‘పేదలు పేదలుగానే మిగిలిపోతున్నారు, సంపన్నులు మరింత సంపన్నులు అవుతున్నారు. ఎంత కాలమిది. ఎందుకీ ప్రజాస్వామ్యం. అంబానీ సంపద నానాటికి పెరిగిపోతోంది. పేదలు అప్పుల్లో మునిగిపోతున్నారు.’ ఇలాంటి డైలాగులు మనం చాలా సార్లు విని ఉంటాం. కథల్లో, సినిమాల్లో, సీరియల్స్‌లో, నాయకుల ఉపన్యాసాల్లో ఇవి సర్వసాధారణం. చాలా మంది మేధావులు, రచయితలు పేదరికాన్ని గ్లోరిఫై చేస్తుంటారు. అదేదో పూర్వ జన్మ సుకృతం అన్నట్టుగా సినిమాల్లో చూపిస్తుంటారు. ధనానికి పేదలం కానీ గుణానికి పేదలం కాదు బాబు అంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ధనవంతుడైన యజమాని ముందు డైలాగు చెబుతాడు.
ఇలాంటి వాదన వినిపించినప్పుడు సాధారణంగా రాజకీయ నాయకులు కావచ్చు, సంపన్నులు కావచ్చు, సాధారణంగా సమాధానం చెప్పరు. నిజాయితీగా సమాధానం చెబితే అది తమకు సమస్య అవుతుంది. కాబట్టి వౌనంగా ఉండిపోతారు.
కానీ మీరు నిజంగా ధనాన్ని ప్రేమిస్తే, సంపన్నులు కావాలి అనుకుంటే ఇలాంటి అనారోగ్యకరమైన ఆలోచనలకు దూరంగా ఉండాలి. అంబానీ డబ్బు సంపాదించడమే తప్పా? అంటే అతను కూడా ఓ ఫైలు పట్టుకుని ఉద్యోగం కోసం చెప్పులు అరిగిపోయేట్టుగా రోడ్ల మీద తిరిగితే బాగుంటుందా? చాలా మంది రచయితల దృష్టిలో వీళ్లే హీరోలు. పేదరికాన్ని ప్రేమించే వారికి పేదరికమే దక్కుతుంది. చట్టబద్ధంగా డబ్బు సంపాదించడం తప్పేమీ కాదు. సంపన్నులను వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఒక పెట్రోల్ బంకులో పని చేసిన ధీరూబాయి అంబానీ కొన్ని లక్షల మందికి ఉపాధి చూపే స్థాయికి ఎలా ఎదిగాడు. శ్రీమంతుడిగా ఎదగడానికి అతను చేసిన కృషి ఏమిటి? అనే దానిపై దృష్టి పెడితే మనకు ఉపయోగపడే విషయాలు తెలియవచ్చు. అంతే కానీ సంపదన కలిగి ఉండడం అంటే దేశద్రోహం అన్నట్టుగా భావించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు.
ఇటీవల ఓషో ఉపన్యాసం ఒకటి వింటే... సంపన్నులను విమర్శించే వారికి సున్నితంగా ఆయన ఇచ్చిన సమాధానం అద్భుతం అనిపించింది.
ఇలాంటి వాదనకు బహుశా ఇంత చక్కని సమాధానం ఇప్పటి వరకు ఎవరూ ఇచ్చి ఉండరు.
ఓషో ఉపన్యాసం ఇస్తుండగా, ఒకరు ప్రశ్న రాసి పంపించారు. దేశంలో ఎంతో మంది పేదలు ఉండగా, మీరు రోల్స్ రాయిస్ కార్లలో తిరగడం ఎందుకు? ఆ డబ్బును పేదలకు పంచవచ్చు కదా? అని ప్రశ్నించారు.
ఆయన సమాధానం ఇలా సాగింది...
‘‘దేశంలో 70కోట్ల మంది డబ్బు అవసరం ఉన్న పేదలు ఉన్నారు. నేను కారు అమ్మితే ఎంత మందికి ఇవ్వగలను. సరే మీరు ముందుకు వచ్చారు సంతోషం. నీ వాటాగా ఓ పైసా వస్తుంది. వచ్చి తీసుకో. మిగిలిన పేదవారు వచ్చినప్పుడు తలా ఓ పైసా ఇస్తాను. చిత్రమేమంటే నేను కారులో కాకుండా నడుస్తూ వెళ్లినప్పుడు కూడా దేశంలో ఇంత మంది పేదలే ఉన్నారు. నన్ను ప్రశ్నించిన వారిని అడుగుతున్నాను. పేదలకు మీరేం ఇచ్చారు. మీ సైకిల్ అమ్మి పేదలకు ఇచ్చారా? మీ ఇళ్లు అమ్మి ఇచ్చారా? మీ షాప్ అమ్మి ఇచ్చారా? ఎందుకివ్వడం లేదు. అవసరం అయిన పేదలు ఎంతో మంది ఉన్నారు. కదా? వారిని మీరు ఆదుకోరా! డబ్బు అవసరం అయిన పేదవారికి ఏం చేశారు. సంపన్నులను పేదలకు సంపద ఇచ్చేయాలి? మరి ఇంతకూ పేదలేం చేయాలి. మరి పేదలు ఏం చేయాలి? మరింత మంది పేదలను పుట్టించడమే వారి పని అంతే కదా?
డబ్బు సంపాదించిన వారు పేదల గురించి ఆలోచిస్తే మరి పేదలేం చేయాలి?’’
ఇలా సాగుతుంది ఓషో ప్రసంగం.
నిజమే కదా? పేదరికం ఓ వరం అన్నట్టు, డబ్బు సంపాదించడం పాప కార్యం అన్నట్టుగా చాలా మంది ఆలోచనలు. చట్టవిరుద్ధంగా సంపాదిస్తే తప్పవుతుంది కానీ చట్టబద్ధంగా తనకున్న అవకాశాలను ఉపయోగించుకుని సంపాదించడం తప్పేలా అవుతుంది. పైగా అవకాశాలను అందిపుచ్చుకోకుండా పేదరికంలో మగ్గిపోవడమే తమ ఘనకార్యం అని భావించడం తప్పవుతుంది. అలాంటి ఆలోచనలకు ప్రచారం కల్పించడం, ప్రోత్సహించడం తప్పవుంది.
చాలా మతాల్లో డబ్బు పాపిష్టిది అనే అభిప్రాయం కలిగించారు. సంపన్నుల పట్ల వ్యతిరేక భావన కలిగించారు. ఈ ఆలోచనలను మన బుర్ర నుంచి తొలగించాలి. అవకాశాలను అందిపుచ్చుకోవాలి.
నీ పేదరికానికి నీ పూర్వ జన్మ కారణం అని కొన్ని మతాలు చెబితే, సమాజమే కారణం అని మార్క్స్ చెప్పాడు. బౌద్దం నయం నీ పరిస్థితికి నువ్వే కారణం అంటుంది అంటారు రజనీష్. ఎవరేం చెప్పినా మన పరిస్థితికి మనమే కారణం. మన నిర్ణయాలే మనల్ని తయారు చేస్తాయి. పేదరికంలో ఉండిపోవాలా? సంపన్నుడిగా మారాలా? అనేది నిర్ణయించుకోవలసింది ఎవరికి వారే. తల రాతల్లోనూ, చిలక జోస్యంలోనో మన భవిష్యత్తు ఉండదు. మన చేతిలో, మన నిర్ణయాల్లోనే మన భవిష్యత్తు ఉంటుంది. మనం ఏం కావాలో మనమే నిర్ణయించుకోవచ్చు. అంటే అదేదో అల్లా ఉద్దీన్ అద్భుత దీపం మాదిరిగా కోరుకున్నది ప్రత్యక్షం అవుతుంది అని కాదు..... మనం ఏం కావాలనుకుంటున్నాం, పేదలుగానే ఉండిపోవాలా? ఎదుగుబోదుగు లేని జీవితం గడపాలా? సంపన్నుడిగా మారాలా? అనే నిర్ణయం మన చేతిలోనే ఉంటుంది. నిర్ణయం తీసుకున్న తరువాత ఆ లక్ష్యాన్ని సాధించే విధంగా మన అడుగులు పడాలి. నిర్ణయం తీసుకోగానే సరిపోదు. దానికి తగిన కృషి ఉండాలి. మీ పేదరికానికైనా, మీ సంపన్నతకైనా మీరే కారణం. మీకు మీరే యజమాని. ముందుగా డబ్బు పాపిష్టిది అనే ఆలోచనలు తుడిచిపెట్టాలి. డబ్బును ఆహ్వానించాలి. గౌరవించాలి.
గౌరవం ఉన్న చోటే డబ్బు నిలుస్తుంది.
బి మురళి (24-11-2019 ధనం -మూలం )

Kudos for your all sayings Sir!!
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిడబ్బును ఆహ్వానించాలి. గౌరవించాలి.
గౌరవం ఉన్న చోటే డబ్బు నిలుస్తుంది.
సూపర్.
లక్ష్మీ చపల చిత్తః అన్నారు కదా. కొంత పొడిగించి ఈ విషయం పై కూడ రాయండి.
జిలేబి