‘‘ఏదీ శాశ్వతం కాదు.’’
‘‘ఔను ఎప్పుడైనా అనుకున్నామా సికిందరాబాద్‌లో ఆనంద్ భవన్ మూసేస్తారని, జె రామచంద్రయ్య క్లాత్ స్టోర్‌ను కూల్చేస్తారని, నగరం రూపే మారిపోతోంది’’
‘‘అఫ్ఘానిస్తాన్‌లో అంత పెద్ద బుద్ధుని విగ్రహాన్ని , రష్యాలో ఎర్ర దేవుడు లెనిన్ విగ్రహాలను కూల్చేసినప్పుడు ఆనంద్‌భవన్‌ను కూల్చడం ఎంత సేపు.. నేనంటున్నది దాని గురించి కాదు. కొన్నిసార్లు మనం అస్సలు ఊహించనివి జరుగుతుంటాయి’’
‘‘ అదా సంగతి నిన్ననే పత్రికలో చదివాను. శ్రావణ సమీరాలు టివి సీరియల్ అయిపోయిందట కదా? మన జీవిత కాలంలో ఆ సీరియల్ అయిపోతుందని ఊహించలేదు. అప్పుడు రుతురాగాలు, ఇప్పుడు శ్రావణ సమీరాలు ఏ సీరియల్ అయినా ఎనే్నళ్లు నడిచినా ఏదో ఒక రోజు అయిపోవలసిందే. పుట్టిన వాడు గిట్టక తప్పదు అని గీతకారుడు చెప్పినట్టు ప్రారంభం అయిన సీరియల్‌కు ఏదో ఒక నాడు ముగింపు పలకాల్సిందే. సృష్టి ఉన్నంత కాలం సీరియల్ ఉండాలని మనం కోరుకుంటాం. కానీ అది జరగదు. ముందూ వెనక అంతా ఎప్పుడో ఒకప్పుడు పోలసిందే అలానే సీరియళ్లు కూడా అంతే మహా అయితే పదేళ్లు ఇరవై ఏళ్లు.’’
‘‘సెక్రటేరియట్ నుంచి నన్ను ఎవడూ కదపలేడు అని సెక్షన్ ఆఫీసర్‌గా ఉన్న నా స్నేహితుడు గొప్పగా చెప్పేవాడు. యూనియన్ లీడర్ కూడా. ఏ సెక్షన్‌లోనైనా పైరవీలు చక చకా చేసుకుని వచ్చేవాడు. ప్రపంచం స్మార్ట్ ఫోన్‌లో, ఉంటే సచివాలయం నా మిత్రుడి జేబులో ఉన్నట్టు అనిపించేది. సెక్రటేరియట్‌లో ప్రార్థనాలయాలను, వీడ్ని ఎవరూ కదపలేరు అని గర్వంగా చెప్పుకునే వాళ్లం. సెక్రటేరియట్ నుంచి కదపలేదు కానీ సెక్రటేరియట్‌ను హైదరాబాద్ నుంచి అమరావతికి మార్చారు. ఎక్కడైతేనేం ఇదైనా అదైనా సెక్రటేరియటే కదా? అని ఓదార్చాను. ప్రసూతి వైరాగ్యం బదిలీ వైరాగ్యం ఎన్ని రోజులుంటుందిలే? తన జాతకంలో బదిలీ లేదని జ్యోతీష్కుడు చెప్పాడట! ఉద్యోగి బదిలీ లేకపోవచ్చు కానీ రాజధాని బదిలీ గురించి ఆ జ్యోతీష్యుడ్ని అడగి ఉండడు కదా? ’’
‘
‘ ఇంతకూ నీ వైరాగ్యానికి కారణం ఏమిటో చెప్పనే లేదు’’
‘‘వైరాగ్యం కాదు జీవిత సత్యం. కలికాలం కాకపోతే ఆ బాబు రైళ్లను కంటిచూపుతో వెనక్కి మళ్లించే వారు. ఒంటి చేత్తో సుమోలను గాల్లోకి లేపేవారు. కాలం కలిసి రాకపోతే అంతే మహాయోధుడు భీష్ముడి అంతటి వాడు. శిఖండిని చూసి ఆయుధాలు కింద పడేశాడు. అంతెందుకు సుదీప్ వంటి బయంకరమైన విలన్‌ను ఓ ఈగ ముప్పు తిప్పలు పెట్టింది కదా? కాలం కలిసిరాకపోతే అంతే’’
‘‘సస్పెన్స్‌లో ముంచకు. ఇంతకూ అంతగా వేదాంతాన్ని మాట్లాడుతున్నది ఎవరి గురించి? ’’
‘‘ఇంకెవరికో అయితే నేనేందుకు బాధపడతాను. యువరత్న గురించి. మాట మీద నిలబడే వంశం. చదువుకునే రోజుల్లో మొదలైన అభిమానం ఇప్పుడు రిటైర్‌మెంట్ వయసులో కూడా కొనసాగుతోంది అంటే యువరత్న అంటే నాకెంత అభిమానమో అర్ధం చేసుకో?
ఎన్నో సినిమాల్లో అవలీలగా రైళ్లను ఎత్తి అవతల పారేశాడు. శ్రీకృష్ణుడు గోవర్థన గిరి పర్వతాన్ని చిటికెన వేలితో ఎత్తినట్టు యువరత్న ఎన్నో బ్రిడ్జీలను చిటికెన వేలితో తోసేశాడు. హీరో కారుకు పూలమాల అడ్డం వచ్చి డివైడర్‌కు కొట్టుకోవడం ఏమిటి? కలికాలం కాకపోతే. కొంపదీసి ఆ డివైడర్ కాంట్రాక్టరో లేక మేస్ర్తి ఏమైనా పులివెందులకు చెందిన వాడేమో చూడాలి.’’
‘‘ఇందులో పెద్ద వింతేముంది.? మొన్న మా వాడు అర్థరాత్రి ఇంటికి వెళ్లి కంగారుగా ఫోన్ చేశాడు. వీడు లేని సమయం చూసి వీడి ఇంటిని ఎవడో పక్కకు జరిపాడట! ఇల్లు కనిపించడం లేదని కంగారు పడ్డాడు. సరే నేను వెళ్లి ఇల్లును మళ్లీ పాత ప్లేస్‌లోనే పెట్టి వాన్ని ఇంటిలోపలికి పంపి వచ్చాను. ఇలాంటివి మామూలే. బాధపడొద్దు’’
‘‘హీరోల విషయంలో, సామాన్యుల విషయంలో ఏదైనా ఒకటే అనేది నమ్మలేకపోతున్నాను. ’’
‘‘నువ్వు నమ్మాలి తప్పదు. పాతాళాభైరవి కాలం నుంచి అడవిరాముడు వరకు, కంచుకోట నుంచి గుళేభకావళి కథ వరకు మనం ఎన్ని సినిమాల్లో చూడలేదు. వృద్ధ రాజును రాజనాల ఎన్నిసార్లు మోసం చేయలేదు. నమ్మించి మోసం చేసిన రాజనాల నుంచి రావుగోపాలరావు వరకు ఎంత మందికి ఎన్టీఆర్ బుద్ధి చెప్పి విజయం సాధించలేదు. చివరకు ఏమైంది ఎన్నో డజన్ల సినిమాల్లో విలన్ మోసం చేసినట్టే అల్లుడు అధికారం నుంచి దించేస్తే ఎన్టీఆర్ ఏం చేశాడు విలవిలలాడి... పోయారు.. జీవితం వేరు సినిమా వేరు అంతే’’
‘‘నిజమే ఆకాశంలోకి సుమోలను ఎగరేసిన హీరో చిన్న డివైడర్‌ను ఢీ కొని పడిపోవడం అంటే విధి రాత కాకుంటే ఇంకేంటి?’’
‘‘ విధిరాత కాదు. అది సహజం అంతే ప్రకృతి ధర్మం మనుషులందరికీ ఒకటే’’
‘‘వచ్చే ఏడాది నువ్వు రిటైర్ అవుతావు కదా? రిటైర్‌మెంట్ జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకున్నావ్ చెప్పు’’
‘‘ఏముంది ఓ ఏడాది పుణ్యక్షేత్రాలు తిరుగుతాను. ఇంత కాలం బంధువుల ఇళ్లల్లో ఏ శుభకార్యం జరిగినా వెళ్లలేక పోయాను అందరి ఇళ్లకు వెళతాను. 60 ఏళ్లు వచ్చాక కృష్ణా రామా అనుకుంటూ కాలక్షేపం చేస్తాను’’
‘‘మరి హీరోలు ఏం చేస్తారో తెలుసా? 60 ఏళ్ల వయసు వచ్చాక 100వ సినిమా,150వ సినిమాలో హీరోగా 18ఏళ్ల కొత్త హీరోయిన్‌తో నటిస్తారు. ఇప్పుడు తెలిసిందా ? మనుషులంతా ఒకటే కాదు మనుషుల్లో హీరోలు వేరు అని ఈ మాట నీతోనే చెప్పించడానికే నీ రిటైర్‌మెంట్ లైఫ్ గురించి అడిగాను. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా మనుషులు 60 ఏళ్లకు భక్తి బాట పడతారు. హీరోలు సినిమాల్లో విరహంతో విజృంభిస్తారు. మనుషులు వేరు హీరోలు వేరు. ప్రకృతి ధర్మాలు కూడా వారికి వేరుగా ఉంటాయి. మనను ఎవరైనా కొట్టినా, మననెవరైనా కొట్టినా కింద పడిపోతాం. అదే హీరోలు కొడితే గాలిలో ఎగిరిపోతారు. హీరోలు ఆకర్షణ శక్తికి భూమి సైతం తన ఆకర్షణ శక్తి కోల్పోతుంది. ఇంకెప్పుడూ మనుషులంతా ఒకటే అనకు. హీరోలు మనుషులు కాదు.’’
-జనాంతికం - బుద్దా మురళి(3-7-2016)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం