‘‘ఏంటోయ్..! మేధావిలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్?’’
‘‘ఆరోజులే వేరు. పెన్ను పట్టుకొని ఆలోచిస్తున్నట్టు ఫొటో దిగితే చాలు మేధావిలా గుర్తింపు వచ్చేది. బోనస్ డబ్బులతో కవితా సంకలనం ప్రచురించి, అట్టచివర ఆ ఫొటో ముద్రిస్తే నాసామిరంగ.. నోబెల్ బహుమతి వచ్చినంత సంబరంగా ఉండేది. ఇపుడు కవితా సంకలనాలు ఉచితంగా పంచిపెట్టినా తీసుకోనేవారు లేరు. మేధావిగా గుర్తింపు మాట దేవుడెరుగు.. డబ్బులు ఎందుకిలా వృథా చేస్తావు? నీ కవిత్వం చదివేదెవడు? చచ్చేదెవడు? అని దెప్పిపొడుస్తున్నారు. చెప్పుకొంటే సిగ్గుచేటు.. మన కొలీగ్ షేర్‌మార్కెట్ కోటీశ్వరరావుకు మొన్న క్యాంటీన్‌లో నా కొత్త కవితా సంకలనం ఇచ్చాను. అందరిముందు వాడు నా పరువు తీశాడు.’’
‘‘ఏమన్నాడేం? ఒక్కో కవిత చదివి పీకిపాకం పట్టాడా?’’
‘‘చదివి విమర్శిస్తే సంతోషించేవాడిని, పుస్తకం అట్ట కూడా చూడలేదు.’’
‘‘కవి అనే ముద్రపడ్డాక ఇలాంటి అవమానాలు మామూలే. పుస్తకం తెరవలేదని బాధపడితే ఎలా? ఇప్పటికి పాతిక కవితా సంకలనాలు వేసి ఉంటావు. అదేదో తొలిసారి అన్నట్టుగా బాధపడితే ఎలా?’’
‘‘వాడు కూడా సరిగ్గా పాతిక అనే నా పరువుతీశాడు.’’
‘‘ఏం పరువుతీశాడో చెప్పవేం?’’
‘‘పాతికేళ్ల క్రితం బోనస్ డబ్బులు వచ్చినప్పుడు తొలిసారిగా కొత్త ప్రపంచం అనే కవితా సంకలనం ముద్రించా.. ఆ సంగతి షేర్‌మార్కెట్ కోటేశ్వరరావుకు ఇప్పటికీ గుర్తుంది..’’
‘‘పాతికేళ్ళ తరువాత చదివి, ఇప్పుడు సమీక్ష చేశాడా?’’
‘‘కాదు- తిట్టిపోశాడు’’
‘‘ఇద్దరిదీ ఒకే జీతం, ఒకే ఉద్యోగం. పాతకేళ్ళ క్రితం తొలిసారి బోనస్ వచ్చినప్పుడు ఆ డబ్బులతో నేను హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు కొన్నాను. నువ్వేమో కొత్త ప్రపంచం కవితా సంకలనం ముద్రించావు. కొత్త ప్రపంచం వచ్చింది లేదు, చచ్చింది లేదు. నేను కొన్న షేర్ల పుణ్యమాని నాకు నిజంగానే కొత్త ప్రపంచం వచ్చింది. రిటైర్‌మెంట్ తరువాత పెన్షన్ సరిపోదనే భయం లేదు. పిల్లలు చూస్తారా? లేదా? అనే దిగులు లేదు. ఆరోజు నేను కొన్న షేర్లు బంగారు బాతుగుడ్లు అయ్యాయి. మరి నువ్వు ప్రచురించిన కొత్తలోకం పుస్తకం ఒక్కడన్నా చదివాడా? ఎందుకురా? ఈ పనికిమాలిన పని.. రిటైర్‌మెంట్ దగ్గరగా వచ్చావు, ఐనా నీకా పిచ్చి పోలేదా? అని తిట్టాడు.’’
‘‘అతనన్న దాంట్లోనూ నిజం ఉంది. చేతిచమురు వదిలే వ్యాపకాలు ఎందుకోయ్! మనం ఎంత ప్రయత్నించినా ఈ ప్రపంచం మారదు’’.
‘‘నీతో దాపరికం ఏముంది కానీ, ప్రపంచాన్ని మార్చాలనే పిచ్చి నాకు పాతికేళ్ళ క్రితం లేదు, ఇప్పుడూ లేదు’’
‘‘మరి ఈ ప్రయత్నం అంతా..?’’
‘‘ఏదో నలుగురిలో మేధావిగా గుర్తింపు పొందాలనే దుగ్ధ. కడుపు చించుకొంటే కాళ్ళమీద పడుతుంది. కలం పట్టుకొని ఆలోచిస్తున్న ఫొటోల సీజన్ తరువాత బాగా ఆలోచించి గడ్డం పెంచాను. అందరూ తిట్టేవారే కానీ మేధావిలా కనిపిస్తున్నావని మెచ్చుకున్నవాళ్ళు లేరు.’’
‘‘నీ బాధ అర్థమైంది. మేధావిగా గుర్తింపుపొందాలనే తపన అన్నింటికన్నా ఇబ్బందికరమైంది. లక్ష్యం నెరవేరే మార్గం కనిపించదు. లక్ష్యం చేరేంతవరకు నిద్రపట్టదు. పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కాదు. పెళ్ళయితే కానీ పిచ్చి కుదరదు లాంటిదన్నమాట ఈ సమస్య.’’
‘‘నువ్వొక్కడివైనా నా సమస్య గుర్తించావు. మార్గం కూడా చూపించు.’’
‘‘పాత టెక్నిక్‌లు పనిచేయవు, తాజా ట్రెండ్‌ను ఫాలో కావాలి!’’
‘‘అవుతూనే ఉన్నాను. కశ్మీర్‌లో 371 రద్దుచేసినా, పాలస్తీనాలో బాంబులు పేలినా క్యాండిల్స్ పట్టుకొని రోడ్డుమీదకు వెళ్ళి నినాదాలు చేశాను. అందరూ అదోలా చూసి నవ్వుకున్నారు. ఇంకా ఏ కాలంలో ఉన్నారు అంకుల్.. అని జోకులేస్తున్నారు. ఇంకా ఐదేళ్ళ సర్వీసు ఉన్నా, ఉద్యోగం మానేసి ఢిల్లీ వెళ్ళి...’’
‘‘ఢిల్లీ వెళ్ళి ఏం చేస్తావ్? రాజకీయాల్లో చేరతావా?’’
‘‘లేదు. జెఎన్‌యూలో చేరి ఆందోళనల్లో పాల్గొని, అలాగైనా మేధావిగా గుర్తింపు పొందాలని..’’
‘‘మరేమైంది?’’
‘‘జెఎన్‌యూలో ఇప్పుడున్న మేధావులకే దిక్కులేదు. నువ్వొచ్చి చేసేదేముంది? అని ఢిల్లీ తెలుగు సంఘం మిత్రుడు కృష్ణారావు వద్దన్నాడు.’’
‘‘ఎంతైనా తెలుగు మేధావులకన్నా జెఎన్‌యూ మేధావులు ముదుర్లు..!’’
‘‘నా కోరిక తీరే మార్గం లేదా?’’
‘‘మేధావివి. నీకే ఆలోచన తట్టనప్పుడు, సామాన్యులం మేమెంత? ఏదో ఆలోచన మెరుపు నీ ముఖంలో కనిపిస్తుంది.’’
‘‘ఔను! యూరేకా.. ఐడియా?’’
‘‘ఏంటో చెప్పు?’’
‘‘దిశ’’
‘‘ఇది కూడా పాతపడిపోయింది. ‘దిశ’ ఉదంతంపై రాష్టప్రతి పాలన విధించాలని, ఎన్‌కౌంటర్ చేయాలని, చేయొద్దు అని, రోడ్డుమీదనే ఉరి తీయాలని, ఎన్‌కౌంటర్ అలా ఎలా చేస్తారని కొందరు.. ఎందుకు చేయరని ఇంకొందరు ఎవరి స్థాయిలో వారు మేధో చర్చ సాగించారులే.’’
‘‘వారెవ్వరికీ రాని ఆలోచన నాది..’’
‘‘ఎన్‌కౌంటర్ అప్రజాస్వామికం, నిందితులకూ హక్కులున్నాయని చాలామంది నీకన్నాముందే ఆందోళనలు చేసి మేధావులుగా గుర్తింపు పొందారులే.’’
‘‘అది కామన్. ప్రతి ఒక్కరికీ హక్కులుంటాయి. రేప్‌లు చేసిన వారికీ ఉంటాయి.. కానీ నా డిమాండ్ అది కాదు.’’
‘‘మరి?’’
‘‘అత్యాచారం మా జన్మహక్కు.. అత్యాచారాలకు అనువుగా కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తా.. రేప్ చేయాలనే కోరిక మనిషి సహజ లక్షణం. రేపిస్టులను రక్షించండి. రేప్‌ల సంస్కృతిని కాపాడండి.. ఎలా ఉంది నా నినాదం.’’
‘‘???’’
‘‘ఇంకో పాయింట్ మరిచిపోయాను. రేపిస్టులూ సమాజంలో భాగమే.. వారికి స్వయం ఉపాధి కల్పించాలి. ఎలా ఉంది?’’
‘‘నువ్వు బాగా ముదిరిపోయిన మేధావివి. నిన్ను జనం అర్థం చేసుకోవడం కష్టం. నీ అద్భుత ఆలోచన ఎవరికీ చెప్పకు. మీ ఇంట్లోవారికి కూడా.’’
‘‘నిజమే! మేధావులను అర్థం చేసుకోరు.. ఎవరికీ చెప్పను.’’*బుద్దా మురళి (జనాంతికం 13-12-2019)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం