినా విదల్చని మనం ఒక్కసారైనా ఆ నైజీరియా వాడ్ని కాదన్నామా? ఆ నైజిరియా వాడి లాటరీ కథను ఊళ్లో ఉండే గ్రామీణుడు అనుమానించాడంటే అర్ధం ఉంది. ఎప్పుడైనా మనలాంటి తెలివైన చదుకున్న వాళ్లు అనుమానించారా?’’ అని భర్త నిలదీసేసరికి ‘‘నిజమే అనుమానించడం ద్వారా చదువుకున్న జాతికే అవమానం కలిగేలా ప్రవర్తించాను క్షమించండి ’’ అంది. ‘‘ ఎవరైం చెప్పినా నమ్మడం మన విద్యావంతుల లక్షణం ’ అని భర్త అనునయించాడు.
***
పుత్రజీవన్ బీజ్ బాటిల్ మొత్తం అయిపోవడంతో శ్రీమతి అపురూపంగా కడుపును నిమిరి చూసుకుంది. ‘‘డార్లింగ్ కడుపులో తిప్పుతున్నట్టుగా ఏదోలా ఉంది ’’అంది. అతను చిన్నప్పుడు సినిమాలో హీరోయిన్‌ను హీరో ఇలాంటి సన్నివేశంలో గిరిగిరా తిప్పే సీన్ చూసినప్పుడే తానెప్పుడు పెద్దవాడిని అవుతానో, తనకెప్పుడు పెళ్లవుతుందా? తానెప్పుడు అలా తిప్పుతానా? అని ఎదురు చూస్తూ గడిపాడు. కానీ ఇప్పుడు అలా తిప్పితే తిడుతుందేమోనని భయపడ్డాడు. ఆస్పత్రికి పరుగు తీశారు. ఇది అదేనా? అంటూ సిగ్గుపడుతూ అడిగారు. ‘‘పుత్రజీవక్ బీజ్ బాటిల్ మొత్తం తినేశాం. పుట్టేది అబ్బాయే కదా?’’ అని ప్రశ్నించారు.
డాక్టర్ పరీక్షించాక అబ్బాయా? అంటే డాక్టర్ తల అడ్డంగా ఊపాడు. మరి అమ్మాయా? అంటే మళ్లీ అడ్డంగానే ఊపాడు.
రెండూ కాదంటే ... అదే కదా అని ఇద్దరూ ఒకేసారి కెవ్వును కేక పెట్టారు.
‘‘్ చీ .. చీ .. ఆడ కాదు .. మగ కాదు. అదసలు కానే కాదు
పిజ్జాలు, బర్గర్లు, చెత్తా చెదారం తింటూ పోతే కడుపు పండదు .. పసరు తో నిండుతుంది .. మూడు రోజుల కాపురానికి పిల్లలు పుట్టే సాఫ్ట్‌వేర్ ఇంకా కనుగొనలేదు’’ అని డాక్టర్ వారిని బయటకు పంపించాడు
.- బుద్దా మురళి

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం