‘‘ఓం ఓం...’’
‘‘భక్తా నీ తపస్సుకు మెచ్చాను. ఏం కావాలో కోరుకో’’
‘‘రంభా ఊర్వశి, మేనకలను పంపి నా తపస్సుకు వెన్నుపోటు పొడవకుండా ప్రత్యక్షం అయ్యారు. ఈ జీవితానికిది చాలు దేవా’’
‘‘పూర్వం చెట్టుకొకరు పుట్టకొకరు తపస్సు చేసేవాళ్లు. కాంపిటేషన్ ఎక్కువగా ఉండడం వల్ల రంభలను పంపక తప్పలేదు. ఏదైనా డిమాండ్ సప్లైలను బట్టే ఉంటుంది కదా? ఈ రోజుల్లో తపస్సు చేసేవారేరి. ఇంకేం కావాలో కోరుకో ?’’
‘‘అదేంటి దేవా! ఏమీ ఇవ్వకుండానే ఇంకేం కావాలంటున్నారు’’
‘‘భక్తా మిమ్ములను చూశాను. జీవితానికి ఇది చాలు అన్నావు కదా? ’’

‘‘ఏదో మర్యాదకు అలా అంటాం దేవా! హైదరాబాద్ బిర్యానీ, ఐ మ్యాక్స్‌లో సినిమాలు, అమ్మాయిలతో కబుర్లు ఇవన్నీ మానుకొని ముక్కు మూసుకుని తపస్సు చేసిందే అంత కన్నా ఎక్కువ ఆశించే కదా? ’’
‘‘ఏం కావాలో కోరుకో మరి’’
‘‘దేవదేవా! పురాణాలన్నీ చదివాను. అసలు చావే లేని వరాన్ని ప్రసాదించి కూడా చంపేసిన మీ కథలు చదివాను. మాట తప్పొద్దు ’’
‘‘ మాట తప్పడం మా దేవుళ్ల వంశంలోనే లేదు. ’’
‘‘కుళ్లు, కుతంత్రాలు, కులాలు, మతాలు, పేద- ధనిక, మేధావి- అజ్ఞాని, ఐశ్వర్యారాయ్- కల్పనారాయ్ అనే తేడా లేకుండా, ఇందిరమ్మ సింగిల్‌బెడ్‌రూమ్ ఇళ్లు- ముఖేష్ అంబానీ 27 అంతస్థుల అంటిలియా బిల్డింగ్ అనే తేడా లేకుండా మనుషులంతా ఒకటిగా ఉండే నవలోకాన్ని మాకు ప్రసాదించు దేవా?’’
‘‘ ప్రపంచ పటంలో అందమైన అమ్మాయి బుగ్గ మీద చుక్క అంత ఉండే దేశం, ప్రపంచాన్ని శాసించే అమెరికా ఒకే స్థాయిలో ఉండాలంటే ఎలా సాధ్యం?. నీ చదువు అయిపోగానే ఉద్యోగం కావాలా? ఎమ్మెల్యే టికెట్ కావాలా? కోటి రూపాయల లాటరీ టికెట్ దక్కాలా? ఏం కావాలో కోరుకో భక్తా’’
‘‘దేవా నేను విశ్వమానవున్ని. నా కోసం కాదు. నా కోసం ఆలోచించే స్వార్థపరున్ని కాదు. విశ్వమంతా శాంతితో నిండిపోవాలి. కులం, మతం, ధనిక, పేద తేడాలు లేని ఆనంద లోకం కావాలి దేవా! బిక్షగాడు- బిల్‌గేట్స్ ఒకేలా జీవించే లోకం నువ్వు తలుచుకుంటే ఇవ్వలేనిదేముంటుంది దేవా? ’’
‘‘హే భగవాన్ నేను కలిపురుషున్ని వస్తున్నాను. ఒక్క నిమిషం ఆగండి ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా వరాలు ఇవ్వకండి. దేవా! దేవలోకానికి వెళితే మీరు భక్తుని తపస్సుకు మెచ్చి వరం ఇచ్చేందుకు వెళ్లారని తెలిసి, పరిగెత్తుకొస్తున్నాను. దేవా ఇది కలియుగం. నేను కలి పురుషుణ్ణి. కలియుగంలో ధర్మం వొంటికాలిపై కుంటుతూ ఉండాలి. నీ భక్తుడు కోరిన వరాలు ప్రసాదిస్తే ధర్మం నాలుగు కాళ్లతో బుల్లెట్ ట్రైన్‌లా పరిగెడుతుంది. యుగ ధర్మానికి విరుద్ధంగా మీరు వరాలు ఇవ్వడం ధర్మమా? ’’
‘‘కలి పురుషా ! ఒకరు మాట్లాడుతుంటే వారి మాటలు పూర్తి కాక ముందే మధ్యలోనే చిరాకెత్తించేట్టు ఇంకొకరు మాట్లాడడం కలియుగంలో టీవి చర్చల ధర్మం. మా సంభాషణ విను అంతే కానీ భక్తునితో మాట్లాడేప్పుడు జోక్యం చేసుకోవద్దు. ’’
‘‘దేవ దేవా కలిపురుషునిగా నా ధర్మం నేను నెరవేరుస్తాను’’
‘‘విన్నావు కదా? భక్తా. యుగధర్మానికి తగ్గుట్టు ఏం కావాలో కోరుకో’’
‘‘ఎక్కడ చూసినా మంచితనం పరమళించాలి. సేవాగుణం గుబాళించాలి. సంఘ సంస్కర్తలతో సమాజం కిక్కిరిసిపోవాలి. ఓజోన్ పొరలా మంచితనం ఈ లోకాన్ని కప్పి వేయాలి. కాగడా వేసి వెతికినా లోకంలో చెడు కనిపించవద్దు’’
‘‘స్పెషల్ ఎకనామిక్ జోన్‌లా! స్పెషల్‌గా మరో లోకం కావాలంటావు ’’
‘‘అంతే దేవా ముంబైలో కురిసిన భారీ వర్షంలా మరోలోకంలో మానవత్వపు వర్షం కురవాలి. ’’
‘‘తథాస్తు. ’’
‘‘దేవా! నేను ఆ లోకంలోకి వెళ్లి చూసి వస్తాను. అప్పుడు కాని నమ్మకం కలగదు. ’’
‘‘సరే వెళ్లు’’
‘‘దేవా? ఈకలిపురుషునికి పని లేకుండా చేస్తారా! మీకిది న్యాయమా? యుగ ధర్మాన్ని మీరే ఉల్లంఘిస్తే ఇక నేనెవరికి చెప్పుకోవాలి’’
‘‘కలి పురుషా ఆవేశ పడకు... నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. కొంచెం ఓపిక పడితే ఆ మానవ భక్తుడు తిరిగి వచ్చాక విషయం నీకే అర్థమమవుతుంది. ’’
‘‘దేవా! మీరు నన్ను మోసం చేశారు. భూ లోకం వెళ్లి చూశా, నేను తపస్సు చేయక ముందు ఉన్న అవలక్షణాలన్నీ అలానే ఉన్నాయి. కులం, మతం, కుళ్లు కుతంత్రాలు అన్నీ అలానే ఉన్నాయి. ఇది మోసం దేవా! ’’
‘‘్భక్తా నేనెలాంటి మోసం చేయలేదు. ఈ దేవుడు ఒకసారి వరం ఇచ్చాడంటే దేవతలంతా అడ్డగించినా అమలు అయి తీరుతాయి.’’
‘‘మరి మార్పేమీ లేదు దేవా! ’’
‘‘ఇదిగో ఇక్కడ చూడు. మనుషుల్లో మానవత్వ పరిమళాలు గుబాళిస్తున్నాయా? కులమతాలు, ఆర్థిక అసమానతలు లేని మరో లోకం కనిపిస్తుందా? ’’
‘‘అవును దేవా కనిపిస్తోంది. మానవత్వం గుబాళింపు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. నేను కోరుకున్న నవ లోకం ఇదే దేవా! ’’
‘‘ఈ కలిపురుషుడికి మాటిచ్చి తప్పుతున్నారా? దేవా ఇక అలాంటి లోకం ఉంటే ఈ కలి ఏం చేయాలి దేవా! ’’
‘‘దేవా ఈ భక్తుని కోరిక తీర్చావు. కలి పురుషున్ని నీ పని నువ్వు చేసుకో అంటున్నావు. ఇదేంటి దేవా! అర్థం కావడం లేదు. ’’
‘‘ఇందులో అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. మానవ భక్తా నువ్వు కోరుకున్న మరో ప్రపంచం పేరు ఫేస్‌బుక్. ఇందులో నువ్వు తట్టుకోలేనంత మానవత్వం, భరించలేనంత మంచి తనం ఉంటుంది. కలిపురుషుని లోకం మానవ లోకం. కలియుగంలో మానవ లోకం ఎలా ఉండాలో అలానే ఉంది. ఉంటుంది.’’
‘‘మోసం అన్యాయం దేవా ఇది అన్యాయం. కనిపించని లోకంలో మంచి తనం కాదు. కంటికి కనిపించాలి . అలా వరం ఇవ్వు దేవా?’’
‘‘సరే నువ్వు కోరుకున్న మానవత్వం పరిమళించే మంచి లోకం ఫేస్‌బుక్‌తో పాటు మైకు ముందు నాయకుల, నటుల మాటల్లో, సినిమాల్లో, పుస్తకాల రాతల్లో ఆ నవ లోకం కనిపిస్తుంది. తథాస్తు’’
***
‘‘ఏమండోయ్ బారెడు పొద్దెక్కా దాక పడుకొని కలలు కనడమేనా ఇంటి గురించి ఏమైనా ఆలోచించేది ఉందా? ఈ నెల అద్దె ఇవ్వకపోతే ఇళ్లు ఖాళీ చేయాల్సిందే అంటున్నాడు ఓనర్.’’
‘‘అద్దె అడగని ఓనర్లు, అప్పు తీర్చమని అడగని మిత్రులు ఉండే నవ లోకం ఎప్పుడొస్తుందో’’

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం