హిందీలో పలు భక్తి చానల్స్ వస్తున్నప్పుడే ఎన్‌టీవి సంస్థ వనితల కోసం ప్రత్యేకంగా ఒక వనితా చానల్, భక్తి చానల్ తీసుకు రావడానికి ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలియగానే టీవీ 9 హడావుడిగా ప్రపంచంలోనే తొలి సర్వమత అధ్యాత్మిక చానల్ అంటూ సంస్కృతి చానల్‌ను ముందుగా ప్రారంభించింది.
అయితే ఎన్‌టీవి భక్తి చానల్ కన్నా ముందు ప్రసారాలు మొదలు పెట్టాలనే హడావుడి తప్ప చానల్‌ను విజయవంతంగా నిర్వహించడంపై శ్రద్ధ లేకపోవడంతో ఎంత వేగంగా మొదలైందో, అంతే వేగంగా చరిత్ర ముగిసింది. ఆ చానల్‌ను ఎలా నిర్వహించాలో తెలియక టీవీ 1 అని పేరు మార్చారు. ఆ చానల్ ఒకసారి దళిత ఉద్యమ చానల్‌గా కనిపిస్తోంది. మరోసారి నాటకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారేమో అనిపిస్తుంది. మొత్తం మీద నానా కంగాళీ చానల్‌గా మారిపోయింది.
ఇక వనిత చానల్ పేరుకు వనిత అయినా ఒక ఎంటర్‌టైన్ మెంట్ చానల్‌గానే నిర్వహిస్తున్నారు తప్ప మిగిలిన చానల్స్ కన్నా మహిళలకు సంబంధించి పెద్దగా ప్రత్యేకతేమీ ఇందులో కనిపించడం లేదు. పాత తరం నటీనటులను అన్ని చానల్స్‌లోనూ ప్రసారం చేస్తుంటే వీళ్లు ఆనాటి హీరోయిన్ల ఇంటర్వ్యూలు చూపుతున్నారు. వనితలో గోల్డెన్ క్లాసిక్ పాత సినిమా పాటలు ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది.
నవ్వుల గోల
ఎంటర్‌టైన్ మెంట్ చానల్స్‌తో పాటు న్యూస్ చానల్స్ అన్నింటిలోనూ ఏదో ఒక సమయంలో కామెడీ బిట్స్‌ను చూపిస్తున్నారు. గుండెపోటు తెప్పించే వార్తల గొడవల మధ్య కాసేపు హాయిగా నవ్వుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు చూసే వారి సంఖ్య బాగానే ఉంటుంది. అలాంటిది ఏకంగా 24 గంటల పాటు హాస్య కార్యక్రమాలు వస్తే ఎలా ఉంటుంది. హాస్యాన్ని ఇష్టపడే వాళ్లు ఎగిరి గంతేస్తారు కదూ! తెలుగులో 24 గంటల కామెడీ కార్యక్రమాల చానల్ ఒకటుంది. పాయసంలో రాయిలా కామెడీ బిట్స్ మధ్యలో ఆ మాటలను భరించడం కష్టంగా ఉంటోంది. కాసేపు రిలాక్స్ అవుదామని ఎంతో ఆసక్తిగా జెమినీ కామెడీ చానల్ పెట్టగానే యాంకర్‌కు ఎవరో ఫోన్ చేయడం వారిద్దరు ఒక్కో సారి చిన్ననాటి స్నేహితుల్లా, పక్కింటి పరిచయస్తుల్లా, ఒక్కోసారి ప్రేమికుల్లా మాట్లాడేసుకుంటుంటారు. టీవీలు పుట్టక ముందు రేడియోల్లో తమ పేరు వినాలనే కోరిక ఉన్నవారికి మీరు కోరిన పాటల కార్యక్రమం ఉండేది. తమ పేరు వినడానికి చాలా మంది తపన పడేవారు. జెమినీ కామెడీ ఆనాటి రోజులు గుర్తుకు వచ్చేవిధంగా ఉన్నాయి. ఇంకా రేడియో నయం తాము కోరిన పాటను కార్డుపై రాస్తే చదివే వారు కావలసిన మ్యాటర్ మాత్రమే చదివి పేరు వినిపించేవారు. ఇప్పుడేమో జెమినీ కామెడీలో ఇప్పుడే లేచావా... టిఫిన్ చేశావా? కాలేజీకి వెళ్లలేదా? అంటూ ప్రేమికుల్లా మాట్లాడుకోవడం, నీ పేరు అని యాంకర్ అడిగితే ఫోన్ చేసిన వారెవరో ఆ... అంటూ ఎవరికీ అర్థం కాకుండా ఏమిటో చెప్పడం ఈమె మళ్లీ అడగడం వినిపించడం లేదనడం... భరించడం కష్టంగా ఉంది.
ఒక కామెడీ బిట్ కోసం ఇంత సోది భరించాలా? అనిపించి చానల్ మార్చేయక తప్పని పరిస్థితి. పోనీ ఫోన్ చేసేవారంతా టీవి చూసేస్తారు, దాంతో వీవర్ షిప్ పెరుగుతుంది అనుకుంటే అదీ లేదు. ఒక పాతిక మంది ఉంటారు. ఎప్పుడు ఫోన్ చేసినా వారి పేర్లే హలో అనగానే యాంకర్ ఫోన్ చేసిన వారిని గుర్తు పట్టేస్తుంది. కామెడీ బిట్‌కు కామెడీ బిట్‌కు మధ్య గ్యాప్ ఉండాలి నిజమే దాని కోసం ఈ తలనొప్పి మాటల కన్నా వినూత్నంగా ప్రయత్నం చేయవచ్చు. ఇద్దరు యాంకర్స్ హాస్యంగా మాట్లాడుకోవచ్చు. యాంకర్ల కొరత ఉందనుకుంటే తెలుగులో మరే భాషలోనూ లేనన్ని కార్టూన్లు వచ్చి ఉంటాయి. పాత పత్రికల్లో ఉన్న వాటిని చూపిస్తూ మధ్యలో డైలాగు వినిపించవచ్చు.
జీ స్మైల్ పేరుతో 24 గంటల తొలి కామెడీ చానల్‌లో 2003లో ప్రారంభించారు. ఆ సంస్థ ప్రకటించిన వివరాల ప్రకారం జీ స్మైల్ ఆర్థికంగానూ బాగానే ఉందని చెబుతున్నారు. జెమినీ కామెడీ సినిమా బిట్స్‌కే పరిమితం అయితే జీ స్మైల్ మాత్రం హాస్య సినిమాలు, కామెడీ బిట్స్, కామెడీ సీరియల్స్ ప్రసారం చేస్తోంది. దేశంలో తొలి కామెడీ చానల్‌గా జీ స్మైల్ రికార్డు సృష్టించింది. తెలుగులో తొలుత నవ్వుల్ నవ్వుల్ అంటూ జెమినీ సాటిలైట్ కనెక్షన్ తీసుకున్న వారికి మాత్రమే ఈ చానల్‌ను ప్రత్యేకం చేశారు. తరువాత ఇప్పుడు జెమినీ కామెడీగా మారింది. కొద్దిపాటి శ్రద్ధ చూపితే కాసేపు సరదాగా నవ్వుకుందాం అనుకునే వారి పాలిట వరంగా మారుతుంది.
జీ స్మైల్ పేరుతో 24 గంటల తొలి కామెడీ చానల్‌లో 2003లో ప్రారంభించారు. ఆ సంస్థ ప్రకటించిన వివరాల ప్రకారం జీ స్మైల్ ఆర్థికంగానూ బాగానే ఉందని చెబుతున్నారు. జెమినీ కామెడీ సినిమా బిట్స్‌కే పరిమితం అయితే జీ స్మైల్ మాత్రం హాస్య సినిమాలు, కామెడీ బిట్స్, కామెడీ సీరియల్స్ ప్రసారం చేస్తోంది. దేశంలో తొలి కామెడీ చానల్‌గా జీ స్మైల్ రికార్డు సృష్టించింది. తెలుగులో తొలుత నవ్వుల్ నవ్వుల్ అంటూ జెమినీ సాటిలైట్ కనెక్షన్ తీసుకున్న వారికి మాత్రమే ఈ చానల్‌ను ప్రత్యేకం చేశారు. తరువాత ఇప్పుడు జెమినీ కామెడీగా మారింది. కొద్దిపాటి శ్రద్ధ చూపితే కాసేపు సరదాగా నవ్వుకుందాం అనుకునే వారి పాలిట వరంగా మారుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం