25, ఏప్రిల్ 2012, బుధవారం

బ్రహ్మచారుల పాలన!

ఇంకా తెలవారదేమీ ఈ చీకటి విడిపోదేమీ అంటూ అబ్బాయి బెంగాలీలో హుషారుగా పాడుకుంటూ ఇంకెన్ని రోజులు డార్లింగ్ మా డాడీ రాగానే మన పెళ్లి గురించి మాట్లాడేస్తాను. నా మాటను ఎప్పుడూ కాదనలేదు’’ అని కుర్రాడు భరోసా ఇచ్చాడు. ‘‘నీతో పెళ్లికి మా ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం మా వాళ్ల గొప్పతనం డార్లింగ్! మీ నాన్న బేసిక్ కన్నా మా నాన్న బేసిక్ ఎక్కువ. మీరుండే ఏరియాలో అపార్ట్‌మెంట్ ధరల కన్నా మా ఏరియా అపార్ట్‌మెంట్ ధరలు ఎక్కువ. చివరకు అద్దెలు కూడా మా ఏరియాలోనే ఎక్కువ. అయినా మనం ప్రేమించుకున్నామని ఇంట్లో వాళ్లను ఒప్పించాను’’అంటూ అమ్మాయి తనదే పై చేయి అని చెప్పుకొచ్చింది. ఇద్దరిదీ ఒకే మతం. ఔను ఒకే కులం. కులంలో ఒకే తెగ, తెగలో ఆర్థిక పరిస్థితి ఇద్దరిదీ దాదాపు ఒకటే మన మధ్య సమానత్వానికి ఇంతకు మించి ఇంకేం కావాలని అని ఒకరి కళ్లల్లో ఒకరు ఆప్యాయంగా చూసుకున్నారు.
***
‘‘సారీ డార్లింగ్’’ అబ్బాయి దిగులుగా చెప్పాడు. నేనూ అదే మాట చెప్పాలనుకున్నాను అంటూ అమ్మాయి ఇంతకూ ముందు నువ్వు చెప్పు ఆ సారీ ఎందుకో అని అడిగింది. ‘‘నిన్న నాన్నకు మన ప్రేమ సంగతి చెప్పాను. సంతోషంగా ఒప్పుకున్నారు. మీ నాన్నతో మాట్లాడతానని ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఆ తరువాత ఏమైంది. వాళ్లేం మాట్లాడుకున్నారో తెలియదు కానీ మాటల సందర్భంలో మీ నాన్న కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త అని చెప్పాడట! మా నానే్నమో దీదీకి వీరాభిమాని అంతే చచ్చినా ఈ పెళ్లికి ఒప్పుకునేది లేదన్నాడు’’ అని అబ్బాయి ఆగాడు. అమ్మాయి మొదలు పెట్టింది. ‘‘మీ నాన్న ఒప్పుకున్నా మా నాన్న ఒప్పుకునే ప్రసక్తే లేదు. దీదీలాంటి అహంకారి పార్టీ అభిమానికి మా పిల్లను ఇచ్చేది లేదని మా నాన్న అన్నాడు’’ అంది అమ్మాయి ఈ జన్మలో మనం ప్రేమికులుగానే మిగిలి పోదాం... ఒకరినొకరం మరిచిపోదాం అనుకుంటూ వెళ్లిపోయారు.
***
అమ్మాయి తండ్రి, అబ్బాయి తండ్రి జయహో దీదీ అనుకున్నారు. అబ్బాయికి భారీగా కట్నం వచ్చే ఓ సంబంధం కుదిరింది, అమ్మాయికేమో అమెరికా సంబంధం కుదిరింది. అమ్మాయి అబ్బాయి, వారి తండ్రులు ఈ ప్రేమ సంబంధం ఎలా వదులుకుందామా? అని ఆలోచిస్తుంటే దీదీ వారి పాలిట దేవతగా కనిపించింది. కమ్యూనిస్టు పార్టీ సానుభూతి పరులను తృణముల్ సానుభూతి పరులు చచ్చినా పెళ్లి చేసుకోవద్దని దీదీ ఆదేశించడంతో అప్పటికప్పుడు అమ్మాయి తండ్రి కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం, అబ్బాయి తండ్రి తృణముల్ పార్టీ సభ్యత్వం తీసుకున్నాడు. రెండు పాతిక రూపాయల ఖర్చుతో రెండు కుటుంబాల సమస్య తీరిపోయినందుకు పెద్దలిద్దరు పార్టీ చేసుకున్నారు. చీర్స్ అంటూ అబ్బాయి తండ్రి జయహో దీదీ అని గట్టిగా అరిస్తే, దీదీ కలకాలం వర్థిల్లాలి అని అమ్మాయి తండ్రి మెల్లగా అన్నాడు. ఎందుకంటే ఆయన కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నాడాయె!
పెళ్లి చేసుకోని పిల్లాపాపలతో చల్లగా కాపురం చేయాలని సినీ రచయిత ఒకరు అలవోకగా చెప్పారు కానీ అదే పెద్ద సమస్యను తెచ్చిపెట్టింది. ఇప్పుడు జనాభాలో మనం ఇప్పుడు చైనాను దాటిపోయేట్టుగా ఉన్నాం. సంక్లిష్టమైన ఈ జనాభా సమస్యకు దీదీ చూపిన పరిష్కారం అనుసరించదగింది. దీదీ తొలి సలహా ప్రేమికులకు ఇచ్చింది. తరువాత మెల్లగా భార్యా భర్తలకదే సలహా ఇస్తుంది. భార్యా భర్తలు తృణముల్ కాంగ్రెస్, కమ్యూనిస్టుల్లా ఉండాలనేది దీదీ త్వరలో ఇవ్వబోయే సలహా! ఇందులో భార్య ఎవరు ? భర్త ఎవరు? అంటే ఇంట్లో పెత్తనం ఎవరిదైతే వారు తృణముల్ కాంగ్రెస్ అన్నమాట! భార్యా భర్తలు తృణముల్ కాంగ్రెస్, కమ్యూనిస్టుల్లా ఉంటే ఆ ఇల్లు ఇల్లులా ఎందుకుంటుంది అసెంబ్లీ అవుతుంది. దీదీ కోరుకునేదే అది కదా! జనాభా నియంత్రణకు ఇది దీదీ కనిపెట్టిన చిట్కా. బెంగాల్ ఈ రోజు ఏం ఆలోచిస్తే రేపు దేశం అదే ఆలోచిస్తుందని ఒకప్పుడు గట్టిగా నమ్మేవారు. వివిధ పార్టీల నాయకులు కలిసి కుంభకోణాలు చేయవచ్చు. కానీ పెళ్లిళ్లు మాత్రం చేసుకోవద్దని దీదీ ఇచ్చిన పిలుపు త్వరలోనే దేశంలోని అన్ని పార్టీలకు మార్గదర్శకం కావచ్చు. బ్రహ్మచారి దీదీకి పెళ్లి గురించి చక్కని ఆలోచనలే ఉన్నాయి. అంతేనా..? ఇంట్లో ఉన్నప్పుడు ఏ పత్రిక చదవాలి, ఏ చానల్ చూడాలో కూడా దీదీ ఆదేశాలిస్తున్నారు. దీదీ తాను చేసే ధర్మోపదేశాన్ని ప్రజలకు వివరించడానికి సొంత పత్రిక, సొంత చానల్ ప్రారంభించబోతున్నారు. ఉదయం లేవగానే ఏ టూత్‌పేస్ట్‌తో ముఖం కడుక్కోవాలో, ఏ కంపెనీ టీ తాగాలో దీదీ చెబుతారు. ఉదయం ఏ కంపెనీ టీ తాగాలో మొదలు పెట్టి రాత్రి ఏ కంపెనీ పరుపు మీద పడుకోవాలో చెబుతారు. ఎంతైనా బెంగాలీ ప్రజలు అదృష్టవంతులు.. అని కొందరంటే గిట్టని వాళ్లు బెంగాలీ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యి మీది నుంచి పడ్డట్టుగా ఉందని అంటారు. జయ, మాయా, మమతా ముగ్గురూ బ్రహ్మచారిణులే. బ్రహ్మచారి పాలన ఎలా ఉంటుందో చూపించారు, చూపిస్తున్నారు. వాళ్ల వాళ్ల పార్టీల్లో ముగ్గురూ నియంతలే. మనం అదృష్టవంతులం మనకు బ్రహ్మ చారులు లేరు.

14 కామెంట్‌లు:

  1. బాగా చెప్పావన్న

    కార్టూను గీసిండని ఒకణ్ణి ఖైదు చేసింది దీది. అన్నా నువ్వు రాసింది జాతీయ వార్తల్లో రాకుండా చూసుకో ;-)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట రమణ గారు దీదీకి తెలుగు రాదు కదా .. అయినా మన నాయకుల నైతిక విలువల పాటలు విని భరిస్తున్న మనను దీదీ ఎమీ చేయలేరు

      తొలగించండి
  2. బావుందండీ.. ఆంద్ర ప్రదేశ్ ప్రజలు అదృష్టవంతులు అన్నమాట. :))))

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ రకంగా మాత్రం అదృష్ట వంతులే నండి వనజవనమాలి గారు

      తొలగించండి
  3. "జయ, మాయా, మమతా ముగ్గురూ బ్రహ్మచారిణులే. బ్రహ్మచారి పాలన ఎలా ఉంటుందో చూపించారు, చూపిస్తున్నారు."

    What about Vajpayee, Narendra Modi & Naveen Patnaik?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Jai Gottimukkala garu ఈ సారి ఆడ బ్రహ్మ చారుల గురించే ఆలోచించాను. మరోసారి మగ బ్రహ్మ హ చారుల గురించి ( ఇందులో ఒకరిద్దరు బ్రహ్మ చారుల గురించి కొన్ని ప్రచారాలు ఉన్నాయి అవి ఎంతవరకు నిజమో వారికే తెలియాలి.) శ్రీ కృష్ణుడు అస్కలిత బ్రహ్మ చారి అని సప్తగిరి చానల్ ధర్మ సందేహల్లో చెప్పారు .

      తొలగించండి
  4. మమతా బెనర్జీ విశ్వరూపం చూసి బెంగాలీలే కాదు, యావద్దేశం నివ్వెరపోతున్నది. ఇంకా భవిష్యత్తులో ఎన్నెన్ని వింతలూ విడ్డూరాలూ చూడబోతున్నామో మనం!! కమ్యూనిస్టులున్న వీధిలో ఇళ్లు కట్టుకోవద్దు, కమ్యూనిస్టులు నడిచిన రోడ్ల మీద నడవొద్దు, కమ్యూనిస్టులు పీల్చే గాలి పీల్చకూడదు etc etc. ఈ పని చేస్తే గనక భారతదేశం జనాభా అతివేగంగా తగ్గిపోతుంది!! జై దీదీ!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునండి అవినాష్ గారు . ఆమె ఇంకెన్ని చేస్తుందో చూడాలి . ఎండు మిర్చి ఎరుపు రంగులో ఉంటుంది , ఎరుపు రంగు చూడగానే కమ్యునిస్టులు గుర్తుకొస్తారు కాబట్టి వంటల్లో పచ్చి మిర్చి మాత్రమే వాడాలి, ఎండు మిర్చి పొడి వాడ వద్దు అనే ఆదేశం ఇంకా ఇవ్వలేదేమిటో

      తొలగించండి
  5. ఇంటి సమస్యని జాతీయ సమస్య చేసి ప్రేమికుల తల్లితండ్రులకు పరిష్కారం బాగా చూపించారు. బాగుంది.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం