‘‘ఏమి రామయ్యా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఇంటికి పై కప్పు దేంతో వేద్దామనా? ’’
ఏరా జోకేసినా నవ్వవా?’’
‘‘ఇది జోకా? ముందే చెబితే నవ్వేవాన్ని కదా? ’’
‘‘అంత దిగులుగా ఉన్నావేంటి? 2012 డిసెంబర్‌లో యుగాంతం దగ్గరికొస్తుందనా? ’’
‘‘యుగాంతం దిగులు నాకెందుకు? ఇంతటి అవమానాన్ని భరిస్తూ ఉండడం కన్నా యుగాంతం ఎంతో సంతోషం కలిగించే విషయం నాకు.
ప్రజలు చెడిపోయారు. ఇక మనం ఎంత మాత్రం బాగు చేయడానికి వీలులేనంతగా చెడిపోయారు అదే నా బాధ’’
‘‘నిన్నటి వరకు బాగానే ఉండేవాడివి, రాత్రికి రాత్రి ప్రజలకేమైంది నీకేమైంది’’
‘‘మీకు తెలుసు నేను చిన్నప్పటి నుంచి చాలా సెన్సిటివ్ నా అభిమాన నటుడే సినిమాల్లో చిర కాలం నంబర్‌వన్‌గా ఉండాలి. రాజకీయాల్లో అంతే నా అభిమాన నాయకుడే నంబర్ వన్‌గా ఉండి చక్రం తిప్పాలి. నంబర్ టూ కూడా నాకు నచ్చదు అలాంటిది ఇప్పుడు నంబర్ త్రీ స్థానంలోకి మా అభిమాన పార్టీని నెట్టివేసిన ఈ ప్రజలందరి చరిత్ర ఎంత తొందరగా అంతం అయితే అంత బాగుండు అనిపిస్తుంది? ఆ పార్టీకి వ్యతిరేకంగా అన్ని రాతలు రాసినా, ఆ పార్టీ గెలవడం ఏమిటి? మయసభలో అభిమాన ధనుడు దుర్యోధనుడికి జరిగిన పరాభవం గుర్తు కొస్తోంది నాకు’’
‘‘ ఓహో అదా నీ సమస్య. దానవీర శూరకర్ణ సినిమా చూశావా?’’
‘‘నీకేమైనా పిచ్చా? ఎన్నిసార్లు చూశావు? అని అడుగు. ఇప్పటికీ ఆ సినిమా డైలాగులు వింటాను? డైలాగు చెప్పమంటావా? ఏమంటివేమంటివి....’’
‘‘వెరిగుడ్ కురుక్షేత్రం చూశావా?’’
‘‘లేదు చూడలేదు... చూసే ఉద్దేశం కూడా లేదు...ఐనా నేనడిగిన ప్రశ్నకు, ఈ రెండు సినిమాలకు సంబంధం ఏమిటి?’’
‘‘అక్కడికే వస్తున్నాను
1977కు దేశ రాజకీయాల్లో ఎంత ప్రాముఖ్యత ఉందో, రాష్ట్ర సినిమా చరిత్రలో సైతం అంత ప్రాముఖ్యత ఉంది. అప్పుడే కృష్ణ కురుక్షేత్రం తీస్తే ఎన్టీరామారావు దానవీర శూరకర్ణ తీశారు. రెండు సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి. రెండూ మహాభారత కథలే. కురుక్ష్రేత్రంను అప్పటి సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి తీశారు. మహాభారత యుద్ధం రాజస్థాన్‌ప్రాంతంలో జరిగిందని భావిస్తారు. కృష్ణ ప్రత్యేక రైళ్లలో నటీనటులను వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులనురాజస్తాన్ తరలించారు. యుద్ధం జరిగిన చోటే కురుక్షేత్రం సినిమాలోని యుద్ధం సీన్లను వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులతోరాజస్తాన్, అంబాల ప్రాంతాలలో షూట్ చేయించారు. పౌరాణిక చిత్ర బ్రహ్మగా పేరుపొందిన కమలాకర కామేశ్వరరావు ఆ సినిమాకు దర్శకత్వం వహించారు.
ఎన్టీరామారావు దానవీర శూరకర్ణ సినిమాను కేవలం ఆరువారాల్లో నిర్మించారు. కౌరవులు, పాండవులు తమ తమ విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించే సీన్ కోసం కృష్ణ ఉత్తరప్రదేశ్‌కు చెందిన మల్ల యుద్ధంలో చాంపియన్‌లను ఉపయోగించుకున్నారు. ఇక ఎన్టీఆర్ దానవీర శూరకర్ణను ఇప్పుటి ఇసిఐఎల్, ఎఎస్‌రావు నగర్ ప్రాంతంలో అప్పుడంతా ఖాళీగా ఉండేది. అక్కడే ఒక పెద్ద గొయ్యి లాంటి ప్రాంతం ఉంటే అక్కడే వందమందితో కురుక్షేత్ర యుద్ధం సీన్లు, మల్లయుద్ధం సీన్లు ఔట్ డోర్ షూటింగ్ అంతా అక్కడే ముగించేశారు. హైదరాబాద్ పాత బస్తీ పహిల్‌వాన్‌లను మల్లయోధులుగా ఉపయోగించుకున్నారు. కృష్ణ కురుక్షేత్రం సాంకేతిక విలువలతో హాలివుడ్ సినిమా స్థాయిలో తీస్తే, దానవీరశూరకర్ణ మాత్రం ఏ మాత్రం సాంకేతిక విలువలు లేకుండా బాణాలకు కట్టిన దారాలు, చెట్టునుంచి ఆపిల్ పండు పడకుండా కట్టిన దారం కనిపించి నవ్వు తెప్పిస్తుంది.
కానీ ఎన్టీఆర్ దుర్యోధనుడి డైలాగులే ఈ సినిమాకు ప్రాణం. కథ ఒకటే కానీ కృష్ణ కురుక్షేత్రంలో అర్జునుడు హీరో, ఎన్టీఆర్ సినిమాలో దుర్యోధనుడే హీరో. పౌరాణిక బ్రహ్మ, దైవభక్తి గల కమలాకర కామేశ్వరరావును దేవుడు చిన్నచూపు చూసి కురుక్షేత్రం ప్లాప్ షోగా మిగల్చాడు. నాస్తికుడైన కొండవీటి వెంకటకవిని దేవుడు అనుగ్రహించి దానవీర శూరకర్ణను సూపర్‌హిట్‌గా నిలిపాడు. దీన్ని బట్టి నీకేమర్ధమైంది.?
’’
‘‘ అర్ధం కాలేదు’’
‘‘ రెండు కథల్లో ఏది వాస్తవమైన కథ అని అడిగితే కురుక్షేత్రం అని సమీక్షకులు సమాధానం చెబుతారు. ఏది మంచి సినిమా అంటే దానవీరశూరకర్ణ అని ప్రేక్షకులు తేల్చేశారు. జనం మెచ్చిన సినిమాకు కాసులు కురుస్తాయి, జనం నచ్చిన పార్టీకి ఓట్లు పడతాయి.
అటు 38 ఏళ్ల కుర్ర జగన్. అందులోనూ లక్ష కోట్లు సంపాదించాడనే ఆరోపణ. ఉన్నదేమో జైలులో. ఇటు చూస్తే మొత్తం ప్రపంచానే్న ప్రభావితం చేశారని పేరున్న వృద్ధ బాబు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను క్రమ శిక్షణలో పెట్టడంతో పాటు నవ గ్రహాలను సరైన కక్షలో ఉండేట్టు చూశాడని ఆయన అభిమానులు నమ్ముతారు. పైకి చెప్పరు కానీ సూర్యుడు ఎపిలో ఉదయించడానికి ఇష్టపడనప్పుడు ఆయనే నచ్చజెప్పి రాష్ట్రంలో ఉదయించేట్టు చేశాడని కొందరి నమ్మకం. ఇక కుర్ర జగన్ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పలుకుబడి వల్లనే వరుణుడు రాష్ట్రానికి వచ్చేందుకు అంగీకరించాడని కొందరి నమ్మకం. ఈ రెండు నమ్మకాల్లో ఏ నమ్మకాన్ని ఎక్కువ మంది నమ్మితే వారు ఎన్నికల్లో విజయం సాధిస్తారు. ఇదే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం సైన్స్ కాదు నమ్మకం.
ముక్తాయింపు: గడ్డం ఉన్నవాళ్లంతా మేధావులు కాదు. తెల్ల చొక్కా వేసుకున్న వాళ్లంతా రాజకీయ నాయకులు కారు.

లాస్ట్ పంచ్ అదిరింది. బహు చక్కగా ఉంది టపా
రిప్లయితొలగించండిభాస్కర్ రావు గారు ధన్యవాదాలు .
తొలగించండి:)))))))
రిప్లయితొలగించండిఆ ' కాంగ్రెస్ + బాబులు ' మేధావులేమి ......! అనుభవజ్ఞులేమి.....! పాలనాదక్షులేమి.....! నీతిమంతులేమి.....!
జనం నాడిని కనిపెట్టక ఇట్లు రెండు పత్రికలు మూడు చానల్లతో జగనూ .... జగనూ ..... అని గోల సేతురా....
ఇంతయేల ...... 2014 లో కూడా నా ఆస్తి గురించి ఒక్క సమాధానం చెప్పకనే, ఆ ప్రబుద్ధులకు జనం ఓట్లతోనే సమాధానం చెపుతా.( ఇట్లు ఖైదీ(?) జగనయ్య )
Palla Kondala Rao garu thanks
తొలగించండిmost likely జగన్ జైలు లోపల ఇదే డైలాగ్ practice చేస్తూ ఉండొచ్చు!! :D
తొలగించండిటపా అదిరింది :)
రిప్లయితొలగించండికాలంతో పాటు రుచులూ మారతాయి. మహేష్ అర్జునుడిగా, ప్రభాస్ కర్ణుడిగా, సుమన్ కృష్ణుడిగా అవే ప్రమాణాలతో తీస్తే ఈరోజు కురుక్షేత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అదే బాలయ్య త్రిపాత్రాభనయంతో DVS కర్ణ విడుదల అట్టర్ ఫ్లాప్ అయ్యే అవకాశాలే ఎక్కువ.
చిన్న సవరణ: అంబాలా హరియానలో (రాజస్థాన్ కాదు) ఉంది. కురుక్షేత్ర యుద్ధం అక్కడికి దూరంలో ఉన్న "కురుక్షేత్ర" ప్రాంతంలో జరిగిందని అనుకుంటారు.
Jai Gottimukkala garu బాలయ్య ఆపని చేయరని.. చేయకూడదని కోరుకుంటున్నాను ...
తొలగించండి"ప్రజాస్వామ్యం సైన్స్ కాదు, నమ్మకం" అనే డైలాగ్ అద్దిరిపోయిందండీ!! ఎంతో మంది ఉద్ధండులున్నా కురుక్షేత్రం సినిమా ఫ్లాప్ అయినట్టే తెలుగుదేశం కూడా ఫ్లాప్ షో చేసింది. గతం ఎంత ఘనంగా ఉన్నా, వర్తమానంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు వల్ల తెదేపా భవిష్యత్తు అగమ్యగోచరమవుతున్నది. పాపం!! రాష్ట్రంలోని రోడ్లన్నీ నేను వేసినవే, కంపెనీలన్నీ నేను పెట్టినవే అంటూ పురావస్తు శాఖ వాళ్ల కన్నా ఎక్కువ చరిత్ర తవ్వినా జనం మెచ్చలేదు!!
రిప్లయితొలగించండిఒక చిన్న clarification!! కురుక్షేత్ర యుద్ధం హర్యానా రాష్ట్రంలోని "కురుక్షేత్ర" అనే జిల్లాలో జరిగిందని విన్నాను. ఒకప్పుడు ఉమ్మడి పంజాబ్ రాష్ట్రంలో ఉన్న ఈ "కురుక్షేత్ర" పంజాబ్ ని 3 రాష్ట్రాలుగా విభజించిన తరవాత, హరియాణా లో భాగం అయ్యింది. మీరు పైన చెప్పిన అంబాలా కూడా హరియాణా లోనే ఉంది, రాజస్థాన్ లో కాదు. ఇదంతా నేను గుర్గావ్ లో ఉన్నప్పుడు జనం నుంచి విన్న విషయాలు మాత్రమే!! వీలైతే ఒకసారి confirm చేసుకుని పైన సవరించండి!! :)
రిప్లయితొలగించండిఅవినాష్ గారు మీరు చెప్పింది నిజమే కావచ్చు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను . దానవీర శూర కర్ణ సినిమా షూటింగ్ జరిగినప్పుడు చూసిన యాన్ టి ఆర్ అభిమాన సంఘం నాయకుడు సాయిబాబా అప్పటి విషయాలు కొన్ని చెప్పారు. ecil వద్ద పెద్ద గుంతలో షూటింగ్ , పాత బస్తి పహిల్వాన్ల సేవల గురించి ... నెట్లో వికిపిడియాలో చూస్తే కురుక్షేత్రం సినిమా షూటింగ్ రాజస్తాన్ లో జరిగినట్టు ఉంది
తొలగించండిhttp://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B1%81%E0%B0%B0%E0%B1%81%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%87%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82_(%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AE%E0%B0%BE)
"ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను క్రమ శిక్షణలో పెట్టడంతో పాటు నవ గ్రహాలను సరైన కక్షలో ఉండేట్టు చూశాడని ఆయన అభిమానులు నమ్ముతారు. పైకి చెప్పరు కానీ సూర్యుడు ఎపిలో ఉదయించడానికి ఇష్టపడనప్పుడు ఆయనే నచ్చజెప్పి రాష్ట్రంలో ఉదయించేట్టు చేశాడని కొందరి నమ్మకం. ఇక కుర్ర జగన్ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పలుకుబడి వల్లనే వరుణుడు రాష్ట్రానికి వచ్చేందుకు అంగీకరించాడని కొందరి నమ్మకం. ఈ రెండు నమ్మకాల్లో ఏ నమ్మకాన్ని ఎక్కువ మంది నమ్మితే వారు ఎన్నికల్లో విజయం సాధిస్తారు. ఇదే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం సైన్స్ కాదు నమ్మకం."
రిప్లయితొలగించండిచంద్రబాబు ఉద్యోగుల విషయం లో మీరు చెప్పింది ఆయన అభిమానులూ అనుకుంటారు, అభిమానులు కాని వారూ అనుకుంటారు. కాని నవగ్రహాలు, సూర్యుడు అని మీరు మసాలా దట్టించి చెప్పారే అదే వెగటు పుడుతుంది. పైగా మీ కల్పనకి, నిజంగా కాంగ్రెస్స్ వాళ్ళు ప్రచారం చేసిన దానికి పోలిక పెట్టారు. అది చవకబారుగా ఉంది.
కాంగ్రెస్ వాళ్ళే వరుణుడు మా పార్టీ అని ప్రచారం చేసి, చంద్రబాబు కాబట్టే వర్షాలు పడలేదు అనే మూఢమైన ప్రచారం చేసారు..
బాటసారి గారు ఇది వార్త కాదు సెటైర్ ..వార్తకు వ్యాసానికి, సెటైర్ కు తేడా ఉంటుంది . రెండు నమ్మకాల గురించి చెప్పను ఆ నమ్మ కాల్లో కాంగ్రెస్స్ , టిడిపి వాళ్ళు ఉంటారు , ప్రాంతాలు, కులాలు అన్ని ఉంటాయి.
తొలగించండిx వాళ్ల నమ్మకం y వారికి వెగటు పుట్టించ వచ్చు , y వారి నమ్మకం x వారికి వెగటు పుట్టించ వచ్చు .
//ఇది వార్త కాదు సెటైర్//
తొలగించండిidi maree muhchatagaa unnadi..setair ki vaarthaki tedaa teliyakundaa kaament chese vaallani emi anaali
బుద్ధ మురళి గారు అది వార్తనో, వ్యాసమనో అనుకుని నేను చదవలేదండీ.. వ్యంగ్యంగానే తెలిసిపోతుంది.. అయితే సమతూకం లోపించింది అనిపించే నేను ఆ వ్యాఖ్య చేసాను.
తొలగించండితేలికపాటి సెటైర్తోనే పోస్ట్ అదిరింది.అయినా కొంతమంది వీరాభిమానులకు ఎక్కడో గుచ్చుకోకమానదిది..జగన్ ఓడిపోయుంటే జనాన్ని గొర్రెలనే వారేనా?
రిప్లయితొలగించండిపంతుల గోపాల కృష్ణ రావు గారు థాంక్స్. తమకు నచ్చని పార్టీ గెలిస్తే జనాన్ని గొర్రెలు అని అవమానించడం ద్వారా కొంత మంది తమ అహంకారాన్ని ప్రదర్శిస్తూ ప్రజలకు శాశ్వతంగా దూరం అవుతున్నారు
తొలగించండి"జనం గొర్రెలు, అందుకే జగన్ పార్టీని గెలిపించారు" అని ఈరోజు అంటున్న నాయకులు రేపు 2014 లో ఏ మొహం పెట్టుకుని జనాన్ని ఓట్లు అడుగుతారు?? ఎన్ని డబ్బులు వెనకేసినా, తెర వెనక రాజకీయ కుట్రలూ, గిమ్మిక్కులూ ఎన్ని చేసినా చివరికి రాజకీయ నాయకుల భవిష్యత్తును నిర్ణయించేది ప్రజలే!!
తొలగించండితమ భవిష్యత్తు ప్రజల చేతిలోనే ఉందన్న నిజం మరిచి, ప్రజల మీదనే ఎడాపెడా వ్యాఖ్యానాలు చేస్తున్న ఈ రాజకీయ నాయకులు నిజమైన గొర్రెలు!!
చాలా బాగుంది మీ సెటైర్. అందరినీ మైండ్ సెట్ మార్చుకోవాలనే వృద్ధ బాబు తన మైండ్ సెట్ మార్చుకుని ఇంకా కృషి చేస్తే 2014 లో కొంతైనా గౌరవం సంపాదించవచ్చు.
రిప్లయితొలగించండిమాధవ్ గారు థాంక్స్ నేను అదే కోరుకుంటున్నాను ...ఏ రంగం లో నయినా బలమైన ప్రత్యామ్నాయం ఉండాలి
తొలగించండిvery nice.. great post
రిప్లయితొలగించండిప్రసీద garu thanks
తొలగించండిచివరి పేరాగ్రాఫ్ అదుర్స్!
రిప్లయితొలగించండిఎక్కణ్ణించి ఎక్కడికి లాక్కొచ్చారండి!
చంద్రబాబు నీతి, జగన్ అవినీతిల గూర్చి ఎంత చెప్పినా జనాలకి అర్ధమయ్యి చావట్లేదు!
థాంక్స్ రమణ గారు థాంక్స్ సమాజం అంటే రెండు సామాజిక వర్గాలే కాదు ప్రపంచం అంటే రెండు రెండు పార్టీ లే చాలా పార్టీ లు చాలా సిద్ధాంతాలు ఉన్నయి బాబు అంటే అర్థం చేసుకోరు ఆ పార్టీని విమర్శించావు కాబట్టి నువ్వు ఈ పార్టీ అంటూ ప్రపంచాన్ని రెండు పార్టీ లకే పరిమితం చేస్తున్నారు
తొలగించండిExcellent.
రిప్లయితొలగించండి*ప్రజాస్వామ్యం సైన్స్ కాదు నమ్మకం.*
భవిషత్ లో ఈ వాక్యం, పి వి నరసిమ్హారావు గారు చెప్పిన "చట్టం తనపాని తాను చేసుకుపోతుందని" చెప్పిన వాక్యమంత ప్రజాదరణగల మాటగా నిలచి పోతుందని అనిపించింది.
మీ వీర అభిమాని :)
శ్రీనివాస్ గారు ధన్యవాదాలు
తొలగించండిudayam chadavanandi paper lo, chakkaga raasaarandi.
రిప్లయితొలగించండిDVS కర్ణ హిట్టవ్వడానికి, కురుక్షేత్రం ఫ్లాపవడానికి కారణం NTR నటన.
రిప్లయితొలగించండిNTR మూడు పాత్రల్లో విశ్వరూపం ప్రదర్శిస్తే, కృష్ణ, శోభన్‌బాబులు కలిసి మల్టీ స్టారర్ సినిమా చేసినా ఫలితం దక్కలేదు.
కథలన్నీ తెలిసినవే కాబట్టి, పాత్రధారుల్లో విషయం లేకపోతే ఎవరూ పట్టించుకోరు.
జగన్‌లోని నాయకుడిని సామాన్య ప్రజలు గుర్తించారు.
అదే ప్రజలు గతంలో NTR లో, చంద్రబాబులో,YSR లోను నాయకుడిని గుర్తించారు.
మరో కొత్త నాయకుడొచ్చేదాకా, జగన్‌కి ఢోకా ఉండకపోవచ్చు.
అయితే ఇదే అంతిమవిజయమని YSRCP వాళ్ళు, అవినీతి గెలిచిందని మిగతావాళ్ళు గోల చెయ్యక్కర్లేదు.
బోనగిరి గారు నా ఉద్దేశం కూడా ఇదే నండి . కానీ ఒక పార్టీ గెలిచినప్పుడు ప్రజలు తెలివిగా తీర్పు ఇచ్చారని చెప్పి అదే ప్రజలు ఇప్పుడు తమకు నచ్చిన తీర్పు ఇస్తే ప్రజలకు తెలివి లేదు అని విమర్శిస్తున్నారు
తొలగించండిబావుంది.
రిప్లయితొలగించండిలోకేశ్ని లాక్కొచ్చేటట్లు వున్నారు కానీ నగదు బదిలీ పథకంతోనే అతని మీద నాకయితే నమ్మకం పోయింది. అంత గొప్ప పథకం కోసం అన్ని దేశాలు తిరిగి స్టడీ చేసి రావాలా!? నన్నడిగితే చెప్పనూ.
శరత్ గారు బాబు యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి అతని గురించి అన్ని విషయాలు తెలిసిన ఒక సీనియర్ జర్నలిస్ట్ బాబు కుమారుడి ప్రస్తావన వచ్చినప్పుడు లోకేష్ కన్నా బాబు వెయ్యి రెట్లు బెటర్ అన్నారు . చక్రం తిప్పే కాలం లో వారసుడు వస్తే జనంలో క్రేజీ ఉండేది కానీ ఇప్పుడు ?????
రిప్లయితొలగించండిఇప్పుడే కోర్టు కూడా సిబిఐ కి గడ్డి పెట్టింది ప్రజలని అమాయకులు అన్నందుకు. ప్రజా తీర్పు ని అపహాస్యం చేసే వారిని ప్రజలు ఎన్నడూ గెలిపించరు. ప్రజలు గొర్రెలన్నప్పుడు,మరి వీళ్ళెవరు,ప్రజల్లో భాగం కాదా ? తమ వాళ్ళు గెలిస్తే చరిత్ర ,ఇతరులు గెలిస్తే ప్రజలు గొర్రెలు. బాగుంది ఈ పచ్చ బాబుల నాలుక మడత.
రిప్లయితొలగించండిభాస్కర్ గారు ప్రజలు వాళ్ళకు అధికారం అప్పగించినప్పుడు ఆ ప్రజలు మేధావులే బహుశా వీళ్ళు తమ పాలనతో ప్రజలను గోర్రేలుగా మార్చినట్టు ఉన్నారు . అందుకే తమను ఓడించిన ప్రజలను గొర్రెలు అంటున్నారు . మా పాలనతో ప్రజలను గోర్రేలుగా మార్చమని ప్రకటించ వచ్చు కదా ?
తొలగించండిNTR gaaru prathibha choosi janam mechaaru.......ikkada jagan gaari e prathibha choosi janam mechaaro kodaa chepte baagundedhi......Kaani meeru cheppina daanni batti ardam chesukovalsindhi okate........janam politics ni koodaa entertainment laa ne choosthunaaru.........
రిప్లయితొలగించండిmee laanti maatala maantrikulu......political medaavulu.........evariki anugunam gaa vaaru....kadalu raasesthunaaru......
Indiragandi poyina taruvaatha ......rajiv gaandi vasthe ........bumper majority to gelipinchaaru......ade rajiv poyaaka sonia raaledu.......congress ki koodaa majority ne vachindhi,...bumper majority kaadu......mokaalu ki bodigundu ki baagaa mudesaaru............offcourse janaalandaroo ade chesthunaaru..idoka kotha fashion.
vara గారు,
తొలగించండి"ఎన్టీఆర్ ప్రతిభను చూసి, ఆయన వ్యక్తిగత చరిష్మాను చూసి 1983 లో జనం గెలిపించారు" అనడం అర్థసత్యం మాత్రమే!! రాష్ట్రంలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా నిలదొక్కుకోలేకపోవడం, దశాబ్దాల తరబడి సాగిన కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత కూడా ప్రధాన కారణాలే!! కేవలం ప్రతిభా, చరిష్మా మెజారిటీ స్థానాల్లో గెలిపించలేవు, ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఎన్టీఆర్ గెలుపులో ప్రధాన కారణమే!!
ఇప్పుడు రాష్ట్రంలో కొంత విచిత్ర పరిస్తితి ఉన్నది. ప్రభుత్వంతో పాటు, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కూడా ప్రజావ్యతిరేకత ఎదుర్కుంటున్నాయి. తెలంగాణ సమస్య పట్లా, ఇతర ప్రజాసమస్యల పట్లా తెలుగుదేశం అవలంబిస్తున్న అవకాశవాద ధోరణీ, రాజ్యసభ సీట్ల బహిరంగ అమ్మకం, వెర్రిమొర్రి పథకాల ప్రకటనలూ అన్నీ కలిసి అసలే విశ్వసనీయత కోల్పోయిన చంద్రబాబును పాతాళానికి తోక్కేశాయి.
ఎన్టీఆర్ అంత ప్రతిభావంతుడే ఐతే, జనం గొర్రెలే ఐతే 1989 ఎన్నికల్లో తెలుగుదేశం ఎందుకు ఓడిపోయింది?? ఎన్టీఆర్ స్వయంగా కల్వకుర్తి అసెంబ్లీ స్థానంలో ఎందుకు ఓడిపోయారు?? కేవలం ప్రతిభా, చెత్తాచెదారం ఎన్నికల్లో గెలుపు ఓటములను నిర్ణయిస్తాయనుకోవడం తప్పు!!
జనం జగన్ ని గెలిపించింది ఆయన మీద అభిమానంతోనో, ఆయన ప్రతిభా చూసో, ఆయన సంపాదించిన లక్ష కోట్లలో వాటా కోసమో కాదు. చచ్చి బతికిపోయిన వైఎస్సార్ మీద సానుభూతితోనూ, కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల పట్ల వ్యతిరేకత తోనూ, వాటికి ప్రత్యామ్నాయంగా నిలదొక్కుకోగలడన్న నమ్మకంతోనూ జనం ఆయనకు ఒట్లేశారు. ఇవే కాక కులం కూడా తన వంతు పాత్ర యథావిధిగా పోషించింది, అన్ని ఎన్నికల్లో పోషించినట్టుగానే!!
politics ని కూడా entertainment లాగా చూసేవాళ్లకు ఓట్లు వెయ్యాల్సిన అవసరం లేదు. 24 గంటల వార్తాచానెళ్ల ముందు కూర్చుని పాకెట్ల మీద పాకెట్లు junk food తింటూ ఫుల్లుగా entertain కావచ్చు.
ఇందిరాగాంధీ పోయిన తరవాత కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలిచింది. రాజీవ్ గాంధీ పోయిన తరవాత కాంగ్రెస్ మామూలు మెజారిటీ మాత్రమే సాధించగలిగింది. దీన్ని బట్టే జనం గొర్రెలు కాదనీ, గెలుపు ఓటములను ఇంకా సవాలక్ష కారణాలు ప్రభావితం చేస్తాయనీ అర్థం అవుతున్నది.
vara గారు ఇదే ప్రజలు ఒక పార్టీ నీ గెలిపించినప్పుడు దేవుళ్లల కనిపించారు ఇప్పుడు గోర్రేలయ్యారు.మీరే కాదు చాలా మంది మీలానే అంటున్నారు ..
రిప్లయితొలగించండిఖద్దరు చొక్కా వేసుకున్న వారంతా రాజకీయనాయకులు కాదు ,ప్రెస్ మీట్లు పెట్టి ఊదర గొట్టే వారంతా ప్రజాభిమానం పొందిన నేతలుకాదు
రిప్లయితొలగించండి