ఎక్కువ జీతం వచ్చే వాళ్లు, ఎక్కువ ఆదాయం ఉండే వారే సంపన్నులు అవుతారు అనే అంచనా తప్పు. జీతం తక్కువగా ఉన్నా మీ మైండ్‌సెట్ బట్టి మీరు సంపన్నులు కావచ్చు. ఇదేమీ మంత్రం కాదు. మాటలతో బురిడీ కొట్టించడం కాదు.
దాదాపు దశాబ్దం క్రితం యాదగిరిగుట్ట పక్కనున్న వంగపల్లిలో వ్యవసాయ భూమి పదివేలకు ఎకరం అమ్మాలంటే కూడా కొనేవారుండేవారు కాదు. పెళ్లి ఖర్చుల కోసం చాలా ఇబ్బంది పడి వంగపల్లిలో పదెకరాల భూమిని పదివేలకు ఎకరంలా అమ్మేసిన వారున్నారు. ఈ పదేళ్ల కాలంలో అక్కడ భూమి విలువ ఎంతుంటుందో ఊహించగలరా? యాదగిరిగుట్ట అభివృద్ధి కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత హైదరాబాద్ నగరాన్ని మించి ధరలు పలుకుతున్నాయి అక్కడ. ఆలయానికి సమీపంలో ఒక ఎకరానికి రెండు కోట్లకు పైగా ధర పలుకుతోంది.
భవిష్యత్తును ఊహించి భూమిని నిలుపుకొన్న వారు, కొన్నవారు చాలా తక్కువ సమయంలోనే సంపన్నులు కాగా, అమ్మిన వారు లబోదిబోమంటున్నారు.
హైటెక్‌సిటీ భవన నిర్మాణ సమయంలో అక్కడ ఎకరం ధర లక్ష రూపాయల వరకు ఉండేది. ఇప్పుడు ఆ ధరతో ఒక గజం భూమి కూడా లభించదు. ఇలాంటి ఉదాహరణలు మనకు అన్ని చోట్ల కనిపిస్తాయి. అదృష్టం అనేది మనకు జీవితంలో అనేక సార్లు తలుపు తడుతోంది. ఆ ఆహ్వానాన్ని స్వీకరించేందుకు మనం సిద్ధంగా ఉన్నామా? లేదా? అనే దాన్ని బట్టి మన ఆర్థిక స్థితి ఆధారపడి ఉంటుంది.
ఆర్థికంగా బాగుండేందుకు ఎక్కువ జీతం, ఎక్కువ సంపాదన ఒక్కటే సరిపోదు. దీని కన్నా సంపదను ఆకట్టుకునే మైండ్‌సెట్ అవసరం. మీ మైండ్‌సెట్ దానికి సరిపోయే విధంగా లేకపోతే సంపద వచ్చి మీ ఖాతాలో పడ్డా అది ఎక్కువ కాలం ఉండదు. ఒక డాక్టర్ ఆన్‌లైన్‌లో ఎవరో లాటరీ వచ్చిందంటే దశల వారిగా కోటి రూపాయలు సమర్పించుకుందట! అంటే డాక్టర్‌గా ఉన్నత విద్యావంతురాలు అయినా, ఆన్‌లైన్‌లో డబ్బులు పంపేంత సాంకేతిక నైపుణ్యం ఉన్నా , సంపాదించే సామర్థ్యం ఉన్నా ఆ డబ్బును నిలుపుకొనే మైండ్‌సెట్ లేకపోవడం వల్ల అంత చదువు చదివినావిడ, పెద్దగా చదువు సంధ్యలు లేని మోసగాళ్ల ఆన్‌లైన్ మోసాలకు చిక్కింది.
మన మైండ్‌సెట్ ఎలా ఉంది. మనల్ని ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకు వచ్చే విధంగా ఉందా? అప్పులు, సమస్యల్లో ముంచేట్టుగా ఉందా? అని మనకు మనమే పరీక్షించుకోవాలి.
సంపద సమకూర్చుకునే వారి మైండ్‌సెట్ ఎలా ఉంటుందో నిపుణులు సూచించారు. ఈ పది లక్షణాలు తప్పన సరిగా ఉండాలట! అవి ఉంటే సంపన్నులు కావడానికి మిమ్ములను ఎవరూ ఆపలేరు.
* ఈ రోజు గురించే కాదు.. భవిష్యత్తు గురించి ఆలోచించగలగాలి. వచ్చే ఐదేళ్లు, 20 ఏళ్లలో మీరు ఆర్థికంగా ఎలా ఉండాలనుకుంటున్నారో ఊహించుకోవాలి. ఉద్యోగంలో చేరిన మొదటి నెలనే రిటైర్‌మెంట్ గురించి ఆలోచించగలగాలి. మంచిరోజు, మంచి ముహూర్తం గురించి ఆలోచన వద్దు .. ఆర్థికంగా బలంగా ఉండాలనే ఆలోచనకు ఈరోజే శ్రీకారం చుట్టండి.
* ఒక వస్తువును కొనేప్పుడు తక్కువ ధర అనే కాదు నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి ఖర్చులోనూ ఇదే ధోరణి అవసరం. ఎక్కువ కాలం ప్రయోజనం కలిగించే ఖర్చు చేయాలి. ఖర్చులో, కొనుగోలులో సైతం తెలివి ఉండాలి.
* ఒక కంపెనీకి బ్రహ్మాండంగా లాభాలు వస్తే యజమానికి ప్రయోజనం. కానీ అదే కంపెనీ దివాళా తీస్తే ఉద్యోగి కోలుకోలేని విధంగా దెబ్బతింటాడు. ఉద్యోగమే పోయి జీవితం ప్రశ్నార్థకంగా మారుతుంది. లాభం వచ్చినప్పుడు తేడా ఉండదు కానీ నష్టాలు వస్తే ఉద్యోగి కూడా భరించాలి. నిజానికి యజమాని కన్నా ఉద్యోగిపైనే నష్టప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీరు ఉద్యోగిగా ఉంటూ కూడా యజమానిగా ఉండే ఆలోచన చేయవచ్చు. మీ జీతంతో వచ్చే డబ్బును రియల్ ఎస్టేట్ వంటి వాటిపై ఇనె్వస్ట్ చేయవచ్చు. స్టాక్స్‌లో, మ్యూచువల్ ఫండ్స్‌లో, మీకు అవగాహన ఉన్న వాటిలో ఇనె్వస్ట్ చేయవచ్చు. అంటే ఇక్కడ ఉద్యోగిగా జీతం వస్తుంది. ఇనె్వస్ట్‌మెంట్‌పై ఆదాయం గడించడం ద్వారా ఉద్యోగిగా, యజమానిగా రెండు రకాల ప్రయోజనం పొందగలరు. జీవిత కాలమంతా ఉద్యోగిగానే కాదు యజమానిగా మారే విధంగా మైండ్‌సెట్ ఉండాలి. ఇనె్వస్ట్‌మెంట్‌కు అనుకూలమైన మైండ్‌సెట్ లేనివారు ఎక్కడా ఇనె్వస్ట్ చేయలేరు.
* ఇతరుల ప్రతిభను గుర్తించాలి. ఇతరుల సహాయానికి కృతజ్ఞత చూపాలి. ఒక్కరి వల్లనే ఏదీ సాధ్యం కాదు. మీరు ఆర్థికంగా బలంగా మారడంలో ఇతరుల సహకారం కూడా ఏదో విధంగా ఉంటుంది. దానికి కృతజ్ఞతలు చూపే విధంగా మీ మైండ్‌సెట్ ఉండాలి.
* అత్యవసర ఖర్చులు, అవసరాలు, ఊహించని విధంగా వచ్చే సమస్యలను ముందే ఊహించి, దానికి సిద్ధం కావాలి. యుద్ధానికి సిద్ధంగా ఉండే సైనికుల మాదిరిగా అత్యవసరంగా వచ్చే వాటి కోసం ఆర్థికంగా సిద్ధంగా ఉండాలి.
* సినిమాల గురించి, క్రికెట్ గురించి గంటల తరబడి మాట్లాడుతుంటాం. చదువుతుంటాం. సినిమాల వల్ల ఆ సినిమా తీసిన వారికి, నటించిన వారికి లాభాలు రావచ్చు, క్రికెట్ వల్ల క్రికెటర్లకు లాభమేమో కానీ మనకు ఆర్థికంగా ఏ మాత్రం ఉపయోగపడని వాటి గురించి గంటలు గంటలు కేటాయిస్తూ జీవితంలో మనకు ఎంతో ముఖ్యమైన ఆర్థిక అంశాలను పట్టించుకోం. వడ్డీ, స్టాక్‌మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అనే కనీస అవగాహన కూడా లేని వాళ్లు కనిపిస్తారు. వీటిని తెలుసుకోవాలి.
* మార్పునకు సిద్ధంగా ఉండాలి. ఉద్యోగం మారవచ్చు, పరిస్థితి తలక్రిందులు కావచ్చు, మార్పునకు సిద్ధంగా ఉండాలి.
* మార్పు మీపై నెగిటివ్‌గానే కాదు పాజిటివ్‌గా కూడా ప్రభావం చూపవచ్చు. ఏ పరిస్థితినైనా ఎదుర్కొంటాను అనే విధంగా మీ మైండ్‌సెట్ ఉండాలి. లాభాలే కాదు నష్టాలనూ ఎదుర్కోవడానికి సిద్ధం కావాలి.
* ఆయా రంగాల గురించి మనకు ఎంత తెలిసినా నిపుణుల నుంచి సలహాలు తీసుకోవడం తప్పు కాదు. ఫైనాన్షియల్ అడ్వైజర్స్ సలహాలు తీసుకోవచ్చు.
* మంచి జరుగుతుంది అనే పాజిటివ్ ఆలోచన లేనిదే ఏదీ సాధించలేరు. ఆర్థిక అంశాలపై నిరంతరం తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం