‘‘దీని వెనుక పెద్ద అంతర్జాతీయ కుట్ర ఉంది?’’
‘‘ఏదీ మనం తినే పిజ్జా వెనుకనా? మన ఫుడ్ మనం మరిచిపోయి ఆరోగ్యం పాడు చేసే ఇలాంటి తిండి తినడానికి మనకు అలవాటు చేయడం వెనుక బహుళ జాతి కుట్రే కారణం’’
‘‘ఎప్పుడూ తిండి యావేనా? ఆంధ్రకు ప్రత్యేక హోదాను కేంద్రం ప్రకటించక పోవడం వెనుక పెద్ద అంతర్జాతీయ కుట్ర ఉందని తెలుగు నేత ఒకరు నాకు రహస్యంగా చెప్పారు’’‘‘80వ దశకంలో టి అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలానే తనను పదవి నుంచి దించేయడానికి విదేశీ హస్తం ఉందన్నారు. రష్యా అమెరికా ప్రపంచంలో ఏ దేశాన్నీ సుఖంగా బతక నివ్వడం లేదు. అన్నింటిలో వేలు పెడుతూనే ఉన్నాయి. కుట్ర ఉండే ఉంటుంది?’’
‘‘నేనో విషయం ప్రస్తావించానంటే, నువ్వు చెబితే వినాలని కాదు.’’
‘‘అలాగా అయితే అంతర్జాతీయ కుట్ర ఏంటో నువ్వే చెప్పు’’
‘‘ఏ హోదా ఇవ్వక ముందే బాబు రాజధాని నగర నిర్మాణానికి పిలుపు ఇస్తే, 200 దేశాలు పోటీ పడ్డాయి. ఇక ప్రత్యేక హోదా ఇస్తే’’
‘‘ఆగాగు ప్రపంచంలో ఉన్నవే 195 దేశాలు కదా? గూగుల్ ఇదే మాట చెబుతోంది. కావాలంటే ఇదిగో స్మార్ట్ఫోన్‌లో చూడు. నువ్వేంటి 200 దేశాలు పోటీ పడుతున్నాయని చెబుతున్నావ్’’
‘‘ఎదురుగా కనిపించే మనిషి కన్నా ప్రాణం లేని యంత్రం చెప్పే దానికే విలువ ఇవ్వడం వల్లనే ప్రపంచం ఇలా తయారైంది. ఉగ్రవాదం పెరిగిపోతోంది. ఇవేనా మార్టిన్ లూథర్ కింగ్, మహాత్మాగాంధీ ప్రపంచానికి బోధించిన విలువలు? శ్రీశ్రీ మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది అని రాసింది ఇలాంటి మాటలు వినేందుకేనా? సత్యజిత్‌రాయ్ అవార్డు సినిమాలు తీసింది మన కోసం కాదా? బిస్మిల్లాఖాన్ షహనాయి వాయించింది దేని కోసం ? రాజ్‌కపూర్ మేరానామ్ జోకర్‌ను నువ్వు అర్ధం చేసుకున్నది ఇంతేనా? రాహుల్‌గాంధీ ఇంత వయసులోనూ పెళ్లి చేసుకోకుండా ఉన్నది ఇందుకోసమే అనుకుంటున్నావా? ఇంటర్‌లో 70 శాతం మార్కులతో లోకేశ్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది ఇందుకే అనుకుంటున్నావా? వీరందరి త్యాగాలు వృధానేనా? వీరి మాటల కన్నా నీకు ఆ స్మార్ట్ఫోన్‌లో గూగుల్ వాడు చెప్పిందే ముఖ్యమా? సాటి తెలుగు వాడి మాట కన్నా ప్రాణం లేని ఫోన్‌కు విలువ ఇస్తున్నావు. అందుకే తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టుకోవడానికి ఏ బ్యాంకు ముందుకు రావడం లేదు. కనీసం తెలుగు వాడి గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు ఉన్నా బాగుండేది. సాటి తెలుగు వాడనే అభిమానంతో తెలుగు ఆత్మగౌరవాన్ని ఆ బ్యాంకన్నా తాకట్టు పెట్టుకునేదేమో!’’
‘‘సారీ నేనేమన్నానని ఇన్నేసి అంటున్నావు. చెప్పింది వింటాను. అంతర్జాతీయ కుట్ర ఏంటో చెప్పు’’
‘‘మోదీకి ఢిల్లీలో పెద్దగా అనుభవం లేదు. అదే బాబుగారికి ఢిల్లీలో చాలా స్పీడ్‌గా చక్రం తిప్పిన అనుభవం ఉంది. మోదీ ఇమేజ్ క్రమంగా సన్నగిల్లడం ఖాయం. దేశానికి ప్రత్యామ్నాయం థర్డ్ ఫ్రంట్. ప్రత్యామ్నాయ ఫ్రంట్‌కు బాబు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు.
బాబు ఏనాటికైనా మోదీకి థ్రెట్. బాబు అమెరికాకు అనుకూలం. దీని వల్ల చైనా రష్యాలకు పక్కలో బల్లెం. బాబు చాలా ముందు చూపుతో అంతర్జాతీయ దృక్ఫథంతో అమరావతిని జపాన్‌కు రెండవ రాజధాని, చైనాకు మూడవ రాజధానిగా భావించాలని కోరితే వారు సరేనన్నారు. ఇవన్నీ మోదీ వర్గీయులకు కంటగింపుగా మారాయి. అందుకే ప్రత్యేక హోదా ఇవ్వడానికి మోదీ వణికిపోతున్నారు’’
‘‘మీకు ప్రత్యేక హోదా ఇస్తామంటే మాకేమీ అభ్యంతరం లేదు అని కెసిఆర్ కూడా ప్రకటించారు. అంతర్జాతీయ కుట్రలో కెసిఆర్? పాత్ర కూడా’’
‘‘మెల్లగా అడుగుతావేంటి బాబులా రోజుకు రెండు సార్లు ప్రెస్‌కాన్ఫరెన్స్‌లు పెట్టి బయటపడే రకం కాదు కెసిఆర్. అమెరికా, చైనా, జపాన్, రష్యాలకు బాబు ఒకేసారి దగ్గరవుతున్నాడు. లోకేశ్‌ను చూసి ఒబామా బావోద్వేగానికి గురయ్యాడు. జాగ్రత్త అని మోదీ చెవిలో చెప్పిందే కెసిఆర్. బ్రదర్ అనిల్‌కుమార్ ద్వారా జగన్ అటు నుంచి నరుక్కొస్తూ ఇజ్రాయిల్‌పై ఒత్తిడి తెచ్చి ఐక్యరాజ్య సమితి ద్వారా మోదీకి చెప్పించారు.’’
‘‘అంటే కేంద్రంలో రెండు పార్టీల బంధం వీడిపోయినట్టేనా?’’
‘‘విడిపోవాలంటే ఎంత సేపు రెండు నిమిషాల పని.. కానీ విడిపోరు’’
‘‘అంటే మోదీకి బాబు అంటే?’’
‘‘ఏ పార్టీ నాయకులైనా తనకు పోటీ వస్తారు అనుకున్నవారిని క్రమంగా ప్రాధాన్యత తగ్గిస్తుంటారు. బయటకు పంపిస్తుంటారు. అంతెందుకు స్వయంగా బాబుగారు సైతం ఈ పని చేసిన వారే. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఉపేంద్ర, రేణుకాచౌదరి, చివరకు దగ్గుబాటి వెంకటేశ్వరరావు లాంటివారిని బయటకు పంపలేదా? ఇదీ అంతే బాబును ఇలానే వదిలేస్తే చివరకు బిజెపి ఎంపిలు తిరుగుబాటు చేసి మాకు మోదీ వద్దు బాబే ముద్దు అని అడుగుతారని ఆయన భయం.’’
‘‘దీంట్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ల వైఖరి ఎలా ఉండొచ్చంటావ్’’
‘‘పైకి అలా కనిపిస్తారు కానీ వీళ్లంతా ఒకటే. ఇండియా- పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు ఇలా ఉంటేనే అటు పాకిస్తాన్‌లోని పార్టీలకు ఇటు మోదీకి ప్రయోజనం అందుకే బాబును దెబ్బతీయడం కోసం వీళ్లంతా మోదీకి తెర వెనుక అండగా ఉంటారని నాకున్న కచ్చితమైన సమాచారం. ’’
‘‘ ప్రపంచాన్ని కదిపేసే ఇలాంటి అద్భుతమైన విషయాలు నీకెలా తెలుస్తాయి. కొంపతీసి వీకిలిక్స్ వాడితో సంబంధం లేదు కదా?’’
‘‘కాదోయ్ తెలుగు పార్టీ అభిమానుల నుంచి వచ్చిన సమాచారం. క్రాస్ చెక్ చేసుకున్నాను దాదాపు అభిమానులు అందరూ ఇదే అభిప్రాయంతో ఉన్నారని నిర్థారించుకున్నాను. బాబు సూపర్‌మ్యాన్ ఇమేజ్‌కు మోదీ భయపడుతూ హోదా ఇవ్వడం లేదు. గవర్నర్ మార్పు, మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవి, ప్రత్యేక హోదా మూడు నిర్ణయాలు ఒకే రోజు తీసుకుంటారేమో’’
‘‘మరో మాట చెప్పు’’
‘‘అంతా నాటకాలు ఆడుతున్నారని బాబు చెప్పాక చెప్పేందుకు ఇంకేముంది? రాజకీయాలు అంటేనే నాటకాలు.’’

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం