మేడం మీరు వంట చేస్తున్నట్టుగా ఒక ఫోటో కావాలి ? ఇంటర్వ్యూ ముగిశాక బ్లిట్జ్ పత్రిక జర్నలిస్ట్ ఇందిరా గాంధీని అడిగాడు. ఆమె నవ్వి నేను ఆలాంటి ఫోటో కు పోజు ఇవ్వనన్నారు . నాకు వంట చేయడం వచ్చు కానీ వంట చేస్తూ ఫోటో ఇచ్చే ప్రసక్తే లేదన్నారు . అతనికి అర్థం కాలేదు ఫొటోకు అభ్యంతరం ఎందుకో అనుకున్నాడు .. నేను వంట చేస్తున్నప్పటి ఫోటో మీ పత్రికలో వచ్చిందనుకోండి . ఈ దేశ ప్రదాని కూడా వంట చేయాల్సిందే నువ్వేమిటి అని మగాళ్ళు భార్యను అంటారు . దానికి నేను అవకాశం ఇవ్వను అని ఆమె సున్నితంగా తిరస్కరించారు.
పత్రికల వాళ్ళు అడగ గానే మురికి వాడల పిల్లలను ముద్దు పెట్టుకొంటూ పోజులు ఇచ్చే నాయకులు, ఎన్నికలు రాగానే బట్టలుతుకుతూ, రిక్షా తొక్కుతూ పోజులు ఇచ్చే పనికి మాలిన నాయకులున్న దేశం లో ఇందిరా గాంధీ చెప్పిన ఆ మాట నాకు బాగా నచ్చింది .
నేనేమి ఆమె అభిమానిని కాదు . పైగా . చదువుకొనే రోజుల్లో దేశం లోని సమస్యలన్నింటికీ ఇందిరాగందినే కారణం అనుకొనే వాడిని. ఆమె పొతే ( బహుశా చనిపోతే కావచ్చు )దేశం లోని సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అన్నంతగా నమ్మేవాడిని.
స్కూల్ బుక్స్ కన్నావార్త పత్రికల పైనే అభిమానం ఎక్కువ . పత్రికలు క్రమం తప్పాకుండా చదివే వాణ్ణి ఆ సమయం లో ఈనాడు ప్రభావం మరీ ఎక్కువ. ఎవరు ఎలా ఆలోచించాలో అందరి తరపున ఆ పత్రికే ఆలోచించి పెట్టేది. ఇందిరాగాంధీ మీద విషం కక్కుతూ ఆ పత్రిక రాసే రాతల ప్రభావం బాగా పడింది . ఇప్పటి మాదిరిగా ఈనాడు ఉద్దేశాలను విప్పి చెప్పే బలమైన మీడియా అప్పుడు లేదు ... దాంతో ఇందిరాగాంధీ పొతే తప్ప దేశం బాగుపడదు అనే నిర్ణయానికి వచ్చాను .
నాలుగు రైదుగురు తీవ్రవాదులు దేశం మీద యుద్ధం ప్రకటించి అల్ల కల్లోలం సృష్టించి, పార్లమెంట్ మీద దాడి చేసినా , పట్టు బడిన వారికి అల్లుడిలా మర్యాదలు చేస్తున్నా ఇప్పటి నాయకత్వాన్ని చూస్తుంటే .. ఈ దేశానిక ఇందిరాగాంధీ లాంటి మగాడి నాయకత్వం గుర్తుకొస్తోంది .
ఆ మధ్య ఒక వ్యాసం కోసం సమాచారం వెతికినప్పుడు పాకిస్తాన్తో యుద్ద సమయం నాటి సమాచారం చదివాను.
పాకిస్తాన్ తో యుద్ధం తప్పదనే వాతావరణం ఏర్పడిన తరువాత ఆమెరికా అధ్యక్షుడు ఇందిరా గాంధీని సున్నితంగా హెచ్చ రించాడు . మీరు పాకిస్తాన్ తో యుద్ధం చేస్తే , చైనా పాకిస్తాన్ కు అండగా నిలువ నిలుస్తుంది . అలా జరిగితే మేం మాత్రం మీకు అండగా నిలువం అని చెప్పారు .ఒక రకంగా పాక్ తో యుద్ధం వద్దు అనే హెచ్చ రిక... అయినా భయపడకుండా పాకిస్తాన్తో యుద్ధం చేసి ఆ దేశాన్ని రెండు ముక్కలు చేసిన వీరనారి ఇందిరా గాంధీ ... మేం శాంతి కాముకులం దాన్ని మా బలహీనతగా భావించి తోక జాడిస్తే రెండుగా చీలుస్తాం అని చేసి చూపింది ..
విధానాల్లో తప్పు ఉండవచ్చు , కొందరికి నచ్చ వచ్చు, నచ్చక పోవచ్చు కానీ ఇప్పటి నాయకుల్లా కోట్లు సంపాదించిన నాయకురాలు కాదు ఆమె ..
ఆర్థికంగా దేశం దూసుకు వెళుతున్న ఇలాంటి కీలక సమయం లో దేశమంతా మరుగుజ్జ నాయకులే కానీ ఇందిరా గాంధీ లాంటి నాయకులేరి ... ఇలాంటి పరిస్థితుల్లో ఆమె లాంటి నాయకులు ఉండాల్సింది .
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఇందిరా గాంధీ గుర్తుకు వచ్చారు.
ఇందిరా గాంధీని మగాడు అనడం లో ఆడవారిని చిన్న చూపు చూడడం కాదు ... ఒకరి వీరత్వం నచ్చితే సాధారణ మనుషులు వాడు మగాడు అంటారు. అలా నే ఒక అసాధారణ మహిళకు సామాన్యుడి నివాళి వాజ్ పాయి లాంటి నాయకుని తో అపర కాలిక అనిపించుకున్న నాయకురాలు ఆమె .
ఒకసారు ఒకాయన ఒక రైల్లో జెనీవా ప్రయాణం చేస్తున్నారట. ఆయనేదో టాక్సులెక్కలు సరిచూసుకుంటున్నారట. అవేమో ఎక్కడో తేడావస్తున్నాయట. ఇహ లాభంలేదని పక్కనాయన్ని సహాయం అడిగారట. ఆప్రక్కనున్నాయన వాటిని ఇట్టే సరిదిద్ది, "ఎక్కడకు వెళుతున్నారు" అని అడిగారట. "జెనీవాలో సైన్సు కాంఫరెన్సుకు" అని సమాధానమిచ్చారట (ఆ కాన్‌ఫరెన్సును సాపేక్ష సిధ్ధాంతాన్ని వివరించడానికి ఐన్‌టైనుచేత ప్రత్యేకంగా ఏర్పాటుచేస్తున్నారట). దాంతో ఆ ప్రక్కాయన "టాక్సులెక్కలే అర్ధంకాదు నీకు ఇహ సాపేక్ష సిధ్ధాంతం ఏమర్ధమవుతుందీ?" అని అన్నాడట. ప్రయాణం ఎలా గడిచిందో తెలీసుగానీ. చివర్లో ఆ ప్రక్కనాయన "ఇంతమీ మీపేరు చెప్పనే లేదు" అన్నదానికి సమాధానం ఆ అనామకుడు "టాక్సులెక్కలు మాత్రమే వచ్చిన నీలాంటివాళ్ళకు సాపేక్షతా సిధ్ధాంతాన్ని వివరించడానికి జెనీవా వెళుతున్నాను. నేనే ఐన్‌స్టీన్‌ని" అన్నాడట.
రిప్లయితొలగించండిఈ ధీరత్వం అనేది ఇందిరలోని ఒక మంచిపార్శ్వం. ఆవిడచేసిన మంచిపనుల్లో ఇంకొన్ని రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ లాంటివి.
రిప్లయితొలగించండిఅలాగని ఆమెచేసిన పిచ్చి పనులు లేవనికాదు. సెక్యులరిజం అనే పదానికి కొత్త అర్ధాన్ని ఈమే ఇచ్చారేమోకదా. ఇదికాక యుధ్ధంలో(1971) గెలిచినాకకూడా మనమే సంధికి ముదుగా సిధ్ధమయ్యాం కూడా. వానపాములాంటి భింద్రన్‌వాలే ని త్రాచుపామును చేసిందెవరు? ఎందుకు? ఆ ఇహ ఎమర్జెన్సీని ఎవరుమాత్రం మర్చిపోగలరు.
ఎవరికి తెలుసు నిజా నిజాలు
రిప్లయితొలగించండి@ఇండియన్ మినర్వా గారు స్పందించినందుకు థాంక్స్
రిప్లయితొలగించండి@ఫణింద్ర గారు మెచ్చుకోన్నది కొన్ని చర్యలను మాత్రమే వ్యక్తిని కాదు. నిజం అయితే వాటిని మెచ్చుకోన్నట్టు, కాకపోతే .సమస్యే లేదు
Super LIKE for the first paragraph! Thanks for sharing with us Murali garu.. :)
రిప్లయితొలగించండిమధుర వాణి గారు స్పందించి నందుకు థాంక్స్
రిప్లయితొలగించండిGood post
రిప్లయితొలగించండిpost చాలా బాగుంది.
రిప్లయితొలగించండి'నేనేమి ఆమె అభిమానిని కాదు'
ఇది చదివిన తర్వాత ఇంకా బాగుంది.
Thanks for a good post.
మంచి పనులు చెడ్డ పనులను కప్పెయ్యవు
రిప్లయితొలగించండిDespite of her follies,she is the only leader of the country not alone for her party.ఎన్ని బలహీనతలున్నా కాంగ్రెస్ పార్టీకీ,దేశానికీ అమె తర్వాత ఒక్క సరైన నాయకుడు రాలేదు.నేను మా అమ్మాయికి ఆమె పేరే పెట్టాను.
రిప్లయితొలగించండి@శ్రీనివాస్ పప్పు @చందు@kastephale @ రాజేంద్ర ప్రసాద్ గారు స్పందించినందుకు థాంక్స్.
రిప్లయితొలగించండిఅత్యవసర పరిస్థితి కాలం లో మానవ హక్కుల ఉల్లంగన జరిగింది నిజమే. ఆ తరువాత కానీ ఇప్పుడు కానీ మానవ హక్కులను గౌరవిస్తున్నారా ? ఉల్లంగన జరగడం లేదా.? అత్యవసర పరిస్థితి కాలం లో పత్రికలపై సెన్సార్ విధించారు . ఇప్పుడు ఏకంగా మీడియాను కొనేస్తున్నారు .
*ఆవిడచేసిన మంచిపనుల్లో ఇంకొన్ని రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ లాంటివి.*
రిప్లయితొలగించండిమనదేశం సొషలిస్ట్ దేశమని అందుku గా రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణచేశారని, పిల్లలకి పాటలు చెప్పటానికి పనికి వస్తాయి. ఆమే యుద్దం చేసి గెలవడం ఎవరు కాదనరుగాని. దేశాన్ని ఆర్ధిక పరంగా దిగ జార్చటం లో ఘన విజయం సాధించారు. ఇందిరమ్మ పాలన ఆ విషయంలో మరచి పోలేము.
*కాంగ్రెస్ పార్టీకీ,దేశానికీ అమె తర్వాత ఒక్క సరైన నాయకుడు రాలేదు.*
ఎలా వస్తారు. వచ్చిన ఎవరు గుర్తిస్తారు. అంతటి గుర్తింపు వస్తే గాంధి నెహౄ ఫామిలి బ్రాండ్ ఇమేజ్ కి దెబ్బ కనుక గుర్తించరు. పగలు రాత్రి ఏమాత్రం స్థాయిలేని నాయకులను వేసుకొని ప్రణబ్ ముఖర్జి లంటి వారు అన్ని సమస్యలను పరిష్కరిస్తూంటే అటువంటి వారికి ఎమీ గౌరవం ఇస్తున్నారు.
బుద్దామురళి గారు,
రిప్లయితొలగించండిఆరోజుల్లో తెలుగుదేశం పార్టీ కూడా లేదుకదా! మరి ఈనాడు పేపర్ వారికి ఇందిరా గాంధి పైన విరోధం ఎందుకు ఉండేది? అది ఒక ప్రాంతీయ పత్రికకు ఎక్కడో డిల్లి లో ఉన్న ఆమేపై విషం కక్కవలసిన అవసరం ఎమీటి? ఆమే సొషలిస్ట్ ఆర్ధిక పంథాను కొనసాగించటం, ఈనాడు వారికి నచ్చేది కాదా! మీ అభిప్రాయం పంచుకొనేది.
1980 ప్రాంతం అంటే మరీ పతే ఎమీ కదండీ ఒక వేళ మీరు హైదరాబాద్ లో ఉంటే చిక్కడపల్లి లైబ్రరీ కి వెళితే ఆనాటి పత్రికల ఫైల్స్ లభిస్తాయి . అందులో పాత పత్రికలు లభిస్తాయి కావాలంటే చూడండి ఇందిరాగాంధీ కి వ్యతిరేకంగా ఎన్ని రాతలు ఉండేవో. కొందరు మిత్రులు చెప్పిన సమాచారం ప్రకారం రామోజీ కమూనిస్ట్ పార్టీ లో కార్డ్ హోల్డర్ . ఆయన మొదటి నుంచి కాంగ్రెస్స్ వ్యతిరేక శిబిరమే. మరింత సమాచారం తెలుసుకోవాలంటే నరిశెట్టి ఇన్నయ్య రాసిన వందేళ్ళ ఆంధ్రా ప్రదేశ్ రాజకీయాలు బుక్ చదవండి. రాష్ట్రం లో కుల రాజకీయాల గురించి బాగా రాశారు . టిడిపి పుట్టిన తరువాతనే కొన్ని సామజిక వర్గాల్లో కాంగ్రెస్స్ వ్యతిరేకత ఏర్పడిందని అనుకుంటారు నిజం కాదండీ. 1930 ప్రాంతం లోనే జస్టిస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రం లో అధికారం లోకి వచ్చింది . బ్రమ్హనులు కాంగ్రెస్స్ వైపు ఉంటే కమ్మ ,రెడ్డి, కాపు , వెలమ జుస్తిస్ పార్టీ వైపు ఉండేవారు . జుస్తిస్ పార్టీ స్వతంత్రం అవసరం లేదు బ్రిటిష్ వారే పాలించాలని కొరుకొంది. టిడిపి తొలి కాంగ్రెస్స్ వ్యతిరేక పార్టీ అని చాలా మంది అనుకుంటారు కానీ కాదు అంతా కన్నా ముందు జస్టిస్ పార్టీ అదే సిద్ద్న్తలతో పుట్టింది .. ఇన్నయ్య బుక్ లోని ఈ సమాచారం తో వీలును బట్టి పెద్ద వ్యాసం రాయాలని ఉంది .
రిప్లయితొలగించండిరామోజీ గతం లో కమ్యునిస్ట్ కార్డ్ హోల్డర్ వ్యాపారం లో ఎదిగాక బిజిపికి ప్రాణ మిత్రుడు. టిడిపి బిజెపి పొత్తులో సూత్ర ధరి. మార్గదర్శి పై ఉండవల్లి పోరు ప్రరంబించినప్పుడు రాజ గురువుకు అండగా నిలిచింది అద్వాని . వ్యాపారికిలాబమే సిద్ధాంతం తప్ప సోషలిజం, కమ్యునిజం , క్యాపిటలిజం తేడా ఏముంటుంది. కిల్లి కొట్టు నడిపే వాడు కూడా తన చెప్పు చేతుల్లో ఉండే మున్సిపల్ కౌసిలర్ ఉండాలని కోరుకుంటారు . అలాంటిది వేళ కోట్ల వ్యాపారం చేసే పెద్దలు ప్రభుత్వం తమ చేతిలో ఉండాలనుకుంటారు కానీ ఆ ప్రభుత్వం పాటించే సిద్ధాంతాలు ఏవి అనేది చూడరు.ప్రజారాజ్యం పుట్టిన కొత్తలో ౮౦ షాతం వోట్ లు ఆ పార్టీ కే అని రాసి , తరువాత తీవ్రంగా వ్యతిరేకిస్తూ వార్తలు రాశారు . ఇందులో మర్మం ఏమిటో ఆలోచించండి
రిప్లయితొలగించండి>. ఒకరి వీరత్వం నచ్చితే సాధారణ మనుషులు వాడు మగాడు అంటారు.
రిప్లయితొలగించండిఆ మనుషులు ఎవరండీ , మగాల్లా ,ఆడవాళ్ళా ?
జస్టిస్ పార్టీ గురించి కొంచెం తెలుసండి. అందులో డబ్బులున్న వారు (రాజాలు, జమిందారులు) ఉండేవారని. అందరికేంద్ర స్థానం చెన్నై అని, దేశ స్వాతంత్రం,ప్రజల సమస్యలు కన్నా తెల్ల వాడికి సలాం చేయటంలో ముందు ఉండేవారని విన్నాను. వీరికి దేశ స్వాతంత్రం కొరకు పోరాడే కాంగ్రెస్ లో ఉండే, బ్రహ్మణులతో పొసగక వారి ఇమేజిని ప్రజలలో దెబ్బతీయటానికి, ప్రభుత్వ ఉద్యోగాలలో వారు ఎక్కువగా ఉన్నారంటు ప్రచారం చేయటం మొదలుపేట్టారని ఎక్కడో చదివాను. వారు కుల అభిమానాన్ని ఎగతోసి సామాన్య బ్రహ్మణులను ఇబ్బందులకు బాగా గురిచేశారని చదివాను కూడా!
రిప్లయితొలగించండిబాగా చెప్పారు.
రిప్లయితొలగించండినేను కూడా పి.వి ని చిన్నప్పుడు ఈనాడు చదివి చదివి అవినీతి రాక్షసుడిలా ఊహించుకునే వాణ్ణి. ఇప్పుడు తలచుకుంటే తెలిసిస్తొంది అప్పటి మాయా మధ్యమాలలొ ఎలా కొట్టుకుపొయానో అని.
ఇందిరా గాంధి తనని స్త్రీగా సాధించిన విజయాలకి ప్రతీకగా భావించక ఒక వ్యక్తిగ చుడాలనుకునేదట!
Gandhi/Nehru hegemony in politics will disintegrate India.
రిప్లయితొలగించండి