‘‘అది 2000 సంవత్సరం. ప్రపంచమంతా నూతన శతాబ్ది సంబరాల్లో మునిగితేలుతోంది. నేను మాత్రం కుప్పకూలిన నా భవిష్యత్తు గురించి ఆలోచనలో మునిగిపోయాను. నా చేతిలో సినిమాలు లేవు, నా దగ్గర డబ్బులేదు. నా కంపెనీ లేదు. కోట్లాది రూపాయలకు సంబంధించిన కేసులు. ఆదాయం పన్ను బకాయిలు. చివరకు నా సొంత ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి నోటీసు అందింది’’ ఇది అమితాబ్ తన గురించి తాను చెప్పుకున్న మాటలు.
నమష్కార్
మై అమితాబ్ బచ్చన్ బోల్ రహహూ కౌన్ బనేగా కరోడ్‌పతి సే అంటూ ఆయన మాటలు వినిపిస్తే, ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. తన మాటలతో జీవితం పట్ల ఉత్సాహాన్ని నింపుతాడు ఈ 72 ఏళ్ల యువకుడు. 20 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులను మరిచిపోయి వారున్న ఈ కాలంలో 72 ఏళ్ల వయసులో ఆయన సందర్భం వచ్చినప్పుడల్లా తన తండ్రి హరివంశరాయ్ బచ్చన్ కవిత్వాన్ని వినిపిస్తారు.
యంగ్రీ యంగ్ మెన్‌గా భారతీయ సినిమా రంగాన్ని ఏలిన బాద్‌షా ఒక సందర్భంలో సొంతింటిని తాకట్టు నుంచి విడిపించలేక బ్యాంకుకు అప్పగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆర్థిక వ్యవహారాల్లో అవగాహన లేకపోవడమే దానికి కారణం.
మొదటి నుంచి నాకు డబ్బుకు సంబంధించిన అవగాహన లేదు. నాకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ కుటుంబ సభ్యులు, మేనేజర్లే చూసుకునే వారు అంటూ ఆర్థిక వ్యవహారాల్లో తనకు అవగాహన లేదని ఆయనే చెప్పుకున్నారు.

1975లో హిందీ సినిమా రంగంలో ఒక సంచలనం దీవార్..
‘‘ఆజ్ మేరేపాస్ బిల్డింగ్ హై, ప్రాపర్టీ హై, బ్యాంక్ బ్యాలెన్స్ హై, బంగ్లా హై, గాడీ హై క్యాహై.. క్యా హై తుమారీ పాస్ అని అమితాబ్ అంటే
శశికపూర్ నెమ్మదిగా మేరీ పాస్ మా హై అంటాడు. సినిమాలో ఈ డైలాగు చెప్పడానికి బాగుంటుంది కానీ ఒక సంపన్నుడు, సెలబ్రిటీ చివరకు ఇల్లు కూడా లేని స్థాయికి పడిపోవడాన్ని తట్టుకోవడం చెప్పినంత ఈజీ కాదు.
సినిమా రంగంలో ఇలా దెబ్బతిన్నవారికి కొదవ లేదు. అవకాశాలు దక్కనప్పుడు అప్పటి వరకు ఓ వెలుగు వెలిగిన వారు మారిన పరిస్థితిని జీర్ణం చేసుకోలేక తమ నుంచి తాము పారిపోతూ వ్యసనాలకు అలవాటు పడి జీవితాన్ని చీకటిగా మార్చుకున్నవారు లెక్కలేనంత మంది ఉన్నారు. మారిన పరిస్థితిని అవగాహన చేసుకొని తిరిగి తామెలా నిలదొక్కుకోవాలో ఆలోచించే వారు తక్కువ. అమితాబ్ ఆ కోవకు చెందిన వారు కాదు. ఆయన జీవితం ఆత్మవిశ్వాసం పాఠం. అమితాబ్ పడి లేచిన కెరటం. అతని వద్ద ఏమీ లేని స్థితిలో కూడా బోలెడంత ఆత్మవిశ్వాసం ఉంది. కావలసినంత ఆరోగ్యం ఉంది. అవే ఆయన్ని తిరిగి నిలబెట్టాయి. పడిపోయిన వారికి జీవితంలో తిరిగి లేవడానికి కావలసింది అదే.

53 ఏళ్ల వయసు. సాధారణంగా ఈ వయసులో రిటైర్‌మెంట్ లైఫ్ గురించి ప్రణాళికలు రూపొందించుకుంటుంటారు. కానీ ఆ వయసులో అమితాబ్ నిండా అప్పుల్లో కూరుకుపోయి కేసులో చిక్కుకుపోయారు. హిందీ సినిమా రంగాన్ని ఏలిన అమితాబ్‌కు వ్యాపార రంగంలో అడుగు పెట్టాలనిపించింది. 1995లో అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు. విశ్వసుందరి పోటీల ఈవెంట్ నిర్వహించడం, టీవి కార్యక్రమాలు మొదలుకొని సినిమాల నిర్మాణం వరకు అన్నింటిలో వేలు పెట్టిందీ కార్పొరేషన్. ఏం జరిగిందో అర్ధం చేసుకునే లోపే ఉన్నదంతా ఊడ్చుకుపోయింది. అమితాబ్ అప్పుల్లో కూరుకుపోయారు. 1982లో కూలీ సినిమా షూటింగ్‌లో తీవ్రంగా గాయపడి మరణం అంచుల వరకు వెళ్లి వచ్చిన ఆయన్ని ఆత్మవిశ్వాసమే బతికించింది. ఆర్థిక పరమైన దెబ్బ అంత కన్నా తీవ్ర ప్రభావం చూపింది. కూలీ సినిమాలో గాయపడితే కోలుకోవాలని దేశ వ్యాప్తంగా అభిమానులు పూజలు చేశారు. ఎలాంటి వ్యక్తి అయినా ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బతిన్నప్పుడు కోలుకోవాలనే పూజలను, దీవెనలను ఆశించలేం. సక్సెస్ ఉంటేనే అంతా వెంటుంటారు... అప్పుల్లో కూరుకుపోయిన వారిని పలకరించేవారు కూడా ఉండరు. అన్నీ పోయినా ఆత్మవిశ్వాసం తన వెంటే ఉందనే ఆనందం అమితాబ్‌ది. ఏం తప్పు చేశాను ఎక్కడ తప్పటడుగు వేశాను, ఇప్పుడేం చేయాలి, నా జీవితం ముగిసిపోయిందా? మళ్లీ లేచేందుకు అవకాశం లేదా? అంటూ తనను తాను ప్రశ్నించుకున్నాడు.
1996లో బెంగళూరులో నిర్వహించిన మిస్ వరల్డ్ అమితాబ్‌ను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. 1999 నాటికి ఎబిసిఎల్ పీకలోతు కష్టాల్లో కూరుకుపోయింది. సిబ్బందికి వేతనాలు చెల్లించలేని పరిస్థితి. అప్పులు తీర్చలేని పరిస్థితిలో ఎబిసిఎల్ ఖాయిలా పడ్డట్టు ప్రకటించారు. అమితాబ్ సొంతిల్లు ప్రతిక్ష, మరో రెండు ప్లాట్లు లోన్ రికవరీ కింద కెనరా బ్యాంకుకు అప్పగిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఈ దశలో చాలా మంది ఆర్థిక నిపుణులు, సన్నిహితులు ఎబిసిఎల్‌ను ముగించేసి కొత్త సినిమాలతో కొత్త జీవితాన్ని ప్రారంభించమని సలహా ఇచ్చారు. కానీ అమితాబ్‌కు ఇది నచ్చలేదు. అమితాబ్ అనే తన పేరు మీద ఉన్న నమ్మకంతో ఎంతో మంది ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. అలాంటి వారి నమ్మకాన్ని వమ్ము చేస్తూ చేతులెత్తేయడం ధర్మం కాదనుకున్నారు.
‘‘ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఒక రోజు తెల్లవారు జామునే లేచి యష్ చోప్రా ఇంటికి వెళ్లాను. నేను దివాళా తీశాను. నా చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. నా ఇల్లు, ఢిల్లీలోని ఆస్తులను అటాచ్ చేశారు. నేను చెప్పిందంతా యష్ చోప్రా ప్రశాంతంగా విన్నారు. మొహబతే సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు. ఆ తరువాత కోలుకున్నాను ’’ అంటూ అమితాబ్ తన ప్రయాణాన్ని చెప్పుకున్నారు. జీరోతో రెండవ ఇన్నింగ్ ప్రారంభించిన అమితాబ్ 90 కోట్ల రూపాయల అప్పును తీర్చేశారు. 2012 నాటికే దాదాపు నాలుగు వందల కోట్లరూపాయల ఆస్తి ఉన్నట్టుగా చూపించారు. విశ్వసుందరి ఐశ్వర్య ఆయన కోడలు. కొడుకు అభిషేక్ హీరో. కుటుంబ సభ్యుల మధ్య మంచి అనురాగం. చక్కని కుటుంబం. ఆర్థికంగా దెబ్బతిన్నప్పుడు అమితాబ్‌కు ఆత్మవిశ్వాసం అనేది లేకపోతే నేడీ స్థాయికి చేరుకునే వారే కాదు.
మొహబతే సినిమా తరువాత అమితాబ్ వ్యాపార ప్రకటనల్లో, సినిమాల్లో, టీవి షోల్లో బిజీ అయ్యారు.
2000 సంవత్సరంలో కౌన్ బనేగా కరోడ్‌పతి ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఒకసారి దెబ్బతినగానే అంతా అయిపోయింది అంటూ మత్తులోనో, వ్యసనాల్లోనో మునగడం కాదు. తప్పు ఎక్కడ జరిగిందో నిజాయితీగా సమీక్షించుకోవాలి. ఎక్కడ తిరిగి నిలబడే అవకాశం ఉందో తెలుసుకోవాలి. అమితాబ్ చేసింది అదే. కౌన్‌బనేగా కరోడ్‌పతి కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఆయన వద్దకు వచ్చినప్పుడు అంతా వద్దు వద్దు అని సలహాలు ఇచ్చిన వారే. కుటుంబ సభ్యులతో సహా అంతా వద్దన్నా అమితాబ్ ఆ కార్యక్రమాన్ని తాను విజయవంతం చేయగలను అనే నమ్మకంతో అంగీకరించారు. రాజీవ్ స్నేహితునిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టి బోఫోర్స్ కుంభకోణంలో తన పేరు ఇరికించడంతో ఈ రంగానికి తాను సరిపోనని గ్రహించి బయటపడ్డ అమితాబ్ తానే రంగానికి సరిపోతాడో తనను తాను సరిగ్గానే అంచనా వేసుకున్నారు. కౌన్‌బనేగా కరోడ్‌పతి విజయంతో ఐసిఐసిఐ వంటి ప్రముఖ బ్యాంకు బ్రాండ్ అంబాసిడర్‌గా అమితాబ్‌ను ఎంపిక చేసుకుంది. అప్పుల నుంచి బయటపడి తిరిగి నిలదొక్కుకోవడానికి ఈ కార్యక్రమం అమితాబ్‌కు ఉపయోగపడింది. అమర్‌సింగ్ లాంటి రాజకీయ నాయకుడు, కొందరు పారిశ్రామిక వేత్తలు అమితాబ్‌కు అండగా నిలిచి ఉండవచ్చు. కానీ ఆయన విజయం వెనుక వారి సహకారం మాత్రమే కాదు. మొక్కవోని ఆత్మవిశ్వాసమే అమితాబ్‌ను తిరిగి సగర్వంగా నిలబడేట్టు చేసింది. తిరిగి ఎబి కార్పొరేషన్‌ను ప్రారంభించి కొన్ని సినిమాలను నిర్మించారు. తాను దేనికి సరిపోతాను అని సరిగ్గా అంచనా వేసుకున్న వారినే విజయం వరిస్తుంది.

దేహమే దేవాలయం అనే భావన మనది. ఏ కార్యమైన నిర్వహించాల్సింది ఈ దేహంతోనే. దేహం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఎన్ని కష్టాలనైనా తట్టుకుని తిరిగి నిలబడగలుగుతుంది. కింద పడిపోయినప్పుడు అదే నీ జీవితంలో చివరి అవకాశం అనుకోక మళ్లీ లేచి నిలబడడానికి అవకాశం ఉందని గ్రహించమంటోంది, సంపాదించడమే కాదు సంపద గురించి అవగాహన అవసరం అని చెబుతోంది అమితాబ్ జీవితం.
నీకు అవగాహన ఉన్న వ్యాపారమే చేయాలంటారు వారన్ బఫెట్. అవగాహన లేని వ్యాపారంలో అడుగు పెడితే ఏమవుతుందో చెబుతుంది అమితాబ్ అనుభవం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం