ఆవిడెవరో వనజా రావు క్విక్ మ్యారేజేస్ అంటూ తెగ హడావుడి చేస్తున్నారు. ఆమె వ్యాపారం చూసి ప్రభుత్వానికి కన్ను కుట్టిందో మరేమిటో కానీ క్విక్ మ్యారేజేస్ కు పోటిగా క్విక్ డైవోర్స్ స్కీం ప్రకటించేసింది కేంద్రం. దీంతో మనం ఎలగయితే నేఁ అమెరికాను తోసి ముందుకు వెళ్లి పోయాం .
ఆర్థిక రంగంలో కాదు. విడాకుల రంగంలో... ఔను అమెరికా పౌరులకు విడాకులు మంజూరు కావాలంటే రెండేళ్లవరకు పడుతుంది. పలు ఐరోపా దేశాల్లో ఆరేళ్ల వరకు సమయం పడుతుంది. అమెరికాలో విడాకులు కోరుకునే సంఖ్య చాలా స్పీడ్‌గా పెరుగుతోంది కానీ విడాకులు మాత్రం అంత స్పీడ్‌గా లభించడం లేదు. అమెరికాలోని ప్రతి వెయ్యి జంటల్లో నాలుగు వందల జంటలు విడాకుల పేరుతో విచ్ఛిన్నం అవుతున్నాయి. మన దేశంలో వెయ్యికి 11 జంటలు మాత్రమే విడాకులు తీసుకుంటున్నారు. క్విక్ మ్యారేజెస్ మాదిరిగా నిజానికి క్విక్ విడాకుల అవసరం మనకన్నా అమెరికాకే ఎక్కువగా ఉంది. కానీ ఎందుకోగానీ ఈ సౌకర్యం అమెరికా కంటే ముందే మనకు లభించింది. హిందూ వివాహ చట్టం సవరణ బిల్లు 2010కి కేంద్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేయడంతో ఇప్పుడు మన దేశంలో విడాకులు పొందడం చాలా సులభం. మహిళలను గృహ హింస బారి నుంచి తప్పించాలన్న అభిప్రాయంతో కేంద్రం ఈ మార్పును తెచ్చింది. అందువల్లనే భార్య విడాకులు కోరుకున్న పక్షంలో భర్త అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా విడాకులు మంజూరు చేసే విధంగా చట్టంలో మార్పులు తెచ్చారు.

ఇష్టం ఉన్నా లేకున్నా గతంలో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నవారు తప్పని సరిగా కనీసం 18 నెలల పాటు నిరీక్షించాల్సి వచ్చేది. తాత్కాలిక ఆవేశంతో విడాకుల కోసం దరఖాస్తు చేసినా 18 నెలల గడువు ఉండడం వల్ల అన్ని కోణాల్లో ఆలోచించి తమ నిర్ణయాన్ని మార్చుకుంటారు అనే ఉద్దేశంతో ఈ నిబంధన విధించారు. ఏం ఆలోచించారో కానీ ఇప్పుడు దీన్ని తొలగించారు. కోర్టుకు వచ్చినప్పుడు కేసుల పరిస్థితిని బట్టి న్యాయమూర్తే నిర్ణయం తీసుకుంటారు. అంతేతప్ప తప్పని సరిగా వేచి ఉండాల్సిన అవసరం లేదు. విడాకుల కోసం దంపతులు కోర్టులను ఆశ్రయించినప్పుడు తప్పనిసరిగా కొంతకాలం నిరీక్షించాలనే నిబంధన విధించారు. ఎవరైనా తమ దాంపత్యం కలకాలం ఉండాలని కోరుకుంటూనే పెళ్లి చేసుకుంటారు. అంతేతప్ప సరదాగా కొంతకాలం కాపురం చేసి విడాకులు తీసుకుందామని ముందుగానే నిర్ణయించుకుని పెళ్లి చేసుకునేవారు ఎవరూ ఉండరు.
భార్య వేసుకున్న డ్రెస్ నచ్చలేదని భర్త విడాకులు ఇచ్చాడని, భార్య చేసిన కాఫీ నచ్చలేదని భర్త విడాకులు కోరాడని అమెరికా వార్తలను మనం ఒకటి రెండు దశాబ్దాల క్రితం నిజమా? అని వింతగా చదివేవాళ్లం. ఆర్థిక సంస్కరణల తరువాత ఇలాంటి వింతలు మనకు ఇప్పుడు లోకల్ వార్తలు అయ్యాయి. ఇలాంటి దాంపత్యాన్ని హిందూ వివాహ చట్టంలోని సవరణలు మరింత ప్రమాదంలో పడేట్టుగా ఉన్నాయి. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అవుతోందని ఆందోళన చెందుతున్న సాంప్రదాయ వాదులకు వివాహ చట్టంలోని సవరణలు మరింతగా ఆందోళన కలిగించే విషయం.
దంపతుల మధ్య ఇక కలిసి ఉండే ప్రసక్తే లేదు అనే భావన ఏర్పడినప్పుడు, కలిసి ఉండే పరిస్థితి లేనప్పుడు, వారిని ఇంకా కలిపే ఉంచాలని ప్రయత్నించడం అర్ధరహితం, అమానవీయమని లా కమీషన్ విడాకులను సమర్థిస్తూ పేర్కొంది. వివాహం అర్ధరహితంగా మారినప్పుడు విడాకులే పరిష్కారం అని తేల్చింది. నిజమే రోజూ శత్రువుల్లా కలిసి ఉండడం కన్నా ఎవరికి వారు విడివిడిగా కొత్త జీవితాలు ప్రారంభించడమే మంచిది. అయితే అది ఆలోచనతో తీసుకునే నిర్ణయం కావాలి కానీ తాత్కాలిక ఆవేశంతో తీసుకునే నిర్ణయం అయితే కొత్త నిర్ణయం వల్ల మరిన్ని కొత్త సమస్యలు వస్తాయి. వివాహం తరువాత విడాకుల కోసం ఇప్పుడున్న నిబంధనల ప్రకారం కనీసం 18 నెలల పాటు వేచి చూడాలి. ఆ తరువాత కూడా వెంటనే విడాకులు మంజూరు అవుతాయనే నమ్మకం లేదు. విడాకుల కోసం దశాబ్దాల పాటు కోర్టుల చుట్టూ తిరిగిన కేసులు సైతం ఉన్నాయి. పొరపాటు గ్రహించి విడాకులు తీసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకునే వారికి ఇలాంటి ఆలస్యం నిజంగా శాపమే. దశాబ్దాల తరబడి కోర్టుల చుట్టూ తిరగడానికే జీవితం సరిపోతుంది ఇక కొత్త జీవితం మొదలు పెట్టేది ఎప్పుడు. ఇలాంటి వారి కోణంలో ఆలోచిస్తే 18 నెలల పాటు తప్పనిసరిగా వేచిచూడాల్సిన గడువు తొలగించడం మంచి నిర్ణయమే అనిపిస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆవేశంతో విడాకుల కోసం కోర్టులను ఆశ్రయించే కేసులు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇలాంటి కేసుల్లో ఈ కొత్త మార్పు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది.

విడాకుల కోసం ఇద్దరిలో ఒకరు కోరుకుంటే వేధించాలనుకున్న మరొకరు కేసుకు హాజరు కాకుండా పోవడం వల్ల ఏళ్లతరబడి కేసులు సాగుతున్నాయి. కొత్త మార్పుల ప్రకారం ఇప్పుడు భార్య విడాకులు కోరితే అభ్యంతరం వ్యక్తం చేసే అధికారం భర్తకు ఉండదు. 18నెలలు వేచిచూడాల్సిన అవసరం లేదు. అదే భర్త మాత్రమే విడాకులు కోరితే అభ్యంతరం చెప్పే అధికారం భార్యకు ఉంటుంది. మారిన పరిస్థితుల్లో మగవారే కాదు ఆడవారు సైతం కొన్ని సందర్భాల్లో ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే పెద్దలు సర్దిచెప్పేవారు. ఇప్పుడు ఇద్దరూ చదువుకున్నవారే, ఇద్దరూ సంపాదిస్తున్నారు. ఇది కుటుంబ సంతోషానికి ఉపయోగపడితే మంచిదే కానీ కొన్ని సందర్భాల్లో ఇది ఇద్దరి మధ్య విడాకులకు దారితీసేందుకు ఉపయోగపడుతోంది.
తక్షణ విడాకులు భస్మాసుర వరమా ? లేక కల్ప తరువా ? కాలమే సమాధానం చెబుతుంది
.
.