22, ఆగస్టు 2011, సోమవారం

మాస్ హిస్టీరియా వచ్చినట్టుగా అవినీతిపై ఊగిపోతున్నారు.. లోక్ పాల్ పరిధిలోకి .మీడియా, కార్పొరేట్ రంగం, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్‌

 అదేంచిత్రమో కానీ మన దేశంలో ఒక్కో కాలంలో ఒక్కో అంశం తెరపైకి వచ్చి తెగ హడావుడి చేస్తుంది. ఇప్పుడు అవినీతిపై తీవ్ర స్థాయిలోవ్యతిరేకత కనిపిస్తోంది. స్కూల్ పిల్లలు మొదలుకుని ఐటి ఉద్యోగులు, వాకింగ్‌కు వెళ్లే రిటైర్డ్ ఉద్యోగులు, గృహిణులు అంతా ఒక్కసారిగా అవినీతిపైనే మాట్లాడుకుంటున్నారు. మాస్ హిస్టీరియా వచ్చినట్టుగా అవినీతిపై ఊగిపోతున్నారు. 


ఇంత మంది అవినీతిని ఇంతగా వ్యతిరేకిస్తుంటే, మరి అవినీతికి పాల్పడుతున్నది ఎవరు? అందరి సహకారం లేకుంటే అవినీతి ఎలా బతికి బట్టకడుతోంది? అన్నా హజారే సాగిస్తున్న అవినీతి ఉద్యమానికి మద్దతు తెలపనివాడిదే పాపం అన్నట్టుగా వాతావరణం ఏర్పడింది. నిజంగా భారతీయుల్లో అవినీతి పట్ల ఇంతటి ధర్మాగ్రహం ఉందా? కళ్ల ముందు కనిపిస్తున్నప్పుడు కాదని ఎలా అనగలం. మంచిదే. కానీ చిత్రం ఏమంటే ఈ మధ్యనే నిర్వహించిన ఒక సర్వేలో ప్రపంచంలోని అవినీతిమంతమైన దేశాల్లో మనం 87వ స్థానంలో నిలిచాం. మరో జాతీయ చానల్ ఇటీవల నిర్వహించిన సర్వేలో దేశంలో ప్రధాన సమస్య అవినీతి అని 61 శాతం మంది పేర్కొన్నారు.


 క్యాండిల్స్ పట్టుకుని ఊరేగడంతోనే సరిపోతుందా? మేం లంచం ఇవ్వం, తీసుకోం అని ప్రతిజ్ఞ చేస్తారా? చేస్తే ఎంత మంది ఆ మాట నిలుపుకొంటారు. ఇంత పెద్ద సంఖ్యలో జనం అవినీతిని వ్యతిరేకిస్తున్నప్పుడు అన్నాకు జై కొట్టడంతోనే బాధ్యత తీరిపోదు. లంచం ఎందుకు ఇవ్వాలి? అని ప్రశ్నించగలగాలి.
అలా ప్రశ్నిస్తున్న సూచనలు కనిపించడం లేదు. ఎవరో ఉద్యమిస్తారు, మాకు ఇప్పుడు ఎలాగోలా పని చేసుకోవడం ముఖ్యం, దాని కోసం లంచం ఇవ్వక తప్పడం లేదు అనే ధోరణి మంచిది కాదు. ఎవరో ఉద్యమించడం కాదు కానీ నా వంతుగా నేను లంచం ఇవ్వను అని నిర్ణయించుకోవచ్చు కదా! ఇంతకూ అన్నా హజారే ఉద్యమిస్తున్నది మనం నిత్యం ఎదుర్కొనే అవినీతి సమస్యపై కాదు.



 జాతీయ స్థాయిలో ప్రభుత్వాలకు సంబంధించిన వ్యవహారాలపైనే అన్నా ఉద్యమిస్తున్నారు. ఐతే అది అవినీతి ఉద్యమం కాబట్టి అంతా మాస్ హిస్టీరియా మాదిరిగా అండగా నిలుస్తున్నారు కానీ అన్నా ఉద్యమిస్తున్న అంశంపై పెద్దగా అవగాహన లేదు. సాధారణ పౌరుడు మండల కార్యాలయం, మున్సిపాలిటీల్లో పనుల కోసం వెళ్లినప్పుడు అవినీతితో ఇబ్బంది పడుతున్నాడు. అన్నా చేస్తున్న ఉద్యమంలో ఈ సామాన్య సమస్య ప్రస్తావనే లేదు. ఐతే ప్రజల్లో ఈ వ్యవస్థ పట్ల, అవినీతి పట్ల తీవ్ర స్థాయిలో నెలకొన్న అసంతృప్తిని ప్రదర్శించే విధంగా ఉంది అన్నా ఉద్యమానికి లభిస్తున్న మద్దతు. ఒక పార్టీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడితే, మరో పార్టీని ఎన్నుకోవాలి. వారూ పెద్ద తేడా లేకుండా పాలిస్తున్నారు.


 మళ్లీవాళ్లపై వ్యతిరేకత, మరో పార్టీని ఎన్నుకోవాలి. పార్టీలు మారుతున్నాయి తప్ప ప్రజలకు మేలు జరగడం లేదు, ప్రజలు ఆశించిన పాలన రావడం లేదు. ఈ పరిస్థితి వల్ల ప్రజల్లో తీవ్రమైన నిరాశ ఏర్పడింది. అన్నా ఉద్యమానికి దేశ వ్యాప్తంగా లభిస్తున్న మద్దతు ఈ నిరాశ నుండి పుట్టిందే. జన లోక్‌పాల్ బిల్లులో ఏముందో, ఆ చట్టం వస్తే కలిగే మార్పు ఏమిటో పెద్దగా అవగాహన లేకున్నా ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై వ్యతిరేకతతో ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్నారు. ఒక రాజకీయ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడితే నష్టమేమీ లేదు. మరెన్నో పార్టీలు ఉన్నాయి. కానీ ప్రజలకు మొత్తం రాజకీయ వ్యవస్థపైనే నమ్మకం పోవడం ప్రజాస్వామ్యానికి మంచిది. కాదు ఇప్పుడు మనమీ ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాం. ఏ ఒక్క పార్టీలోనూ నిజాయితీ కనిపించడం లేదు. అందుకే అన్నా దీక్ష వద్దకు రాజకీయ పార్టీల నాయకులు వచ్చినప్పుడు ఛీ కొట్టి జనం వెనక్కి పంపించారు. అయతే దీనివల్ల సమస్య పరిష్కారం కాదు. దేశంలో ఏ మార్పు అయినా జరగాల్సింది రాజకీయ వ్యవస్థ ద్వారానే. ఆ వ్యవస్థపై వ్యతిరేకత పెంచడానికి అన్నా లాంటి వారు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. నాయకుల స్వయం కృషి చాలు. లంచం ఇవ్వం, తీసుకోం అని ప్రజలు నిర్ణయం తీసుకోవడానికి అన్నా హజారే ఉద్యమందోహదం చేయాలి.




హైదరాబాద్ లో జరిగిన ఒక సమావేశం లో అరుందతి మాట్లాడుతూ .....................అవినీతిపై ప్రజల్లో చైతన్యం రానంతవరకు జన్ లోక్‌పాల్, లోక్‌పాల్ బిల్లు వచ్చినా ఏమి ఒరగదని ఆమె అభిప్రాయపడ్డారు. అన్నా హజారే ఉద్యమానికి మీడియా, ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. అన్నా హజారే చేపట్టిన ఉద్యమం మధ్యతరగతి ప్రజానీకాన్ని దృష్టిలో పెట్టుకొని నడుస్తోందని  ప్రస్తుతం సమాజంలో కీలక భూమిక పోషిస్తోన్న మీడియా, కార్పొరేట్ రంగం, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్‌ల్లో అవినీతి నెలకొందని, వాటిని కూడా లోక్‌పాల్ బిల్లు పరిధిలోకి తీసుకురావాలని అరుంధతి రాయ్ డిమాండ్ చేశారు..........


 ఇప్పుడు హడావుడి చేస్తున్న మీడియా , పెద్దలు ఈ డిమాండ్ ను వినగలదా? ఈ డిమాండ్ ను అంగీకరించే మాట అటుంచి అవినీతిపై హడావుడి చేస్తున్నా వారి మీడియాలో ఈ డిమాండే కనిపించలేదు ?  

11 కామెంట్‌లు:

  1. మీకో విషయం తెలుసా? నా చేత http://mothertheresaindia.org.in వెబ్‌సైట్ చెయ్యించిన వ్యక్తి కూడా దొంగ NGOయే. అతను నాకు రెండుమూడు సార్లు బౌన్సెబుల్ చెక్కులు ఇచ్చాడని రెండుమూడు సార్లు అతని వెబ్‌సైట్ మూసివెయ్యడం జరిగింది. అతని ఇంటిలో ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. విదేశాలలో ఉన్నవాళ్ళు ఆ వెబ్‌సైట్ చూస్తుంటారు. అతనికి విదేశాల నుంచి నిధులు వస్తే నాకు బహుమతి ఇస్తానని మధ్యపెట్టి నా చేత వెబ్‌సైట్ చెయ్యించాడు. ఇప్పటి వరకు నాకు ఏమీ ఇవ్వలేదు. కొన్ని సార్లు దొంగ చెక్కులు ఇచ్చాడు, కొన్ని సార్లు క్యాష్ ఇచ్చాడు. ఇదేమని అడిగితే తనకి ఇప్పటి వరకు నిధులు రాలేదనీ, తనకే నిధులు అడిగే ఇతర NGOలు ఉన్నారనీ చెప్పాడు. ప్రొఫెషన్ కోసం ఎవరో చెప్పిన పనులు చేస్తాం, కొన్ని సార్లు వాళ్ళని నమ్మి మోసపోతుంటాం. నేను ఆ NGOని నమ్మి అలాగే మోసపోయాను. ఆ వెబ్‌సైట్ నేను చెయ్యకపోతే వైజాగ్‌లో ఇంకో వ్యక్తి చేత చెయ్యించగలడు. కొన్ని సార్లైనా అతని నుంచి డబ్బులు రాబట్టగలిగాను. నన్ను ఎంత కాలం ఫూల్ చెయ్యగలడో చూస్తాను.

    రిప్లయితొలగించండి
  2. మురళి గారూ, చాలా బాగా రాశారు. ఇంకా వివరణాత్మకంగా ఇంకో వ్యాఖ్య రాస్తాను. ముందు బాగా రాశారని చెప్పడానికి వచ్చాను

    రిప్లయితొలగించండి
  3. http://lightbehindshadow.blogspot.com/2011/08/blog-post_2694.html

    రిప్లయితొలగించండి
  4. అవినీతిని వ్యతిరేకించాల్సిందే కానీ అవినీతి మాయమైపోయినంతమాత్రాన గొప్ప అద్భుతాలు జరిగిపోవు. దేశంలో ఇప్పటికీ 70% మంది పల్లెటూర్లలో ఉంటున్నారు. అవినీతి 100% మాయమైనా వీళ్ళ బతుకులు మారవు. ఆర్థిక అసమానతల గురించి మాట్లాడకుండా, పల్లెలు & పట్టణాల మధ్య సమతౌల్యం సాధించడం గురించి మాట్లాడకుండా కేవలం అవినీతి గురించే మాట్లాడితే ఏమి లాభం? పల్లెటూరివాణ్ణి పిలిచి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొందాం రా అని అంటే అవినీతిని నిర్మూలిస్తే నాకేమొస్తుంది, నా బతుకేమైనా మారుతుందా అని అడుగుతాడు. మిడిల్ క్లాస్ ఉద్యోగులు ఉద్యోగాలకి సెలవులు పెట్టి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనడానికి వాళ్ళు పని చేసే కంపెనీలు ఎలాగూ ఒప్పుకోవు. కొంత మంది డబ్బున్నవాళ్ళు వ్యక్తిగత పాపులారిటీ పెంచుకోవడానికి ఈ తూతూమంత్రపు ఉద్యమాలు నడుపుతారు.

    రిప్లయితొలగించండి
  5. Before posting such articles, better you first take oath that you will never encourage or indulge in corruption. @ Buddha Murali, Sujatha.

    రిప్లయితొలగించండి
  6. http://amruthamathanam.blogspot.com/2011/08/blog-post_13.htmlఅవినీతి ఉద్యమంలో ముందున్నఅవినీతి పరులు ..
    అజ్ఞాత గారు ఇప్పుడు మీ కామెంట్ చూసి రాసింది కాదు .. చాలా ముందుగానే రాశాను వీలుంటే చూడండి . నేను నెలనెలా జీతం పై బతికే వదినండి అవినీతి పై పోరాటం చేసేంత మీ అభిమాన నాయకుడంతటి వాణ్ణి కాదు .. జయప్రకాశ్ నారాయణ సైతం ఇప్పుడు జరుగుతున్న అవినీతి ఉద్యమం పై మీడియా tamashaa nu లైవ్ గా చూపుతోందని అన్నారు. అరుంధతి మాటలు చూశారు కదా .

    రిప్లయితొలగించండి
  7. buddha murali - Buzz - సార్వజనీన
    అవినీతికి దూరంగా ఉండాలనే ఒక నియమం పెట్టుకున్నాను . ఇల్లు కట్టినప్పుడు నేను ఎవరికీ పైసా కూడా లంచం యివ్వలేదు. అంతా ముగిశాక మాబిల్డర్ తో అదే మాట చెప్పాను . ఆతను నన్ను ఎగాదిగా చూసి సార్ మీలాంటి వాళ్ళతో వచ్చిన చిక్కే ఇది . కాలనీలో మొత్తం ౫౦ ఇళ్ళను కట్టాను అన్నింటికీ కలిపి ఒకే సారి లంచం ఇచ్చాను . నేను ఇచ్చిన లంచం కాకుండా మళ్లీ కొందరి వద్ద తీసుకున్నారు. మీరు ఇవ్వలేదు అదే తేడా అన్నాడు. ఇంతకు నేను లంచం ఇచ్చినట్ట ఇవ్వనట్ట అనేది నాకు అర్థం కాలేదు. మీలో ఎవరైనా లంచం ఇవ్వకుండా పని చేయించుకున్న వాళ్ళు ఉంటే వారి అనుభవం చెబితే సంతోషంసవరించు ( idi buzz lo 17 na rashanandi aznatha garu )

    రిప్లయితొలగించండి
  8. http://www.koumudi.net/gollapudi/082211_anna_venuka_manishi.html
    aznathala kosam

    రిప్లయితొలగించండి
  9. aznatha garu mi kula vruthiki sambandinchi yedo rashavu ni kanna nuvvu prasthavinchina vallu nayam vallu dharna chesi photo digi patrikalaku iccharu nuvvu matram aznathangane unnavu. dayachesi nuvvu yemi rasinaika chudanu

    రిప్లయితొలగించండి
  10. ఇంత మంది అవినీతిని ఇంతగా వ్యతిరేకిస్తుంటే, మరి అవినీతికి పాల్పడుతున్నది ఎవరు?
    ---------
    తేలని ప్రశ్న

    రిప్లయితొలగించండి
  11. అందరూ శుద్ధ శాకాహారులే కానీ బుట్టలో కోడి పిట్ట మాయమైంది.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం