14, ఆగస్టు 2016, ఆదివారం

నయీ మిజం వర్థిల్లాలి

‘‘తాతా ఓ కథ చెప్పవా?’’
‘‘నా పోలీసు జీవితంలో నేను పాల్గొన్న సాహస కథ చెబుతా! ఆ ఆపరేషన్‌లో ప్రాణాలతో బయటపడింది నేనొక్కడినే’’
‘‘చెప్పు తాతా’’
‘‘న
యీమ్ అని మా కాలంలో నరరూప రాక్షసుడు. భూమిని చుట్ట చుట్టి తన జేబులో పెట్టుకున్న భయంకర రాక్షసుడు. అరాచకాలు మితిమీరిపోవడంతో పోలీసు అధికారులు ఇండియన్ పీనల్ కోడ్ పుస్తకాలను ముందేసుకుని కూర్చున్నారు.’’

‘‘మక్కెలిరగ్గొట్టి స్టేషన్‌లో పడేయాలి కానీ ఐపిసి చదవడమేంటి? కామెడీ కథ చెబుతున్నావు. ఇన్ని వేల మంది పోలీసులు, ప్రభుత్వాలు ఉండగా, ఒక్కడు అరాచకాలు ఎలా చేస్తాడు?వాడేమన్నా సూపర్ మ్యానా? స్పైడర్ మ్యానా? తప్పించుకొనేందుకు?’’
‘‘పోలీసులు, ప్రభుత్వాల మద్దతు లేనిదే వాడు అరాచకాలు చేశాడని నేను చెప్పానా? వారి సంపూర్ణ మద్దతుతోనే చేశాడు. చెప్పింది విను’’
‘‘పోలీసులు, ప్రభుత్వమే కోన్‌కిస్కాగాడు చెలరేగిపోతే వౌనంగా ఉంటే, చిన్న పిల్లాడిని ఊ కొడుతూ వౌనంగా వినలేనా? చెప్పు’’
‘‘ప్రభుత్వం మారింది, ప్రియారిటీలు మారాయి. దాంతో పోలీసు అధికారులు ఐపిసి పుస్తకాలతో కుస్తీ పట్టి 356 పేజీల నోటీసు తయారు చేశారు. దానికి భారత రాజ్యాంగాన్ని ఇరుగు పొరుగు రాష్ట్రాల చట్టాలను జత చేసి ట్రాలీలో న
యీ మ్ ఇంటికి పంపించారు.

కాలింగ్ బెల్ సౌండ్ విని నయీమ్ అంగరక్షకురాలు కిటికీలోంచి చూసిం ది పెద్ద సంఖ్యలో పోలీసులు కనిపించడంతో లోపలకు వెళ్లి కరెన్సీ నోట్ల కట్టలు తెచ్చి ఒక్కోక్కరిని వరుసలో నిలబడమంది. మేం పాత పోలీసులం కాదు. నయీమ్ చేస్తున్న పని నేర పూరితమైనది. సెక్షన్ 349/ 10 +3 డివైడెడ్ బై 2 ఇంటూ 4 మైనస్ 2, 1958లో సవరించిన చట్టం 1456 - 5 ప్రకారం నయీ మ్ పలు నేరాలకు పాల్పడ్డాడు...లొంగిపో.... అని మా పోలీసు ఇంకా సెక్షన్‌లను చెప్పడం పూర్తి కాక ముందే నయీమ్ అంగరక్షకురాలు పేల్చిన తూటాకు ఆ పోలీసు నేలకొరిగాడు. దాంతో పక్కనున్న మరో పోలీసు సెక్షన్లను చదవడం పూర్తి చేశాడు. అంగరక్షకురాలు ముందు వరుసలో ఉన్న ఆరుగురికి ముగింపు పలికింది. ఆరేడు డజన్ల మంది పోలీసులను దశల వారిగా పంపించారు. తూటాల శబ్దానికి న రుూమ్‌కు మెళకువ వచ్చి చిరాకేసి ఎకె 47 తీసుకుని అందరినీ ఒకేసారి వేసేశాడు. పోలీసులు ఎంతో కష్టపడి తయారు చేసిన నోటీసును కనీసం చదవకూడా చదవలేదు.

చాలా దూరంలో ఒక వ్యాన్‌ను ఆపి హ్యాండ్ మైక్‌తో నేను ఎప్పటికప్పు డు సెక్షన్లను చదువుతూ మా పోలీసు అధికారులకు చెబుతుండాలి అందుకే నేను ఐపిసి పుస్తకాల మధ్య సురక్షితంగా ఉండిపోయాను. అవన్నీ పనికిరాని పుస్తకాలు అనుకుని నయీ మ్ బృందం నన్ను చూడకుండా వదిలేసింది. ఐపిసి పుస్తకాలు నన్ను అలా తమ కడుపులో దాచుకున్నాయి. అందుకే అవంటే నాకు అంత గౌరవం.
పోలీసులు అందరూ పోవడంతో కొత్తగా పోలీసులు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మంత్రివర్గంలో నిర్ణయించి, అసెంబ్లీలో చర్చించి చివరకు మరింత మంది పోలీసులు అవసరం అనే నిర్ణయానికి వచ్చారు. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ద్వారా నియామకాలు జరపాలా? పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలా? అని చాలా ఏళ్లపాటు చర్చలు జరిగాయి. ఇతరులపై పోలీసులు పెత్తనం చేయాలి కానీ పోలీసులపై ఇతరుల పెత్తనాన్ని ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పడంతో పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారానే నియమించాలని నిర్ణయించారు. అంతా అయిపోయాక రిజర్వేషన్లలో పాయింట్ 2% లెక్కల్లో తేడా వచ్చిందని, తనకు రావాలసిన ఉద్యోగం మరొకరికి వచ్చిందని ఒక అభ్యర్థి హైకోర్టుకు వెళ్లాడు. 10ఏళ్లకు తీర్పు వచ్చింది. ఆ తీర్పు నచ్చక మరో అభ్యర్థి సుప్రీంకోర్టుకు వెళ్లాడు. తీర్పు ఏదో ఒకనాడు వచ్చి తీరుతుంది. ’’


‘‘తరువాతేమైంది తాతయ్య?’’
‘‘మా పోలీసుల్లో చాలా మంది ఇలా నేలకొరిగిపోవడంతో ఎస్‌ఐగా ఉద్యోగంలో చేరిన నేను ఎస్‌పిగా రిటైర్ అయ్యాను. న
యీ మ్ కార్పొరేషన్ అని సినిమా కంపెనీని స్థాపించి నయీమ్ ఎన్నో సందేశాత్మక సినిమాలు తీశాడు. వాడి మనవళ్లలో చాలా మంది భారతీయ సినిమాల్లో అనేక భాషల్లో హీరోలు. నయీమ్ దుబాయ్ కేంద్రంగా అనేక దేశాల్లో తన బ్రాంచిలు ఏర్పాటు చేసి సత్వర న్యాయం స్కీమ్‌ను అమలు చేస్తున్నాడు. చానల్స్‌లో నైతిక విలువలు బోధిస్తున్నాడు. పోలీసు నియామకాల కేసు కూడా నయీ మ్‌కు అప్పగిస్తారంటున్నారు. నయీ మ్ భక్త పోలీసు అధికారులు రిటైర్ అయ్యాక, రియల్ ఎస్టేట్‌లో, రాజకీయాల్లో శేష జీవితాన్ని గడుపుతున్నారు. నయీ మ్ స్వదేశానికి వచ్చి ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ఇంత కాలం తనను ఆదరించిన మాతృదేశం రుణం తీర్చుకోవాలనుకున్నాడు. విషయం తెలిసిన దేశ ప్రజలు నయీ మిజం వర్థిల్లాలి.. నయీ మిజం వర్థిల్లాలి అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ..’’
***
‘‘ఎంత ఆదివారం అయినా బారెడు పొద్దేక్కే దాక పడుకుని ఏంటా కలవరింతలు న
యీ మిజం వర్థిల్లడమేంటి లేచి తగలడండి’’
‘‘ నాకేమీ పిచ్చెక్కలేదు. ఇలాకల కన్నాను ’’
‘‘ఏడ్చినట్టే ఉంది మీ కల? ఆ మేధావుల టీవి చర్చలు చూడకండి అని చెబితే వినరు. వాళ్ల మాటలు విని చట్టాల పుస్తకాలు పట్టుకుని న
యీ మ్‌ను పట్టుకోవడానికి వెళ్లి ఉంటే నిజంగా మీరు కల కన్నట్టే జరిగేది. మనసుండాలి కానీ దుష్టశిక్షణ అసాధ్యమా? పగలు, రాత్రి, ఇంట్లో బయట మరణం వద్దనుకున్న హిరణ్యక్షుడు.. తన చేతిలోనే తన మరణం కోరుకున్న భస్మాసురుడు, కడుపులోనే మరణ రహసాన్ని దాచుకున్న రావణుడు, శాశ్వతంగా ఉండేట్టు వరాలు పొందిన ఎంతో మంది రాక్షసులకు మరణం తప్పలేదు. ఎన్ని చావు తెలివి తేటలతో వరాలు పొందినా చావు తప్పదు.’’
‘‘నాకో ధర్మసందేహం ’’
‘‘న
యీ మ్ మరణం ధర్మ బద్ధమా? చట్టబద్ధమా?’’
‘‘రెండూ కలిసే ఉంటాయి. నేనూ ఓ ప్రశ్న అడుగుతాను. వాడి పీడా విరగడ కావడం బాగుందా? లేక మీరు కల కన్నట్టు జరగడం మంచిదా?’’    

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయానికి స్వాగతం