ఆమె అందాన్ని చూడాలంటే భక్తతుకారం సినిమా లోని ఆ ఒక్క పాటలో ఆమెను చూస్తే చాలు . ఆ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు తుకారాంగా నటించారు. తన అందాలతో తుకారాం ను ఆకర్షించాలని కాంచన ప్రయత్నిస్తుంది. కాంచన అందాలను ఈ పాటలో అద్భుతంగా చూపించారు. పూజకు వేళాయెరా అంటూ అతన్ని కవ్విస్తూ తన తాపాన్ని ప్రదర్శిస్తూ, తన అందాన్ని వర్ణిస్తూ పాడుతుంది. ఆ పాట రచయిత కాంచన అందాలను దృష్టిలో పెట్టుకొనే ఆ పాట రాసి ఉంటాడు. ఆ పాటలో అందాల వర్ణనకు ప్రతిరూపంగా ఉంటుంది ఆమె అందం. .
దువ్వుకున్న ఆ నీలి ముంగురులే దూది పింజలై పోవునులే
నవ్వుతున్న ఆ కంటి వెలుగులే దివ్వెల పోలిక ఆరునులే
వనె్నలొలుకు ఆ చిగురు పెదవులే వాడి వక్కలై పోవునులే
పాలు పొంగు ఆ కలశాలే తోలు తిత్తులై పోవునులే
నడుము వంగగా, నీ ఒడలు కుంగగా
నడువలేని నీ బడుగు జీవితం .. వడవడ వణుకునులే
ఆశలు రేపే సుందర దేహం ఆస్థిపంజరబౌనులే .....
అంటాడు.
నిజంగా ఇప్పుడు కాంచన పరిస్థితి అలానే ఉంది. భవిష్యత్తులో కాంచన ఇలా ఉంటుంది అని ఆ పాట రచయిత ఊహించి ఉండరు. కాంచనే కాదు ఎంత అందమైన యువతి అయినా చివరకు ఇలా మారాల్సిందే నిజమే కానీ వైవాహిక జీవితం అనుభవించకుండానే అందమైన నటి జీవితం ఇలా మారింది అదే కాంచన జీవితంలోని విషాదం .
***
తనను అర్థం చేసుకుని గౌరవించే మంచి మొగుడు.. ప్రేమించే పిల్లలు... ఉండేందుకు నీడ.. చక్కని కుటుంబం అమ్మాయి అయినా దేవున్ని మనసులోనే కోరుకునే కోరికలు ఇవే. సగటు అమ్మాయి మొదలుకొని సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి వరకు ఆశించేది ఇదే. పూరిగుడిసెలో జీవితం గడిపే అమ్మాయి అయినా, సంపన్నరావు కుమార్తె అయినా కోరుకునేది వైవాహిక జీవితమే. కానీ ఆ రాజకుమారికి సామాన్య ఈ కోరిక సైతం తీరిన కోరికగానే మిగిలి పోయి ఒంటరి జీవితమే గడుపుతోంది. .
ఆకలి, పేదరికం వంటి వాటిని అష్టకష్టాలు అంటూ కష్టాల జాబితాను మన పూర్వీకులు రూపొందించారు. నిజానికి వీటన్నింటిని మించిన కష్టం కుటుంబ సభ్యుల మధ్య మంచి సంబంధాలు లేకపోవడం, కన్న తల్లిదండ్రులు పిల్లలను సంపాదన యంత్రాలుగా చూడడం, పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోక పోవడం. పూర్వం ఇలాంటి దారిద్య్రాలు కూడా ఉంటాయని ఊహించలేదు కాబట్టి అష్ట దారిద్య్రాల్లో వీటిని చేర్చలేదు కానీ వీటిని ముందు వరుసలో చేర్చాల్సిన తరంలో మనమున్నాం.
***
అభిమన్యు సినిమాలో రాజకుమారి శశిరేఖ గుర్తుందా? అచ్చం రాజకుమారిలా అందంతో మెరిసిపోయిన ఆమె నిజంగానే రాజకుమారి. ఆధునిక కాలం రాజకుమారి. అందగత్తె కాబట్టే ఎయిర్ హోస్టెస్‌గా ఆకాశంలో విమానంలో విహరించింది. ఆ రాజకుమారి పురాణం కాంచన ఈ తరం వారికి ఆమె తెలియకపోవచ్చు. కానీ మన జీవితం కోసం మనం తెలుసుకుందాం.
1965లో వీరాభిమన్యు సినిమాతో తెలుగు నాట ఒక వెలుగు వెలిగిన కాంచన జీవితమంతా చీకటే. మంచి అందగత్తె. చూడగానే ఆకర్షించేంత అందగత్తె. ప్రేమించిన వారికి కొదవేమీ లేదు. ఎంతో మంది పెళ్లికి ముందుకు వచ్చారు. ఆ కాలం నాటి ప్రసిద్ధ దర్శకుడు శ్రీ్ధర్ ఆమెను పెళ్లి చేసుకుంటానని ముందుకు వచ్చారు. కానీ కరెన్సీని ముద్రించే డబ్బు యంత్రంగా కనిపిస్తున్న కాంచనను పెళ్లి చేసి అత్తారింటికి పంపించేందుకు తల్లిదండ్రులు ఇష్టపడలేదు.
కాంచన ఒక సంపన్న కుటుంబంలో పుట్టింది. ఏమీ కొరత లేకుండా ఉన్న తనకు చివరకు పెళ్లి కొరత ఏర్పడుతుందని ఆమె కలలో కూడా ఊహించి ఉండరు. సంపన్న కుటుంబంలో బాల్యం నుంచి ఆమెది ఒంటరి జీవితమే. తండ్రి ప్రముఖ న్యాయవాది. సంపాదనకు కొదవ లేదు. ఏ వ్యాపారంలో ఏం జరిగిందో తెలియదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి తలక్రిందులైంది. చదువుకు పుల్‌స్టాప్ పెట్టి ఎయిర్ హోస్టెస్ కాంచన కొత్త జీవితాన్ని ప్రారంభించింది. జరిగిందేదో జరిగిపోయింది అమ్మాయి తన జీవితం తాను హాయిగా గడిపితే చాలు అని తల్లిదండ్రులు అనుకుంటే బాగుండేది కానీ వారికి ఆ ఆలోచనే రాలేదు. కాంచన అందాన్ని సినిమా రంగం ఆహ్వానించింది. ఈ రోజుల్లో అయితే హీరోయిన్లు బట్టలు వేసుకుంటేనే ఓ సంచలనం. కానీ ఆ రోజుల్లో కాంచన స్విమ్మింగ్ డ్రెస్‌లో తన అందాలతో ఆనాటి యువత మతులు పోగొట్టింది. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1964లో తమిళ సినిమా నుంచి దాదాపు పదేళ్ల కాలం ఆమె హీరోయిన్‌గా వెలిగిపోయారు. ఆ తరువాత క్రమంగా తెర వెనక్కి వెళ్లారు. హఠాత్తుగా కాంచన కనిపించకుండా పోయినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆమె ఉందో లేదో, ఉంటే ఎక్కడున్నారో? ఏం చేస్తున్నారో పట్టించుకున్న వారు లేరు.
కాంచన ఏమైందో తెలియదు కానీ కొన్ని రోజుల క్రితం కాంచన ఒక ఆలయంలో సేవికగా జీవితం వెళ్లదీస్తోంది అనే వార్త తెలుగు సినిమా అభిమానులను కలిచివేసింది...
ఆ వార్త ఎలా ప్రచారంలోకి వచ్చిందో కానీ అది నిజం కాదు. ఆమె ఆలయంలో సేవ చేస్తున్నది నిజమేకానీ జీవనోపాధి కోసం కాదు. మానసిక ప్రశాంతత కోసమే. కాంచన సంపాదనపై తల్లిదండ్రులదే పెత్తనం. ఎంత సంపాదనో, సంపాదించిన సొమ్మును తల్లిదండ్రులు ఎలా ఇనె్వస్ట్ చేస్తున్నారో కాంచన పట్టించుకోలేదు.
బహుశా బాల్యం నుంచి ఒంటరి జీవితం గడపడం వల్ల కావచ్చు కాంచన కుటుంబ సభ్యుల అనుబంధాన్ని కోరుకుంది. పెళ్లికి అడ్డు చెప్పినా, సంపాదనపై పెత్తనం చెలాయించిన తల్లిదండ్రులతో ఆమె అనుబంధాన్ని కోరుకుంది కాబట్టి ఎవరెంత చెప్పినా తల్లిదండ్రులు చెప్పినట్టే నడుచుకుంది. వారు కోరుకున్నట్టే జీవించింది. వారు చెప్పిన చోట సంతకాలు పెట్టింది. ఆస్తులకు సంబంధించి కాంచనకు, అమె తల్లిదండ్రులకు మధ్య కోర్టులో వివాదాలు. వాదోపవాదాలు. ఎవరు గెలిచారు అనేది ముఖ్యం కాదు.
న్యాయమూర్తిగా తండ్రి, ముద్దాయి కొడుకు, కేసును వాదించే న్యాయవాదిగా తల్లి ఇలాంటి దృశ్యం సినిమాల్లో చూసేందుకు బాగుంటుంది కానీ జీవితంలో పగవాడికి సైతం అలాంటి పరిస్థితి రాకూడదు అనిపిస్తుంది. ఆస్తులు, కేసుల తరువాత కాంచనకు డబ్బుపైన విరక్తి కలిగింది. వైరాగ్యం ఏర్పడింది. ఒంటరిగా ఉన్న మహిళ వయసులో ఉంటే ఆమె శరీరాన్ని అపహరించాలని, సంపన్నురాలైతే ఆస్తిని కొట్టేయాలని చూస్తారు. చెన్నైలోని విలువైన కాంచన భవనాల్లో అద్దె కుండేవారు అదే చేశారు. తన ఆస్తులను కాంచన తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా ఇచ్చారు .
పెళ్లి చేసుకున్నా కుటుంబ బాగోగులను చూసుకుంటాను నాదీ బాధ్యత అని కాంచన గట్టిగా చెప్పి ఉంటే ఆమె ఈ పరిస్థితిలో ఉండేవారు కాదేమో! కానీ ఆ మాటలతో తల్లిదండ్రుల అండ కోల్పోతానేమో అనే భయం ఆమె జీవితాన్ని ఇలా మార్చింది. జీవితమంతా ప్రేమా ఆప్యాయతల కోసం పరితపించిన కాంచనను వైరాగ్యం ఆవహించింది. డబ్బు గొడవలతో చివరకు డబ్బుపైన విరక్తి కలిగింది. నా జీవితం ఇలా ఎందుకు రాశారు దేవుడా! అని దేవున్ని నిలదీయాలని ఆమెకు ఎప్పుడూ అనిపించి ఉండదు. అందుకే ఆస్తిని దేవుడి పేరు మీద రాసి జీవితాన్ని దేవుడి సేవతో గడిపేస్తోంది బెంగళూరులో....
భానుప్రియ, అంజలి, స్మిత అంటూ పేర్లలో తేడా ఉండొచ్చు. బాల నటులు మొదలుకుని హీరోయిన్ల వరకు చాలా మంది హీరోయిన్లకు ఇదే శాపం. వాళ్లు కరెన్సీ ముద్రించే యంత్రాలు కాదు వాళ్లకూ మనసుంటుంది, వాళ్లూ కుటుంబం నుంచి ప్రేమా ఆప్యాయతలను కోరుకుంటారు అనే విషయం కుటుంబ సభ్యులే గ్రహించక పోతే ఇంకెవరు గుర్తిస్తారు... ఈ రోగం ఇప్పుడిప్పుడే మధ్యతరగతిలో సైతం అక్కడక్కడ కనిపిస్తోంది. ఐటి ఉద్యోగం చేసే అమ్మాయి శాశ్వతంగా ఇంట్లోనే ఉండాలని కోరుకునే కుటుంబాలు సైతం అక్కడక్కడ పిచ్చిమొక్కల్లా కనిపిస్తున్నాయి. డబ్బు ముఖ్యమే కానీ దానితో పాటు కుటుంబ విలువలు ముఖ్యం అని గ్రహించకపోతే జీవితం విషాదంగా మారుతుంది. *
ఆమె కవ్విస్తూ పాడితే.. చివరకు అతను.......

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం